Posts

Showing posts from July, 2019

మొజాంబిక్‌తో బలపడుతున్న భారత్ సంబంధాలు

మొజాంబిక్‌తో వ్యూహాత్మక సంబంధాలు, ద్వైపాక్షిక సంబంధాలు బలపడడానికి భారత్ పూనుకుంది. మొజాంబిక్‌లో భారత్ భారీస్థాయిలో ఆర్థిక పెట్టుబడులను కూడా పెట్టింది. రెండు దేశాలూ రెండు ముఖ్యమైన పరస్పర ప్రయోజనకర ఒప్పందాలపై సంతకాలు కూడా చేశాయి. అవే ‘వైట్ షిప్పింగ్’ ఒప్పందాలు. వైట్ షిప్పింగ్‌కు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే ఒప్పందంపై సంతకాలు చేశాయి. అలాగే సముద్రం తదితర జలవనరుల ప్రాంతాలకు సంబంధించిన రంగంలో (హైడ్రోగ్రఫీ)సహాకారాన్ని ఇచ్చిపుచుకోవాలని ఇటీవల కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన మూడు రోజుల మొజాంబిక్‌ పర్యటనలో ఆ ఆఫ్రికా దేశంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. మొజాంబిక్ రక్షణ మంత్రి అతనసియోమ్తుముకెతో ద్వైపాక్షిక సమావేశాన్ని జరిపారు. ఈ సందర్భంగా మంత్రి సింగ్ మాట్లాడుతూ ఆఫ్రికాలోని భారత అత్యంత మిత్రదేశాల్లో, భాగస్వాముల్లో మొజాంబిక్ కూడా ఒకటని వ్యాఖ్యానించారు. గణాంకాలు సూచిస్తున్న దాని భారత పెట్టుబడులు ఏడు బిలియన్ అమెరికన్ డాలర్ల వరకూ ఉన్నాయి. ప్రధానంగా భారత పెట్టుబడులు విద్యుత్, బొగ్గు రంగాలలో 25 శాతం మేర ఉన్నాయి. 2017 లో మొజాంబిక్ ఎగుమతులకు భారత్ అతిపెద్ద నిలయంగా ఉంది. ఆ దేశం మొత్తం ఎగుమతు...

ఉద్రిక్తలను తిరిగి పెంచిన ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు

కొరియా ద్వీపకల్పంలో శాంతిస్థాపనకు ఆటంకంగా మరో ఆందోళన కరమైన పరిణామం చోటుచేసుకుంది. ఉత్తర కొరియా గత వారం రెండు బెలాస్టిక్ క్షిపణుల పరీక్షలు నిర్వహించింది. ఉత్తరకొరియా ఛైర్మన్ కిమ్ జాంగున్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు కొరియాల మధ్యన ఉన్న సైనికరహిత మండలం (డీమిలిటరైజ్డ్ జోన్, డిఎంజడ్)లో సమావేశమై చర్చలు జరిపిన నెలలోపే ఈ క్షిపణి ప్రయోగాలు జరిగాయి. ఈ సమావేశంలో ప్రధాన అంశాలపై సమగ్ర పరిష్కారాలు చేపట్టే దిశగా పనిచేయాలని ఈ రెండు దేశాలూ ప్రతినబూనాయి కూడా. ఉత్తరకొరియా తూర్పు తీరంలోని వాన్సాన్ నుంచి రెండు క్షిపణుల పరీక్షలు చేశారు. ఉత్తర, దక్షిణ కొరియాలు రెండూ ఈ క్షిపణులు భిన్నమైన స్వభావంతో కూడినవని ధృవీకరించాయి కూడా. ఇవి చేతితో తీసుకెళ్లేలా ఉంటాయి, ఇతరులకు తెలియకుండా సులభంగా దాచవచ్చు కూడా. అన్నింటికన్నా ముఖ్యమైనది ఏమిటంటే వీటిని ట్రాక్ చేయడం చాలా క్లిష్టం. భద్రతాపరమైన అంశాలు కొరియా ద్వీపకల్పానికే తప్ప అమెరికాకు కాదన్నది కూడా ఇందులో స్పష్టంగా తెలుస్తుంది. క్షిపణులను ప్రారంభించిన తర్వాత కిమ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఎలాంటి భద్రతా పరమైన ప్రమాదం ఉత్తరకొరియాకు ఎదురుకాకూడదనేది క్షిపణుల ప్రయ...

బిఆర్ఐసిఎస్ విదేశాంగ మంత్రుల సమావేశం

ప్రపంచ చరిత్ర పునాదులు డైనమిక్ రీతిలో కదులుతున్నాయి. అధికారం పశ్చిమాన్నించి తూర్పుకు, ఉత్తరాన్నించి దక్షిణానికి మారుతోంది. ఇతర నిర్మాణ విధానాల మార్పుకన్నా ఇది ఎక్కువగానే ఉంది. ఇది చారిత్రాత్మకమైన మార్పు. సంపద, ప్రపంచ జనాభా ఒకే చోట కేంద్రీకృతం కావడం ఆధునిక యుగంలో ఇదే తొలిసారి. ఈ పరిణామమే ‘బ్రిక్స్’ తలెత్తడానికి కారణమైంది. ప్రపంచం వేగంగా పరిణామం చెందుతోంది. అలాగే ప్రపంచ శక్తులు కూడా. ప్రస్తుతం ప్రపంచ దృష్టి ‘బ్రిక్స్’ మీదే ఉంది. బ్రిక్స్ ఇతర గ్రూపుల కన్నా భిన్నమైంది. ఇందులో మాజీ సూపర్ పవర్ ఉంది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాల్లాంటి శక్తివంతమైన చోట్ల శక్తిసామర్థ్యాలను, అధికారాన్ని నెలకొల్పేందుకు ఆ సూపర్ పవర్ పనిచేస్తోంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇది ఇపుడిప్పుడే పైకి ఎదుగుతున్న అధికారశక్తుల పాత్రపై తన చూపును నిలుపుతోంది. అంతేకాదు సుస్థిరతపాదుకొల్పడంలో ముఖ్యమైన, గ్లోబల్ ఆర్థికవ్యవస్థ సుసంపన్నతలపై కూడా చూపు సారించింది. అంతర్జాతీయ సంబంధాలలో ‘బ్రిక్స్’ ఒక కొత్త కూటమి. జి7 కన్నా కూడా అత్యధిక ప్రాతినిద్యాన్ని కలిగి ఉన్న కూటమి. అలాంటి ‘బ్రిక్స్’ తన రెండవ దశాబ్ద ప్రయాణాన్ని ప్రారంభించింది...

పార్లమెంటులో ఈ వారం..

చంద్రయాన్-2ను విజయవంతంగా ప్రయోగించిన భారత అంతరిక్ష అధ్యయన సంస్థ (ఇస్రో)ను రాష్ట్రపతి రామ్ నాథ్‌కోవింద్, ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీలు ప్రశంసించారు. చారిత్రకమైన ఈ ఘట్టం భారతీయులందరికీ ఎంతో గర్వించదగ్గ క్షణాలుగా కోవింద్ వ్యాఖ్యానించారు. ఈ ప్రయోగం కొత్త అంశాలను కనుగొనడానికి దారులు వేస్తుందని అన్నారు. అంతేకాదు భారత అంతరిక్ష విజ్ఘాన వ్యవస్థను మరింత సంపద్వంతం చేస్తుందన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ విజయవంతమైన చంద్రయాన్-2 లాండింగ్ ఈ రంగంలో ముందున్న దేశాల్లో నాల్గవ దేశంగా భారతదేశాన్ని నిలబెడుతుందన్నారు. తన సందేశంలో భారత ప్రధాని నరేంద్ర మమోదీ భారత శాస్త్రవేత్తల ప్రతిభా సామర్థ్యాలను ఎంతగానో పొగిడారు. అంతేకాదు వారి ఆత్మవిశ్వాసానికి ఇది ఒక మచ్చచుతునకగా పేర్కొన్నారు. కేంద్ర విదేశ వ్యవహారాల శాఖా మంత్రి డా. ఎస్. జైశంకర్ మాట్లాడుతూ ముఖ్యమైన అంశాలను పాకిస్తాన్‌తో ద్వైపాక్షికంగానే చర్చించి పరిష్కరించుకోవాలన్నది భారత విస్పష్టమైన పంథా అని స్పష్టంచేశారు. జమ్ము-కశ్మీర్ సమస్యపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన గురించి రాజ్యసభలో ప్రస్తావిస్తూ కశ్మీర్ ...

జగమెరిగిన సత్యాన్ని వెల్లడించిన పాకిస్తాన్

రచన: కౌశిక్ రాయ్: ఎఐఆర్: విశ్లేషకులు పాకిస్తాన్ ప్రకటన ఆసక్తిని రేపేలా ఉంది. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తమ దేశంలో 40 ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయంటూ ప్రకటించారు. అంతేకాదు పాకిస్తాన్ అడ్డాగా 40 వేల మంది ఉగ్రవాదులున్నారంటూ కూడా ఆయన పేర్కొన్నారు. ప్రధాని అయిన తర్వాత తన తొలి అధికారిక వాషింగ్టన్ పర్యటనలో ఇమ్రాన్ ఖాన్ ఈ విషయాన్ని వెల్లడించారు. పాకిస్తాన్‌ ఉగ్రవాదులకు నిలయంగా ఉందన్న సత్యాన్ని ఒప్పుకున్నారు. గతంలో ఇస్లామాబాద్ ప్రభుత్వాలేవీ కూడా ఈ సత్యాన్ని అమెరికాతో పంచుకోలేదని వ్యాఖ్యానిం చారు. అమెరికా ఉగ్రవాదంపై చేస్తున్న పోరుతో పాకిస్తాన్ కూడా కలిసి పోరాడుతోందని ఖాన్ అన్నారు. ‘‘పాకిస్తాన్‌కు 9/11 ఉగ్రదాడులతో ఏ విధమైన సంబంధం లేదు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఆల్-ఖైదా ఉంది. పాకిస్తాన్‌లో తాలిబాన్ ఉగ్రవాదులు ఎవ్వరూ లేరు. అయినా కూడా మేం అమెరికా చేస్తున్న ఉగ్రవాద పోరాటంతో చేతులు కలిపాం. దురదృష్టవశాత్తు పరిస్థితులు వికటించడంతో, నేను నా ప్రభుత్వాన్ని నిందించాను. మేం అసలు సత్యాలను అమెరికాకు వివరించలేదు’ అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. కాంగ్రెస్ మహిళ షైలా జాక్సన్ లీ కాపిటల్ హిల్‌లో ఇచ్చిన విందు సందర్భంలో ఇమ్రాన్ మ...

అధిక వృద్ధిపై భరోసా కల్పిస్తున్న భారత ఆర్థిక రంగం

అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఐఎంఎఫ్) తాజా ప్రపంచ ఆర్థిక చిత్రాన్ని ముందుపెట్టింది. దాని ప్రకారం భారత జాతీయోత్పత్తి పెరుగుదల ఈ ఆర్థిక సంవత్సరంలో ఏడు శాతం పెరగనుందని పేర్కొంది. రానున్న ఆర్థిక సంవత్సరంలో ఇది 7.2 శాతం ఉంటుందని కూడా సూచించింది. కేంద్రం 2019 ఆర్థిక బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ముందు ప్రభుత్వం ఆర్థిక సర్వే నివేదికను విడుదల చేసింది. అందులోని అంశాలపై ఐఎంఎఫ్ పరిశీలించింది. ఆర్థిక సర్వేలో పేర్కొన్న అంశాల కనుగుణంగా అంతర్జాతీయంగా క్లిష్టపరిస్థితుల గాలి వీస్తున్నా, భారత ఆర్థిక ప్రగతి పటిష్టంగా ఉంటుందని పేర్కొంది. ఐఎంఎఫ్ ఈ ఆర్థిక సంవత్సరం అభివృద్ధి రేటును 7.3 శాతం నుంచి 7 శాతానికి తగ్గించి పేర్కొంది. దీనికి కారణం తీవ్రస్థాయిలో కొనసాగుతున్న వాణిజ్య యుద్ధాలతో పాటు విస్తరిస్తున్న రక్షణవాదం, చైనాతో పాటు ఎన్నో దేశాల భారీ ఆర్థికవ్యవస్థల క్షీణత, నేడు అంతర్జాతీయ పెట్టుబడులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు. అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థలో పెరుగుదల వాతావరణం ఒక గొప్ప సానుకూల అంశంగా పేర్కొనాలి. అంతర్జాతీయంగా పరిస్థితులు బలహీనంగా ఉన్న పరిస్థితులు ఉన...

మరోసారి షాక్ ఇచ్చిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కశ్మీర్ విషయంలో చేసిన వ్యాఖ్యలు ప్రపంచమంతా సంచలనం సృష్టించాయి. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో జరిగిన సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కశ్మీర్ వివాదంలో కలుగజేసుకుని మధ్యవర్తిగా వ్యవహరించమని తమని కోరారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. ఇది కథలో సగం విషయమే. అమెరికా, పాకిస్తాన్‌ల మధ్య జరిగిన వ్యూహాత్మక చర్చలలో దాగున్న అసలు విషయాన్ని భారత్ జాగ్రత్తగా గమనించాలి. మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలకు భిన్నంగా అమెరికా స్టేట్ డిపార్ట్ మెంట్ విడుదల చేసిన ఒక ప్రకటనలో కశ్మీర్ వివాదంలో యుఎస్ కలుగజేసుకునే ప్రసక్తి లేదని, కశ్మీర్ వివాదం భారత, పాకిస్తాన్ల మధ్య నలుగుతున్న ద్వైపాక్షిక అంశమని పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలకు స్పందిస్తూ భారత విదేశాంగ వ్యవహారాల శాఖా మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ మాట్లాడుతూ అలాంటి విజ్ఘాపనను ప్రధాని నరేంద్రమోదీ అమెరికన్ అధ్యక్షుడితో చేయలేదని స్పష్టంచేశారు. అమెరికా అధ్యక్షుడు, భారత ప్రధాని మోదీ జపాన్‌లోని ఒసాకాలో జరిగిన జి20 శిఖరాగ్ర సదస్సు సమయంలో విడిగా చర్చలు జరిపారు. ఈ సమావేశం మోదీ రెండవసారి ప్రధానిగా బాధ్యత...

భారత రెండవ చంద్రయానం అంతరిక్షంలోకి

భారత అంతరిక్ష కార్యక్రమాల్లో ఎంతో ప్రతిష్ఠాత్మకమైన, సంక్లిష్టమైన ప్రయోగం సోమవారం మధ్యాహ్నం అంతరిక్షంలోకి విజయవంతంగా దూసుకువెళ్లింది. భారత దేశ శక్తివంతమైన రాకెట్ జిఎస్ఎల్‌వి ఎంకె-3 చంద్రయాన్-2ని అంతరిక్షంలోకి విజయవంతంగా తీసుకువెళ్లింది. ఇది చంద్రగ్రహంపై భారత రెండవ మిషన్. దీన్ని ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న భారత అంతరిక్ష స్పేస్ పోర్ట్ సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి సోమవారం మధ్యాహ్నం 2.43 నిమిషాలకు నింగికి ఎగిసింది. పదిహేడు నిమిషాల అనంతరం ముందరే నిర్ణయించిన భూగ్రహం చుట్టూ ఉన్న కక్ష్యలోకి చంద్రయాన్-2 వెళ్లేలా అనుసంధానించారు. నిజానికి చంద్రయాన్-2 జూలై 15 వతేదీన పంపడానికి ప్రయత్నించారు కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల దాన్ని ఆపేసారు. ఆ సాంకేతిక లోపాన్ని సరైన సమయంలో గుర్తించి వెంటనే ఆ పొరపాటును స్వల్పవ్యవధిలోనే సరిచేసి చంద్రయాన్-2 నింగికి ఎగసేలా మన అంతరిక్ష శాస్త్రవేత్తలు చేశారు. అలా చంద్రయాన్-2 అంతరిక్ష్యంలోకి అనుకున్న సమయానికి వెళ్లేలా చేసిన క్రెడిట్ ఇస్రో శాస్త్రవేత్తలకే దక్కుతుంది. ఇక్కడ ఒక ముఖ్య విషయం చెప్పాలి. ఈ మిషన్‌లో ప్రయోగం కేవలం తొలి అడుగు మాత్రమే. ఇప్పటివరకూ ఇస్రో ...

శ్రీలంకలో పెట్టుబడులను పెంచుతున్న భారత్

భారత, శ్రీలంక దేశాలు 91.26 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువచేసే ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందంననుసరించి మాహో నుంచి ఒమంథై వరకూ రైల్వే లైనును సముద్ధరించాని నిర్ణయించుకున్నాయి. మాహో నుంచి ఒమథై వరకూ మొత్తం 130 కిలోమీటర్ల దూరాన్ని ఈ ట్రాక్ కవర్ చేస్తుంది. వంద సంవత్సరాల కాలంలో తొలిసారి ఈ రైలు మార్గాన్ని పునరుద్ధరించే పనిపై ఒప్పందం చోటుచేసుకోవడం ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. శ్రీలంక రైల్వేల మెరుగుదలలో భారత్ అందిస్తున్న తోడ్పాటు అందరికీ తెలిసిన విషయమే. ద్వీప దేశమైన శ్రీలంకలో ఇప్పటివరకూ శ్రీలంక రైల్వే రంగ అభివృద్ధికి మొత్తం 1.3 బిలియన్ అమెరికన్ డాలర్ల సహాయాన్ని భారత్ ప్రకటించడమే కాదు దానికి కట్టుబడి వ్యవహరిస్తోంది కూడా. దీన్నిబట్టి స్పష్టమవుతన్న విషయం ఏమిటంటే భారత్ తన పెట్టుబడులను బాగా మెరుగుపరుచుకోవాలని చూస్తోంది. అలాగే మూడవ ప్రపంచ దేశాలతో సంయుక్త పెట్టుబడులకు కూడా భారత్ సంసిద్ధంగా ఉంది. భారత్ చేపట్టిన ప్రాజక్టులు ప్రజా ప్రయోజనాలే కేంద్రంగా చేపట్టినవి. అక్కడి ప్రజల ఆరోగ్యం, విద్య, అనుసంధానతా రంగాలపై భారత్ దృష్టి పెట్టింది. ఈ నెలలో వంద వరకూ మోడల్ విలేజీలను భారత సహాయంతో గమ్‌పహ జిల్లాలో ...

పార్లమెంటులో ఈ వారం

కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి డా. ఎస్. జైశంకర్ పాకిస్తాన్ నిర్బంధంలో ఉన్న భారత జాతీయుడు కుల్‌భూషణ్ జాదవ్‌ను విడుదల చేయాల్సిందిగా కోరారు. ఈ కేసుపై ఇటీవల అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. కుల్‌భూషణ్ జాదవ్‌ను విడుదలచేయాల్సిందిగా, అతన్ని తిరిగి స్వదేశానికి పంపించాల్సిందిగా మంత్రి జైశంకర్ పాకిస్తాన్‌ను కోరారు. పార్లమెంటు ఉభయసభల్లోనూ దీనికి సంబంధించిన ప్రకటనను చేశారు. ఆ ప్రకటనలో భారత్, భారతదేశానికి చెందిన జాదవ్‌కే కాదు చట్టబద్ధ పాలన, అంతర్జాతీయ ఒప్పందాలపై గౌరవం ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని విస్పష్టంగా ఆహ్వానిస్తారన్నారు. అమాయకుడైన జాదవ్‌పై చేసిన ఆరోపణలన్నీ అసత్యాలని పేర్కొన్నారు. చేయని నేరాన్ని ఒప్పుకోమంటూ అతనిపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. అతని తరపున వాదించేందుకు చట్టబద్ధ ప్రతినిధి కూడా లేరన్నారు. ఈ నేపథ్యంలో వాస్తవ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు. కేంద్ర విదేశాంగ వ్యవహారాల మంత్రి మాట్లాడుతూ కాంస్యులర్ సంబంధాలకు సంబంధించిన వియత్నాం ఒప్పందం కింద ఉన్న నిబంధనలన్నీంటినీ కూడా పాకిస్తాన్ అతిక్రమించిందని ప్రకటించారు. జాదవ్‌కు ఉన్న హక్కుల గురించి ఆలస్యం చేయకుండ...

భద్రతా సహకారాన్ని పటిష్టం చేసుకుంటున్న ఇండియా-ఉజ్బెకిస్తాన్‌లు

ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడానికి సంబంధించి ‘ఇండియా-ఉజ్బెకిస్తాన్ జాయింట్ వర్కింగ్ గ్రూపు’ ఎనిమిదవ సమావేశం న్యూ ఢిల్లీలో జరిగింది. ఇరుదేశాలకు చెందిన సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సరిహద్దు తీవ్రవాదం వల్ల ఎదురయ్యే ప్రమాదాలను రెండు దేశాలూ క్షుణ్ణంగా పరిశీలించాయి. ఆయా ప్రాంతాలలోనే కాదు ప్రపంచంలోని పలు ప్రాంతాలలో ఉగ్రవాద బృందాలు తమ కార్యకలాపాలను విస్తృతంగా నిర్వహించడాన్ని గమనించాయి. ఉగ్రవాదంపై పోరాటంలో ఎదుయ్యే సవాళ్లను కూడా రెండు దేశాలూ చర్చించాయి. అంతేకాదు రాడికలైజేషన్, ఉగ్రవాదశక్తులకు నిధుల సహాయంపై పోరాటం, ఉగ్రవాదచర్యలకు అంతర్జాలాన్ని వినియోగించడాన్ని నిరోధించడం, విదేశీ ఉగ్రవాదులను తిరిగి అప్పగించే ఒప్పందాలకు సంబంధించిన పలు విషయాలను ఈ సమావేశంలో ఇరుదేశాలు లేవనెత్తాయి. సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించుకోవడం, సామర్థ్య పెంపుదల, మంచి విధానాలను అనుసరించడం ద్వారా ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో ద్వైపాక్షిక సహకారాన్ని పటిష్టం చేసే చర్యలను కూడా ఇరుదేశాల అధికారులు చర్చించారు. ఈ సమావేశంలో ఇంకొన్ని ముఖ్య విషయాలను కూడా ఇరుదేశాలూ పంచుకున్నాయి. బహుపక్ష వేదికలపై సహకారం ఆవశ్యకతను రెండు దేశాలూ గుర్తించ...

ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థ దిశగా భారత్

బడ్జెట్ 2019‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 నాటికి ఐదు ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు భారత్ చేరుకోవాలనే అంశంపై తన దృష్టిని కేంద్రీకరించారు. ‘విజన్ ఫర్ ది డికేడ్’ ను ఆమె ప్రకటించారు. ఇందులో విధానపరమైన పలు చర్యలు మిళితమై ఉన్నాయి. ఈ రోడ్‌మ్యాప్ పూర్తిగా పెట్టుబడులు, ఆర్థికాభివృద్ధిపైనే తన దృష్టిని కేంద్రీకరించింది.  విధాన చర్యలు, భౌతిక, సామాజిక మౌలికసదుపాయాలతో పాటు డిజిటల్ మౌలిక సదుపాయాలతో పాటు ద్రవ్య పెంపుదలను కూడా చేర్చారు. అలాగే మహిళలకు, చిన్నారులకు పోషకాహారం, ఆరోగ్యం , నీటి నిర్వహణ, బ్లూ ఎకానమీపై పోకస్, అంతరిక్ష కార్యక్రమాలను బలోపేతం చేయడం, ధాన్యాలు, పప్పులు ఉత్పత్తిలో స్వయంసాధి కారికంగా నిలబడ్డం, ‘మేక్ ఇన్ ఇండియా’ను మరింత విస్తృతస్థాయిలో వృద్ధిచేయడం, ‘ఆయుష్మాన్ భారత్’ను పూర్తిస్థాయి ప్రభుత్వం, పూర్తిస్థాయి పాలనా అంశాలతో మరింత పరిపుష్టం చేయడం వంటి అంశాలు కూడా విధానపరమైన చర్యల్లో ఉన్నాయి. ఈ మొత్తం కార్యక్రమాలలో ప్రతి భారతీయుడు వాటాదారుడేనని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానిం చారు.  ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థికాభివృద్ధిని 2024 నాటికి సాధించేలా...

ఐసిజెలో భారత దౌత్య విజయం

భారతదేశానికి చెందిన కులభూషణ్ సుధీర్ జాదవ్‌ను 2016, మార్చిలో పాకిస్తాన్ అదుపులోకి తీసుకుంది. ఉగ్రవాదచర్యలకు, గూఢచర్యానికి పాల్పడ్డట్టు ఆరోపిస్తూ జాదవ్‌ను పాకిస్తాన్ అదుపులోకి తీసుకుంది. 2017 ఏప్రిల్‌లో పాకిస్తాన్ సైనిక న్యాయస్థానం జాదవ్‌కు ఉరిశిక్షను విధించింది. 2017, మేలో దీనిపై పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం (ఇంటర్నేషనల్ కోర్టు ఆఫ్ జస్టిస్, ఐసిజె) లో భారత్ కేసు నమోదుచేసింది. కాన్సులార్ సంబంధాలకు సంబంధించిన 1963 వియన్నా ఒప్పందాన్ని పాకిస్తాన్ అతిక్రమించిందని భారత్ పేర్కొంది. వియత్నాం ఒప్పందంలోని 36వ ఆర్టికల్ కింద జాదవ్‌ను నిర్భంధంలోకి తీసుకున్న విషయాన్ని పాకిస్తాన్ వెంటనే భారత్‌కు తెలియజేయాల్సి ఉందని అందులో స్పష్టంగా పేర్కొంది. అంతేకాదు కుల్‌భూషణ్ హక్కుల గురించి తెలపాలని కోరింది. దీని కింద భారత కాంస్యులర్ అధికారులను కుల్‌భూషణ్‌ని కలవడానికి అనుమతించాలి కూడా. అయితే ఇండియా కోరిన అంశాలను పాకిస్తాన్ నిర్ద్వందంగా తిరస్కరించింది. ఐసిజిలో కేసు విచారణ జరిగేటప్పుడు రకరకాల చట్టపరమైన వాదనలను వినిపించింది. 2019, జూలై 17వ తేదీన ఐసిజె తన తీర్పును వెలువరించింది. ఈ తీర్ప...

హఫీజ్ సయూద్‌ని తిరిగి బయటకు తెచ్చిన పాకిస్తాన్!

రచన: డా. అశోక్ బెహూరియా, కో-ఆర్డినేటర్, దక్షిణ ఆసియా సెంటర్, ఐడిఎస్ఎ అరెస్టుకు ముందు ఇచ్చే బెయిల్‌ని నిషేధిత జమ్మత్-ఉద్-దా అవా(జెయుడి) అధిపతి హఫీజ్ ముహమ్మద్ సయూద్‌కి లాహోర్‌లోని యాంటీ-టెర్రరిజం కోర్టు (ఎటిసి) మంజూరుచేసింది. మరో ముగ్గురు కూడా దీన్ని పొందారు. పాకిస్తాన్ ఈ వార్త ఎవ్వరినీ ఆశ్చర్యపరచదు. జెయుడి పాకిస్తాన్ భూభాగంలో తమ శిక్షణాసంస్థల నిర్వహణ, ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చడం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోంది. దానిపైనే కోర్టులో కేసు నడుస్తోంది. తాత్కాలిక బెయిల్‌ని సయూద్‌కి, అతని సోదరుడు హఫీజ్ సయూద్‌కి, లష్కర్-ఇ-తోయిబా (ఎల్ఇటి)కి చెందిన ఇద్దరు సహవ్యవస్థాపకులకు, అమీర్, హమ్జా, మాలిక్ జఫర్లకు ఆగస్టు 31 వరకూ బెయిల్ మంజూరుచేసింది. వీరు ప్రతి ఒక్కరూ 50,000 పికెఆర్‌ను షూరిటీ బాండ్లను వ్యక్తిగత పూచీకత్తుగా ఇవ్వాలని పేర్కొంది. హమ్జా, జఫర్ జెయుడికి నిధులు సహాయం చేశారు. కొన్ని వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం ఏడాది క్రితం (మార్చి, 2018) హమజ్ ఎల్ఇటి నుంచి విడిపోయాడు. తర్వాత సొంతంగా జైష్-ఇ-మన్ఖవా పేరుతో మరో ఉగ్ర సంస్థను ఏర్పాటుచేశాడు.  జూలై మొదటివారంలో పాకిస్తాన...

కర్తార్‌పూర్ కారిడార్ తుది ఒప్పందానికి చేరువలో భారత్, పాకిస్తాన్లు

  పాకిస్తాన్ వైపున ఉన్న వాఘా-అత్తారి సరిహద్దులో భారత్, పాకిస్తాన్ అధికారుల మధ్య రెండవ విడత చర్చలు జరిగాయి. కర్తార్‌పూర్ కారిడార్‌ ఒప్పందం ఖరారు చేయడానికి సంబంధించిన విధాన పరమైన చర్చలు ఎంతో  ప్రగతిని సాధించాయి. దీనివల్ల సరిహద్దుల్లోని పాకిస్తాన్ నరోవాల్ జిల్లాలో ఉన్న చారిత్రాత్మక దర్బార్ సాహిబ్ గురుద్వారాను భారత యాత్రికులు సందర్శించే అవకాశం ఉంది. ఇది 16వ శతాబ్దానికి చెందిన గురుద్వారా. చారిత్రాత్మకంగా, మతపరంగా ఎంతో పేరున్న గురుద్వారా ఇది. సిక్కుల గురువు గురు నానక్ దేవ్ జీ తన తుది రోజుల్లో ఇక్కడే ఉన్నారు. అంతేకాదు 1539లో ఆయన తన తుది శ్వాసను ఇక్కడే విడిచారు. భారత, పాకిస్తాన్ల మధ్య తీవ్ర  ఉద్రిక్తల మధ్యనే సుదీర్ఘ చర్చల అనంతరం ఎట్టకేలకు దర్బార్ సాహిబ్ గురుద్వారా క్షేత్ర దర్శనానికి సంబంధించి ఒక ఆశ చిగిర్చింది. సుదీర్ఘకాలంగా వస్తున్న ఒక కోరికకు పునాదిరాయి పడింది. భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు కర్తార్‌పూర్ కారిడార్‌కు గత ఏడాది నవంబరు 26న పంజాబ్ లోని గురుదాస్ పూర్ జిల్లాలో ఉన్న డేరా బాబా నానక్‌కు దగ్గరలో పునాదిరాయి వేశారు. అనంతరం పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కర్తార్‌ప...

ఐసిసి ప్రపంచకప్పు 2019 విజేత ఇంగ్లండ్

ప్రపంచ క్రికెట్ కప్పుకు ఆతిథ్యం ఇచ్చిన ఇంగ్లండ్ 44 ఏళ్ల ఎదురుచూపులు చిట్టచివరకు ఆ దేశాన్ని 2019 ఐసిసి క్రికెట్ వరల్డ్ కప్పు విజేతగా నిలబెట్టాయి. ఆదివారం రాత్రి లార్డ్స్ మైదానంలో న్యూజిలాండ్‌తో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్స్ లో ఇంగ్లండ్ విజేతగా నిలిచింది. బెన్ స్టోక్స్ హీరోచిత పోరులో కప్పును సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ ముందున్న లక్ష్యం 242 పరుగులు. చివరి బంతికి స్కోరు సమం కావడంతో సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. దీంట్లో మరోసారి స్టోక్స్, బట్లర్ రాణించి 15 పరుగులు సాధించగా, కివీస్ కూడా అన్నే పరుగులు సాధించి ధీటైన సమాధానం ఇవ్వడంతో టైగా ముగిసింది. ఇక్కడ జిమ్మీ నీషామ్, మార్టిన్ గుప్తిల్‌లకు కృతజ్ఘతలు చెప్పాలి. అయితే ఆతిథ్య దేశం ఇన్నింగ్స్‌ లో సాధించిన అత్యధిక బౌండరీల సంఖ్య బట్టి ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించింది. న్యూజిలాండ్ తెచ్చిన ఒత్తిడిని తట్టుకుంటూ ఆతిథ్య జట్టు ఇంగ్లండ్ జగజ్జేతగా నిలిచింది. మొత్తం మీద ఈ పోటీలో ఇంగ్లండ్ 50 ఓవర్లలో 22 బౌండరీలు సాధిస్తే, న్యూజిలాండ్ 14 బౌండరీలను మాత్రమే సాధించింది. తొలి దశలో ఆర్చర్ అద్భుత బంతులతో ఇబ్బంది పెట్టాడు కానీ ప్రత్యర్థి జట్టు దానిని తట్టుకుంది...

పార్లమెంటులో ఈ వారం

న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్,2019 బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు సహాయంతో న్యూ ఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఇది దేశానికి సంబంధించిన ముఖ్య సంస్థ. ఎందుకంటే అతి పెద్ద ఆర్బిట్రేషన్ హబ్‌గా సమగ్ర అభివృద్ధి సాధనలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంటుంది. ఈ బిల్లుపై బుధవారం పార్లమెంటులో జరిగిన చర్చలో న్యాయ శాఖా మంత్రి రవి శంకర్ ప్రసాద్ సమాధానం ఇస్తూ దేశాన్ని అంతర్జాతీయ, దేశీయ మధ్యవర్తిత్వానికి ముఖ్యమైన హబ్‌గా ఈ సెంటర్‌ని తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు వెల్లడించారు.  దీంతోపాటు పార్లమెంటు ఉభయసభలు మరో ముఖ్యమైన చట్టబద్ధ తీర్మానాన్ని చేపట్టాయి. అదేమిటంటే పాకిస్తాన్ నుంచి ఎగుమతి అయ్యే, లేదా పాక్ సరుకులపై 200 శాతం కస్టమ్స్ డ్యూటీని విధించాలని తీర్మానం చేపట్టింది. కస్టమ్స్ టారిఫ్ యాక్ట్ లోని తొలి షెడ్యూల్‌లో సవరణకు ఉభయసభలు ఆమోదించాయి. అంతేకాదు ఇస్లామాబాద్ నుంచి వచ్చే అన్ని రకాల సరుకులపై ఈ ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 200 శాతం ప్రాథమిక కస్టమ్ డ్యూటీ విధించాలని న్యూ ఢిల్లీ నోటిఫై చేసింది. ఈ తీర్మానాలను కేంద్ర ఆర్థిక సహా...

మీడియాపై తీవ్ర స్థాయిలో చర్యలు చేపడుతున్న పాకిస్తాన్

పాకిస్తాన్ ప్రభుత్వానికి, అక్కడి మీడియాకు మధ్య సంబంధాలు లవ్ అండ్ హేట్ పద్ధతిలో ఉంటాయి. అక్కడి ప్రజాస్వామ్య చరిత్రలో చూస్తున్న సత్యం ఇది. స్వేచ్ఛయుతమైన మీడియా, ముఖ్యంగా పత్రికారంగంపై తరచూ అక్కడ నిషేధాలు కొనసాగుతూనే ఉంటాయి. వ్యంగ్యమైన అంశం ఏమిటంటే ఈ నిషేధాలు లేదా పత్రికా స్వేచ్ఛను అణచివేసే ధోరణులు ఏవీ సైనిక పాలనకు మాత్రం వర్తించవు. మీడియాపై విధిస్తున్న అలాంటి కఠిన చర్యల పట్ల పౌర యంత్రాంగం కూడా చాలా ఇబ్బందిపడుతోంది. ఇటీవల ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం మీడియా కవరేజ్‌ను నిషేధించాలంటూ తాజాగా ఆదేశాలు జారీచేశారు. అంతేకాదు గతంలో న్యాయవిచారణ ఎదుర్కొంటున్న వారు, నిర్బంధంలో ఉన్న నేరస్తులైన రాజకీయ నాయకుల ఇంటర్వ్యూలను నిషేధిస్తూ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌లో మీడియాని నియంత్రణలో పెట్టే ‘ఆదేశాలను ఇస్తూ రెగ్యులేటరీ అథారిటీకి ఆదేశాలు ఇచ్చింది.  గతంలో, టెలివిజన్ వార్తా చానల్స్ ‘ఛానల్ 24, ‘ఆబ్‌తక్ న్యూస్’, ‘క్యాపిటల్ టివి’ వంటివి మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురు మరియం నవాజ్ సంచలన ఇంటర్వ్యూను ప్రసారం చేశాయి. ఆతర్వాత నుంచి ఆ ఛానల్స్ దేశం అంతటా ప్రసారం కావడ...