అంకుర పరిశ్రమలు అద్భుత విజయాలు
భారత దేశం 71వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. ఈ వేడుకల్లో స్టార్టప్ ఇండియా... అంకుర భారత్’ ప్రతిష్టాత్మక స్థానంలో నిలిచింది. స్టార్టప్ ఇండియా స్వల్పకాలంలోనే మూడు లక్షల ఉద్యోగాలను సృష్టించింది. 26 వేలకు పైగా స్టార్టప్’ సంస్థలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. ప్రభుత్వం కలిపిస్తున ప్రోత్సాహంతో దేశంలో స్టార్టప్ పెట్టుబడులు రోజు రోజుకు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా స్టార్టప్ పెట్టుబడుల మొత్తం 35 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇంకా ఇంకా పై పైపైకి సాగుతోంది.
ప్రస్తుతం భారత దేశంలోని ప్రముఖ సాంకేతిక విద్యా సంస్థల నుంచి పట్టభద్రులు అయిన యువకులు, ఉద్యోగాల కోసం ఎదురు చూడడం లేదు.అంకుర పరిశ్రమ స్థాపన వైపు మొగ్గు చూపుతున్నారు. అంకుర పరిశ్రమల స్థాపన ద్వారా స్వయం ఉపాధిని, వృత్తిగా ఎంచుకుంటున్నారు.ఇది దేశంలోని యువతలో వెలుగు చూస్తున వృత్తి నైపుణ్య విజయ గాధకు ప్రతీకగా నిలుస్తోంది. ప్రతిధ్వనిస్తోంది.
అందుకే, ఆ విధంగా దేదీప్యమానంగా వెలుగుతున్న స్టార్టప్ కాంపైన్, అంకుర ఉద్యమం శకటం గణతంత్ర వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలించింది. గణతంత్ర వేడుకల్లో ప్రదర్శించిన స్టార్టప్ శకటం కళాత్మకంగా కన్నుల పండగ చేసింది. స్టార్టప్స్ పర్యావరణ వ్యవస్థ స్వరూపాన్ని చక్కగా, కళాత్మకంగా ప్రదర్శించింది. ఏవిధంగా అయితే మొలకెత్తిన విత్తన అంకురాలు సరైన పోషణలో మహా వృక్షాలుగా ఎదుగుతాయో, అదే విధంగా పన్ను రాయితీలు, పెట్టుబడుల సౌలబ్యం వంటి ప్రభుత్వ ప్రోత్సాహాలతో అంకుర పరిశ్రమలు భారీ కార్పొరేట్ సంస్థలుగా ఎలా ఎదుగుతాయో చాలా చక్కగా, ఎంతో ఆకర్షణీయంగా చూపించారు.
నిజానికి, 2016లో ప్రారంబించిన స్టార్టప్ ఇండియా పధకం ఇంకా నజాత శిశువుగానే ఉంది. అయినా, స్టార్టప్ ఇండియా విజయం మాత్రం అబ్బురపరిచే విధంగా, చాలా చాలా విస్తృతంగా, విశాలంగా ఉంది. కొత్తగా స్థాపించిన స్టార్టప్ సంస్థల పెట్టుబడులు బిలియన్ డాలర్లను దాటిపోయాయి.అంతే కాదు సరిహద్దులను దాటి విస్తరిస్తోంది.ఇతర దేశాలలోనూ స్టార్టప్ ఇండియా సంస్థలు అంకురిస్తున్నాయి.
పరిశ్రమలు, దేశీయవాణిజ్య ప్రోత్సాహక శాఖ విడుదల చేసిన గణాంకాలు నిజంగా చాలా ఆశాజనకంగా ఉన్నాయి. దేశంలోని 28 రాష్ట్రాలు, ఏడు కేంద్రపాలిత ప్రాంతాలలోని 551 జిల్లాల్లో మొత్తం 26 వేల స్టార్టప్ సంస్థలు నమోదయ్యాయి. అంతే కాదు, స్టార్టప్ ఇండియా సంస్థలు టెక్నాలజీ, ఫుడ్ డెలివరీ అప్లికేషన్స్’కు మాత్రమే పరిమితం కాలేదు. అలాగే, పట్టణాలకు మాత్రమే పరిమితం కాలేదు. స్టార్టప్ సంస్థలు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాయి. గ్రామీణ ప్రాంత రైతులను గణనీయంగా మార్చి వేస్తునాయి. రైతుల ఆదాయాలను 2023 నాటికీ రెట్టింపు చేయాలన్న ప్రభుత్వ సంకల్పానికి గ్రామీణ ప్రాంతాలలో పనిచేస్తున్న స్టార్టప్ సంస్థల చేయూతనిస్తున్నాయి.
భారతీయ పెట్టుబడిదారులు భారతీయ స్టార్టప్స్’ను ప్రోత్సహిస్తున్నారు. ఒక్క 2019లోనే 14 బిలియన్ డాలర్ల పెట్టుబడులు స్టార్టప్స్’లో కి ప్రవహించాయి. స్టార్టప్స్’ను పెట్టుబడులు చాలా వేగంగా వెంటాడుతున్నాయి.జపాన్, చైనా, అమెరికా ఆర్థిక దిగ్గజాలు మంచి లాభాల కోసం, భారతీయ స్టార్టప్స్ వైపు ఆనందంగా చూస్తున్నారు. అదే విధంగా భారత దిగ్గజ సంస్థలు కూడా స్టార్టప్స్ లో ఏంజెల్ ఇన్వెస్టర్స్ గా పెట్టుబడులు పెడుతున్నారు.ఆ విధంగా స్టార్టప్స్ ఎలా ఎదగాలి, కార్యకలాపాలను ఎలా విస్తరించుకోవాలి అనే విషయంలో సాంకేతిక సహకారాన్ని , యాజమాన్య నైపుణ్యాన్ని స్టార్టప్స్ అంది పుచ్చుకుంటున్నాయి.
అయినప్పటికీ, కొన్ని స్టార్టప్స్ భారీ విదేశీ పెట్టుబడుల సహకారంతో అస్థిర వ్యాపర పద్దతులును పాటించి, భారీ నష్టాల్లోకి జారిపోతున్నారని విమర్శకులు ఆక్షేపిస్తున్నారు. ఇప్పుడిప్పుడే మొగ్గతొడుగుతున్న ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఇది నిజంగా పెద్ద సవాల్. చక్కని,ఉత్తమ వ్యాపర పద్దతులు, సుస్టిర లక్ష్యాలను ఔత్సాహిక పారిశ్రామిక, వ్యాపాపర వేత్తలు తమ ప్రాధామ్యాలు ఎంచుకుంటే, అలవరచుకుంటే ఇలాంటి సవాళ్ళను చాలా సులభంగా అధిగమించ గలరు.
అదే విధంగా ఎక్కవ స్టార్టప్స్ వినియోగదారుల సేవల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది ఒక విధంగా, స్టార్టప్స్ వ్యాపార పరిధిని కుదించి వేస్తుంది. వివధ విశ్వవిద్యాలయాల్లో చేస్తున్న పరిశోధనల పై స్టార్టప్స్ దృష్టిని కేంద్రీకరించడం, నూతన ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇవ్వడం సర్వదా శ్రేయస్కరం. లాభదాయకం.నిజానికి, అమెరికా ఆర్థిక విజయానికి, నూతన అవిష్కరణలే మూల మంత్రంగా పనిచేశాయి. అందుకే భారత ప్రభుత్వం అనేక సాంకేతిక సంస్థలలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, R&Dని ప్రోత్సహించే పథకాలను అమలు చేస్తోంది. పరిశోధనశాల నుంచి కర్మాగారానికి అనే సంస్కృతీ మరింతగా అలవరచుకోవడం భారతీయ స్టార్టప్స్’కు అవసరం. అభిలక్షణీయం.
భారతీ స్టార్టప్స్ ఉద్యమం ఇంతవరకు సాధించిన విజయం నిజంగా చాలా చాలా అభినందనీయం. స్టార్టప్స్ ఉద్యమం ప్రారంభమైన అతి కొద్దికాలంలో భారతీయ స్టార్టప్స్ అమెరికా, ఇంగ్లాండ్ తరవాత స్థానానికి చేరుకుంది. ఇది నిజంగా చాలా అభినందయనీయ విజయం. ప్రభుత్వం ఏంజెల్ టాక్స్’ ను తీసివేయడం కూడా చాలా చాలా ప్రోత్సాహాన్ని ఇస్తోంది. కొత్త కొత్త లాభదాయక వ్యాపార ఆలోచనలతో ముందుకొస్తున్న యువతకు పెద్ద పెద్ద పెట్టుబడిదారులు ప్రాధాన్యత ఇస్తున్నారు. యువత ఆలోచనలను సావధానంగా వింటున్నారు. బ్యాంకింగ్ రంగం, ముందున్న సందేహాలను పక్కన పెట్టి స్టార్టప్స్ కు చేతులు చాపి స్వాగతం పలుకుతోంది. ముందు ముందు ప్రతి నగరంలో కనీసం ఒక బ్యాంకు బ్రాంచ్’ని ప్రత్యేకంగా స్టార్టప్స్ ప్రయోజనాల సేవకు నిర్దేశించడం మరో భారీ ముందడుగు అవుతుంది. ప్రభుత్వం ఆదిశగా ఆలోచిస్తోంది.
రచన: మనీషా ఆనంద్, సీనియర్ కరెస్పాండెంట్, న్యూ ఇండియన్ ఎక్ష్ప్రెస్స్

Comments
Post a Comment