ఆర్‌సిఇపి ఏడవ సమావేశం

రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్టనర్‌షిప్ (ఆర్‌సిఇపి) సమావేశం ఇటీవల బ్యాంకాక్‌లో జరిగింది. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధ నేపథ్యంలో ఇది జరిగింది. అంతేకాదు జపాన్, దక్షిణ కొరియా మధ్య ఆర్థికపరమైన సంబంధాలు కూడా బాగా ముసురుపట్టి ఉన్నాయి. పోయిన నెలలో ఆర్‌సిఇపి సమావేశం జరిగింది. భారత వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఈ కీలక సమావేశంలో పాల్గొన్నారు. అంతర్జాతీయ ఆర్థిక కార్యకలాపాలలో భారత డైనమిజం ఎంతో శక్తివంతమైంది. మంత్రి పీయూష్ గోయల్ మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్నారు. దేశానికి సంబంధించిన బహుపక్ష, ద్వైపాక్షిక కార్యక్రమాల ఎజెండాలతో సభ్యదేశాల మంత్రులతో సమావేశం జరిగింది. 

ఆర్‌సిఇపిలో ఆగ్నేయాసియా దేశాల కూటమికి (ఆసియాన్)సంబంధించిన పదిమంది సభ్యులతో పాటు ఆరు మంది ప్రాంతీయ దేశాలూ ఉన్నాయి. ఇండియా, చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు కూడా వీటిల్లో ఉన్నాయి. మొత్తం ఆసియాన్ ప్రాంతంలో స్వేచ్ఛా వాణిజ్య ప్రతిపాదనలు కూడగట్టడానికి ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటుచేశారు. ఏడవ మంత్రివర్గ సమావేశం అనంతరం ఇందులో పాల్గొన్న 16 దేశాలు సమిష్టిగా ఒక ప్రకటనను విడుదలచేశాయి. ప్రకటన విడుదల చేయడానికి ముందు ఆ దేశాలు స్వేచ్ఛాయుత వాణిజ్య పరిస్థితులను అన్ని జోన్‌లలో ఏర్పాటు ఆవశ్యకతపై నొక్కి మరీ చర్చించారు.ఈ సమావేశానికి ఆతిథ్య దేశమైన థాయ్‌లాండ్‌ డిప్యూటీ ప్రధాన మంత్రి, వాణిజ్య మంత్రి అయిన జురిన్ లక్సానావిసిట్ మాట్లాడుతూ స్వేచ్ఛావాణిజ్య ప్రాంత ఒప్పంద ఖరారు వచ్చే సంవత్సరం పూర్తిగా రూపుదాల్చుకునే అవకాశం ఉందని తెలిపారు.

యూరోపియన్ కూటమి తర్వాత ఆసియాన్ ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక కూటమి.దక్షిణ ఆసియన్ అసోసియేషన్ ఫర్ రీజినల్ కో-ఆపరేషన్ (సార్క్, ఎస్‌ఎఎఆర్‌సి) స్వల్ప స్పందన అనంతరం మరీ ముఖ్యంగా ఆర్థిక ఫ్రంట్ విషయంలో, భారత్ ఆసియాన్‌తో తన సహకారం, అసోసియేషన్లను బాగా పెంపొందించుకుంది. నేడు, యుఎస్ తర్వాత, ఆసియాన్ సభ్యులు భారత అతిపెద్ద వాణిజ్య భాగస్వాములుగా ఉన్నారు. ‘ఆసియాన్’తో భారత ద్వైపాక్షిక వాణిజ్యం 2005-2006 సంవత్సరంలో 21 బిలయన్ అమెరికన్ డాలర్లు ఉండగా, అది 2018-19 సంవత్సరానికి మూడు రెట్లు అంటే 96.7 బిలియన్ డాలర్లకు పెరిగింది. ‘ఆసియాన్’ దేశాలు 20118-19 సంవత్సరానికి 11.47 శాతం వాటాతో భారత అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచాయి. ‘ఆసియాన్’ కూటమిలో భారత్ ఆరవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా 2018లో నిలిచింది.

ఈ పరిస్థితుల్లో స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం చోటుచేసుకుంటే భారత్ వివిధ రంగాలలో పలు అవకాశాలను పెద్ద ఎత్తున పొందుతుంది. అంటే సరుకులు, సేవలు, పెట్టుబడులు, మేథో హక్కుల సంపత్తి, ప్రభుత్వ సంపాదన వంటివాటికి బాగా అవకాశాలు లభిస్తాయి. భారత ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’లో ‘ఆసియాన్’తో వివిధ కార్యకలాపాలలో భాగస్వామ్యం పంచుకోవడానికి భారత ప్రభుత్వ కీలకాంశంగా ఉంది. విస్తృతమైన ఇండో-ఫసిఫిక్ ప్రాంతానికి ఆసియన్ భారత ‘గేట్ వే’ కూడా. రెండు దేశాలు సన్నిహిత భాగస్వాములు కావడంతో, భారత్, ఆసియాన్‌ల అభిప్రాయాలు కూడా కలుస్తాయి. అంతేకాదు సహకారం, వాణిజ్యం పరంగా ఆసియాన్ దృక్కోణం కూడా కలుస్తుంది. ‘ఆసియాన్’ ప్రాంతంలోని పలు దేశాలతో భారత్‌కు పటిష్టమైన సంబంధాలు ఉన్నాయి. మలేసియా, దక్షిణ కొరియా వంటి కొన్ని దేశాలతో వాణిజ్య లోటు ఉంది. ఆ అంశాన్ని లేవనెత్తాల్సిన అవసరం ఉంది. 

ఆసియాన్ నుంచి 2018 ఏప్రిల్ నుంచి 2019 మార్చి వరకూ భారతదేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) 16.41 బిలియన్ అమెరికన్ డాలర్లు ఉంది. భారతదేశంలోకి వచ్చే మొత్తం ప్రత్యక్ష విదేశీ పెట్టుబడుల్లో ఇవి 37 శాతం. భారత దేశం నుంచి ఆసియాన్‌కు పోయే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 2018లో 1.7 బిలియన్లు ఉంది. ఇది భారత్‌ని ఆసియాన్ లోని ఆరవ అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెడుతున్న దేశంగా నిలబెట్టింది. 

భారత వాణిజ్యం, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఆర్‌సిఇపి సదస్సు సమయంలో విడిగా భాగస్వామ్య దేశాలైన జపాన్, సింగపూర్, చైనా, ఇండొనేసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిలిప్పైన్స్, థాయ్‌లాండ్ నుంచి వచ్చిన ప్రతినిధులతో చర్చలు జరిపారు. 

భారత-ఆసియాన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఇండియా-ఆసియాన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (ఎఫ్‌టిఎ) 2010, జనవరి నుంచి అమలవుతోంది. ఆ సమయంలో కొన్ని వస్తువుల పరంగా వాణిజ్యం కేంద్రీకృతంగా సాగేది. పామాయిల్, రబ్బర్, కాఫీ, బ్లాక్ టీ, మిరియాలు వంటివి వీటి కిందకు వస్తాయి. ఎఫ్‌టిఎ ఈ సరుకుల దిగుమతులు ఆషియాన్ దేశాల నుంచి బాగా పెరిగే అవకాశం ఉందనే భయం భారత్‌లో బాగా ఉంది. చివరకు వీటి వల్ల భారత పరిశ్రమలు భారీగా దెబ్బతింటాయి. వీటిని ప్రత్యేక ఉత్పత్తులుగా ప్రకటించలేము. ఎందుకంటే చాలా పరిమితమైన టారిఫ్ తగ్గింపు ఉంది. లేదా మినహాయించిన ఉత్పత్తుల జాబితాలో ఉన్నాయని చెప్పలేం. అలా ఇవి ఒప్పందం పరిధిలోకి రాకుండా పోయాయి. ఎఫ్‌టిఎ ఆర్థిక హేతుబద్ధతను సమీక్షా పరిధిలోకి తీసుకువచ్చారు. 

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టిఎ)ను ‘ఆసియాన్’తో కలిసి సమీక్షించాలని నిర్ణయించుకుంది. ఇది రీజనల్ అప్రహెన్సివ్ ఎకనామిక్ పార్టనర్‌షిప్ (ఆర్‌సిఇపి) చర్చలపై ప్రభావం చూపరాదు. ఈ చర్యలు ఈ సంవత్సరాంతానికి పూర్తవుతాయని భావిస్తున్నారు. వచ్చే సంవత్సరారం ప్రారంభానికి ఆర్‌సిఇపితో ఫైనల్ ఒప్పందం వాస్తవరూపం దిద్దుకుంటుంది. భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ ప్రపంచ ఆర్థిక రంగంలో భారత్ ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించుకుంటుందన్నారు. వాణిజ్యంలో, పెట్టుబడుల్లో సుస్థిర ప్రగతి సాధనకు న్యూఢీల్లీ కొత్త ఆలోచనలను ముందు పెట్టాలి. 

రచన: మనోహర్ మనోజ్, ఆర్థిక పాత్రికేయులు

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన