పాకిస్తాన్ విద్వేషాన్నిస్వీకరించడానకి ఎవ్వరూ సిద్ధంగా లేరు
కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేద్దామని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రయత్నాలు 74వ ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో కూడా వైఫల్యం చెందాయి. జమ్ము,కశ్మీర్ రాష్ట్రాల ప్రజల ఈతిబాధలపై తన ప్రసంగంలో ఇమ్రాన్ ఖాన్ విరుచుకుపడ్డారు. కానీ ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రసంగాన్ని పట్టించుకోలేదు. ఆ తర్వాత ఇమ్రాన్ ఖాన్ యుద్ధ ప్రస్తావన కూడా తెచ్చారు. అంతేకాదు ‘న్యూక్లియర్’ అనే పదాన్ని కూడా ఇమ్రాన్ ఖాన్ ఉపయోగించారు. అందరి దృష్టిని ఆకర్షించే లక్ష్యంతో పాక్ ప్రసంగ తీరు కొనసాగింది. అమెరికా యంత్రాంగం నుంచి కూడా కశ్మీర్ అంశంపై ఎలాంటి మద్దతు లభించడం లేదని పాక్ ప్రధాని ఇమ్రాన్ గుర్తించారు. అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ఒక సందర్భంలో స్పందిస్తూ కశ్మీరీల గురించి మాట్లాడుతున్నంతగా యుఘుర్స్ బాధితులు పడుతున్న కష్టాలపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడడం లేదని కూడా తీవ్రంగా విమర్శించింది దక్షిణ, మధ్య ఆసియా యాక్టింగ్ సహాయ కార్యదర్శి అలిస్ వెల్స్ మాట్లాడుతూ ‘కశ్మీర్‌పై గొంతు తగ్గించడం అవసరం అన్నారు. ముఖ్యంగా రెండు న్యూక్లియర్ దేశాలు కూడా ’ అని ఆమె అభిప్రాయపడ్డారు. మి...