ఇండియా – పోర్చుగల సంబంధాలో నూతన అధ్యాయం
పోర్చుగీసు అధ్యక్షడు మార్సెలో రెబెలో డే సౌసా భారత దేశంలో పర్యటించారు. విజయవంతమైన ఈ పర్యటనలో ప్రత్యేకంగా పేర్కొనవలసిన విషయం, విశేషం, ఉభయ దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు.ఈ పర్యటనలో అనేక విషయాలకు సంబంధించి పరస్పర ప్రయోజనకరమైన 14 అవగాహనా ఒప్పందాలు, MoUలపై ఉభయ దేశాలు సంతకాలు చేశాయి.ఇందులో సముద్ర రవాణా, నౌకా కేంద్రాల అభివృద్ధి, అంకుర పరిశ్రమలు, అంతరిక్ష పరిశోధనలు, దౌత్య శిక్షణ, శాస్త్ర పరిశోధనలు, ప్రజా సంబంధ విషయాలు వంటి అనేక అంశాలు ఉన్నాయి.
పోర్చుగల అధ్యక్షుని భారత పర్యటన ఉభయ దేశాల సంబంధాలలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. గడచిన మూడు సంవత్సరాలలో ఉభయ దేశాల సంబంధాలలో చోటు చేసుకున్న మార్పులు నూతన నిర్వచనాన్ని చైతన్యాన్ని, ఆవిష్కరించాయి.ఈ మూడు సంవత్సరాల కాలంలో ఉభయ దేశాల సంబంధాలలో అనేక సానుకూల మార్పులు వేగంగా చోటు చేసుకున్నాయి. ఈ నేపధ్యంలో భారత్, పోర్చుగల్ దేశాలు రెండూ దౌత్య ప్రయోజనాలు పొందేందుకు పోటీ పడుతున్నాయి.
ప్రస్తుతం, నడుస్తున్న చరిత్రలో చోటు చేసుకుంటున్న ప్రపంచ, ద్వైపాక్షిక పరిణామాలు పోర్చుగల్, భారత ప్రయోజనాలను సమ్మిళితం చేస్తున్నాయి. ఒకటిగా కలుపుతున్నాయి. ప్రపంచ పరిణామలు అనూహ్యంగా, అస్థిర మార్గంలో కదులుతున్నాయి. ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి.అధికార శక్తి కేంద్రాల పోటీలో చోటు చేసుకుంటున్న మార్పులు, వైరుధ్యాలు, భౌగోళిక ఆర్థిక స్థితిగతులు, భౌగోళిక వ్యూహాత్మక పోటీ, వేగం తగ్గిన ఆర్థిక వృద్ధి, సంప్రదాయ,సంప్రదాయేతర భద్రతా ముప్పు అందరినీ కలవర పెడుతోంది.
21శతాబ్దిలో ప్రముఖంగా వినిపించే పదం, ప్రపంచీకరణ.మరో వంక జాతీయ వాదం స్పూర్తి వేగంగా వ్యాపిస్తోంది. ప్రపంచ దేశాలు అంతర్ముఖంగా ముందుకు సాగుతున్నాయి.ప్రపంచం నాల్గవ పారిశ్రామిక విప్లవ శకంలోకి అడుగు పెడుతున్న ప్రస్తుత సమయంలోనూ సాంకేతిక విజ్ఞానం చాలా సందర్భాలలో దుర్వినియోగం అవుతోంది. ట్రాన్స్ – అట్లాంటిక్ సంబంధాలలో తలెత్తిన సంఘర్షణ, యూరప్’ విషయంలో అమెరికా చిత్తశుద్దిని ప్రశ్నార్ధకంగా మార్చింది. ఈ పరిణామాలు కొత్త భాగస్వామ్య సంబంధాలు, నూతన పొత్తులు, కలయికల అవసరాన్ని నొక్కి చెపుతున్నాయి.
ప్రపంచ వేదిక పై పెరుగతున్న భారత దేశ ప్రాధాన్య, ప్రాధాన్యతలు,యురోపియన్ యూనియన్’, నాటోలలో పోర్చుగల్ సభ్యత్వం నేపధ్యంగా ప్రపంచ వ్యాప్తంగా వివిధ రూపాల్లో చోటుచేసుకుంటున్న ఒడిదుడుకులను సమర్ధవంతంగా ఎదుర్కునేందుకు ఉభయ దేశాలు ఒకటిగా కృషి చేయవలసిన ఆవశ్యకత ఏర్పడింది. కరోనా వైరస్ వంటి అనూహ్య పరిణామాలు విసురుతున్న సవాళ్ళ నేపధ్యంలో, భారత దేశం, పోర్చుగల్ మధ్య పరస్పర ప్రయోజనకర ఒడంబడికలు, ఒప్పందాల సహేతుకత మరింత బలపడింది.
