Posts

Showing posts from January, 2020

ట్రంప్ రెండు దేశాల ప్రణాళిక 

మెడ మీద అధికార కత్తి వేళ్ళాడుతున్న నేపధ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజిమన్ నేతన్యాహూ, ఇజ్రాయిల్, పాలెస్తేనియా ఘర్షణలకు స్వస్తి పలికే శాంతి ఒప్పందం పై చర్చించేందుకు, శ్వేత సౌధంలో సమావేశమయ్యారు. శాంతి - సౌభాగ్యపత్రంగా పేర్కొన్న 180 పేజీల ఈ ప్రణాళిక ‘ఇజ్రాయిల్, పాలెస్తేనియా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపైచేందుకు ప్రాధాన్యత ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇజ్రాయిల్ అధికారులు, అరబ్ నాయకులతో నెలల తరబడి చర్చలు జరిపిన అధ్యక్షుడు ట్రంప్ మధ్యప్రాచ్య వ్యవహారాల కీలక సలహాదారు జారెడ్ కుష్నెర్ పాలెస్తీనియాను మాత్రం నిర్లక్ష్యం చేశారు. పాలేస్తేనీయుల అభిప్రాయాలను అంతగా పట్టించుకోలేదు. నిజానికి ఆ దేశ ప్రతినిధులతో ఎలాంటి చర్చలు జరపలేదు. అధ్యక్షుడు ట్రంప్ ఈ ప్రణాళికను, ‘వాస్తవ శాంతి ప్రణాళిక’ గా అభివర్ణించారు. అలాగే, పాలెస్తేనియాకు ఇదే చివరి అవకాశమని ట్రంప్ పేర్కొన్నారు. కాగా నేతన్యాహూ ఈ ప్రణాలికను చారిత్రిక పత్రంగా పేర్కొన్నారు. ఇది, పాలెస్తీనియా ప్రజల న్యాయమైన ఆకాంక్షలను, స్వయం నిర్ణయాధికారాన్నిగుర్తిస్తోంది, గౌరవిస్తోందని, నేతన్యాహూ అన్నారు. అయిత అదే సమయంలో జెరూసలేం ఇజ్...

పొరుగు దేశానికి ప్రధమ ప్రాధాన్యత విధానం: ప్రాంతీయ అవగాహనలు 

డిల్లీలోని భారత ప్రధాన మేథోమథన కేంద్రం,ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ ఎనాలిసిస్ (IDSA), ఇటీవల,“భారత పొరుగు దేశానికి ప్రధమ ప్రాధాన్యత: ప్రాంతీయ అవగాహనలు” అనే అంశంపై 12వ దక్షిణ ఆసియా సదస్సును నిర్వహించింది.దక్షిణ ఆసియా దేశాలు, మయన్మార్’నుంచి విధాన నిర్ణేతలు,విద్యావేత్తలు, నిపుణులు, ఇంకా ఇతర సంబంధిత రంగాల ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొన్నారు. భారత దేశం ఆచరిస్తున్న ‘పొరుగు దేశాలకు ప్రధమ ప్రాధాన్యత విధానం” అంటే ఏమిటీ? తమ తమ దేశాలకు ఈ విధానం ఏ విధంగా వర్తిస్తుంది అనే కోణంలో చర్చించారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో సుమారు 25 మందికి పైగా పొరుగు దేశాలకు ప్రధమ ప్రాధాన్యత విధానం” పై తమ తమ అభిప్రాయాలను, విశ్లేషణలను తెలియచేసే పత్రాలను సమర్పించారు. విదేశీ ప్రతినిధులతో పాటుగా తొమ్మిది మంది భారతీయ ప్రతినిధులు కూడా ‘పొరుగు దేశాలకు ప్రధమ ప్రాధాన్యత విధానం” పై తమ అభిప్రాయాలను పత్రాల రూపంలో పంచుకున్నారు. కాగా, సదస్సులో ప్రారంభ ఉపన్యాసం చేసిన భారత రక్షణ శాఖ మంత్రి, IDSA అధ్యక్షుడు రాజనాథ్ సింగ్,దక్షిణ ఆసియా దేశాలు వ్యక్తిగత దేశీయ గుర్తింపు పరిధినిదాటి, దక్షిణ ఆసియా ప్రాతీయ గుర్తింపును కోరుకోవ...

ప్రపంచ దేశాలతో ఆర్థిక సంబంధాలు – ప్రగతి బాటలో భారత ఆర్థిక వ్యవస్థ

భారతదేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా చేసుకొని ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఓ వంక దేశీయంగా వాణిజ్యం, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని నిర్మిస్తూ, మరోవంక విదేశాలతో బలమైన సంబంధాలను ఏర్పరచుకునేందుకు కృషి చేస్తోంది. ఇందుకు గాను భారతదేశం అనేక సంస్కరణలను తీసుకువచ్చింది. దివాళాచట్టం (ఐబిసి), వస్తు సేవల పన్ను చట్టం – జి.ఎస్.టి - ఇందులో ప్రధానమైనవి. 5 ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరుకునేందుకు భారతదేశం మార్కెట్ ప్రయోజనాలను ముందుకు తీసుకుపోతూ, వ్యాపార భాగస్వాములతో సత్సంబంధాలను నెలకొల్పుకునేందుకు అడుగులు వేస్తోంది. అంతర్జాతీయ విలువల పరిరక్షణలో భాగంగా ఇలాంటి చర్యలను తీసుకుంటోంది. అదేవిధంగా ప్రపంచ దేశాలతో పరిస్పర ప్రయోజనకరమైన, నిర్మాణాత్మక సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు గాను, భారత దేశం ప్రాంతీయ వాణిజ్య ద్వైపాక్షిక ఆర్థిక చర్చల పంధాను ఎంచుకొని ముందుకు సాగుతోంది. భారత ఆర్థిక వ్యవస్థ అంతర్ముఖ ఆర్థిక వ్యవస్థ అన్న అభిప్రాయాన్ని తొలగించేందుకు ప్రపంచ దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సాధించే దిశగా సాగుతోంది. కొద్ది సంవత్సరాల క్రితం యురేపియన్ యూనియన్, ఆస్ట్రేలియా, ఇజ్రాయిల్, ఇరాన్ వంట...

అంకుర పరిశ్రమలు అద్భుత విజయాలు

భారత దేశం 71వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. ఈ వేడుకల్లో స్టార్టప్ ఇండియా... అంకుర భారత్’ ప్రతిష్టాత్మక స్థానంలో నిలిచింది. స్టార్టప్ ఇండియా స్వల్పకాలంలోనే మూడు లక్షల ఉద్యోగాలను సృష్టించింది. 26 వేలకు పైగా స్టార్టప్’ సంస్థలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. ప్రభుత్వం కలిపిస్తున ప్రోత్సాహంతో దేశంలో స్టార్టప్ పెట్టుబడులు రోజు రోజుకు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా స్టార్టప్ పెట్టుబడుల మొత్తం 35 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇంకా ఇంకా పై పైపైకి సాగుతోంది. ప్రస్తుతం భారత దేశంలోని ప్రముఖ సాంకేతిక విద్యా సంస్థల నుంచి పట్టభద్రులు అయిన యువకులు, ఉద్యోగాల కోసం ఎదురు చూడడం లేదు.అంకుర పరిశ్రమ స్థాపన వైపు మొగ్గు చూపుతున్నారు. అంకుర పరిశ్రమల స్థాపన ద్వారా స్వయం ఉపాధిని, వృత్తిగా ఎంచుకుంటున్నారు.ఇది దేశంలోని యువతలో వెలుగు చూస్తున వృత్తి నైపుణ్య విజయ గాధకు ప్రతీకగా నిలుస్తోంది. ప్రతిధ్వనిస్తోంది. అందుకే, ఆ విధంగా దేదీప్యమానంగా వెలుగుతున్న స్టార్టప్ కాంపైన్, అంకుర ఉద్యమం శకటం గణతంత్ర వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలించింది. గణతంత్ర వేడుకల్లో ప్రదర్శించిన స్టార్టప్ శకటం కళాత్మకంగా క...

د ترهګری پر وړاندی د عمران خان د حکومت ریاکارانه کړنی

لیکنه: معین الدین خان ژباړه: پښتو څانګه د عمران خان واک ته له رسیدو وړاندی د نوی پاکستان جوړیدو لپاره نعری اوچتیدلی ، او فساد د له منځه وړلو هم یو مهم شعارونه اوریدل کیدل ، خو هغه په خپل حکومت کی چی نژدی یو نیم کال یی پوره کیږی تر ټولو نابریالی لومړی وزیر معلومیږی. که له فساد سره مبارزه وی یا په ملګرو ملتونو کی د پاکستان پیاوړی ښودنه وی او یا هم له اقتصادی بحران څخه د وتلو نعری وی ، خو حقیقت دا دی چی هغه یوازی په اواز اوچتولو کی ډیر ماهر دی. د پاکستان ورځپاڼی چی نږدی سانسور حالت څخه تیریږی، هغوی هم د واکمنۍ د ناکامیو له یادولو نشی تښتیدی. همدی ورځو کی هغوی په داووس کی د ملګرو ملتونو په وړاندی د اقتصادی ناورین اصلی لامل له ده څخه وړاندی حکومتو په فساد کی ډوبوالی او د پوځ سره د مخکینو حکومتونو د خرابو اړیکو درلودل بیان کړل. او وآ ئی چی له همدی کبله د پاکستان اقتصادی حالت دومره خرابیدو. هغه ځان ته د کریډیټ اخیستو په موخه وویل چی اوسمهال د حکومت او پوځ دریځ یو دی ، نو له همدی کبله له اقتصادی ناورین څخه د پاکستان د ایستلو هڅی بریالی ثابت شوی دی. پاکستانی رسنیو په دی خبری پوری...

ఇమ్రాన్ ఖాన్ దావోస్ పర్యటన వైఫల్యం

పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్, ఇటీవల దావోస్’లో జరిగిన ప్రపంచ ఆర్థిక మండలి 2020 సదస్సులో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన స్విస్ స్కి – రిసార్ట్’లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్’తో సమావేశమయ్యారు. ఆయన అక్కడకు వెళ్ళింది తమ దేశంలోకి విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు,అయితే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన అసలు విషయాన్ని పక్కన పెట్టి, అలవాటులో గ్రహపాటుగా, కశ్మీర్’దండకం ఎత్తుకున్నారు. అదే వేదిక నుంచి ఇమ్రాన్ ఖాన్, “భారత దేశంతో మా సంబంధాలు చక్కగా ఉన్నప్పుడు, వ్యూహాత్మకంగా మా బలమ ఏమిటో ప్రపంచానికి తెలుస్తుంది. ప్రపంచం చూస్తుంది” అంటూ చెప్పుకొచ్చారు. ‘పాకిస్థాన్’లో ఉగ్రవాదమా, అస్సలు లేదు’ అంటూ మరో ముక్కను చేర్చారు. నిజమే కావచ్చును. పాకిస్థాన్’లో ఉగ్రవాదం అసలే లేదన్న ఇమ్రాన్ ఖాన్ మాటలు నిజమే కావచ్చును. ఎందుకంటే, వాస్తవంలో అక్కడ ఉగ్రవాదం ప్రభుత్వ పోషణలో విరాజమానంగా విరాజిల్లుతోంది.ఉగ్రవాద సంస్థలు ప్రభుత్వ సహాయ సహకారలాను సంపూర్ణంగా అనుభవిస్తున్నాయి.కాబట్టి,సహజంగానే పాక్ పాలకులకు ఉగ్రవాదం అనేది కనిపించక పోవడంలో అబ్బురపడవలసింది,ఆశ్చర్యపోవల్సిదీ ఉండదు. మరోవంక, పారిస్ స్థావరంగాగల ప్రపంచ ఉగ్రవాద ...

71 వ గణతంత్ర వేడుకల ముఖ్య అతిధిగా బ్రెజిల్ అధ్యక్షడు బోల్సోనారో- ఉభయ దేశాల దౌత్య సంబంధాలలో మరో ముందడుగు

భారత్ , బ్రెజిల్ దేశాలు రెండూ అత్యంత శక్తివంతమైన,బలమైన,ఆర్థిక వ్యవస్థలుగల దేశాలు.చైనా తర్వాత అగ్రరాజ్య హోదాను సాధించగల శక్తి సామర్ధ్యాలు ఉన్న దేశాలు.అయితే ఇటీవలకాలం వరకు భారత దేశం పేదరికానికి, హిందూ అభివృద్ధి రేటుకు నిర్వచనంగా నిలిస్తే, బ్రెజిల్ భారీ ద్రవ్యోల్బణం, రుణ విష్పోటనకు పర్యాయ పదంగా నిలిచింది. భారత దేశం ప్రప్రంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అయినప్పటికీ, భారత దేశం అంటే పాములు ఆడించే పామరుల దేశంగా, మార్మిక సాధువుల దేశంగానే పాశ్చాత్య ప్రపంచం గుర్తించింది.అలానే చూసింది.ఫ్రాన్స్ అధ్యక్షుడు చార్లెస్ డే గయుల్లే అయితే, “బ్రెజిల్’ అసలు దేశమే కాదు”, ఆ దేశాన్ని ఒక దేశంగా పరిగణించవలసిన అవసరమే లేదు అని తూలానాడారు. అంతే కాదు, “బ్రెజిల్ రేపటి దేశం, ఎప్పటికీ ఆలాగే రేపటి దేశంగానే ఉంటుంది” అని అన్నారు. అయితే, ఈనాడు భారత్, బ్రెజిల్ దేశాలు రెండూ అడుగులు ముందుకు వేశాయి, సమతుల్యసాధన దేశాల స్థాయి నుంచి ప్రపంచ ప్రధమ శ్రేణి దేశాల స్థాయికి చేరుకున్నాయి. గత దశాబ్దకాలంలో లేదా అందుకు కొంచెం అటూ ఇటుగా, రెండు దేశాలు ద్వైపాక్షిక, బహుముఖ వేదికల ద్వారా అంతర్జాతీయ సంబంధాలలో కీలక పాత్రను పోషించే విధంగా విద...

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

సంవిధాన‌స‌భ మూడేళ్లు శ్ర‌మించి రూపొందించిన భార‌త రాజ్యాంగం చివ‌ర‌కు చ‌ట్ట‌రూపం దాల్చింది. ఈ రాజ్యాంగం దీర్ఘ‌కాలం మన‌గ‌లుగుతుంద‌ని కొద్దిమంది విశ్లేష‌కులు మాత్ర‌మే గుండె మీద చెయ్యివేసుకుని చెప్పేందుకు సిద్ధ‌మ‌య్యారు. కానీ అది ఇప్ప‌టికీ స్థిరంగా, గ‌ట్టిగా నిలిచిందంటే అది దానిని నిర్మించిన వ్య‌వ‌స్థాప‌క పిత‌రుల వివేక‌సంప‌ద‌కు, ముందు చూపుకు తార్కాణం. భార‌త రాజ్యాంగం శాస‌న‌క‌ర్త‌ల‌కు, సామాన్య పౌరుల‌కు ఇరువురికి దిక్సూచిగా కాంతిరేఖ‌గా ప‌ని చేస్తుంది. 7 ద‌శాబ్దాల‌కు పైగా కాలంలో దాని మౌలిక నిర్మాణం చెక్కు చెద‌ర‌కుండా నిల‌చింది. రాజ్యాంగంలో అనేకానేక స‌వ‌ర‌ణ‌లు జ‌రిగిన‌ప్ప‌టికీ దాని ఉపోద్ఘాతం న‌మ్మ‌కం క‌లిగిస్తూ స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. మేము - భార‌త ప్ర‌జ‌లం - అంటూ ప్రారంభ‌మ‌య్యే ఉపోద్ఘాతం న్యాయం, స్వేచ్ఛ‌, సమాన‌త్వం, సౌభ్రాతృత్వ సూత్రాల‌తో ముడివ‌డిన‌ ఒక సార్వ‌భౌమ‌, లౌకిక‌వాద‌, ప్ర‌జాస్వామ్య గ‌ణ‌తంత్రాన్ని ప్ర‌పంచానికి అంద‌జేసింది. ఇది దేశ నిర్మాణం, దానిలోని విభాగాల‌ను వివ‌రించే చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన ప‌త్రం. అలాగే ప్ర‌జ‌ల హ‌క్కులు, స్వేచ్ఛ‌ల‌కు నిలువుట‌ద్దంలా నిల‌చే ప్ర‌మాణ ప‌త్రం. గ‌ణ‌...

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

ఆఫ్రికా దేశాల‌పై మ‌రింత దృష్టిపెట్టి వాటితో ఇంకా స‌న్నిహిత‌మైన‌, ఆర్థిక సంబంధాల‌ను పెంచుకోవాల‌నే ప్ర‌య‌త్నంలో భాగంగా భార‌త విదేశీ వ్య‌వ‌హారాల మంత్రి డా.ఎస్‌.జైశంక‌ర్ ఈవారం మొద‌ట్లో నైజ‌ర్ టునీషియాల‌ను సంద‌ర్శంచారు. ఐక్య‌రాజ్య‌స‌మితిలోని భ‌ద్ర‌తామండ‌లిలో శాశ్వ‌తం కాని స‌భ్యులుగా భార‌త‌దేశానికి స‌హాయం చేసిన‌ప్ప‌టి నుంచి ఈ ఆఫ్రికా దేశాల‌కు భార‌త్ అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. విదేశీ మంత్రిత్వ శాఖ ప‌గ్గాలు చేప‌ట్టిన నాటి నించి జైశంకర్ ఆఫ్రికా సంద‌ర్శించ‌టం ఇదే మొద‌టిసారి. నియామీ నైజర్ సంద‌ర్శ‌న సంద‌ర్భంగా డా.జైశంక‌ర్‌, నైజ‌ర్ అధ్య‌క్షుడు మ‌హ‌మ‌దౌ ఇసౌఫోను క‌లుసుకున్నారు. ఇద్ద‌రు నాయ‌కులు సంయుక్తంగా మ‌హాత్మాగాంధి అంత‌ర్జాతీయ క‌న్వెష‌న్ కేంద్రాన్ని ప్రారంభించారు. ప్ర‌స్తుతం మ‌హాత్మాగాంధి 150వ జ‌యంతిని పాటిస్తున్న సంద‌ర్భంగా ఆయ‌న స్మృతికి గౌర‌వ‌సూచ‌కంగా ఈ కేంద్రాన్ని నెల‌కొల్పారు. ఆఫ్రికాలో భార‌త్ ఏర్పాటు చేసిన తొలి కేంద్రం ఇది. ఈ కేంద్రం స్థాప‌న భార‌త్ - నైజ‌ర్ స్నేహ బంధాల‌లో ఒక మైలురాయిగా నిలుస్తుంది. అంతేకాదు ఆఫ్రికా ప‌ట్ల భార‌త్ నిబ‌ద్ధ‌త‌కు చిహ్నంగా కూడా నిలుస్తుంది. ఈ కేంద్రాన్ని...

JCPOA నించి ఇరాన్ నిష్క్రమణ ప్రపంచ వ్యాప్తంగా దాని ప్రభావం

ఇరాన్ జనరల్ ఖాసిం సోలేమానిని అమెరికా హతమార్చిన తర్వాత అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందం ఎన్పిటి నించి వైదొలగుతానని ఇరాన్ బెదిరించినట్టు తాజా పరిస్థితి సూచిస్తోంది . తమ అణ్వస్త్ర అంశాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతామండలి - UNSC కి నివేదించిన పక్షంలో ఈ చర్య తీసుకుంటానని చెప్పింది . సోలేమాని హత్యానంతరం ఏర్పడిన పెద్ద చిక్కు ఇది . మిగతా విషయాలన్నిటినీ ఇది కప్పివేస్తుంది . దీని పర్యావసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి . ఈ నిర్ణయం ఆ ప్రాంతానికే కాకుండా భౌగోళిక అణు వ్యాప్తి నిరోధక ఏర్పాటుకు చాలా చేటు కలిగిస్తుంది . ఇకపై తాను ఇరాన్ అణు ఒప్పందంగా పిలిచే ఉమ్మడి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక (JCPOA) నిబంధనలకు కట్టుబడి ఉండేదిలేదని ఇరాన్ ప్రభుత్వం తీసుకున్నట్టు చెప్తున్న నిర్ణయంతో ఈ భయం ఏర్పడింది . ఒప్పందంలో భాగస్వాములైన మూడు ఐరోపా దేశాలు - బ్రిటన్ , ఫ్రాన్సు , జర్మనీల బృందం - అణు ఒప్పందంలో పొందుపరచిన వివాద పరిష్కార యంత్రాంగాన్ని ప్రేరేపించినందుకు ప్రతిస్పందనగా NPT నించి వైదొలగాలని ఇరాన్ పిలుపునిచ్చింది . ఈ విషయమై ఈ దేశాలప...