ఎస్‌సివొ విదేశాంగ మంత్రుల సమావేశం
భారత విదేశాంగ వ్యవహారాల శాఖా మంత్రి సుష్మా స్వరాజ్ కర్గజిస్తాన్‌లోని బిష్కెక్‌లో ఈ వారం ప్రారంభంలో జరిగిన షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సివొ) విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరయ్యారు. సుష్మా స్వరాజ్‌కి ఇది ఆఖరి విదేశాంగ పర్యటన. భారత్‌లో ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడుతున్న విషయం తెలిసిందే. అందుకే సుష్మా స్వరాజ్‌కు విదేశాంగ మంత్రిగా ఇది చివరి పర్యటనగా నిలిచింది. భారత ఎన్నికల ఫలితాలు వెలవడడానికి ఒక రోజు ముందు ఆమె పర్యటనకు వెళ్లారు. ఎస్‌సివొ భారత్‌కు ఎంత ముఖ్యమైందో చెప్పడానికి ఈ ఉదాహరణ చాలు. భారత నాయకులు అందరూ ఎన్నో ఏళ్లుగా ఎస్‌సివొ సమావేశానికి తప్పనిసరిగా హాజరవుతూ వచ్చారు. ఎస్‌సివొ పదిహేనవ శిఖరాగ్ర సమావేశం రష్యాలోని యుఫాలో 2015లో జరిగిన నాటి నుంచీ ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతూనే వచ్చారు.
గత ఏడాది సుష్మా స్వరాజ్, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌లు చైనాలో తమకు సంబంధించి ఎస్‌సివొ సమావేశాలకు హాజరయ్యారు. దోక్లాం ప్రతిష్ఠంభన, మధ్య ఆసియాను చేరడం, బహుపక్ష వ్యవస్థ ఏర్పాటు వంటి వాటిపై చైనాకు చెందిన సంబంధిత నాయకులతో సమావేశానికి ఎస్‌సివొ ఒక వేదికగా నిలిచింది. 2019 సంవత్సరంలో జరిగిన ఎస్‌సివొ సమావేశ సందర్భంలో మన దేశ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వుహాన్ అనధికార శిఖరాగ్ర సమావేశంలో అంగీకరించిన నియమావళిని అనుసరించాల్సిన అవసరాన్ని ఆమె ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.
2017, జూన్‌లో భారత్‌ను పూర్తిస్థాయి సభ్యురాలిగా ఎస్‌సివొలోకి తీసుకున్నారు. భారత, పాకిస్తాన్ దేశాలకు ఇందులో సభ్యత్వం కల్పించడంతో ఎస్‌సివొ పాన్ యురేసియన్ రూపాన్ని సంతరించుకోవడమే కాకుండా దాని ప్రభావం భారత ఉపఖండం అంతా వ్యాపించింది. వివిధ స్థాయిల్లో వివిధ ముఖ్య అంశాలపై తరచూ ఎస్‌సివొలో పరస్పర సమావేశాలు, చర్చోపచర్చలు జరిగేవి.
భారత సభ్యత్వంతో ‘కనెక్ట్ సెంట్రల్ ఏసియా’ విధానానికి ఎస్‌సివొలో బాగా ఊతం ఇచ్చినట్టయింది. ఎస్‌సివొలో ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్‌లు పరిశీలక దేశాలుగా వ్యవహరిస్తు న్నాయి. తన ప్రసంగంలో సుష్మా స్వరాజ్ ఆఫ్ఘనిస్తాన్ శాంతి చర్చలు మృదువుగా సాగే విషయంలో భారత్ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. అంతేకాదు ఆఫ్ఘనిస్తాన్ ‘కాంటాక్ట్ గ్రూప్’ ప్రక్రియలో ఎస్‌సివొకు భారత్ పూర్తి మద్దతును అందిస్తుందని సుష్మా స్పష్టంచేశారు. డ్రాఫ్ట్ రోడ్ మ్యాప్‌ను త్వరగా పూర్తిచేసిన పక్షంలో కాంటాక్ట్ గ్రూపుకు సంబంధించి తదుపరి చర్యలు సాధ్యమవుతాయన్నారు. ప్రాంతీయ భాగస్వాముల సహాయసహకారాలు లేకపోతే ఈ ప్రక్రియ కార్యరూపం దాల్చదు. దీర్ఘకాలం పరిష్కారం సాధించలేం. ఆఫ్ఘనిస్తాన్‌లో శాంతిప్రక్రియకు ప్రాంతీయ సహకార వేదికగా ఎస్‌సివొ పనిచేస్తుందని భారత్ భావిస్తోంది.
