జపాన్’లో జీ – 20 విదేశాంగ మంత్రుల సమావేశం
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభివృద్ధి చెందిన, చెందుతున్న 20 ప్రధాన ఆర్థిక వ్యవస్థల ప్రపంచ వేదిక, జీ – 20. ఇందులో, 19 సభ్య దేశాలు, యురోపియన్ యూనియన్’లకు భాగస్వామ్యం ఉంది. జీ-20 దేశాల 14వ శిఖరాగ్ర సదస్సు జూన్ నెలాఖరులో, ఒసాకాలో జరిగింది. ఆ సదస్సు కొనసాగింపుగా, జపాన్, నగోయా నగరంలో జీ – 20 సభ్య దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్. ఎస్.జైశంకర్ పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొన్న విదేశాంగ మంత్రులు ప్రస్తుత ప్రపంచ స్థితిగతులు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పై ప్రసరిస్తున్న, ఆర్ధిక మాంద్యం ప్రభావం, అందుకు సంబదించిన ఇతర అంశాలపై క్షుణ్ణంగా చర్చించారు.
సమావేశం అనంతరం, జపాన్ విదేశాంగ మంత్రి, జీ – 20 విదేశాంగ మంత్రుల సమావేశం అధ్యక్షుడు తోషిమిట్సు మోటేగి మాట్లాడుతూ, ప్రస్తుత సభ్యదేశాల ముందున్న అనేక సమస్యలను చర్చించి, పరిష్కారాలను చూపే విధంగా ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)ను తక్షణం సంస్కరించ వలసిన అవసరం ఉందని అంగీకరించారని తెలిపారు. అదే విధంగా, వివాదాల పరిష్కార యంత్రంగాన్ని మెరుగు పరిచే విధంగా సంస్థ చర్యలు తీసుకోవాలని కూడా సభ్య దేశాల ప్రతినిధులు కోరారు. ఒకాసాలో సభ్యదేశాల అధినేతల సదస్సులో చర్చిన సంగతుల పై కూడా విదేశాంగ మంత్రుల సమావేశం చర్చించిందని, తోషిమిట్సు మోటేగి తెలిపారు.
అదే విధంగా, ప్రతిపాదిత, ఆసియా పసిఫిక్ స్వేచ్చా వాణిజ్య ఒప్పందం (APFTA) పై, భారత దేశం సహా 16 వాస్తవ సభ్య దేశాల చర్చలను శ్రీఘ్రంగా ముగించాలని, విదేశాంగ మంత్రుల సమావేశం నిర్ణయించిందని, మోటేగి తెలిపారు. విదేశాంగ మంత్రుల సమావేశంలో మంత్రులు సంబందిత అంశాలపై తమ తమ దేశాల అధికారిక నిర్ణయాలు, ఆలోచనలు, అభిప్రాయాలను తెలియ చేశారు. ఏ ప్రస్తుత సమస్య పైనా, ఏ దేశం కూడా, ఏకాభిప్రాయం కోరలేదు.
ఇప్పటి నుంచి మూడేళ్ళ తర్వాత, 2022లో జీ-20 శిఖరాగ్ర సదస్సుకు ఆతిధ్య మిచ్చే గౌరవం భారత దేశానికి దక్కింది. ఈ నేపధ్యంలో, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించేందుకు జీ-20 అజెండాను రూపొందించడంలో భారత దేశం పోషించే పాత్రను ప్రపంచ దేశాలు, ప్రపంచ ప్రధాన ఆర్థిక సంస్థలు దగ్గరగా పరిశీలిస్తున్నాయి.ఆ విధంగా ప్రపంచ దృక్పధాన్ని అవగతం చేసుకునేందుకు ఈ సమావేశం చక్కని అవకాశం కలిపించింది.
1999లో ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల వేదికాగా ప్రారంభమైన జీ-20, ఆనాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని సమర్ధవంతంగా ఎదుర్కునేందుకు,అవసరమైన నిర్ణయాలను తక్షణం తీసుకునేందుకు వీలుగా2008లో జీ -20 స్థాయిని దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు స్థాయికి పెంచడం జరిగింది. ఇక అప్పటి నుంచి జీ – 20 అంతర్జాతీయ ఆర్ధిక సహకార సంస్థగా, ముందుకు సాగుతోంది. జీ -20 సభ్య దేశాలు ప్రపంచ స్థూల ఉత్పత్తిలో 85 శాతం మొత్తానికి, ప్రపంచ వాణిజ్యంలో 75 శాతం మొత్తానికి , ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతుల జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఇంతవరకు జరిగిన జీ-20 అన్ని సదస్సుల్లోనూ సభ్యదేశంగా పాల్గొన్న భారత దేశం 2022లో జరిగే 17వ జీ-20 శిఖరాగ్ర సదస్సుకు అతిధ్యమిస్తోంది.
అమెరికా – చైనాల మధ్య జరుగతున్న టారిఫ్ యుద్ధం నేపధ్యంగా నగోయాలో జరిగిన జీ-20 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం, జూన్ నెలలో ఒకాసాలో జరిగిన శిఖరాగ్ర సదస్సులో తీసుకున్న నిర్ణయాల అమలుకు తీసుకోవలసిన తదుపరి చర్యలపై చర్చించింది. భారత దేశానికీ సంబందించనంత వరకు, ఇంధన భద్రత, ఆర్థిక సుస్థిరత, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే సామర్ధ్యంగల మౌలిక సదుపాయాలు, అందుకు అనుగుణమైన సాంకేతిక పరిజ్ఞానం, సంస్కరించబడిన బహుల పాక్షిక విధానం, ప్రపంచ వాణిజ్య సంస్థ సంస్కరణలు, ఉగ్రవాద వ్యతిరేక ఉమ్మడి వ్యూహం, విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లను అప్పగిచడం,ఆహార భద్రత, సాంకేతిక విజ్ఞాన ప్రజాస్వామీకరణ, సంచార సామాజిక భద్రత పథకాలు కీలకమైనవి. సమావేశానికి అమెరికా విదేశాంగ మంత్రి హాజరు కాని, నేపధ్యంలో కొన్ని సభ్య దేశాలు, అమెరికా అనుసరిస్తున రక్షనాత్మక విధానాలు, ఏక పక్ష అంక్షల విషయాలను ప్రస్తావించాయి.
మంత్రుల సమావేశం ఇతర అంశాలతో పాటుగా, భౌగోళిక రాజకీయ పరిణామాలు,పరిస్థితులు, వాణిజ్య ఉద్రిక్తలు,సుస్థిర అభివృద్ధి దిశగా సాధించిన ప్రగతి వంటి అనేక విషయాలను,అనేక సమస్యలను చర్చింది. ఈ సమావేశం, ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రతిపాదించిన వివాదాస్పద సంస్కరణలపై చర్చించేందుకు చక్కటి అవకాశాన్ని కలిపించింది.
అదే విధంగా, జీ -20 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం వేదికగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చైనా, జపాన్, కొరియా రిపబ్లిక్, నెదర్ల్యాండ్స్, స్పెయిన్, సింగపూర్, ఆస్ట్రేలియా, చిలీ, ఫ్రాన్స్ విదేశాంగ మంత్రులతో సంబందిత వివిధ అంశాలపై విడివిడిగా చర్చలు జరిపారు.
ఫ్రెంచ్ విదేశాంగ మంత్రితో, డాక్టర్ జైశంకర్, ఇండో – పసిఫిక్ స్ట్రాటజిక్ ల్యాండ్’స్కేప్ అంశం సహా, అనేక అంశాలపై చర్చించారు. స్పెయిన్ విదేశాంగ మంత్రితో, భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్, యురోపియన్ యూనియన్’తో భారత దేశ భవిష్యత్ సంబధాలపై చర్చలు జరిపారు. చిలీ విదేశాంగ మంత్రితో సహకార విస్తరణ అంశాన్ని, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి మరిసే పైనే’తో ఆ దేశ ప్రధాన మంత్రి స్కాట్ మొర్రిసన్ భారత పర్యటన విషయాన్ని చర్చించారు.
ఆ విధంగా వివిధ దేశీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత గల పలు అంశాలు, ద్వైపాక్షిక సంబంధాల గురించి భారత దేశ అభిప్రాయాలను వ్యక్త పరిచేందుకు జీ – 20 సమావేశం ఒక చక్కని అవకాశం కలిపించింది. భారత దేశం అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది.
రచన: రంజిత్ కుమార్, డిప్లొమాటిక్ ఎడిటర్,నవోదయ టైమ్స్
Comments
Post a Comment