Posts

Showing posts from March, 2020

ఊపందుకున్నఅమెరికా అధ్యక్ష ఎన్నికల సన్నాహాలు

మరికొద్ది నెలల్లో ... రానున్న 2020 నవంబర్’లో అమెరికా 46 వ అధ్యక్షుని ఎన్నిక జరుగుతుంది.ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. అమెరికా రాజకీయాలలో కురువృద్ధ పార్టీ ..రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిగా మరోమారు పోటీచేసేందుకు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్’ సిద్ధమయ్యారు.చురుగ్గా అడుగులు వేస్తున్నారు.ఇంతవరకు వివిధ స్టేట్ ప్రైమరీస్ ,కాకసస్’లో 1099 ప్రతినిధులను ట్రంప్ గెలుచుకున్నారు. రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్ధిగా నామినేషన్ పొందేందుకు ట్రంప్’కు మొత్తం 1276 ప్రతినిధి ఓట్లు అవసరం. ఆ మార్క్ చేరితే ఆయన అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిగా నిలుస్తారు. ఇక డెమొక్రటిక్ పార్టీ విషయానికి వస్తే, మాజీ ఉపాధ్యక్షుడు జోయ్ బిడెన్, వెర్మాంట్ సెనేటర్ బెర్నీ సాండర్స్ మధ్య నువ్వా నేనా అన్న విధంగా పోటీ నెలకొంది. అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు పోటీ పడుతున్న వారిలో ఈ ఇద్దరి మధ్యనే పోటీ నడుస్తోంది. అయితే, ‘Super Tuesday’ ప్రైమియర్స, కొన్ని కీలక రాష్ట్రాల్లో ఆధిక్యత సాధించడంతో బిడెన్ ముందంజలో ఉన్నారు. మొత్తం 14 రాష్ట్రాలు సహా అమెరికన్ సమోవాలో మంగళవారం అధ్యక్ష అభ్యర్ధి ఎంపిక ఎన్నికకు presidential prim...

చమురు ధరల యుద్ధం 

ముడి చమురు ధరలను సౌదీ అరేబియా ‘బ్రెంట్’ ఒక్కసారిగా 30 శాతం తగ్గించాయి. చమురు యుద్ధం మొదలైంది. 1991 గల్ఫ్ యుద్ధం తర్వాత ఒక్క సారిగా ఇంత పెద్ద మొత్తంలో చమురు ధరలు తగ్గడం లేదా తగ్గించడం, ఇదే మొదటి సారి కావడం విశేషం. సౌదీ అరేబియా , రష్యాల మధ్య చమురు ధరలు తగ్గించే విషయంలో విబేధాలు తలెత్తడంతో ఇలా ఒక్కసారిగా ముడి చమురు ధరలు దిగివచ్చాయి. కరోన వైరస్ వ్యాప్తి కారణంగా చమురు కొనుగోలు డిమాండ్ తగ్గింది. దీంతో సౌదీ అరేబియా సారధ్యంలోని, పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ, ఒపెక్, చమురు ఉత్పత్తిని రోజుకు 1.5 మిలియన్ బ్యారెల్స్ కు కుదించాలనుకుంది.అయితే అందుకు రష్యా చమురు ఉత్పత్తి తగ్గించేందుకు ఒప్పుకోలేదు. ఫలితంగా, సౌది అరేబియా కంపెనీ బ్రెంట్, ఈ శతాబ్దిలోనే కనిష్ట ధరను ప్రకటించి,చమురు ధరల యుద్దానికి తెర తీసింది. కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ఫైనాన్సియల్ మార్కెట్లను, రియల్ ఎస్టేట్ రంగాన్ని అన్నిటికంటే ముఖ్యంగా ఇంధన రంగంలో పెట్టుబడులను దెబ్బతీయడం మొదలైంది. సౌది అరేబియా చమురు ఉత్పత్తి వ్యయం ఇతర అన్ని దేశాలకంటే లభాలలు చాలా తక్కువ. అంత చౌకగా చమురు ఉత్పత్తి చేయడం మరో దేశానికి సాధ్యం కాదు.చమురు ఉత్పత్తి వ్యయ...

