Posts

Showing posts from May, 2019

రెండవసారి పదవీ ప్రమాణం చేసిన మోదీ ప్రభుత్వం

భారీ మెజారిటీతో దేశ ప్రజలు మోదీని గెలిపించిన తర్వాత నరేంద్ర మోదీ భారత ప్రధానిగా రెండవ పర్యాయం పదవీస్వీకార ప్రమాణం చేశారు. ప్రధాని నేతృత్వంలోని 58 మంది మంత్రులతో కూడిన మంత్రిమండలి చేత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు. భారతీయ జనతాపార్టీ, మిత్రపక్షాలలోని ప్రతిభావంతులైన వారికి మంత్రి పదవులను ఇచ్చారు. వీరిలో భారత మాజీ కార్యదర్శి సుబ్రమణియన్ జైశంకర్ కూడా ఉన్నారు. ప్రధాని మోదీ జైశంకర్‌ని ఎంపిక చేసుకోవడం కూడా ఆశ్చర్యాన్ని రేకెత్తించింది. భారత విదేశాంగ మంత్రిత్వశాఖలో ముఖ్య సహాయకులుగా ఆయన ఉన్నారు. చైనా విషయంలో ఆయన చూపిన ప్రతిభాసామర్థ్యాలు ఆయనకు లాభకరంగా పరిణమించాయనడంలో సందేహంలేదు. బిజెపి అధ్యక్షుడు అమిత్ షాను కూడా మోదీ ఈసారి తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. మోదీ ప్రభుత్వంలో అమిత్ షా కీలకపాత్ర నిర్వహిస్తారనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలు ఈసారి బిజెపిని గెలిపించడం, రెండవసారి తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం వెనుక దేశంలోని ప్రజల ఆంకాంక్షలను వెల్లడిస్తోందంటూ మోదీ పలుమార్లు వ్యక్తం చేయడం మరవలేం. రాష్ట్రపతి ప్రమాణం స్వీకారం చేయించిన కేంద్ర మంత్రిమండలిలో పాన్-ఇండి...

2019 ఐసిసి ప్రపంచ కప్ ప్రారంభం

‘జంటిల్మన్ ’ క్రీడగా పేరొందిన క్రికెట్ 12వ వరల్డ్ కప్ పోటీలకు ఇంగ్లండ్, వేల్స్ కలిసి ఆతిథ్యం ఇస్తున్నాయి. ఇవి మే 30 వ తేదీ నుంచి జూలై 14 వ తేదీ వరకూ జరుగుతాయి. ఐసిసి ( గతంలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ) ఒకటిన్నర నెల పాటు సుదీర్ఘంగా జరిగే టోర్నమెంట్. క్రికెట్ వరల్డ్ కప్ క్రీడలు ఇంగ్లండ్, వేల్స్‌ లలో ఐదవ పర్యాయం జరుగుతున్నాయి. గతంలో 1975, 1979, 1983, 1999 సంవత్సరాలలో ప్రపంచ క్రికెట్ కప్ పోటీలు ఇక్కడే జరిగాయి. క్రికెట్ ఆడే దేశాలు కొన్నే అయినప్పటికీ వాటిల్లో చాలా బ్రిటిష్ సామ్రాజ్యంలో వలసలుగా ఉన్నవే. అందుకే ఆ ప్రాంతాలలో క్రికెట్‌ని ఇష్టపడేవారు బాగా ఉన్నారు. ఫుట్‌బాల్, లాన్ టెన్నిస్ తర్వాత క్రికెట్‌ ప్రేమికులు, వీక్షకుల సంఖ్యే ఎక్కువ. భారత ఉపఖండంలో క్రికెట్ అంటే మతమంత ప్రేమ, ఇష్టం కనిపిస్తాయి. ఇక క్రికెటర్లు ప్రజలకు దేవుడి తర్వాత దేవుళ్లు. ఉపఖండంలోని క్రికెట్ టీముల మధ్య పోటీ కూడా ఎక్కువే. కొన్నిసార్లు అది మితిమీరిన వెర్రిగా పరిణమించే పరిస్థితులను కూడా చూస్తాం. ఇక ఇప్పటి వరకూ ప్రపంచ కప్ క్రికెట్ విజేతల్లో ఇండియా, శ్రీలంక, పాకిస్తాన్ల మధ్యనే నాలుగు పర్యాయాలు ప్రపంచకప్ కైవసమైంది. క్రి...

పాకిస్తాన్‌లో మైనారిటీలపై కొనసాగుతున్న హింస

పాకిస్తాన్ తమ దేశంలోని మైనారిటీల పట్ల కనబరుస్తున్న వివక్షా పూరిత విధానం వల్ల ఎందరో మైనారిటీలు అన్యాయానికి గురవుతున్నారు. దేశంలోని మెజారిటీ ప్రజల చేతుల్లో వీరు పెద్ద ఎత్తున పక్షపాతం, వేధింపులకు బలవుతున్నారు. మరీ ముఖ్యంగా రైట్‌వింగ్ తీవ్రవాదుల చేతుల్లో అన్యాయానికి గురవుతున్నారు. వారి దురాగతాల పాల బడుతున్నారు. పాకిస్తాన్ జనాభాలో హిందువులు, క్రిస్టియన్లు, సిక్కులు అందరూ కలిపి మూడు మిలియన్ల వరకూ ఉంటారు. వాళ్లు తమ తమ మత విశ్వాసాలు, నమ్మకాలు అనుసరించడం వల్ల ప్రమాదాల్లో చిక్కుకుంటున్న పరిస్థితులు పాకిస్తాన్‌లో నేడు వ్యాపించి ఉన్నాయి. అక్కడ ఎంతగానో వివాదాస్పదమైన దైవ దూషణ చట్టాన్ని మైనారిటీల పట్ల వివక్ష పూరితంగా ప్రయోగిస్తున్నారు. అక్కడ మైనారిటీ మతస్తులపై పాక్ ప్రయోగించే తొలి ఆయుధం అదే. ఇస్లాం బోధనలను అవమానించారని మైనారిటీలపై ఆరోపణలు చేస్తూ ఆ చట్టం కింద వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారు. సింధ్ ప్రాంతంలో మైనారిటీకి చెందిన ఒక డాక్టరుపై ఇటీవల దైవదూషణకు పాల్పడిన కేసును పెట్టింది. మత గ్రంథ పవిత్రతను దెబ్బతీశాడంటూ ఆయనపై ఆరోపణలు చేసింది. ఈ సంఘటనకు కొన్ని వారాల ముందు పంజాబ్ ప్రాంతంలో ఉంటున్న మైనారిట...

మోదీ 2.0 లో భారత విదేశాంగ విధాన కార్యక్రమాలు

ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ విజయదుందుభి మోగించారు. 900 మిలియన్ల పైగా ఓటర్లు ఆయనకు ఓటు వేసి మోదీ చేతికి తిరిగి అధికార పగ్గాలు ఇచ్చారు. 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేశంలోని అన్ని రంగాలలో గొప్ప మార్పును తీసుకొచ్చేలా ప్రధాని పలు చర్యలను దేశ విదేశాంగ విధానంలో చొప్పించారు. అంతేకాదు రానున్న ఐదు సంవత్సరాల కాలంలో భారత విదేశాంగ విధాన కార్యకలాపాలకు పలు అవకాశాలను మోదీ కల్పించారు. ప్రధాని మోదీ ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ కింద అందరినీ పాలనలో కలుపుకుపోతామంటూ ఈ సందర్భంగా ప్రకటించారు. ఇది ఆయన ప్రభుత్వ విధానాల తీరును అద్దంపడుతుంది. భారత విదేశాంగ విధానం ప్రధానంగా భారత అంతర్జాతీయ కార్యకలాపాలను విస్తృతం చేయడం ద్వారా అందరినీ కలుపుకుపోయే పాలనను లక్ష్యంగా పెట్టుకున్నారు. తద్వారా భారత స్వరూప స్వభావాలను మార్చాలన్న దానిపై మోదీ దృష్టి పెట్టారు. అలాగే పెరుగుతున్న అంతర్జాతీయ విచ్ఛిన్నకర వాతావరణంలో పెద్ద అంతర్జాతీయ శక్తులైన చైనా, అమెరికా, రష్యాలాంటి దేశాలతో భారత సంబంధాల సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలన్నది భారత విదేశాంగ విధాన ప్రధాన లక్ష్యం. పైన పేర్కొన్న ప...

గ్లోబల్ శక్తిగా ముందుకు వెడుతున్న భారత్

ఉత్తమ నిర్ణయాలు తీసుకోవడంలో ఎవ్వరూ కూడా ప్రధాని మోదీకి సాటిరారు. తన రెండవ పాలనా ప్రయాణం సరికొత్త పంథాలో సాగుతుందని మోదీ అన్నారు. నూతన శక్తితో కూడిన సరికొత్త భారతాన్ని ప్రజలు వెలువరించిన కొత్త తీర్పులో ఆవిష్కరించనున్నట్టు మోదీ వెల్లడించారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో 2022 సంవత్సరానికి ప్రతి భారతీయుడి కలలు సాకారం చేసే విధంగా భారత నిర్మాణానికి పూనుకోనున్నట్టు అన్న మాటలు వెనుక ఇదే అర్థం వెల్లడవుతోంది. ఆయన ఈ కల నాణ్యమైన ఆరోగ్య సేవలకు మాత్రమే పరిమితం కాలేదు. ప్రతి భారతీయునికీ విద్య, హౌసింగ్, ఇతర మౌలిక సదుపాయాలను రానున్న మూడు సంవత్సరాల కాలంలో చేకూర్చాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటితో పాటు అంతర్జాతీయంగా భారత్‌ను ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని కూడా మోదీ కల లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాని మోదీ సరికొత్త నినాదాన్ని ప్రకటించారు. అదే ‘నారా’ (నేషనల్ యాంబిషన్+ రీజినల్ యాస్పిరేషన్స్). దీనిని విశాలదృక్పథంలోంచి చూస్తే, రానున్న భవిష్యత్తులో అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించాలని ఈ నినాదం లక్ష్యంగా ఉంది. భారత్ రూపొందించిన రోడ్ మ్యాప్‌కు తగ్గట్టు కొత్త ఆవిష్కరణలకు, శాస్త్రీయ విజ్ఘానానికి మనదేశం ని...

ఇండొనేసియాలో తిరిగి అధికారంలోకి వచ్చిన జొకోవి

ఇండొనేసియాలో ఎన్నికలు జరిగిన ఒక నెల అనంతరం ‘జొకోవి’గా ప్రసిద్ధులైన జొకో విడుడు ఇండొనేసియా అధ్యక్ష ఎన్నికల్లో ఘనవిజయం సాధించినట్టు ప్రకటించారు. ఇండొనేసియాలో ఏప్రిల్ 17న ఎన్నికలు జరిగాయి  ప్రెసిడెంట్, వైస్‌-ప్రెసిడెంట్ ఎన్నికలతో పాటు పీపుల్స్ కన్సల్టేటివ్ అసెంబ్లీ, స్థానిక లెజిస్లేటివ్ బాడీలకు కూడా ఎన్నికలు జరిగాయి.    కేవలం ఒక రోజులోనే ఎంతో సంక్లిష్టమైన ఎన్నికల ప్రక్రియను నిర్వహించారు. 154 మిలియన్ల మంది ఓటర్లు, వందలకొద్దీ ద్వీపసమూహాలతో కూడిన ఇండొనేసియాలో   ఎన్నికలను విజయవంతంగా పూర్తిచేశారు. ఇండొనేసియా జనరల్ ఎలక్షన్ కమిషన్ (కెపియు) ఏప్రిల్ 17న నిర్వహించిన ఎన్నికల ఫలితాలను మే 21న ప్రకటించింది. భారత దేశంలో నరేంద్ర మోదీ సారథ్యంలోని నేషనల్ డెమొక్రాటిక్ అలయెన్స్ భారీ సక్సెస్‌తో  విస్తృత ఆసియాలో జొకోవి విజయం మరింత ఆసక్తిని సంతరించుకుంది. అంతేకాదు ఆస్ట్రేలియాలో స్కాట్ మారిసన్ విజయం కూడా కీలక ప్రభావం చూపనుంది. ఈ మూడు ప్రముఖ ప్రజాస్వామ్య దేశాలు తమ దేశాల్లో అతి పెద్ద ప్రజాస్వామ్య ఎన్నికల పండుగను విజయవంతంగా పూర్తిచేసుకున్నాయి. ఓట్ల ద్వారా ఈ దేశాలలోని ప్రజలు తమ అ...

ఎస్‌సివొ విదేశాంగ మంత్రుల సమావేశం

భారత విదేశాంగ వ్యవహారాల శాఖా మంత్రి సుష్మా స్వరాజ్ కర్గజిస్తాన్‌లోని బిష్కెక్‌లో ఈ వారం ప్రారంభంలో జరిగిన షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సివొ) విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరయ్యారు. సుష్మా స్వరాజ్‌కి ఇది ఆఖరి విదేశాంగ పర్యటన. భారత్‌లో ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడుతున్న విషయం తెలిసిందే. అందుకే సుష్మా స్వరాజ్‌కు విదేశాంగ మంత్రిగా ఇది చివరి పర్యటనగా నిలిచింది. భారత ఎన్నికల ఫలితాలు వెలవడడానికి ఒక రోజు ముందు ఆమె పర్యటనకు వెళ్లారు. ఎస్‌సివొ భారత్‌కు ఎంత ముఖ్యమైందో చెప్పడానికి ఈ ఉదాహరణ చాలు. భారత నాయకులు అందరూ ఎన్నో ఏళ్లుగా ఎస్‌సివొ సమావేశానికి తప్పనిసరిగా హాజరవుతూ వచ్చారు. ఎస్‌సివొ పదిహేనవ శిఖరాగ్ర సమావేశం రష్యాలోని యుఫాలో 2015లో జరిగిన నాటి నుంచీ ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతూనే వచ్చారు. గత ఏడాది సుష్మా స్వరాజ్, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌లు చైనాలో తమకు సంబంధించి ఎస్‌సివొ సమావేశాలకు హాజరయ్యారు. దోక్లాం ప్రతిష్ఠంభన, మధ్య ఆసియాను చేరడం, బహుపక్ష వ్యవస్థ ఏర్పాటు వంటి వాటిపై చైనాకు చెందిన సంబంధిత నాయకులతో సమావేశానికి ఎస్‌సివొ ఒక వేదికగా నిలిచిం...

పటిష్టమైన ప్రభుత్వానికి భారత్ ఓటు

భారతీయ జనతాపార్టీ సారథ్యం వహించిన నేషనల్ డెమోక్రాటిక్ అలయెన్స్ (ఎన్డీఎ) ఎన్నికల్లో విజయదుందుభి మోగించింది. 900 మిలియన్ల మంది పైగా ఉన్న భారతీయ ఓటర్లు సుస్థిర, పటిష్టమైన ప్రభుత్వానికి తమ ఓటు వేశారు. 35 సంవత్సరాలలో మొదటిసారి ఒకే పార్టీ 303 సీట్ల అఖండ విజయంతో లోక్ సభలో ప్రవేశించింది. అలా ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా రెండవసారి దేశ ప్రధానిగా అధికార పగ్గాలు చేపట్టారు. జాతీయ భద్రత, అభివృద్ధి అనే రెండు అంశాలతో దేశం సర్వత్రా అనూహ్యమైన విజయ పతాకాన్ని ఎగరవేశారు. పదిహేడవ లోక్ సభ ఎన్నికలు ఏడు దశల్లో జరిగాయి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ దేశ ఓటర్ల మద్దతును పూర్తిగా కైవశం చేసుకుంది. అంతేకాదు పశ్చిమబెంగాల్, తెలంగాణా వంటి కొన్ని రాష్ట్రాలలో సైతం బిజెపి ప్రభంజనం సృష్టించింది. ఎందుకంటే ఈ రాష్ట్రాలలో బిజెపి ఉనికి చాలా తక్కువ. అలాంటి చోట సైతం బిజెపి తన విజయాలను నమోదుచేసింది. భారత ప్రతిపక్షాలకు సారథ్యం వహించిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎన్‌సి) అనుకున్న విజయాన్ని, స్థానాలను సంపాదించలేక కుదేలైంది. పైగా గత ఐదేళ్ల కాలంలో ప్రధాని నరేంద్రమోదీ చేసిన పనులు ఎందరో ఓటర్ల హృదయాలను గెలుచుకున్నాయి. అది ఓట్ల రూపంలో బ...

నిఘా సామర్థ్యం పెంచుకునే దిశగా అంతరిక్షంపై భారత కన్ను

భారత నూతన ఎర్త్ అబ్సర్వేషన్ ఉపగ్రహం రీశాట్-2బి (ఆర్ఐఎస్ఎటి-2బి, రాడార్ ఇమేజింగ్ శాటిలైట్) టెక్స్ట బుక్ ప్రయోగం బుధవారం ఉదయం జరిగింది. ఇది భారతదేశ నిఘా సామర్థ్యాలను మరింతగా పెంపొందిస్తుంది. ఇది ఇరవైనాలుగు గంటలూ భారత సరిహద్దులను కాపుకాస్తుంది. ఎలాంటి వాతావరణ పరిస్థితులలో నైనా నిఘా కొనసాగుతుంది. 615 కిలోగ్రాముల బరువు ఉన్న రీశాట్-2బి మిషన్ జీవితకాలం ఐదు సంవత్సరాలు. ఈ ఉపగ్రహాన్ని దేశ సరిహద్దుల్లో నిఘా కోసం ఉపయోగిస్తారు. తద్వారా చొరబాటుదారులు, ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవచ్చు. అంతేకాదు ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పలు కార్యకలాపాలు చేపట్టవచ్చు కూడా. సంప్రదాయ రిమోట్-సెన్సింగ్ ఉపగ్రహాలకు మల్లే భూమిపై కనిపించే వెలుతురులో దృశ్యాలను సమీకరిస్తుందే తప్ప రాత్రుళ్లు, మబ్బులు కమ్మిన వాతావరణంలో ఇమేజెస్‌ను తీయలేదు. కానీ రీశాట్ 2బి ఉపగ్రహం రాడార్ ఇమేజింగ్ శాటిలైట్. ఇందులో సింథటిక్ అపెర్చర్ రాడార్ అని పిలవబడే యాక్టివ్ సెన్సర్లు ఉన్నాయి. ఈ శాటిలైట్ అంతరిక్షం నుంచి రాడార్ కిరణాలను వదలడం ద్వారా రాత్రి, పగలు అనే తేడా లేకుండా భూమి మీద ఉన్న దృశ్యాలను ఇట్టే పట్టేస్తుంది. అంతేకాదు ఆకాశం మబ్బులతో నిండి...

ప్రయోగించనున్న భారత చంద్రయాన్-2 మిషన్

భారత చంద్రయాన్-2 మిషన్‌ని ఈ ఏడాది జూలైలో ప్రయోగించాలనుకున్నారు. ఇందులో 13 పేలోడ్స్ ఉన్నాయి. వీటిని దేశంలోని వివిధ అధ్యయన సంస్థలు రూపొందించాయి. వీటి ద్వారా విస్తృతస్థాయిలో శాస్త్ర ప్రయోగాలను చేపట్టాలనుకుంటోంది ఇస్రో. అంతేకాదు డేటా సేకరణ కూడా చేపట్టాలని భావిస్తున్నట్టు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘ఇస్రో’ తెలిపింది. ఈ స్పేస్‌క్రాఫ్ట్ 3.8 టన్నుల బరువు ఉంది. ఇందులో మూడు మాడ్యూల్స్ ఉన్నాయి. ఒకటి ఆర్బిటర్, రెండు లాండర్ (విక్రమ్), మూడు రోవర్ (ప్రజ్ఘాన్). నాసా ప్రయోగించిన మాడ్యూల్ భూమి, దాని సహజ ఉపగ్రహం మధ్య ఉన్న దూరం కొలవడం లక్ష్యంగా  ప్రయోగించారు. చంద్రయాన్-2 మిషన్ ప్రయోగానికి అన్ని మాడ్యూల్స్ సర్వ సన్నద్ధంగా ఉన్నాయి. దీన్ని జూలై 9-6 మధ్య లక్ష్యంగా పెట్టుకున్నారు. సెప్టెంబరు ఆరవతేదీ నాటికి అది చంద్రడిపై దిగేలా ప్రణాళిక వేశారు. ఈ విషయాలను అంతరిక్ష ఏజెన్సీ వెల్లడించింది. ఆర్బిటర్ చంద్రుడి ఉపరితలం నుంచి వంద కిలోమీటర్ల కక్ష్యలో తిరుగుతుంది. లాండర్ (విక్రమ్) చంద్రుడి దక్షిణ ధృవ సమీపంలో జాగ్రత్తగా దిగుతుంది. ఇక రోవర్ అంటే ప్రజ్ఘాన్ అక్కడి పరిస్థితులపై ప్రయోగాలను నిర్వహిస్తుంది. చంద్రయాన...

పర్షియన్ గల్ఫ్ ఘర్షణ దిశగా పయనిస్తోందా?

ఇటీవల అమెరికా, దాని మిత్రదేశాల మధ్య తీవ్ర వాగ్విదాలు చోటుచేసుకున్నాయి. మరోవైపు ఇరాన్ పర్షియన్ గల్ఫ్‌ లో ఉద్రిక్తలను తీవ్రతరం అవుతున్నాయి. వాషింగ్టన్, టెహ్రాన్‌ల మధ్య నలుగుతున్న సమస్య చాలా పెద్దది, ఎంతో సంక్లిష్టమైంది కూడా. అమెరికా జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ (జెసిపివొఎ) నుంచి లేదా ఇరాన్ అణు ఒప్పందం నుంచి గత ఏడాది మేలో అమెరికా విరమించుకున్న తర్వాత పరిస్థితులు మరింత తీవ్రతను సంతరించుకున్నాయి. ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ తన చర్యలతో ఆ ప్రాంతాన్ని అస్థిరతకు గురిచేస్తోందంటూ నిందించారు. అంతేకాదు అణ్వాయుధ ఒప్పందం చేసుకున్నప్పటికీ అణ్వాయుధాల తయారీ, బాలిస్టిక్ క్షిపణుల తయారీకి ఇరాన్ పాల్పడుతోందంటూ ఆరోపించారు. అప్పటి నుంచి తిరిగి అమెరికా ఇరాన్‌పై ఏకపక్షంగా ఆర్థిక ఆంక్షలను విధించింది. ఇలా ఆర్థిక ఆంక్షలను విధించడం ద్వారా టెహ్రాన్‌పై తీవ్ర ఒత్తిడి తీసుకురావాలని, అణ్వాయుధ ఒప్పందంపై చర్చలకు ఇరాన్ మళ్లా దిగేలా చేయాలని అమెరికా భావించింది. కానీ ఇరాన్ మాత్రం అమెరికా ప్రయత్నాలను ఎదుర్కొంది. అమెరికా కోరుకున్నట్టు చేయడానికి ఇరాన్ పూర్తిగా వ్యతిరేకించింది. ఒప్పందం నుంచి అమెరికా త...

ముగిసిన 17వ లోకసభ ఎన్నికల పోలింగ్

పదిహేడవ లోకసభ (భారత పార్లమెంట్ దిగువ సభ) ఎన్నికలు అత్యంత కోలాహలంగా ముగిసాయి. ఓటర్ల నుంచి అనూహ్యమైన స్పందన కనిపించింది. మొత్తంగా చూస్తే, 2019 లోకసభ ఎన్నికల్లో 900 మిలియన్ ఓటర్లలో 66 శాతం మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. దీని ద్వారా భారత దేశం మరోసారి ప్రజాస్వామ్యం పట్ల ఉన్న తన శ్రద్ధ, శక్తి, విశ్వాసాన్ని ప్రపంచానికి చాటింది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యమైన భారత దేశంలో ఓటర్లు ఎన్నికల పట్ల ఎంతో ఆసక్తి ప్రదర్శించారు. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) కూడా అద్భుతమైన ఏర్పాట్లు చేసింది. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగ ఓటర్లకు తగు సదుపాయాలు సమకూర్చింది. మూడు అడుగుల ఎత్తు ఉన్న వినితా జైన్ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో తన ఓటు హక్కు వినియోగించుకొని ఎంతో గర్వంగా ఇంకుతో కూడిన తన చేతి వేలిని ప్రదర్శించింది. మొట్టమొదటి సారి జంట కవల సోదరీమణులు సబా, ఫరాలు బిహార్‌లోని పట్నాలో తమ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. లోకసభ ఎన్నికలు విదేశాల్లో ఉన్న భారతీయులను కూడా ఆకట్టుకున్నాయి. అందుకే అనేక మంది విదేశాల నుంచి తరలి వచ్చి మరీ ఇక్కడ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతేకాదు, రోజు వారి కూలీలు కూడా తమ పని ప్రదేశాలను వదిల...

బ్రిగ్జిట్ ఒప్పందానికి ఆఖరి పిలుపు:  తర్వాత ఏమిటి?

బ్రిటిష్ ప్రధాని థెరిస్సామే ప్రవేశపెట్టిన బ్రిగ్జిట్ ఒప్పందాన్ని గతంలో మూడుసార్లు పార్లమెంట్ తిరస్కరించింది. ఒప్పందం నుంచి విరమించుకునే విషయమై బ్రిటిన్ నాయకురాలు  తన చివరి, ఆఖరి సవాలును ప్రస్తుతం ఎదుర్కొంటున్నారు. ఈ ఒప్పందం మళ్లాకనుక నిరాకరించడం జరిగితే అది ఘోర ఫలితాలకు దారితీస్తుది. ఒప్పందంతోపాటు, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం సైతం చేదు అనుభవాలను చవిచూస్తుంది. ఈ విషయాన్ని ‘ఎగ్జిటింగ్ ది యురోపియన్  యూనియన్’ సెక్రటరీ ఆఫ్ స్టేట్ స్టీఫన్ బార్క్లే వెల్లడించారు. ఈ ఒప్పందం కనుక ఓడిపోతే ఈ డీల్ పూర్తిగా మృతప్రాయం అవుతుందన్నారు. బ్రిటిష్ ప్రధాని థెరిస్సా మే పరిస్థితి ప్రస్తుతం ఎంతో బలంగా ఉంది. ఈ ఒప్పందాన్ని ఆమె హౌస్ ఆఫ్ కామన్స్ లో త్వరలో  మళ్లా ప్రవేశపెట్టి పార్లమెంట్ ఆమోదాన్ని కోరనున్నారు. ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్న వారు ప్రధానంగా ఈ ఆరువారాల సంభాషణల సమయంలో కొత్త మార్పులను ఏవైనా ప్రవేశపెట్టారా అన్నదానిపై మౌలిక ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ధెరిస్సా కన్సర్వేటివ్ పార్టీలోని కొందరు ‘యూరోస్కెప్టిక్స్’ ఈ ఒప్పందం యుకెని కస్టమ్స్ యూనియన్‌కి పరిమితం చేస్తుందంటున్నారు. అయితే డెమోక్రాటిక్ ...

పోంపే-లవరోవ్ సంభాషణలు:  వైషమ్యాలు సరళం చేసే దిశగా ఒక ప్రయత్నం

అమెరికా విదేశాంగమంత్రి మైక్ పోంపే రష్యాలో పర్యటించారు. రష్యా విదేశాంగమంత్రి, ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్లతో సంభాషణలు జరిపారు. ఈ పరిణామం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వ యంత్రాంగం యొక్క సరికొత్త వ్యూహాన్ని వెల్లడిస్తోంది. రష్యాతో ఉన్న వైషమ్యాలను సరళం చేయడానికి ట్రంప్ యంత్రాంగం నూతన వ్యూహానికి తెరలేపిందన్న విషయం ఈ పర్యటన స్పష్టం చేస్తోంది. ఇటీవల సంవత్సరాలలో అమెరికా, రష్యాల మధ్య చిన్నపాటి ప్రచ్ఛన్న యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్నాయి.ఈ విషయాన్ని అంతర్జాతీయ కమ్యూనిటీ గమనించింది. అమెరికా విదేశాంగ విధాన విశ్లేషకులు అమెరికా, రష్యాల మధ్య క్లిష్టతరమైన సంబంధాలను చిన్నపాటి ప్రచ్ఛన్న యుద్ధంగా అభివర్ణించడానికి ఇష్టపడటం లేదు. కారణం రష్యాకు ఆ క్రెడిట్‌ను ఇవ్వడానికి వాళ్లు సుముఖంగా లేరు. మాజీ సోవియట్ యూనియన్‌లో రష్యా అతి పెద్దది కావడం కూడా ఒక కారణం. ప్రచ్ఛన యుద్ధ సమయంలో అమెరికాలోని విద్యావేత్తలు ఇరుదేశాల మధ్య అణ్వాయుధ సమానత్వాన్ని గుర్తించారు. అమెరికాలో తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు కూడా రష్యాకు సమాన హోదా ఇవ్వడం పట్ల సుముఖంగా లేవు. బైపోలార్ అధికార నిర్మాణం అమెరికాకు అనుకూలంగా ఉండ...

ఉగ్రదాడుల నేపథ్యంలో బయటపడ్డ పాకిస్తాన్

ఎన్నో నెలల సుదీర్ఘచర్చల అనంతరం అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఐఎంఎఫ్) ఎట్టకేలకు పాకిస్తాన్‌ను మరో ఆర్థిక సమస్య నుంచి సురక్షితంగా బయటపడేసింది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి పాకిస్తాన్ ప్రధాని సలహాదారు డా. హఫీజ్ షేక్ మాట్లాడుతూ పాకిస్తాన్‌కు, ద్రవ్యనిధి సభ్యులకు మధ్య  ఆఖరి పర్యాయం జరిగిన చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. వచ్చే మూడు సంవత్సరాల కాలంలో పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ఆరు బిలియన్ అమెరికన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందించాలని ఐఎంఎఫ్ నిర్ణయం తీసుకుంది. ఇస్లామాబాద్ పూర్తిగా అప్పుల ఊబిలో మునిగి ఉంది. తమ దేశ ఆర్థిక అవసరాలకు కావాలసిన  18 బియన్ అమెరికన్ డాలర్ల లోటును పాక్ ఎదుర్కొంటోంది. అలాంటి పరిస్థితుల్లో దేశ ఆర్థిక రంగాన్ని ముందుకు నడిపించడానికి పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ సహాయం అత్యవసరం. ఎనిమిది నెలల క్రితం పాకిస్తాన్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ఎన్నికయ్యారు. ఆ సందర్భంలో ఆయన మాట్లాడుతూ ఐఎంఎఫ్ కఠిన నిబంధనలను విధించిన పక్షంలో దాని ఆర్థిక సహాయం అవసరం లేదని అన్నారు. మిత్రదేశాలైన చైనా, సౌదీ అరేబియా, యుఎఇల మీద ఇమ్రాన్ ఖాన్ ఎక్కువగా ఆధారపడ్డార...

న్యూఢిల్లీ డబ్ల్యుటివొ మంత్రివర్గ సమావేశం

స్పెషల్   అండ్   డిఫరెన్షియల్   ట్రీట్ ‌ మెంట్  ( ఎస్   అండ్   డిటి )  యంత్రాంగాన్ని   తిరిగి   కఠినంగా   అమలు    చేసేందుకు   రంగం   సిద్ధమైంది .  దీనికోసం   డబ్ల్యుటివొ  ( వరల్డ్   ట్రేడ్   ఆర్గనైజేషన్ ) కు   చెందిన   పేద   దేశాలు ,  అభివృద్ధిచెందుతున్న   దేశాలు   న్యూఢిల్లీలో   మంత్రివర్గ   సమావేశాన్ని   నిర్వహించాయి .  వివిధ   అంతర్జాతీయ   వాణిజ్య    ఒప్పందాలు   అందిస్తున్న   రాయితీలు ,  సౌకర్యాలను   ఉపయోగించుకోవాల్సిందిగా   అభివృద్ధిచెందుతున్న   దేశాలకు   ఈ   సమావేశం    పిలుపునిచ్చింది .  డబ్ల్యుటివొ   పరిధిలో   బహుపక్ష   వాణిజ్య   విధానాన్ని   అభివృద్ధి   చేయాలని   కోరింది .   డబ్ల్యుటివొ   వాణిజ్య   చర్చలలో   ఏర్పడ్డ   ప్రతిష్ఠంభనను   తొలగించేందుకు ,  అదే   సమయంలో   బహుపక్ష   స్వ...