పెరిగిన భారత విదేశీ మారక నిల్వలు
భారత విదేశీ మారక నిల్వలు భారీగా పెరిగి 2019 డిసెంబర్ 20 నాటికి ఆల్ టైమ్ హై కి చేరుకుని 455 బిలియన్ల అమెరికా డాలర్లుగా వున్నాయి. 2019 మార్చి నాటి నిల్వలు 412 బిలియన్ డాలర్లతో పోలిస్తే చెప్పుకోదగ్గ స్థాయిలో అధికం. ఫోరెక్స్ నిల్వలు పెరగడానికి ప్రధాన కారణం - విదేశీ కరెన్సీ ఆస్తులు - FCA పెరుగుదలు. 2019 మార్చితో పోలిస్తే FCA పదిశాతం పెరిగింది. అమెరికా డాలరు, యూరో, పౌండ్ స్టిర్లింగ్, జపాన్ ఎన్ వంటి విదేశీ కరెన్సీలతో FCAను నిర్వహిస్తారు. ఆర్.బి.ఐ చేసే విదేశీ కరెన్సీ క్రయవిక్రయాల మూలంగా ప్రధానంగా - FCAలో హెచ్చు తగ్గులు జరుగుతూ వుంటాయి. విదేశీ మారకం పెట్టుబడులు కేంద్ర ప్రభుత్వానికి విదేశాల నుంచి వచ్చే నిధులు వంటి వాటి ద్వారా కూడా FCAలో హెచ్చు తగ్గులు ఏర్పడుతూ వుంటాయని - ఆర్.బి.ఐ తన నివేదికలో తెలిపింది. ఫోరెక్స్ కు బంగారం, ప్రత్యేక డ్రాయింగ్ హక్కులు - SDR, IMF లో RTP ద్వారా నిధులు చేరుతూ వుంటాయి. మొత్తం ఫోరెక్స్ నిధులలో FCA వాటా అత్యధికంగా 93 శాతం వుంటుంది. బంగారం వాటా 6 శాతం దాకా వుంటుంది. విదేశీ మారక నిల్వల డిమాండ్ ఆర్థిక వ్యవస్థ సరళత్వం, లిక్విడిటీ అవసరాలు తదితర అ...