కొరియా ద్వీపకల్పంలో పెరుగతున్న ఉద్రిక్తతలు

ఈ వారం ప్రారంభంలో ఉత్తర కొరియా మూడు అదృశ్య ప్రక్షేపకాలను ప్రయోగించింది. రెండు వారల సమయంలో కిమ్–జాంగ్- యున్ ప్రభుత్వం రెండవ సారిఇలాటి చర్యకు పాల్పడింది. తొలి ప్రయోగాన్ని ఖండిస్తూ, ప్రతీకార చర్య తప్పదని దక్షిణ కొరియా హెచ్చరించిన రెండు రోజులకే ఉత్తర కొరియా రెండవ సారి ప్రక్షేపకాలను ప్రయోగించింది. . ఆదేశ తూర్పు తీర ప్రాంతం నుంచి కొరియా ద్వీపకల్పం, జపాన్ మధ్య జలాలలోకి స్వల్ప సామర్ధ్యంగల విభిన్న ప్రక్షేపకలాను ఉత్తర కొరియా ప్రయోగించిందని, దక్షిణ కొరియా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉత్తర కొరియా గరిష్టంగా 200 కిలోమీటర్లు దూరంలోని, 50కిలోమీటర్ల ఎత్తులోగల ల్లక్ష్యాలను ఛేదించే సామర్ధ్యం గల ప్రక్షేపకాలను ప్రయోగించింది. ఉత్తర కొరియా మరో మారు ఇలాంటి చర్యలకు పాల్పడితే వాటిని ఎదుర్కునేందుకు తమ సేనలు సిద్ధంగా ఉన్నాయని దక్షిణ కొరియా పేర్కొంది. కొరియా ద్వీప కల్పంలో సైనిక ఉద్రిక్తలను చల్లబరిచి, ప్రశాంత వాతావరణాన్ని పునరుద్ధరించేందుకు 2018లో ఉభయ దేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఆ దేశం ఉల్లంఘిస్తోందని దక్షిణ కొరియా ఆరోపిస్తోంది. అంతేకాదు, ఇలాంటి ఉల్లంఘనలను ఉపేక్షించబోమని హెచ్చరిస్తోంది. కాగా, గత సంవ...

ఉగ్రవాదం పై మరోసారి బహిర్గతమైన పాకిస్థాన్ ద్వంద్వ వైఖరి

తమ భూభాగం నుండి కార్య కలాపాలు సాగిస్తున్న ఉగ్రబృందాల తో పాకిస్తాన్ వ్యవహరించే తీరు అందరకు తెలిసిందే. భౌగోళిక ఉగ్రవాది మసూద్ అజార్ పై పారిస్ లో అంతర్జాతీయ ఆర్ధిక కార్యాచరణ సంస్థ FATF ప్లీనరీ ఎదుట ఆ దేశం పచ్చి అబద్ధాలు చెప్పడం తో ఆ ద్వంద్వ వైఖరి మరో సారి బహిర్గతమైంది. అధికారిక రక్షణ లో ఈ ఉగ్రవాద సూత్రధారి పాకిస్తాన్ లో తల దాచుకుంటున్నాడు. ఉగ్రవాద బృందాలపై తాము చర్యలు తీసుకుంటున్నట్లు ప్రపంచానికి చూపేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. అయితే వాస్తవం లో ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రదాడులకు కారకులైన మసూద్ అజార్,హఫీజ్ మహమ్మద్ సయీద్,జాకీర్ ఉర్ రహ్మాన్ లఖ్వీ తదితర అనేక మంది ఉగ్రవాదుల పై విచారణ చేబట్టడం,సరైన జరిమానా విధించడాలు చేబట్టలేదు. 2019 ఫిబ్రవరి 14 న 40 మంది కేంద్ర రిజర్వ్ పోలీస్ సిబ్బందిని జమ్మూ కాశ్మీర్ లో పుల్వామా ఉగ్రదాడిలో హతమార్చినట్లు ప్రకటించుకున్న జైషే మహమ్మద్ JEM దళ అధిపతి మసూద్ అజర్. 2019 ఫిబ్రవరి 26 న వైమానిక మెరుపు దాడి సలిపి బాలా కోట్ ప్రధాన కేంద్రాన్ని,జైషే మహమ్మద్ శిక్షణా స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. అప్పటి నుండి మసూద్ అజర్ ను ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించవలసిన ఒ...

