గల్ఫ్ దేశాల చేతుల్లో పాకిస్తాన్‌కు అవమానం
గల్ఫ్ ఆరబ్ దేశాల నుంచి పాకిస్తాన్ ఊహించిన స్పందన రాలేదు. భారత రాజ్యాంగంలోని 370వ ప్రకరణను రద్దుచేయడంపై, కశ్మీర్, జమ్ము, లదాఖ్‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా భారత్ ప్రకటించడంపై గల్ఫ్ దేశాలు చాలామటుకు మౌనం వహించాయి. అవి భారత్ విషయంలో మౌనంగా ఉండడానికి పెరుగుతున్న భారత ప్రతిష్ఠతో పాటు సుస్థిర, పరిణితిగల దేశంగా అది కొనసాగుతున్న తీరు ప్రధాన కారణాలు. అంతేకాదు మూడొంతులు గల్ఫ్ దేశాలన్నింటితో భారత్‌కు వ్యూహాత్మకమైన సన్నిహిత సంబంధాలు నెలకొని ఉన్నాయి. అంతేకాదు ఈ దేశాలతో భారత్ 100 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన వాణిజ్యాన్ని ప్రతి ఏటా చేస్తోంది. అందుకే అరేబియన్ ద్వీపకల్పంలో భారత్ అతిముఖ్యమైన ఆర్థిక భాగస్వామిగా నిలిచింది.
సౌదీ అరేబియా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఇస్లామిక్ దేశం. భారత్ చేపట్టిన చర్యలపై నియంత్రణ పాటించాలని ఈ సందర్భంగా అది కోరింది. కువైట్, కతార్, బహ్రైన్, ఒమన్ లాంటి ముఖ్యమైన దేశాలు కశ్మీర్ అంశంపై, 370వ అధికరణ రద్దుపై ఎలాంటి ప్రకటనను విడుదల చేయలేదు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దీనిపై ప్రతిస్పందిస్తూ ‘ఇది భారత ఆంతరంగిక అంశం’ అని వ్యాఖ్యానించింది. ఇది చాలా ముఖ్యమైన ప్రకటన. అలాగే అబు ధాబి కూడా ఈ అంశాన్ని పట్టించుకోలేదు. ఇటీవల కాలంలో యుఎఇ మూడు బిలియన్ల అమెరికన్ డాలర్ల రుణాన్నిఇచ్చినా, పాకిస్తాన్‌కు చేసిన చమురు ఎగుమతుల చెల్లింపులను ఎమిరేట్స్ వాయుదా వేసుకుంది. కశ్మీర్ అంశంపై ఎమిరేట్స్ పట్టని వైఖరి ఇస్లామాబాద్‌కు ముఖ్యమైన సందేశాన్నే ఇస్తోంది. భారత్‌తో వ్యూహాత్మక సంబంధాలకే తమ దేశం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందన్న విషయాన్ని చెప్పకనే అది విస్పష్టంచేసింది.
యుఎఇ భారత అతిపెద్ద వాణిజ్య భాగస్వాముల్లో ఒకటి. దీనితో దగ్గరగా 50 బిలియన్ అమెరికన్ డాలర్ల వాణిజ్యాన్ని (భారత్ నుంచి ఎగుమతులు 28 బిలియన్ అమెరికన్ డాలర్లు, భారత్‌కు చేసే దిగుమతులు 22 బిలియన్ అమెరికన్ డాలర్లు) చేస్తోంది. అలా యుఎఇలో భారత్ రెండవ పెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచింది. చైనా, అమెరికాల తర్వాత మూడవ అతిపెద్ద భాగస్వామిగా ఉంది.
యుఎఇలో 55 బిలియన్ అమెరిన్ డాలర్ల విలువైన భారత పెట్టుబడులు ఉన్నాయి. దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో విదేశీ పెట్టుబడుదారుల్లో భారత్ పెట్టుబడుదారులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. అధికారపరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాత దుబాయ్‌లో ప్రముఖ గ్లోబల్ పోర్ట్ ఆపరేట్ కశ్మీర్‌లో ఒక లాజిస్టిక్స్ హబ్ పెడుతోంది. భారత దేశ యుఎఇ రాయబారి అహ్మద్ ఆల్-బన్నా కశ్మీర్‌లోని మార్పులపై మాట్లాడుతూ ‘ ఈ పరిణామం సామాజిక న్యాయాన్ని, భద్రతను, దేశ సుస్థిరత, శాంతిలను పెంపొందిస్తుంద’ న్న ఆశాభావాన్ని వ్యక్తంచేసినట్టు వార్తలు సూచిస్తున్నాయి.
సౌదీ అరేబియా కశ్మీర్‌పై మౌనంగా ఎలాంటి అభిప్రాయాన్ని వెలువరించకుండా వ్యవహరించింది. ఈ దేశం ఇండియా, పాకిస్తాన్ రెండు దేశాలతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉంది. ప్రాంతీయ భౌగోళిక రాజకీయాలు మారుతున్న నేపథ్యంలో,ఇస్లామిక్ వరల్డ్‌లో ఆధిక్య సాధన పరంగా రియాద్ టర్కీ, ఇరాన్లతో రియాద్‌కు భావపరమైన శత్రుత్వం కొనసాగుతోంది. భారత తాజా చర్యలపై సౌదీ ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో ‘కశ్మీర్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలను గమనిస్తున్నాం’ అని వ్యాఖ్యానించింది. అదే సమయంలో పాక్, భారత్‌ల మధ్య శాంతిసంబంధాలు కొనసాగాలని పిలుపునిచ్చింది.
ఇస్లామిక్ రాజ్యమైన సౌదీ అరేబియాలో 2.7 మిలియన్ల మంది భారతీయులు ఉన్నారు. భారత్‌కు చమురు ఎగుమతి చేస్తున్న దేశాలలో ఇరాక్ రెండవ అతిపెద్ద సరఫరా దేశం. భారత దేశానికి సౌదీ నుంచి వచ్చే చమురు ఎగుమతులు ఇరుదేశాల ద్వైపాక్షిక వాణిజ్యంలో గత ఏడాది 27.5 బిలియన్ అమెరికన్ డాలర్లు ఉంది.
ఈ వారంలో ఇప్పటివరకూ లేని రీతిలో దేశంలో భారీ స్థాయిలో విదేశీ పెట్టుబడులను భారత్ ప్రకటించింది. భారత రిలయెన్స్ ఆయుల్ అండ్ కెమికల్స్ వాణిజ్యంలో సౌదీ అరేబియా దేశానికి చెందిన అరామ్కోని 15 బిలియన్ అమెరికన్ డాలర్ల మేర కొనుగోలు చేసింది. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సాల్మన్ 2021 నాటికి భారత్‌లో సౌదీ వంద బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడులను పెడతామని న్యూఢిల్లీకి మాట ఇచ్చారు.
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సౌదీ అరేబియా, బహ్రైన్‌లలోని నాయకులను కలిసి కశ్మీర్‌పై భారత చర్యలపై చర్చలు చేశారు. కానీ ఆ దేశాల నుంచి ఎలాంటి మద్దతూ ఆయనకు రాలేదు. బహ్రైన్ అయితే కశ్మీర్ అంశంపై ప్రదర్శనలు నిర్వహిస్తున్న పలువురు దక్షిణాసియా నివాసులను అదుపులోకి తీసుకుంది. ఇరాన్ ప్రెసిడెంట్ హసన్ రొహానీ, ఆ దేశ విదేశాంగమంత్రలు ‘ఇరుదేశాల మధ్య శాంతి కోసం సంభాషణలు చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సంఘటనలన్నీ పాకిస్తాన్‌కు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. పాకిస్తాన్ ఐక్యరాజ్యసమితి భద్రతామండలికి వెడితే ఎవరు పాకిస్తాన్ మద్దతు ఇస్తారు? కశ్మీర్ అంశంపై గల్ఫ్ దేశాల తీరు హద్దుదాటని రీతిలో ఉంది. పాకిస్తాన్ కశ్మీరీ అంశాన్ని అడ్డం పెట్టుకుని చమురుతో సంపద్వంతమైన గల్ఫ్ దేశాల నుంచి డబ్బు దండుకోవాలని పాకిస్తాన్ చూస్తోందని కొన్ని దేశాలు అభిప్రాయపడుతున్నాయి. కానీ డబ్బు అవాంఛనీయ శక్తుల చేతుల్లోకి వెళ్లింది. నేడు గల్ఫ్ దేశాలు ఎన్నో దేశీయ సమస్యలను ఎదుర్కొంటున్నాయి. వాటిల్లో నిరుద్యోగం, అధికధరలతో అల్లకల్లోలమవుతున్న ప్రజల జీవనశైలి ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ‘ఆరబ్ స్ర్పింగ్’ ప్రదర్శనలు వ్యూహాత్మక ప్రాధాన్యం ఉన్న ప్రాంతంలో దేశీయంగా తీవ్రమైన రకరకాల సమీకరణలకు దారితీస్తున్నాయి.
దేశీయంగా ఎదుర్కొంటున్న సమస్యలను పాకిస్తాన్ బయటకు వెల్లడిస్తే మంచిది. ముఖ్యంగా పెరుగుతున్న నిరుద్యోగం, ధరలు, రోజు రోజుకూ క్షీణిస్తున్న ఆ దేశ ఆర్థిక స్థితిగతులను చూస్తున్నాం. కశ్మీర్ సమస్య ద్వారా అంతర్జాతీయ సమాజం నుంచి జాలి, మద్దతులను పొందాలనుకోవడం, అలాగే ఇతర దేశాల నుంచి బిలియన్ల ధన సమీకరణ ఆశించడం వంటివి ప్రస్తుతం ఉన్న తీవ్ర సంక్షోభంలోంచి పాకిస్తాన్‌ను బయటపడవేయలేవు.
రచన: కౌశిక్ రాయ్, ఎఐఆర్: వార్తా విశ్లేషకులు
Comments
Post a Comment