భారత-న్యూజిలాండ్ సంబంధాలు: ఇండో-పసిఫిక్ ప్రాంతీయ ఏకీకరణకు ప్రోత్సాహం
భారత-న్యూజిలాండ్ స్నేహసంబంధాల విషయంలో 2020 సంవత్సరం ఆశావహంగా మొదలైంది. ముఖ్యంగా న్యూజిలాండ్ వలస వ్యవహారాల శాఖ మంత్రి ఇయాన్ లీస్-గాలోవే గతనెల ముంబై సందర్శించి వెళ్లాక ఈ అంశం ప్రస్ఫుటమైంది. ఆ తర్వాత ఫిబ్రవరిలో న్యూజిలాండ్ ఉప ప్రధాని-విదేశాంగ శాఖ మంత్రి విన్‌స్టన్ పీటర్స్, వాణిజ్యశాఖ మంత్రి డేవిడ్ పార్కర్‌లతోపాటు వాణిజ్య ప్రతినిధి బృందం భారత్‌లో పర్యటించడం మరింత ప్రాముఖ్యం సంతరించుకుంది. ఈ పర్యటనలతో రెండు దేశాల మధ్య సంబంధాల్లో ఏకీకరణకు అవకాశంగల కొన్ని ముఖ్యమైన రంగాల్లో సమస్యల పరిష్కారానికి వీలుంటుందన్న భావన వ్యక్తమవుతోంది. భారత-న్యూజిలాండ్ నడుమ చారిత్రకంగా అనేక పోలికలున్నాయి... రెండు దేశాల్లోనూ బ్రిటిష్ వలసపాలన వారసత్వం కనిపిస్తుంది. అలాగే పార్లమెంటరీ పాలన విధానం పరిణామం చెందింది. అంతేకాకుండా కామన్‌వెల్త్ కూటమిలో ఉమ్మడి అనుబంధం కూడా కొనసాగుతోంది. వీటన్నిటి మాట అటుంచి- పరస్పర ఏకీకరణ, ఆసక్తిగల రంగాలను గుర్తించేందుకు ద్వైపాక్షికంగానేగాక ఇండో-పసిఫిక్ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా సునిశిత, ప్రత్యేక పథాన్ని రూ...