ఈ పరిస్థితులలో భారత, పోర్చుగల్ దేశాలు ప్రధాన భద్రత సమస్యల విషయంలో పరస్పర అవగాహనతో ముదుకు సాగుతున్నాయి. 2019లో పుల్వామాలో ఉగ్రవాదులు జరిపిన ఘాతుక దాడిని పోర్చుల్ తీవ్రంగా ఖండించింది,అంతకు ముందే 2005లో కరుడుగట్టిన నేరగాడు అబూ సలెంను లిస్బొన్ నుంచి బహిష్కరించింది. ప్రధాన బహుపాక్షిక సంస్థలలో భారత దేశ సభ్యత్వాన్ని పోర్చుగల్ అల్ సమర్ధించింది.యురోపియన్ యూనియన్’తో భారత దేశ సంబంధాలను బలోపేతం చేసిన యురోపియన్ యూనియన్ – భారత సదస్సును పోర్చుగల్ సాకారం చేసింది.
సుమారు 500 సంవత్సరాల క్రితం వాస్గోడిగామా ప్రయాణించిన హిందూ మహా సముద్రం, అట్లాంటిక్ మహా సముద్ర భౌగోళిక ప్రాంతంలోని భద్రతా పరిస్థితులు, ఉభయ దేశాల ఉమ్మడి భద్రతా అవసరాలను,పరస్పర ప్రయోజనాలను పస్పుటం చేస్తున్నాయి.ఈ ప్రాంతంలో ఉభయ దేశాలకు విడదీయ వీలులేని ఉమ్మడి ప్రయోజనాలు ఉన్నాయి.
అదే విధంగా, పోర్చుగల్ పర్యావరణ పరిస్థితులు, మేధో ఆధారిత ఆర్థిక వ్యవస్థ,భారత్ దేశానికి ఎంతో కీలకం. భారత దేశానికి ప్రత్యేక ఔతిత్యం ఉన్న విషయాలు. ఇనేర్నేట్, కృత్రిమ మేథస్సు, బ్లాక్ – చైన్, ఈ- గవర్నెన్స్ వంటి అనేక విషయాల్లో పోర్చుగల్ ప్రభుత్వం భారీ ముందడు వేసింది. భారత ఆర్థిక వ్యవస్థను,సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించుకుని, భారత మేథో సంపదను గరిష్టస్థాయిలో ఆధునీకరించాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభివృద్ధి లక్ష్యంతో పోర్చుగల్ డిజిటల్ సామర్ధ్యంతో సమ్మిళితమవుతుంది,చక్కగా కలిసిపోతుంది. ఆ విధంగా, మేక్ ఇన్ ఇండియా, క్లీన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టార్ట్ – అప్ వంటి అనేక ప్రాజెక్టుల విషయంలో పోర్చుగీసు కంపెనీలు కీలక పాత్రను పోషిస్తాయి. పోర్చుగల్ కంపెనీలు తమ కార్యకలాపాలను ముందుకు తీసుకు పోవడంలో భారత దేశాన్ని ఒక ప్రయోగశాలగా ఉపయోగించుకోవచ్చును.అదే విధంగా, మైగ్రేషన్, మొబిలిటీకి సంబందించిన ఒప్పందం, భారత దేశ మానవ వనరులు, పోర్చుగల్ నైపుణ్య మానవవనరుల అవసరం ఒకదానికి ఒకటి పరస్పర పూరకాలుగా నిలుస్తాయి. భారత దేశంలో పోర్చుగల్ పెట్టుబడులు గత రెండు సంవత్సరాలలో రెట్టింపు అయ్యాయి. ద్వైపాక్షిక వాణిజ్యం ఒక బిలియన్ యూరోలను దాటింది’ ఇది ఉభయ దేశాల మధ్యగల సానుకూల భావోద్రేకాలను ప్రతిబింబిస్తోంది.
బ్రెక్సిట్ – అనంతరాం బ్రిటన్ స్థానాన్ని పోర్చుగల్’లో గల వ్యాపార అనుకూల వాతావరణం, ఆక్రమిస్తుంది. భారతీయ మార్కెట్లు యురోపియన్ ఉమ్మడి మార్కెట్’ కు ముఖద్వారం అవుతాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పోర్చుగీసు మాట్లాడే, లుసోఫోన్ దేశాలలో కూడా పోర్చుగల్ భారతీయ కంపెనీలకు ఆధారంగా నిలుస్తాయి. లుసోఫోన్ దేశాలలో భారత – పోర్చుగల్ దేశాల సహకారానికి అవకాశ, సామర్ధ్యాలు పుష్కలంగా ఉన్నాయి.
ఇతర సానుకూల అంశాలతో పాటుగా ప్రవాస భారతీయులు, పోర్చుగీసు ప్రజలమధ్య గల ఆధ్యాత్మిక అనుబంధం,సయోధ్యతల కారణంగా ద్వైపాక్షిక సహకారం ద్విగుణీకృతం అవుతుంది. నూతన శిఖరాలను చేరుతుంది. యోగ, ఆయుర్వేదతో పాటుగా సాకర్, పర్యాటకం, పునరుత్పాదక ఇంధనం, వ్యర్ధాల శుద్ధి,సముద్ర అన్వేషణ, రక్షణ, వ్యవసాయం వంటి అనేక రంగాలలో అద్భుత ప్రగతి సాధ్యమవుతుంది.
ఈ విధంగా, పోర్చుగీస్ అధ్యక్షుడు సౌసా భారత పర్యటన, భారత- పోర్చుగీసు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేసే కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది.
రచన: రాజోర్షి రాయ్, రీసెర్చ్ అనలిస్ట్, ఐడీఎస్ఏ
Comments
Post a Comment