కాబూల్ లో కొనసాగుతున్న అనిశ్చితి

మార్చి నెల మొదట్లో ఆఫ్ఘనిస్తాన్ లో గణనీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.యుద్ధ ప్రభావిత దేశం లో అత్యావశ్యకమైన శాంతి పున రుద్ధరణ వేగవంతమయేలా సులభతర ఆఫ్ఘన్ అంతర చర్చల ప్రక్రియకు ఫిబ్రవరి 29 న అమెరికా తాలిబన్ ఒప్పందం కుదిరింది. ఆఫ్ఘన్ సమాజం లోని తీవ్రవాద ప్రతినిధులతో చర్చలకు ఆ దేశ శాంతి కాముకుల పక్షాన ఆఫ్ఘన్ ప్రజాస్వామ్య ప్రభుత్వం సంఘటితమౌతుందని భావించారు .  అయితే ఆఫ్ఘన్ అధ్యక్ష ఎన్నికల ఫలితాల ప్రకటన తదనంతరం ఇపుడు అక్కడి లోతైన విభజనలు అగుపడుతున్నాయి. ప్రస్తుతం కాబుల్ లో నెలకొన్న రాజకీయ గొడవల నేపధ్యం, సామరస్య పరిష్కారాన్ని ఆశిస్తున్న ఆఫ్ఘన్ ప్రజలలోనే కాక బాహ్య శక్తులకూ నిరాశ కలిగిస్తోంది. గత ఏడాది చివర్లో జరిగిన అధ్యక్ష ఎన్నికలలో అష్రఫ్ ఘనీ ని విజేతగా ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే అబ్దుల్లా అబ్దుల్లా నేతృత్వం లోని ప్రభుత్వం లోని మరో శక్తివంతమైన వర్గం, అధికారిక ప్రకటన ద్వారా తెలుపబడిన ఆష్రఫ్ ఘనీ విజయానికి పోటీ పడింది. ఆయనను రెండవసారి అధ్యక్షునిగా అంగీకరించలేని డా.అబ్దుల్లా అబ్దుల్లా అదే క్షణాన తదుపరి అధ్యక్షునిగా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. కాబూల్ లో ప్రస్తు...

విదేశాంగ విధానంతో వాణిజ్యాన్ని సమన్వయం చేసిన భారత్

నరేంద్రమోడీ నాయకత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి, NDA ప్రభుత్వం, విదేశాంగ విధానం లో బిజినెస్ టు బిజినెస్,B2B పై దృష్టి నిగిడ్చింది. వాటిలో భాగస్వామి దేశాలకు తక్కువ వడ్డీతో దశాలవారి రుణ సదుపాయం లైన్ ఆఫ్ క్రెడిట్ ను విస్తరించడం గమనార్హం. వందల సంఖ్యలో ఉన్న అవి గత కొన్ని సంవత్సరాలుగా స్థాయి,సంక్లిష్టత,వైవిద్యాలలో పెరిగాయి. వాటి పరిధి విదేశాలలో ప్రాజెక్టుల అమలు నుంచి సేవలవిస్తరణ,ఉత్పత్తుల సరఫరా వరకు ఉంది. విదేశాంగమంత్రి డా.జైశంకర్ ఒక వాణిజ్యసదస్సులో భారత్ వ్యాపారాత్మక దౌత్యవిధానాన్ని ప్రస్ఫూటం గా వివరించారు. ఏ లైన్ ఆఫ్ క్రెడిట్ లో నైనా 65% నుండి 75% వరకు భారత్ కు చెందిన అంశం ఉండటమన్నది లైన్ ఆఫ్ క్రెడిట్ ల సామాన్య లక్షణం. ప్రతి ఒక్కటీ తమదైన శైలిలో భారత్ కంపెనీలకు విదేశాలలో మార్కెటింగ్ ను సమకూరుస్తుంది. సార్వభౌమ హామీ కలిగిఉండటంతో క్రెడిట్ లైన్లు,భారత్ కంపెనీల కార్యకలాపాలు సాగడానికి దోహదపడతాయి. లేకుంటే సాధారణంగా ఎదురయ్యే ఇక్కట్ల దృష్ట్యా భారత్ కంపెనీలు ఈ సాహసానికి పూనుకోవు. ఇప్పటివరకు 64 దేశాలలోని 539 ప్రాజెక్టులకు భారత్ 300 దశలవారి రుణ సౌకర్యాలను అందించింది. క్రెడిట్ లై...

చైనా పాకిస్తాన్ ఆర్ధిక కారిడార్ CPEC : పాకిస్తాన్ కు రుణభారం

'చైనా పాకిస్తాన్ ఆర్ధిక కారిడార్- CPEC పూ ర్తయితే అది బీజింగ్ కు నిస్సందేహంగా గెలుపు-గెలుపు ఒప్పందంగా ఉండనుంది. చైనా భూభాగం కలిగిన పశ్చిమ జింజియాంగ్ ప్రావిన్స్ ను బలుచిస్తాన్ లోని గ్వాడార్ నౌకాశ్రయంతో కలిపి, చైనాకు గల్ఫ్,హిందు మహాసముద్రాలలోకి ప్రవేశం కల్పించనుంది ఈ 62 బిలియన్ డాలర్ల ప్రాజెక్టు. అయితే ఇది పాకిస్తాన్ ను ఎక్కడ ఖచ్చితంగా వదులుతుంది? ఈ ప్రాజెక్ట్ పై పాకిస్తాన్ లోని స్థానిక విమర్శకులతో సహా పలువురు విశ్లేషకులు కొంతకాలంగా అడుగుతున్న ప్రశ్న ఇది. CPEC , దాని అనుబంధ ఇతర ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం పెరిగి పోవడం,నిర్ణిత గడువు లోపు పూర్తి కాకుండా వెనకబడటాల్ని ఇక్కడ ప్రస్తావించడం తో సరిపోదు. వీటిలో మెగా హైడెల్ పవర్ ప్రాజెక్ట్,పెషావర్ ను కరాచీ తో కలిపే మరింత ప్రతిష్ఠాత్మకమైన రైల్వే లైను కూడా ఉన్నాయి. రైల్వే మార్గ ప్రారంభ అంచనా వ్యయం 8.2 బిలియన్ల అమెరికా డాలర్లు. తదనంతరం ఈ ఖర్చుని 6.2 బిలియన్ల అమెరికా డాలర్లకు తగ్గించారు.ప్రాజెక్ట్ వ్యయం లో 2 బిలియన్ డాలర్ల ఆదా, వేడుకలు జరుపుకోదగిన అంశమే.అయితే వాస్తవ వ్యయం 9 బిలియన్ డాలర్ల వరకు ఉండవచ్చునని ఇప్పుడు నివేదికలు తెలియజేస్తున్న...

పార్లమెంటులో ఈ వారం

ఈ నెల 2వ తేదీన ప్రారంభమైన పార్లమెంటు రెండోదశ బడ్జెట్‌ సమావేశాలు ఏప్రిల్‌ 3వ తేదీవరకూ కొనసాగుతాయి. ఈ సందర్భంగా దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు, వ్యవసాయరంగ సమస్యలపై జాతీయ ప్రజాస్వామ్య కూటమి-NDA ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు యత్నిస్తాయి; అయితే, వాస్తవాలు-గణాంకాలతో ఉభయసభల్లోనూ విపక్షాలను దీటుగా ఎదుర్కొనే కృతనిశ్చయంతో అధికారపక్షం కూడా సిద్ధమైంది. కార్మిక సంస్కరణలు, అద్దె గర్భం నియంత్రణసహా సుమారు 25 బిల్లుల జాబితాను సభామోదం కోసం ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇవేగాక ద్రవ్య బిల్లు కూడా ఈ సమావేశాల్లోనే ఆమోదం పొందనుంది. మరోవైపు కరోనా వైరస్‌ ముప్పు నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికులందరికీ విమానాశ్రయాల్లోనే పరీక్షలు నిర్వహిస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ రాజ్యసభకు తెలిపారు. ప్రస్తుత సమావేశాల్లోనే 2020-21కిగాను రైల్వే మంత్రిత్వశాఖ డిమాండ్లు-గ్రాంట్లకు సంబంధించి రైల్వేలపై స్థాయీ సంఘం నివేదికను రాధామోహన్‌ సింగ్‌, సునీల్‌ కుమార్‌ మండల్‌ సభకు సమర్పించనున్నారు. అలాగే విమాన సవరణ బిల్లు, కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయాల బిల్లు, జాతీయ హోమియోపతి కమిషన్‌ బిల్లు, ఖనిజలోహాల చట్ట సవ...

కెనెసెట్ ఎన్నిక‌లు: ఇజ్రాయెల్‌లో ప్ర‌తిష్టంభ‌న‌కు ల‌భించ‌ని ప‌రిష్కారం

ఇజ్రాయెల్‌ చట్టసభ ‘కెనెసెట్‌’కు ఈ నెల 2వ తేదీన ఎన్నికలు నిర్వహించారు. అయితే, ఏడాది వ్యవధిలో మూడోసారి జరిగిన ఈ ఎన్నికల్లోనైనా స్వర్గంనుంచి అమృతం కురుస్తుందన్న ఇజ్రాయెలీల ఆశ అడియాసగానే మిగిలింది. సుదీర్ఘంగా దేశాన్నేలిన ప్రధానమంత్రి, లికుడ్‌ పార్టీ నేత బెంజమిన్‌ నెతన్యాహు పోలింగ్‌ ముగిసిన కాసేపటికే విజయం తమదేనని ధీమాగా ప్రకటించారు. కానీ, 120 మంది సభ్యులున్న చట్టసభలో ఆధిక్యానికి అవసరమైన 61 స్థానాలను సాధించడంలో ఆయన పార్టీ విఫలమైంది. ఈ ఎన్నికల్లో 60 లక్షల మందికిపైగా ప్రజలు ఓటువేయగా, లెక్కింపు దాదాపు 99 శాతం ముగిసేసరికి లికుడ్‌ పార్టీ 36 స్థానాలతో అతిపెద్ద పార్టీగా మాత్రమే అవతరించగలిగింది. మతవాద “షాస్‌, యునైటెడ్‌ టోరా జూడాయిజం” పార్టీలు 9, 7 వంతున స్థానాలు సాధించగా, మితవాద “యామినా” పార్టీకి 6 సీట్లు దక్కాయి. అయినప్పటికీ నెతన్యాహు నేతృత్వంలోని ఈ “మితవాద-మతవాద” కూటమి 58 స్థానాలతో సాధారణ ఆధిక్యానికి 3 స్థానాల దూరంలో ఆగిపోయింది. మొత్తం ఓట్ల లెక్కింపు ముగిశాక స్థానాల సంఖ్య మారే అవకాశం ఉన్నప్పటికీ, నెతన్యాహు సాధారణ ఆధిక్యం అందుకోవడమూ సందేహాస్పదమే! అమెరికాతో సన్నిహిత బంధం, దేశ ఆర్థిక ప్రగతి తమ...

ఐరోపావైపు సరిహద్దులు తెరచిన టర్కీ – ముదిరిన సిరియా శరణార్థి సంక్షోభం

ఐదేళ్ల కిందట 2015నాటి వలస సంక్షోభంలో అనేకమంది ప్రాణాలు కోల్పోవడంపై ఐరోపా సమాఖ్య సభ్యదేశాల మధ్య తలెత్తిన అసమ్మతి ఇంకా మదినుంచి చెరిగిపోనే లేదు. ఈ నేపథ్యంలో టర్కీ చేపట్టిన ఇటీవలి చర్యలతో ఆనాటి పరిస్థితులు పునరావృతం కాగలవన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంతకూ జరిగిందేమిటంటే- శరణార్థుల కోసం ఐరోపావైపు వెళ్లే తన సరిహద్దులను టర్కీ గతవారం పూర్తిగా తెరచింది. దీనిపై ఐరోపా సమాఖ్య సభ్యదేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వలస సంక్షోభం సమాప్తి దిశగా సమాఖ్యతో కుదుర్చుకున్న 2015-2016నాటి శరణార్థి ఒప్పందాన్ని టర్కీ ఉల్లంఘించిందని అవి ఆరోపిస్తున్నాయి. అయితే, తమకు నిర్దేశించిన శరణార్థుల సంఖ్య పరిమితి దాటిందని, దాంతోపాటు సమాఖ్య తన వాగ్దానాన్ని నిలబెట్టుకోని కారణంగా ఐరోపావైపు తలుపులు మూసి ఉంచడం అసాధ్యమని టర్కీ వాదిస్తోంది. తమకు హామీ ఇచ్చిన ప్రకారం 600 కోట్ల యూరోల నిధులను విడుదల చేయలేదని, టర్కీతో వాణిజ్యాన్ని పెంచలేదని, సమాఖ్యలో టర్కీ సభ్యత్వంపై సంప్రదింపులను వేగిరపరచలేదని, సమాఖ్య దేశాల్లోకి టర్కీ పౌరుల వీసారహిత ప్రయాణానికి అనుమతించలేదని ఆరోపణలు గుప్పిస్తోంది. కానీ, టర్కీ ఆరోపణల్లో వాస్తవం లేదని ఐరోపా సమాఖ్య తోస...

‘బ్లూ డాట్’తో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో కొత్త అవకాశాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలి తన భారత పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో విస్తృత చర్చల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య ప్రస్తావనకు వచ్చిన ప్రధానాంశాల్లో ‘‘బ్లూ డాట్’’ నెట్‌వ‌ర్క్‌ కూడా ఒకటి. ఈ చర్చల తర్వాత విడుదల చేసిన సంయుక్త పత్రికా ప్రకటనలో- ‘‘వర్ధమాన, అల్పాదాయ దేశాల్లో పేరుకుపోతున్న ప్రభుత్వ రుణభారాన్ని నియంత్రించే దిశగా రుణగ్రహీతలు-రుణదాతలు బాధ్యతాయుత, పారదర్శక, నిశ్చిత ఆర్థిక సహాయ పద్ధతులు పాటించాల్సిన అవసరాన్ని అమెరికా, భారత్ గుర్తించాయి’’ అని వారిద్దరూ పేర్కొన్నారు. ఆ మేరకు బహుపాక్షిక భాగస్వామ్య ‘బ్లూ డాట్’ నెట్‌వ‌ర్క్‌పై ట్రంప్, మోదీ ఆసక్తి వ్యక్తం చేశారు. దీనిద్వారా ప్రభుత్వాలు- ప్రైవేటు రంగం-పౌర సమాజం సమష్టిగా, అత్యున్నత నాణ్యత, విశ్వసనీయ ప్రమాణాలతో అంతర్జాతీయంగా మౌలిక వసతులను అభివృద్ధి చేసే వీలుంటుందని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బ్లూ డాట్ నెట్‌వ‌ర్క్‌లో చేరే అవకాశాలను భారత్ పరిశీలిస్తోంది. వర్ధమాన దేశాల్లో... ప్రత్యేకించి ఇండో-పసిఫిక్ ప్రాంతంలో విదేశీ నిధులతో మౌలిక వసతుల నిర్మాణంలో అంతర్జాతీయ ఆమోదంగల నియమనిబంధనలను పాటించేలా చూడటం బ్ల...

అమెరికా-ఆఫ్ఘన్ శాంతి ఒప్పందం: సమ్మోదమా... సందేహమా?

ఆఫ్ఘ‌నిస్థాన్‌లో శాంతి-సుస్థిరతలు లక్ష్యంగా అమెరికా-తాలిబన్ల మధ్య శాంతి ఒప్పందంపై సంతకాలు పూర్తయిన రెండు రోజులకే తాలిబన్లు మాటమార్చారు. ఆ మేరకు ఆఫ్ఘన్ జాతీయ భద్రత-రక్షణ దళాలపై తమ సైనిక కార్యకలాపాలను పునరుద్ధరిస్తామని ప్రకటించారు. ఖతర్ రాజధాని దోహా నగరంలో తొమ్మిది దఫాల చర్చల తర్వాత అందరూ ఆసక్తితో ఎదురుచూసిన శాంతి ఒప్పందం ఓ కొలిక్కి వచ్చింది. దీనిపై అమెరికా ప్రత్యేక ప్రతినిధి జల్మయ్ ఖ‌లీల్‌జాద్‌, తాలిబన్ల ఉప నాయకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బిరాదర్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందం కీలకాంశాల్లో- ‘‘కాల్పుల విరమణ, విదేశీ దళాల ఉపసంహరణ, ఆఫ్ఘన్ అంతర్గత సంప్రదింపులు, ఉగ్రవాద నిరోధంపై హామీ’’ అత్యంత ప్రధానమైనవి. తదనుగుణంగా 10 రోజుల్లోగా తమ దళాల దశలవారీ ఉపసంహరణ ప్రారంభానికి అమెరికా అంగీకరించింది. ఇందులో భాగంగా తమ సైనిక సిబ్బంది సంఖ్యను 135 రోజుల్లో 8,600 స్థాయికి తగ్గిస్తామని ప్రకటించింది. మొత్తంమీద 14 నెలల వ్యవధిలో ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా దళాల సంపూర్ణ ఉపసంహరణ పూర్తి కావాలన్నది శాంతి ఒప్పంద నిర్దేశం. అలాగే వివిధ జైళ్లలో ఉన్న 5 వేలమంది తాలిబన్ ఖైదీలను ఈ నెల 20లోగా విడుదల చేయాల్సిందిగా ఆఫ్ఘన్ ప్రభుత్వాన్ని క...

పటిష్టమవుతున్న భారత్-బంగ్లాదేశ్ ద్వైపాక్షిక బంధం

భారత-బంగ్లాదేశ్ ద్వైపాక్షిక బంధం మరింత పటిష్టమవుతోంది. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శృంగ్లా ఇటీవలి ఢాకా సందర్శన ఇందుకు అద్దం పట్టింది. ముఖ్యంగా బంగ్లా ప్రధానమంత్రి షేక్ హసీనా నాయకత్వంలోని ప్రస్తుత అవామీ లీగ్ ప్రభుత్వ హయాంలో ద్వైపాక్షిక సంబంధాలకు మరింత ఊపు లభించింది. శృంగ్లా 2019 జనవరిదాకా బంగ్లాదేశ్‌లో భారత హై-క‌మిష‌న‌ర్‌గా ఢాకాలో పనిచేశారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఎంతో కృషిచేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఢాకా పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. మరోవైపు భారతదేశంలో ఇటీవలి అంతర్గత పరిణామాలు తమ దేశంపై ప్రభావం చూపే అవకాశం ఉందని బంగ్లాదేశ్ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే, బంగ్లాదేశ్‌ ఆందోళన చెందాల్సిన పనిలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భరోసా ఇవ్వడంతోపాటు భారత పరిణామాలపై అధికారిక సమాచారం కూడా అందజేశారు. బంగబంధు షేక్ ముజీబుర్ రహ్మాన్ శతజయంతి వేడుకలను ఈ నెల మధ్యలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి వెళ్లనుండటంతో ఆయన పర్యటనకు రంగం సిద్ధం చేయడం కోసం శృంగ్లా ఢాకాను సందర్శించారు. కాగా, షేక్ ముజీబుర్ రహ్మాన్ మనకూ జాతీయ యోధుడేనని ప్రధానమంత్రి కొనియాడారు....

మ‌య‌న్మార్‌తో మ‌రింత ముందుకు భార‌త్ దౌత్య సంబంధాలు

మయన్మార్ గణతంత్ర సమాఖ్య అధ్యక్షుడు ‘వూ విన్ మింట్’ భారత పర్యటనకు వచ్చారు. విమానాశ్రయంలో ఘన స్వాగతం అనంతరం భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో ఆయన సమావేశమయ్యారు. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ- ఆయనతో ప్రతినిధి బృందం స్థాయి చర్చల్లో పాల్గొన్నారు. భారత విదేశీ విధానంలో భాగమైన ‘తూర్పు కార్యాచరణ, పొరుగుకు ప్రాధాన్యం’ సూత్రాల మేరకు భారతదేశానికి మయన్మార్ ఎంతో కీలకం. ఆగ్నేయాసియాతో వ్యూహాత్మక, విస్తృత ఆర్థిక సంబంధాల విస్తరణ భారత ప్రాథమిక లక్ష్యాలలో ఒకటి. ఈ దిశగా ముందుకు సాగాలంటే ‘‘సీఎల్ఎంవీ’’గా వ్యవహరించే కంబోడియా, లావో రిపబ్లిక్, మయన్మార్, వియత్నాంలతో సన్నిహిత సంబంధాలు నెరపడం చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో దేశాధినేతలిద్దరూ పరస్పర ప్రయోజన సంబంధిత ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. వూ విన్ మింట్ ఉన్నతస్థాయి పర్యటన సందర్భంగా ద్వైపాక్షిక సహకారం విస్తృతి కోసం పది అవగాహన ఒప్పందాలు, ఒడంబడికలపై సంతకాలు పూర్తయ్యాయి. మ‌య‌న్మార్‌లోని రాఖైన్ రాష్ట్రంలో సామాజిక-ఆర్థికాభివృద్ధికి తన కట్టుబాటును భారత్ పునరుద్ఘాటించింది. తదనుగుణంగా రాఖైన్ రాష్ట్ర ప్రగతి పథకం కింద పరస్పర సహకారంతో వివిధ అభ...

విశ్వ మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ కోరల్లో ప్ర‌పంచం

మాన‌వుల‌లో మునుపెన్న‌డూ కానరాని కొత్త ర‌కం క‌రోనా వైర‌స్ నేడు ప్ర‌పంచాన్ని కుదిపేస్తోంది. దీంతో ప్రస్తుతం 81వేల మందికిపైగా శ్వాస‌కోశ సంబంధిత ‘కోవిడ్-19’ వ్యాధిని క‌లుగ‌జేసే ఈ వైర‌స్ బారిన‌ప‌డ్డారు. ఇప్ప‌టిదాకా ఈ వైర‌స్ బ‌లిగొన్న‌ 3వేల మందిలో 96.5 శాతం... 2,800 మందికిపైగా దీని మూల స్థాన‌మైన చైనా దేశవాసులే. ఇక ప్ర‌పంచంలో వైర‌స్ సంక్ర‌మించిన వారి సంఖ్య చైనాలోని మొత్తం పీడితుల సంఖ్య‌ను మించిపోయింది. మ‌రోవైపు ఐరోపా, మ‌ధ్య‌ప్రాచ్యం, అమెరికా, ఆసియా దేశాల్లో వైర‌స్ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మొత్తం 51 దేశాల్లో కొత్త‌గా వెలుగుచూస్తున్న కేసుల‌కు స్ప‌ష్ట‌మైన‌ సాంక్ర‌మిక వ్యాధుల అధ్య‌య‌న సంబంధం లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అంటే- చైనా వెళ్లిరావ‌డం లేదా వైర‌స్ సోకిన‌ట్లు నిర్ధార‌ణ అయిన‌వారితో సంప‌ర్కం వంటి చ‌రిత్ర ఏదీ లేద‌న్న‌మాట‌. కాగా, లాటిన్ అమెరికాకు సంబంధించి తమ‌ దేశంలో తొలి కేసు న‌మోదైన‌ట్లు బ్రెజిల్ నిర్ధారించింది. చైనా వెలుప‌ల క‌రోనా పీడిత దేశాల్లో ఇరాన్ తొలి మూడు స్థానాల జాబితాలో ఒకటి కాగా, అక్క‌డ ఇప్ప‌టికే 26 మంది మ‌రణించ‌గా, 245 మంది వైర‌స్ బారిన‌ప‌డ్డార‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది...