Posts

Showing posts from November, 2019

మౌలిక సదుపాయ రంగంలో భారత్ నిర్ణయాత్మక పెట్టుబడుల వెల్లువ - పటిష్టమైన వృద్ధి

ఆర్థిక మంగమనాన్నినిలువరించి, తన పరిశ్రమకు మద్దతు విధానంతోపాటు కార్యక్రమాలను కొనసాగించే లక్ష్యంతో గణనీయమైన ప్రతయ్నంలో భాగంగా ప్రభుత్వం బుధవారం నాడు ఒక భారీ ప్రణాళికను ఆవిష్కరించింది. దీనికింద రాగల ఐదేళ్లలో దేశంలోని మౌలిక సదుపాయ రంగంలో వంద లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాలని సంకల్పించారు. ఈ సందర్భంగా రైల్వేలు, వాణిజ్యం - పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ - ఇంత భారీ స్థాయి పెట్టుబడి వల్ల మౌలిక వసతుల లభ్యత, నాణ్యత గణనీయంగా పెరుగుతాయని స్పష్టం చేశారు. విమానయానం, నౌకాయానం రోడ్లు, రహదారులు, రైల్వేలు, రేవులే కాక విద్యుచ్ఛక్తి, చమురు, గ్యాసు రంగాలకు నూతనోత్తేజం లభించి వచ్చే ఐదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా, సమర్థంగా తయారవుతుందన్నారు. ప్రపంచంలోనే అత్యంత విస్తారమైన రైల్వేనెట్ వర్కులతో అధిపతిగా వున్న భారత రైల్వేలు 50 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో 12 సంవత్సరాల ప్రణాళికను రూపొందించిందని, మధ్యకాలానికి సంబంధించినంతవరకు ఇది ఊహకు కూడా అందనంతటి పెద్ద మొత్తమని పీయూష్ గోయల్ చెప్పారు. అయితే ఈ స్థాయిలో పెట్టుబడి ఒక్క ప్రభుత్వం వల్లనే సాధ్యం కాదుకనుక తగిన ప్రోత్సాహకాలతో ప్రైవేటురంగానికి కూడా...

జనరల్ బజ్వా పదవీ కాలం పొడిగింపు పై వివాదం 

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్, జనరల్ ఖమర్ జావేద్ బజ్వా పదవీ కాలాన్ని మూడు సంవత్సరాలు పొడిగిస్తూ, పాక్ ప్రధాని ఇమ్రాన ఖాన్, ఆగష్టు 19వ తేదీన జారీ చేసిన ఉత్తర్వులను, అనూహ్యంగా, పాకిస్థాన్ సుప్రీం కోర్టు కొట్టి వేసింది. 59 సంవత్సరాల జనరల్ బిజ్వా పదవీ కాలం 28 అర్థరాత్రితో ముగియవలసి ఉంది. అయితే, చీఫ్ ఆఫ్ ఆర్మీ పదవీ కాలాన్ని పొడిగించడానికి సంబంధించి, పార్లమెంట్ చట్టాన్ని సవరిస్తామన్నహామీపై సుప్రీం కోర్టు, షరతులు విధిస్తూ అయన పదవీ కాలాన్ని ఆరు నెలలు పొడిగించింది.  ఇందుకు సంబంధించి దేశంలో చాలా వాడీ వేడి చర్చ జరిగింది. మరో వంక అటు సుప్రీం కోర్టులో న్యాయ పోరాటం నడిచింది. చివరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తి, జస్టిస్ సయీద్ ఖోసా సారధ్యంలోని త్రిసభ్య ధర్మాసనం, అన్ని అంశాలను పరిశీలించి, నిర్ణయం తీసుకుంది. న్యాయస్థానం, ధర్మాసనం మొత్తం వ్యవహారం ఇటు ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్’కు అటు అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీలకు తలవంపులు తెచ్చే విధంగా తల్లకిందులుగా సాగిందని అభిప్రాయ పడింది. ఆర్మీ చీఫ్ పదవీ కాలం పొడిగింపు ప్రతిపాదనపై ముందుగా మంత్రి వర్గం ఆమోదం పొందవలసిందని, ఆ తర్వాతనే ప్రధానమంత్రి, అధ్యక్షుడు నిర్ణయ...

గగనంలో భార‌త ‘సునిశిత నేత్రం’

దేశంలోని తూర్పు తీరంలోగల సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి భారత్ నిన్న తన ‘సునిశిత నేత్రా’న్ని గగనంలో ప్రవేశపెట్టింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ISRO విజ‌యాశ్వమైన‌ ధ్రువ ఉపగ్రహ ప్రయోగ వాహనం PSLV-C47 ఈ బాధ్య‌త‌ను నెర‌వేర్చింది. ఈ మేర‌కు భారతదేశపు మూడో తరం అధునాతన భూ గ్ర‌హ ప‌రిశీల‌న‌, రేఖా చిత్రీక‌ర‌ణ ఉప‌గ్ర‌హం కార్టోసాట్-3ని కేవలం 17 నిమిషాల్లో సూర్యానువ‌ర్తిత ధ్రువ కక్ష్యలోకి ప్రవేశ‌పెట్టింది. ఇస్రో ఇప్ప‌టిదాకా కక్ష్య‌లో ప్ర‌వేశ‌పెట్టిన గ‌గ‌న నేత్ర ఉప‌గ్ర‌హాల‌లో అత్య‌ధిక స్ప‌ష్ట‌త‌తో చిత్రాలు తీయ‌గ‌ల సామ‌ర్థ్యం కార్టోశాట్‌-3 ప్ర‌త్యేక‌త‌. ఇందుకోసం ఉప‌యోగించిన PSLV-C47 వాహ‌నం అత్యంత శ‌క్తిమంత‌మైనది కాగా- ఇది ఆరు అనుసంధాన బూస్ట‌ర్‌ రాకెట్ల సాయంతో నింగిలోకి దూసుకెళ్లింది. భార‌త అంత‌రిక్ష శాఖ‌కు చెందిన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్‌-NSILతో అమెరికాలోని రెండు సంస్థ‌ల‌ వాణిజ్య ఒప్పందం మేర‌కు మ‌న‌ కార్టోశాట్‌-3తోపాటు 13 సూక్ష్మ ఉప‌గ్ర‌హాల‌ను ఈ రాకెట్ విజ‌య‌వంతంగా క‌క్ష్యలో నిలిపింది. నిర్దేశిత ప్ర‌ణాళిక ప్ర‌కారం కార్టోశాట్‌-3ని భూమికి 509 కిలోమీట‌ర్ల ప‌రిధిలో ప్ర‌వేశ‌పెట్టాక సూక్ష్మ ...

బ్రిట‌న్‌లో ఆక‌స్మిక ఎన్నిక‌లు... స్థూల ప‌రిశీల‌న‌

బ్రిట‌న్‌లో డిసెంబ‌రు 12వ తేదీన పార్ల‌మెంటు ఆకస్మిక ఎన్నిక‌ల పోలింగ్ జరుగుతుంది. ఐరోపా స‌మాఖ్య నుంచి బ్రిటన్ నిష్క్ర‌మ‌ణ సంబంధిత‌ ‘‘బ్రెగ్జిట్‌’’ ప్ర‌ణాళిక‌కు చట్టసభలో సంపూర్ణ మ‌ద్ద‌తు ల‌క్ష్యంగా ప్ర‌ధాన‌మంత్రి బోరిస్ జాన్స‌న్ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. మొత్తంమీద ఐదేళ్ల వ్యవధిలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌డం ఇది నాలుగోసారి. ‘‘బ్రెగ్జిట్‌’’పై 2016లో ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ త‌ర్వాత దేశంలో రాజ‌కీయ అనిశ్చితి రాజ్యమేలుతోంది. ఈ నిరంతర సంక్షోభం నుంచి దేశాన్ని గ‌ట్టెక్కించడానికి ఎన్నికలే మార్గమని జాన్స‌న్ స్ప‌ష్టం చేశారు. ఇంత‌కుముందు 2017లోనూ అప్ప‌టి ప్ర‌ధాని ‘థెరెసా మే’ ఆక‌స్మిక ఎన్నిక‌ల‌కు వెళ్లారు. అయితే, క‌న్జ‌ర్వేటివ్ పార్టీ ప్రభుత్వం పార్ల‌మెంటులో ఆధిక్యం కోల్పోయింది. ఫ‌లితంగా అధికారంలో కొన‌సాగ‌డం కోసం డెమోక్ర‌టిక్ యూనియ‌నిస్ట్ పార్టీ-DUP మ‌ద్ద‌తు తీసుకోవాల్సి వ‌చ్చింది. సార్వత్రిక ఎన్నికల ప్రచారం మూడో వారంలో ప్రవేశించిన నేపథ్యంలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేక‌ర‌ణ‌ మేరకు- ప్రధాన ప్రతిపక్షం లేబర్ పార్టీపై కన్జర్వేటివ్ పార్టీ 19 పాయింట్ల ఆధిక్యంలో ఉంది. ఆ మేర‌క...

సీపీఈసీ పై పాక్’కు అమెరికా హెచ్చరిక 

చైనా 2013లో బెల్ట్ అండ్ రోడ్డు ఇనిషియేటివ్-BRI- పనులు ప్రారంభించింది. అప్పటినుంచి నుంచి, ముఖ్యంగా అందులో భాగంగా చేపట్టిన చైనా.. పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్, ఆర్థిక నడవ భారత దేశంలో ఆందోళనలు రేకేతిస్తోంది. ఈ నడవ నిర్మాణం భారత దేశ సార్వభౌమాధికారానికి ప్రమాదంగా పరిణమిస్తుందని, అదే విధంగా ఈ ప్రాంతంలో ఇతరత్రా ఉద్రిక్తతలకు దారి తీస్తుందని భారత దేశంలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో భారత దేశం చాలా కచ్చితమైన, నియమబద్దమైన నిర్ణయాన్ని తీసుకుంది. ‘సీపీఈసీ’ని నిర్ద్వందంగా వ్యతిరేకించింది. నిజానికి BRIని మొదటగా వ్యతిరేకించిన దేశం భారతదేశం. అలాగే, చైనాలో జరిగిన బిల్డ్ అండ్ రోడ్ ఫోరం రెండు సమావేశాలకు తమ ప్రతినిధిని పంపని ఏకైక దేశం కూడా భారత దేశమే. ఆవిధంగా BRI విషయంలో భారత దేశం 2013నుంచి ఒకే విధానాన్ని,ఒకే పంధాను పాటిస్తూ వచ్చింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ కుండా వెళ్ళే BRI ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ CPEC విషయంలో భారత దేశం ఎప్పటికప్పుడు అభ్యతరాలను వ్యక్తపరుస్తూనే ఉంది. “ CPECని ప్రధాన ప్రాజెక్టులో చేర్చడంతో దేశ సర్వ భౌమాధికారం, ప్రాతీయ సమగ్రతల విషయంలో భారత దేశం వ్యక్తపరిచిన ఆందోళనను పట్టిచుకో లేదు” అనే...

జపాన్’లో జీ – 20 విదేశాంగ మంత్రుల సమావేశం 

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభివృద్ధి చెందిన, చెందుతున్న 20 ప్రధాన ఆర్థిక వ్యవస్థల ప్రపంచ వేదిక, జీ – 20. ఇందులో, 19 సభ్య దేశాలు, యురోపియన్ యూనియన్’లకు భాగస్వామ్యం ఉంది. జీ-20 దేశాల 14వ శిఖరాగ్ర సదస్సు జూన్ నెలాఖరులో, ఒసాకాలో జరిగింది. ఆ సదస్సు కొనసాగింపుగా, జపాన్, నగోయా నగరంలో జీ – 20 సభ్య దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్. ఎస్.జైశంకర్ పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొన్న విదేశాంగ మంత్రులు ప్రస్తుత ప్రపంచ స్థితిగతులు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పై ప్రసరిస్తున్న, ఆర్ధిక మాంద్యం ప్రభావం, అందుకు సంబదించిన ఇతర అంశాలపై క్షుణ్ణంగా చర్చించారు.  సమావేశం అనంతరం, జపాన్ విదేశాంగ మంత్రి, జీ – 20 విదేశాంగ మంత్రుల సమావేశం అధ్యక్షుడు తోషిమిట్సు మోటేగి మాట్లాడుతూ, ప్రస్తుత సభ్యదేశాల ముందున్న అనేక సమస్యలను చర్చించి, పరిష్కారాలను చూపే విధంగా ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)ను తక్షణం సంస్కరించ వలసిన అవసరం ఉందని అంగీకరించారని తెలిపారు. అదే విధంగా, వివాదాల పరిష్కార యంత్రంగాన్ని మెరుగు పరిచే విధంగా సంస్థ చర్యలు తీసుకోవాలని కూడా సభ్య దేశాల ప్రతినిధులు కోరారు. ఒక...

పార్లమెంటులోఈ వారం

భారత పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఎగువసభ రాజ్యసభ 250వ సమావేశ వేడుకలతో ఆరంభమై 3 వారాలపాటు కొనసాగే ఈ సమావేశాలలో ఇదే ప్రధానాంశం కానుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ సందర్భంగా మాట్లాడుతూ - జాతీయ దృష్టి కోణానికి, ప్రాంతీయ ప్రయోజనాలకు మధ్య సమతుల్యతను పాటించాలని సభ్యులకు పిలుపునిచ్చారు. ప్రజాహిత అంశాలపై సభకు అంతరాయం కల్గించటం కాక చర్చలకు పెద్ద పీట వేయాలన్నారు. అడ్డు కట్టలకు, సమతుల్యతలకు దారికల్పించే ఎగువసభ ఉండటం ఎంతో అవసరమని ప్రధానమంత్రి వక్కాణించారు. కానీ అడ్డుకట్టలకు, ప్రతిష్ఠంభనలకు నడుమ గిరి గీయాలని ప్రధాని హెచ్చరించారు. భారత్ లోని భిన్నత్వంలో ఏకత్వం పెద్దల సభలో చాలా చక్కగా ప్రతిబింబిస్తుందన్నారు. భారత రాజకీయ వ్యవస్థలో ఎగువ సభ భూమికను, సంస్కరణల ఆవశ్యకతను గురించి ప్రస్తావిస్తూ - రాజ్యాంగ వ్యవస్థాపకులు శాసన ద్విసభ చట్రం మంచిదని భావించి ఈ ఏర్పాటు చేసారని ఈ దార్శనికత వల్లనే దేశ ప్రజాస్వామ్యం సుసంపన్నంగా పరిఢవిల్లిందని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఎన్నికల రాజకీయాలకు దూరంగా వుండేవారు సైతం దేశానికి దేశాభివృద్ధికి పాటుపడే అవకాశాన్ని రాజ్యసభ కల్పిస్తుందన్నారు. రాష్ట్రాల కూ...

అనవసర సమస్యలతో సతమతమవుతున్న పాకిస్తాన్

అనేక సమస్యలు చుట్టు ముట్టిన పాకిస్తాన్ లో గత నెలలో చోటు చేసుకున్న అనేక పరిణామాల తో ఆ దేశ రాజకీయాల తీరు రసవత్తరంగా మారింది. గత నెల్లాళ్లుగా మౌలానా ఫజులూర్ రెహమాన్ చేపట్టిన ఆజాదీ మార్చ్ చుట్టూనే పాకిస్థాన్ లో రాజకీయాలు పరిభ్రమించాయి. మూడు సార్లు ప్రధాన మంత్రిగా సేవలందించిన అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని చికిత్స కోసం విదేశాలకు వెళ్లడానికి అనుమతించాలా అనేదానిపై చర్చ జరిగింది .పాకిస్తాన్ భవిష్యత్తుకు సంబంధించిన ప్రధాన సమస్యలపై దృష్టి పెట్టడం కంటే ఈ సమస్యపై పాకిస్తాన్ టెలివిజన్ చానెళ్లు వార్తా పత్రికలు అవసరాన్ని మించి చర్చలు జరిపాయి వార్తలకు ఎక్కువ చోటు కేటాయించాయి. అక్టోబర్ 27 న సుకూర్ నుండి ప్రారంభమైన ఫజులూర్ మార్చ్ కొద్ది రోజులకు ఇస్లామాబాద్ చేరుకున్న అంశం మీడియా దృష్టిని పెద్ద ఎత్తున ఆకర్షించింది. ఇమ్రాన్ ప్రభుత్వాన్ని దించి వేయటమే తమ ర్యాలీ ముఖ్య ఉద్దేశ్యమని, అది జరగకుండా తన మనుషులు ఇస్లామాబాద్ ను విడిచిపెట్టరని మౌలానా అన్నారు. చేతుల్లో కర్రలతో తిరుగాడుతున్న అతని పార్టీ కార్యకర్తల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో చాలామంది వ్యాఖ్యాతలు ప్రభుత్వాన్ని కదిలించే హింసాత్మక ఫలి...

కాళాపానీ  వివాదం 

భారత్, నేపాల్, చైనా ఈ మూడు దేశాల ముక్కోణ కూడలి ప్రాంతం, కాళాపానీ...ప్రాంతం. హిమాలయ పర్వత శ్రేణుల ప్రాంతంలో, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఫిథొరఘడ్ జిల్లాలోని ఈ ప్రాంతం నియంత్రణ విషయంలో భారత-నేపాల్ దేశాల మధ్య ఎంతో కాలంగా వివాదం ఉంది. ఆ వివాదం ప్పుడు మళ్ళీ మరో మారు తెరపైకి వచ్చింది. జమ్మూ కశ్మీర్ రాష్ట్రాన్ని పునర్వివ్యస్తీకరించిన నేపధ్యంలో భారత ప్రభుత్వం, కొద్ది రోజుల క్రితం సవరించిన ఇండియన్ మ్యాప్, దేశ పటాన్ని విడుదల చేసింది. సవరించిన దేశ పటంలో భారత భూభాగంగా చూపిన కాళాపానీ ప్రాంతంలోని కొంత భూభాగం, ఆ పరిసరాలలోని మరి కొంత భూభాగం తమదే అని నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేసింది.  అయితే, ఈ వివాదం ఇప్పుడు కొత్తగా తెరపైకి వచ్చినా, నిజానికి ఇది ఇపాప్తి సమస్య కాదు. ఈ సమస్యకు చరిత్ర ఉంది. 1816లో నేపాల్ రాజు, అప్పటి బిటిష్ ఇండియా ప్రభుత్వం మధ్యకుదిరిన చారిత్రక సంగౌలీ ఒప్పందం నాటినుంచి కూడా ఈ వివాదం సజీవంగా ఉంటూనే ఉంది. చర్చలు, సంప్రదింపులు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఒప్పందమ ప్రకారం రెండు దేశాల మధ్య మహాకాళీ నది సరిహద్దుగా ఉంటుంది. అయితే, ఒప్పందంలో నది జన్మస్థలం, దాని ఉపనదులు వంటి కొన్ని విషయాల్లో స్పష్టత...

బంధాలు బలోపేతానికి భారత విదేశాంగ మంత్రి శ్రీ లంక పర్యటన

శ్రీలంక ఏడవ కార్యనిర్వాహక అధ్యక్షునిగా ఎన్నికైన గోతబయ రాజపక్సను, భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్.ఎస్. జైశంకర్ కొలంబోలో కలిశారు.శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే జైశంకర్ ప్రత్యేకంగా కొలంబో వెళ్లి, నూతన అధ్యక్షునిగా ఎన్నికైన గోతబయను అభినందించారు.ఈ సందర్భంగా భారత దేశంలో పర్యటించాలని శ్రీలంక నూతన అధ్యక్షుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తరపున జైశంకర్ ఆహ్వానించారు. శ్రీలంక అధ్యక్షుడు భారత దేశ ఆహ్వానాన్ని ఆమోదించారు. నవంబర్ 29న భారత దేశంలో పర్యటించేందుకు అంగీకరించారు. ఇదే శ్రీలంక నూతన అధ్యక్షుని తొలి విదేశీ పర్యటన కావడం విశేషం. శ్రీలంక నూతన అధ్యక్షుడు రాజపక్సేను ఆహ్వానించేందుకు స్వయంగా విదేశాంగ మంత్రిని కొలంబో పంపడం ద్వారా భారత దేశం, ఉభయ తారకంగా, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు భారత దేశం సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది.అలాగే, నూతన ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు తమ ప్రభుత్వం ఆసక్తి చూపుతోందనే స్పష్టమైన సంకేతాలను ఆ దేశానికి ఇచ్చినట్లయింది.భారత దేశంతో పాటుగా అమెరికా,పాకిస్థాన్,ఇరాన్, చైనా కూడా గోతబయ రాజపక్సేను అభినందించాయి. అయితే యురోపియన్ యూ...

రాజ్య సభ 250 వ సెషన్

భారత పార్లమెంట్ ఎగువ సభ, రాజ్య సభ మరో మెయిలు రాయిని దాటింది. సోమవారం ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలతో, రాజ్య సభ 250 సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇదొక చారిత్రక సందర్భం.భారత ప్రజాస్వామ్య ప్రస్థానంలో రాజ్య సభ పోషించిన ప్రధాన భూమికను గుర్తు చేసుకోవలసిన సమయం ఇది. పెద్దల సభగా ప్రసిద్ధి చెందిన రాజ్య సభ, 1952లో ప్రారంభమైన నాటి నుంచి, దేశ ప్రయోజనాల పరిరక్షణలో సందర్భోచితంగా సముచిత పాత్రను పోషించింది. రాజ్య సభ 1952 లో హిందూ వివాహ, విడాకుల చట్టం మొదలు ముస్లిం మహిళల (వివాహ హక్కుల రక్షణ) బిల్లు 2019ని ఆమోదించడం వరకు, అక్కడి నుంచి 2019లో జమ్ము-కశ్మీర్ పునర్వ్యవస్తీకరణ బిల్లు ఆమోదించడం వరకు అనేక సందర్భాలలో భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య చరిత్ర పై చెరగని ముద్రను వేసింది.  ఉపరాష్ట్ర పతి, రాజ్య సభ అధ్యక్షుడు ఎం. వెంకయ్య నాయుడు అన్నట్లుగా, ఎగువ సభ సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కుంది. కాలానుగుణంగా దేశం అవసరాలను తీర్చడంలో పెద్దల సభ ప్రముఖ పాత్రను పోషించింది. ‘అయితే,ఇంకా ప్రయాణించవలసిన దూరం చాలానే ఉంది. సభ పని తీరు విషయంలో కోల్పోయిన కాలాన్ని, అవకాశాలను భర్తీ చేసే విధంగా, రాజ్య సభ పూర్...

అభివృద్ధి దిశగా భారత్- భూటాన్ సంబంధాలు

భూటాన్ విదేశాంగ శాఖ మంత్రి ల్యోన్పో (డాక్టర్) తండి దోర్జీ, భారత పర్యటన ఉభ దేశాల స్నేహ సంబంధాలకు కొత్త ప్రమాణాలను, కొత్త అర్థాలను నిర్దేశించింది. డాక్టర్, దోర్జీ వారం రోజుల పర్యటనలో భాగంగా భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్. జయశంకర్’ తో సమావేసమయ్యారు. ఉభయ దేశాల విదేశాంగ మంత్రులు రెండు దేశాల దౌత్య సంబందాలకు సంబందించిన అన్ని అంశాలను సమగ్రంగా చర్చించారు. ఆర్థిక సహకారం, అభివృద్ధి భాగస్వామ్యం, జల విద్యుత్ సహకారం వంటి ద్వైపాక్షిక సంబంధాలను ఉభయ దేశాల విదేశాంగ శాఖ మంత్రులు అమూలగ్రంగా చర్చించారు. భారత విదేశాంగ శాఖ మంత్రితో సమావేశానికి ముందు,భూటాన్ విదేశాంగ మంత్రి దోర్జీ భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలేతోనూ సమావేశమయ్యారు.భూటాన్ విదేశాంగ మంత్రి డిల్లీ పర్యటన ముగించుకుని అక్కడి నుంచి బీహార్’లోని బుద్ధగయ, రాజ్గిర్’ సందర్శిస్తారు. అక్కడి నుంచి కోల్’కత వెళతారు. కోల్’కతాలో ఆయన పశ్చిమ బెంగాలో గవర్నర్, ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉంది. భారత్- భూటన దేశాల మధ్య ఉన్నతస్థాయి వ్యక్తుల పర్యటనలు, అభిప్రాయాలను ఇచ్చిపుచ్చుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ఆ సంప్రదాయంలోభాగంగానే, ల్యోన్పో తండి దోర్జీ భారత దేశంలో ప...

శ్రీలంక ఏడవ అధ్యక్షునిగా గోటబయ రాజపక్స ఎన్నిక

శ్రీలంక రాక్షపతి ఎన్నికలు గత శనివారం జరిగాయి. ఈ ఎన్నికలలో శ్రీ లంక పోడుజన పెరమున (ఎస్ఎల్పీపీ) అభ్యర్ధి గోటబయ రాజపక్స, దేశ ఏడవ కార్యనిర్వాహక అధ్యక్షునిగా ఏన్నికయ్యారు.పోలైన ఓట్లలో 52.25 శాతం ఓట్లు రాజపక్సేకే పోలయ్యాయి.ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం రాజపక్సే, శ్రీలంకలోని అనురాధపురాలో తాను దేశాధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రకటించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా పలువురు ప్రపంచ నాయకులు అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన గోటబయ రాజపక్సను అభినందించారు. శ్రీలంక అధ్యక్షునిగా ఎన్నికైన గోటబయ రాజపక్సకు పంపిన అభినందన సందేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, భారత్ – శ్రీలంక సంబంధాలు మరింత బలపడే విధంగా భారత దేశం నూతన అధ్యక్షునితో కలిసి పనిచేస్తుందని, సేనః సంబంధాలను కొనసాగిస్తుందని పేర్కొన్నారు. భారత ప్రజలు, ప్రభుత్వం తరపున, వ్యక్తిగతంగా నూతన అధ్యక్షునికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాజపక్సే సమర్ధ నాయకత్వంలో శ్రీలంక ప్రజలు శాంతి, సౌభాగ్యాలతో అభివృద్ధి పథంలో ముందుకు పయనిస్తారన్నఆశాభావాన్ని వ్యక్తపరిచారు. అదే విధంగా రాజపక్సే నాయకత్వంలో శ్రీలంక – భారత దేశాల మధ్య సాంస్కృత...

పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాల ఎదుట గ‌ల అంశాలు

పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాలు న‌వంబ‌రు 18న ప్రారంభ‌మ‌వుతున్నాయి. డిసెంబ‌రు 13 వ‌ర‌కు జ‌రుగుతాయి. ఈ స‌మావేశంలో అనేక బిల్లుల‌ను చ‌ర్చ‌కు చేప‌డ‌తారు. ఈ స‌మావేశాల‌లో రెండు కీల‌క ఆర్డినెన్సులు కూడా చ‌ట్ట‌రూపం దాల్చ‌నున్నాయి. అలాగే విధాన ఆమోదం, ఉత్పాద‌క‌త‌, కీల‌క దేశ ప్ర‌యోజ‌న అంశాల‌పై రాజ‌కీయ ఏకాభిప్రాయం - అనే మూడు అంశాలు స‌మావేశాల‌లో కీల‌కంగా ఉంటాయి. వివిధ సామాజిక‌, రాజ‌కీయ‌, ఆర్థిక అంశాల‌పై కేంద్రాన్ని ఇరుకున పెట్టాల‌ని ప్ర‌తిప‌క్షాలు ప్ర‌య‌త్నించే వున్నందున పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాలు ర‌భ‌స‌గా ఉంటాయ‌ని భావిస్తున్నారు. గ‌డ‌చిన రెండేళ్ల‌లో శీతాకాల స‌మావేశాలు న‌వంబ‌రు 21న ప్రారంభ‌మై జ‌న‌వ‌రి మొద‌టివారంలో ముగిసాయి. ఈ ఏడాది జ‌రిగిన వ‌ర్షాకాల స‌మావేశాల‌లో ట్రిపుల్ త‌లాఖ్‌, మోటారు వాహ‌నాల చ‌ట్టం, జాతీయ ద‌ర్యాప్తు సంస్థ స‌వ‌ర‌ణ‌ల చ‌ట్టం మైలురాయి బిల్లులు కాగా 370వ అధిక‌ర‌ణ‌తోపాటు జ‌మ్మూ - కాశ్మీరును పూర్తిగా జాతీయ ప్ర‌ధాన స్ర‌వంతిలో క‌లిపేందుకు అడ్డంకిగా ఉన్న జ‌మ్మూ - కాశ్మీరు పున‌ర్ వ్య‌వస్థీక‌ర‌ణ చ‌ట్టాల ర‌ద్దును స‌మావేశాల మ‌రీ ప్ర‌త్యేకంగా చెప్పాలి. ఇక జాతీయ పౌరుల రిజిస్ట‌ర్‌లు (NRE...

బ్రిక్స్ సభ్యులతో బంధాలను పటిష్టం చేసుకున్న భారత్

భారతదేశ బహుపాక్షిక సంబంధాలలో నాలుగు దేశాల సమూహం ఉనికిలోకి వచ్చినప్పట్నించి దేశ విదేశాంగ విధానంలో బ్రిక్స్ చాలా ముఖ్యమైన వ్యూహాత్మక స్థలాన్ని ఆక్రమించింది. భౌగోళిక రాజకీయాలు, భౌగోళిక ఆర్థిక శాస్త్రం రూపాంతరం చెందుతున్న తరుణంలో పైకి ఆవిర్భవిస్తున్న బ్రిక్స్ ఆర్థిక వ్యవస్థలు ప్రపంచం ప్రధానంగా పరిగణించాల్సిన వ్యవస్థలుగా ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో బ్రెజిల్ రాజధాని బ్రెసిలియాలో జరిగిన 11వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్రమోది పాల్గొనడం ప్రాధాన్యం సంతరించుకుంది. శిఖరాగ్ర సదస్సుకు ముందు ప్రధానమంత్రి నరేంద్రమోది మాట్లాడుతూ - సదస్సు ప్రాముఖ్యాన్ని ప్రధానంగా ఎత్తి చూపారు. బ్రిక్స్ చట్ర పరిధిలో ఉగ్రవాద నిరోధక సహకారానికి యంత్రాంగాలను ఏర్పాటు చేయాలని భారత్ - తదితర బ్రిక్స్ దేశాలు చూస్తున్నాయని మోది చెప్పారు. బ్రిక్స్ వాణిజ్య మండలి నుద్దేశించి భారత ప్రధాని ప్రసంగిస్తూ ఈ దేశాలన్నీ కలిసి ప్రపంచ ఆర్థిక వృద్ధిలో 50 శాతం వాటా కలిగి ఉన్నాయని అన్నారు. ప్రపంచంలో ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికి బ్రిక్స్ దేశాల వేగవంతమైన ఆర్థికాభివృద్ధి వల్ల లక్షలాది ప్రజలు పేదరికం నుండి బైట పడ్డారు. టెక్నాలజీ - ఆవ...

బ్రెసీలియాలో జ‌రిగిన 11వ బ్రిక్స్ శిఖ‌రాగ్ర స‌ద‌స్సు

బ్రెసిలియాలో విజ‌య‌వంతంగా ముగిసిన బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర స‌ద‌స్సు వాటి క్రియాశీల‌త‌కు నానాటికి పెరుగుతున్న వాటి ప్రాముఖ్యానికి కొల‌బ‌ద్ద‌గా నిలుస్తుంది. గ‌డ‌చిన ద‌శాబ్ద కాలంలో బ్రిక్స్ దేశాలు భౌగోళిక వృద్ధికి ప్ర‌ధాన చోద‌కులుగా ప‌నిచేసాయ‌ని సంయుక్త ప్ర‌క‌ట‌న పేర్కొంది. అస‌లు బ్రిక్స్ ఆవిర్భావ‌మే కొత్త‌గా ఉద్భ‌విస్తున్న భౌగోళిక ఆర్థిక క్ర‌మంలోని మారుతున్న ధోర‌ణుల‌కు అద్దం ప‌డుతుంది. ప్ర‌పంచంపై ప‌శ్చిమ దేశాల పెత్త‌నాన్ని ప్ర‌శ్నించ‌ట‌మే కాదు, ఆలోచ‌నా స‌ర‌ళిని, ప్ర‌పంచ దృష్టి కోణాన్ని నూత‌నంగా మ‌ల‌చేందుకు బ్రిక్స్ య‌త్నిస్తోంది. ఆవిష్క‌ర‌ణల‌తో కూడిన భ‌విత‌కై ఆర్థిక వృద్ధి - అనేది 11వ బ్రిక్స్ శిఖ‌ర స‌భ ఇతివృత్తం. నిజంగా ఆవిష్క‌ర‌ణ‌లే భ‌విత‌కు ఆహ్వాన ప‌త్రిక‌లు. కొత్త ఆవిష్క‌ర‌ణ లేనిదే అంధ‌కారంలో మునిగిన‌ట్టే. బ్రిక్స్ నాయ‌కులు విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న అంద‌రు అనుకున్న‌ట్టు గానే ఉంది. యునైటెడ్ నేష‌న్స్ - UN తోపాటు WTO - IMF స‌హా ఇత‌ర బ‌హుళ స‌మాంత‌ర సంస్థ‌ల‌ను బ‌లోపేతం చేయాల‌ని పిలుపునిచ్చింది. వాటిలో సంస్క‌ర‌ణ‌లు చేయాల్సిన అవ‌స‌రం వుంద‌ని చెప్పింది. ఈ అంశంపై అంత‌ర్జాతీయ వ‌ర్గాల నుండి ...

అమెరికాతో త్రివిధ ద‌ళాల సంయుక్త సైనిక విన్యాసాలు - 2019

అమెరికాతో భౌగోళిక వ్యూహాత్మ‌క నిర్మాణం అనేది మోదీ రెండ‌వ ప‌ద‌వీకాలంలో కీల‌క ప్రాధామ్యాల‌లో ఒక‌టిగా ఉంది. ఇటీవ‌లి సంవ‌త్స‌రాల‌లో ఆర్థిక ప‌రివ‌ర్త‌న‌లోను, ప్ర‌పంచ వేదిక మీద మ‌రింత పెద్ద‌గా వ్య‌వ‌హ‌రించాల‌న్న ఆకాంక్ష‌ను సాధించ‌టంలోను భార‌త్‌కు అనివార్య భాగ‌స్వామిగా ఆవిర్భ‌వించినందున అమెరికాకు ఈ ప్రాధాన్యం ఏర్ప‌డింది. ఈమ‌ధ్య కాలంలో ఆవిష్కృత‌మైన ర‌క్ష‌ణ భాగ‌స్వామ్యం అనే కొత్త కోణం ద్వైపాక్షిక సంబంధాల‌కు అండ‌దండ‌గా నిలుస్తోంది. ఈ నేప‌థ్యంలో భార‌త్ - అమెరికా దేశాలు త‌మ తొలి త్రివిధ ద‌ళాల విన్యాసాల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని స‌ముద్ర ప్రాంతంలో న‌వంబ‌రు 13-21 తేదీల మ‌ధ్య నిర్వ‌హిస్తున్నాయి. టైగ‌ర్ ఘ‌న విజ‌యం పేరిట ఈ హ్యుమ‌నిటేరియ‌న్ అసిస్టెన్స్ అండ్ డిసాస్ట‌ర్ రిలీఫ్‌ (HADR) విన్యాసాలు జ‌రుగుతున్నాయి. అమెరికా మెరైన్ కార్ప్స్ - వైరి ర‌హ‌స్య ప‌రిశోధ‌న ప్ర‌త్యేక ద‌ళాల బృందం, భార‌త నౌకాద‌ళంలో స‌ముద్ర ప్రాంత వైరిర‌హ‌స్య ప‌రిశోధ‌న‌కు, జ‌లాంత‌ర్గాముల‌కు వ్య‌తిరేకంగా వాడే దీర్ఘ‌శ్రేణి P8i యుద్ధ విమానం కూడా ఈ టైగ‌ర్ ఘ‌న విజ‌య విన్యాసంలో పాల్గొంటున్నాయి. ఈ విన్యాసాలు మొద‌టి విడ‌త విశాఖ‌ప‌ట్నం రేవు...

ముందెన్న‌డు లేని స్థాయికి దిగ‌జారిన పాకిస్తాన్‌

భార‌త్‌కు పూర్తి అంత‌ర్గ‌త విష‌యంపై పాకిస్థాన్ అధ్య‌క్షునితో స‌హా విదేశాంగ మంత్రి వ‌ర‌కు అధికార యంత్రాంగం అనూహ్య‌రీతిలో అన‌వ‌స‌ర వ్యాఖ్య‌లు చేసింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో శ‌తాబ్దాల త‌ర‌బ‌డి అప‌రిష్కృతంగా ఉన్న అయోధ్య భూవివాదంలో ఆ హ‌క్కును రామ‌మందిర నిర్మాణానికి క‌ట్ట‌బెడుతూ 2019 న‌వంబ‌రు 9న 5గురు న్యాయ‌మూర్తుల భార‌త సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం ఏక‌గ్రీవంగా ఇచ్చిన తీర్పు ఈ వివాదానికి తెర‌దించింది. ఈ తీర్పును స‌మాజంలోని అన్ని వ‌ర్గాలు స్వాగ‌తించాయి. అలాగే మ‌సీదు నిర్మాణం కోసం అయోధ్య‌లోనే ఒక ప్ర‌ముఖ ప్ర‌దేశంలో 5 ఎక‌రాల భూమిని గుర్తించి కేటాయించాల‌ని కూడా ధ‌ర్మాస‌నం కేంద్ర - రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను ఆదేశించింది. ఇంకా వివాదాస్ప‌ద భూమిని ఒక ట్ర‌స్టుకు అప్ప‌గించాల‌నీ ఈ ట్ర‌స్టును కేంద్ర ప్ర‌భుత్వం మూడు నెల‌ల్లోగా ఏర్పాటు చెయ్యాల‌నీ కూడా చెప్పింది. వివాదంలో ఉన్న అన్ని ప‌క్షాలూ కూడా తీర్పును స్వాగ‌తించాయి. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ తీర్పుపై పూర్తి సంతృప్తి వ్య‌క్తం చేసారు. అదేరోజు సాయంత్రం జాతి నుద్దేశించి ప్ర‌ధాని మాట్లాడుతూ - భార‌త స‌మాజంలోని ప్ర‌తి వ‌ర్గ‌ము, ప్ర‌తి క‌మ్యూనిటీ, ప్ర‌తి మ‌త ప్ర‌జ‌ల‌త...

భార‌త‌-సెర్బియా సంబంధాల పున‌రుద్ధ‌ర‌ణ‌

భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్ట‌ర్ S.జైశంక‌ర్ సెర్బియా ప‌ర్య‌ట‌న స‌ఫ‌ల‌మైంది. ఈ ప‌ర్య‌ట‌నలో భాగంగా బెల్‌గ్రేడ్ న‌గ‌రంలో సెర్బియా విదేశాంగ మంత్రి ‘ఇవిచా డాచిచ్‌’తో ఆయ‌న సమావేశ‌మ‌య్యారు. అలాగే దేశాధ్య‌క్షుడు ‘అలెగ్జాండ‌ర్ ఉచిచ్’తోపాటు జాతీయ చ‌ట్టస‌భ అధిపతిని కూడా క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా 21వ శ‌తాబ్ద‌పు అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు ద్వైపాక్షిక భాగ‌స్వామ్య రూపాంత‌రీక‌ర‌ణ‌పై వారు దృష్టి సారించారు. ఇక రెండు దేశాల మ‌ధ్య ర‌క్ష‌ణరంగ స‌హ‌కార ఒప్పందం డాక్ట‌ర్ జైశంక‌ర్ ప‌ర్య‌ట‌న‌లో కీల‌కమైన‌ది కాగా, భ‌విష్య‌త్ ద్వైపాక్షిక సంబంధాలను ఇది మ‌రింత ప‌టిష్ఠం చేయ‌నుంది. భార‌త‌-సెర్బియా సంబంధాల‌కు చారిత్ర‌క నేప‌థ్యం ఉంది. సెర్బియా పూర్వ‌పు యుగోస్లావియాలో భాగంగా కాగా, భారత్‘తో కలసి అలీనోద్య‌మ కూటమి వ్య‌వ‌స్థాప‌క దేశాల్లో ఒకటిగా ఉంది. ఆ మేరకు పండిట్ నెహ్రూ, జోసెఫ్ టిటోల పేర్ల‌తో ముడిప‌డిన జాతీయ స్ఫూర్తిని ఈ ఉద్య‌మం మ‌రింత ముందుకు నడిపించింది. సెర్బియా మేధోవ‌ర్గంతో స్వామి వివేకానంద‌, ర‌వీంద్ర‌నాథ్ టాగూర్ల అనుబంధం కూడా రెండు దేశాల భాగస్వామ్య చరిత్రను ప్రతిబింబిస్తుంది. అయితే, ప్ర‌చ్ఛ‌న్న యుద్ధశ‌కం ముగిశాక ఈ స్న...

క‌ర్తార్‌పూర్ ప్రాముఖ్యం

భారతదేశ విభజనవల్ల తమకు దూరమైన పవిత్ర స్థలాలను స్వేచ్ఛగా సందర్శించే అవకాశం లభించాలంటూ సిక్కులు నిత్యం ప్రార్థనలు చేస్తుంటారు. అలాంటి పుణ్య క్షేత్రాల్లో ‘‘క‌ర్తార్‌పూర్ సాహిబ్’’ అత్యంత పునీత‌మైన‌ది. ‘రావి’ న‌దీతీరంలోగల ఈ మందిరంలోనే గురునాన‌క్ త‌న జీవితంలో చివ‌రి 18 సంవ‌త్స‌రాలు గ‌డిపి, కాల‌ధ‌ర్మం చేశారు. అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దుకు కేవ‌లం 4 కిలోమీట‌ర్ల దూరంలోగ‌ల ఈ ప్ర‌దేశం భార‌త భూభాగం నుంచి క‌నిపిస్తూంటుంది. ఈ మార్గాన్ని తెరిస్తే వేలాది సిక్కు యాత్రికుల‌కు ఆ ప‌విత్ర ప్ర‌దేశం ప్రతి రోజూ అందుబాటులో ఉంటుంది. త‌ద్వారా ల‌క్ష‌లాది భ‌క్తులకు భావోద్వేగ‌ప‌రంగా, అధ్యాత్మికంగా ఎంతో ఊర‌ట ల‌భిస్తుంది. ఈ నేప‌థ్యంలో క‌ర్తార్‌పూర్ మార్గంలో భార‌త్‌వైపున గురుదాస్‌పూర్‌లోని డేరా బాబా నాన‌క్ వ‌ద్ద ఏర్పాటు చేసిన‌ స‌మీకృత త‌నిఖీ కేంద్రాన్ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ప్రారంభించారు. ఇక‌పై క‌ర్తార్‌పూర్‌లోని ద‌ర్బార్ సాహిబ్ గురుద్వారాను యాత్రికులు సుల‌భంగా ద‌ర్శించుకోగ‌ల‌ర‌ని ఈ సంద‌ర్భంగా ఆయన అన్నారు. అటుపైన ద‌ర్బారా సాహిబ్ సంద‌ర్శ‌న‌కు భార‌త యాత్రికుల‌ తొలి బృందం బయల్దేరింది. మాజీ ప్ర‌ధాన‌మంత్రి డాక్ట‌ర్ మ‌న్...