ఇరకాటంలో పాకిస్తాన్
భారత జమ్ము , కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ ఇరకాటంలో పడింది. భారత్ రాజ్యాంగంలోని 370వ అదికరణం కొట్టివేసిన నాటి నుంచి పాకిస్తాన్ పరిస్థితి గందరగోళంలో ఉంది. భారత రాజ్యాంగంలోని 370వ అదికరణం జమ్ము,కశ్మీరుకు స్పెషల్ స్టాటస్‌ను ఇచ్చే అధికరణం. ఈ అంశాన్ని అంతర్జాతీయం చేయాలని పాకిస్తాన్ చేయని ప్రయత్నం లేదు. అంతేకాదు ఇరుదేశాల మద్య యుద్ధపరిస్థితులను ఇస్లామాబాద్ కోరుకుంటోంది. కానీ పాకిస్తాన్ ప్రయత్నాలు ఫలించలేదు. అంతర్జాతీయ కమ్యూనిటీ పాకిస్తాన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలకు ప్రతిస్పందంచలేదు. మరీ ముఖ్యంగా పాకిస్తాన్ ప్రగాఢ మిత్రులుగా భావించే ఎంతో శక్తివంతమైన మధ్య ప్రాచ్యం, పశ్చిమ ఆసియా దేశాలలో కూడా ఇండియా జమ్ము, కశ్మీర్ విషయంపై భారత్ తీసుకున్న నిర్ణయం పరంగా ఎలాంటి స్పందన రాలేదు. కశ్మీర్ విషయంలో తొలిసారి ఇస్లామిక్ ‘ఉమ్మా’ ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయకుండా మౌనంగా ఉండడం ఇదే తొలిసారి. కొన్ని కీలక దేశాలు, అంతర్జాతీయంగా ప్రముఖంగా వ్యవహరిస్తున్న దేశాలు కశ్మీర్ విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయం న్యూఢిల్లీ ఆంతరంగిక వ్యవహారమని వ్యాఖ్యానించాయి. టర్కీ, మలేసియాలు మాత్రమే పాకిస్తాన్ వేదనను ఆలకించాయి. పరారీలో ఉన్న భారత దేశ...