భారత్‌ను ఎస్‌సివొలో చేర్చుకోవడం అనేది ప్రాంతీయంగా ఉగ్రవాదంపై పోరుకు కీలకంగా భావించారు. ఫిబ్రవరి 2019 పుల్వామా దాడి అనంతరం ఉగ్రవాదంపై భారత్ మరింత క్రియాశీలకంగా, దృఢంగా పోరాటం కొనసాగిస్తోంది. ఉగ్రవాదంపై పోరులో ఎంతో యాక్టివ్ పాత్రను పోషిస్తోంది. ఎస్‌సివొలో అంతర్భాగంగా ‘రీజనల్ యాంటి-టెర్రరిస్ట్ స్ట్రక్చర్ (ఆర్ఎటిఎస్)ని ఏర్పాటుచేశారు. దీని ద్వారా ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదం అనే మూడు దుష్టశక్తులను ఎదుర్కోవడమే లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఎస్‌సివొ ప్రతి ఏడాది నిర్వహించే ఉగ్రవాద వ్యతిరేకమైన ‘పీస్ మిషన్’ లో భారత్ పాల్గొంటూ వస్తోంది. ఎస్‌సివొలో భారత్ కొనసాగాలనుకోవడానికి పెట్టుకున్న లక్ష్యాలలో అతిముఖ్యమైంది, పెద్దది ఏమిటంటే ఈ ప్రాంతంలో ఉగ్రవాద వ్యతిరేక కృషిని మరింత పటిష్టం చేయాలనేది.
అనుసంధాన పటిష్టతకు భారత్ కట్టుబడి ఉంది. అంతేకాదు ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతల సాధనకై గట్టిగా కృషి చేస్తోంది. భారత విదేశాంగ మంత్రి మాట్లాడుతూ అంతర్గత ప్రాంతీయ అనుసంధానత సాధనకు భారత్ కట్టుబడి ఉందన్నారు. ఇంటర్నేషనల్ నార్త్-సౌత్ ట్రాన్స్‌పోర్టు కారిడార్, ఛబహార్ పోర్టు, అష్గాబట్ ఒప్పందం, ఇండియా-మయన్మార్-థాయ్‌లాండ్ త్రైపాక్షిక హైవే వంటి పలు అనుసంధాన ప్రాజక్టుల్లో భారత్ పనిచేయడం చూస్తే ఈ విషయంగా మనదేశం ఎంతగా కట్టుబడి ఉన్నదనే విషయం స్పష్టం అవుతోందని విదేశాంగమంత్రి పేర్కొన్నారు. అయితే, చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బిఆర్ఐ) రూపం భారత విదేశాంగ విధానాల ప్రయారిటీల్లో పెద్ద సవాలుగా నిలిచింది. కలుపుకుపోయే, సుస్థిర, పారదర్శక కార్యక్రమాలను భారత్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ వస్తోంది. దేశాల సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రతలను గౌరవించాలని కూడా ఈ సందర్భంగా అన్ని దేశాలను భారత్ కోరింది.
సెంట్రల్ ఆసియా దేశాల విషయంలో ఎస్‌సివొ ఒక వేదికగా పనికివస్తోంది. అంతేకాదు ఆసియా పెద్ద దేశాలైన రష్యా, చైనాలకు కూడా ