ఐసిసి ప్రపంచకప్పు 2019 విజేత ఇంగ్లండ్
ప్రపంచ క్రికెట్ కప్పుకు ఆతిథ్యం ఇచ్చిన ఇంగ్లండ్ 44 ఏళ్ల ఎదురుచూపులు చిట్టచివరకు ఆ దేశాన్ని 2019 ఐసిసి క్రికెట్ వరల్డ్ కప్పు విజేతగా నిలబెట్టాయి. ఆదివారం రాత్రి లార్డ్స్ మైదానంలో న్యూజిలాండ్‌తో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్స్ లో ఇంగ్లండ్ విజేతగా నిలిచింది. బెన్ స్టోక్స్ హీరోచిత పోరులో కప్పును సొంతం చేసుకుంది.
ఇంగ్లండ్ ముందున్న లక్ష్యం 242 పరుగులు. చివరి బంతికి స్కోరు సమం కావడంతో సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. దీంట్లో మరోసారి స్టోక్స్, బట్లర్ రాణించి 15 పరుగులు సాధించగా, కివీస్ కూడా అన్నే పరుగులు సాధించి ధీటైన సమాధానం ఇవ్వడంతో టైగా ముగిసింది. ఇక్కడ జిమ్మీ నీషామ్, మార్టిన్ గుప్తిల్‌లకు కృతజ్ఘతలు చెప్పాలి. అయితే ఆతిథ్య దేశం ఇన్నింగ్స్ లో సాధించిన అత్యధిక బౌండరీల సంఖ్య బట్టి ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించింది. న్యూజిలాండ్ తెచ్చిన ఒత్తిడిని తట్టుకుంటూ ఆతిథ్య జట్టు ఇంగ్లండ్ జగజ్జేతగా నిలిచింది. మొత్తం మీద ఈ పోటీలో ఇంగ్లండ్ 50 ఓవర్లలో 22 బౌండరీలు సాధిస్తే, న్యూజిలాండ్ 14 బౌండరీలను మాత్రమే సాధించింది.
తొలి దశలో ఆర్చర్ అద్భుత బంతులతో ఇబ్బంది పెట్టాడు కానీ ప్రత్యర్థి జట్టు దానిని తట్టుకుంది. ఈ పోటీ చాలా నాటకీయంగా, ఉద్వేగభరితంగా ముగిసింది. ఈ విజేతను నిర్ణయించడానికి ఏడు వారాలపాటు 48 మ్యాచులు జరిగాయి. చిట్టచివరకు ఇంగ్లండ్ 1979, 1987, 1992 ఎడిషన్ల ఓటమి తర్వాత నాల్గవ ఫైనల్స్ లో విజేతగా నిలిచింది.
న్యూజిలాండ్‌కు మటుకు ఈ పరిణామం ఎంతో బాధకరమైందని చెప్పాలి. ఎందుకంటే వరుసగా భారత్‌ను ఓడించి ఎనిమిదవ పర్యాయం ఐసిసి వరల్డ్ కప్ సెమీ-ఫైనల్స్ కు చేరి ఆస్ట్రేలియా రికార్డును సమం చేసిన తర్వాత ఈ ఓటమి సహజంగానే న్యూజిలాండ్ జట్టును బాధపెట్టింది.
బ్యాంటింగ్ ఎంచుకుని 23.1 ఓవర్లలో 86 పరుగులను చేసి నాలుగు వికెట్లను కోల్పోయి తీవ్ర సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొన్న న్యూజిలాండ్ 50 ఓవర్లకు 241 పరుగులను ప్రత్యర్థి జట్టుకు టార్గెట్‌గా పెట్టింది. ఇంగ్లండ్ ఐదవ వికెట్ భాగస్వామ్యంలో 110 పరుగుల దగ్గర ఆల్‌రౌండర్ స్టోక్స అవుటవకుండా 84 పరుగులు చేయగా, జోస్ బట్లర్ 60వ బంతికి 59 పరుగుల దగ్గర ఉండి సవాలును తడబడకుండా ఎదుర్కొన్నారు.
న్యూజిలాండ్ ఓపెనింగ్ బ్యాట్స్ మాన్ హెన్రీ నిఖోల్స్ 55 పరుగులు తీశారు. వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ టామ్ లథామ్ 47 పరుగులు తీశారు. ఇంగ్లండ్ విషయంలో ఫాస్ట్ బౌలర్లు క్రిస్ వోక్స్, లియామ్ ప్లంకెట్లు చెరో మూడు వికెట్లు తీశారు.
ఈ టోర్నమెంట్ టాప్ స్కోరర్‌గా ఇండియాకు చెందిన రోహిత్ శర్మ 648 పరుగులతో ముందుండగా, రెండవ స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ వార్నర్ 647 పరుగులతో నిలిచారు. ఒక్క వరల్డ్ కప్పులోనే ఇరువురూ సచిన్ టెండూల్కర్ సాధించిన 673 పరుగుల ఆల్-టైమ్ రికార్డుకు ఎంతో దగ్గరలో వచ్చారు కానీ ఇద్దరూ కూడా దీన్ని అధిగమించడంలో వైఫల్యం చెందారు. అంటే ఆ రికార్డు ఇంకా భారత బ్యాటింగ్ ఐకాన్ టెండూల్కర్‌దే. ఇంతవరకూ ఎవరూ సాధించలేనిదిగా ఆ రికార్డు ఇంకా అలా నిలిచి ఉంది.
ఏమైనప్పటికీ రోహిత్ శర్మ ఒకే వరల్డ్ కప్ టోర్నమెంటులో ఎక్కువ శతకాలు (ఐదు) సాధించిన రికార్డును బ్రేక్ చేశారు.
ఈ టోర్నమెంటులో ఒక రికార్డును తిరగరాసారు. ఫాస్ట్ బౌలర్ మిట్చిల్ స్టర్క్ తోటి ఆస్ట్రేలియా పేస్‌మ్యాన్ గ్లెన్ మెక్ గ్రాత్ సృష్టించిన 28 వికెట్ల రికార్డును బద్దలుకొట్టాడు. 29 స్కాల్ప్ తో2019 ఐసిసి వరల్డ్ కప్పులో అత్యంత సక్సస్‌ఫుల్ బౌలర్‌గా నిలిచాడు.
గత వరల్డ్ కప్ ఛాంపియన్ భారత్, ఆస్ట్రేలియాలు సెమీ ఫైనల్స్ లో ఓటమి చవిచూశాయి. ఐదుసార్లు ఈ కప్పును కైవసం చేసుకున్న ఆస్ట్రేలియాను ఎనిమిది వికెట్లతో ఇంగ్లండ్ తుడిచిపెట్టేసింది. ఒకప్పటి ప్రపంచ కప్పు విజేతను అత్యంత సులభంగా పెవిలియన్ దారి పట్టించింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ ను నియంత్రించడం దానికి కష్టమైంది.
ముందురోజు కివీస్ మరో వరల్డ్ కప్ ఫేవరేట్ అయిన ఇండియాను ఓడించింది. రెండుసార్లు ఈ కప్పును కైవసం చేసుకున్న ఇండియా ఎంతో పట్టుదలగా ఆడుతున్న న్యూజిలాండ్‌కు చెప్పే జవాబులూ ఏమీ లేవు. 18 పరుగుల తేడాతో కివీస్ చేతుల్లో భారత్ ఓటమి పాలైంది. వర్షం కారణంగా ఆగిన ఆటను రిజర్వు డేలో ఈ రెండు జట్లు పోరాడటం తెలిసిందే.
లీగ్ ప్లేలో మొత్తం ఏడు బృందాలు పోటీ నుంచి నిష్క్రమించాయి. పాకిస్తాన్ ఇప్రసివ్‌గా నిలిచింది. ఆఫ్ఘన్ క్రీడాకారులు తమ ఆటతో ఎందరో క్రికెట్ అభిమానుల గుండెలను గెలుచుకున్నారు. పాకిస్తాన్ సెమీఫైనల్స్ అర్హతలో చాలా తక్కువ రన్ రేటుతో తప్పుకుంది. కానీ ఫైనల్స్ కు వచ్చిన న్యూజిలాండ్‌ను ఆరు వికెట్లతో, ఇంగ్లండ్‌ను 16 పరుగుల తేడాతో ఓడించిన తృప్తి పాక్‌కు మిగిలింది.
దక్షిణాఫ్రికా, వెస్ట్ ఇండీస్ తమ అభిమానులను, ప్రపంచలోని ఎంతో మంది క్రికెట్ నిపుణులను బాగా నిరాశపరిచాయి. కానీ డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియాను లీగ్ ఫైనల్స్‌లో ఓడగొట్టామన్న ఓదార్పు ఒక్కటి మిగిలింది.
సెమీ ఫైనల్స్‌కు చేరిన నాలుగు జట్లు అత్యుత్తమమైనవి. వాటి నుంచి రెండు టీములు ప్రపంచ కప్పు ట్రోఫీకి లార్డ్స్ మైదానంలో పోటీపడ్డాయి. దానికి తగ్గట్టు ఫైనల్స్ ఎన్నో ఉత్కంఠతలకు తెరలేపింది. ఎవరు ట్రోఫీ జగజ్జేతగా నిలుస్తారన్న ఉత్సుకతను ఆ రోజు సాయంత్రం అశేషజనవాహినిలో, క్రీడాభిమానుల్లో నింపింది క్రికెట్‌కు ఆథ్యాత్మిక నెలవు, నిలయం, ఇల్లైన ఇంగ్లండ్.

రచన: రాహుల్ బెనర్జీ, క్రీడా వ్యాఖ్యాత
Comments
Post a Comment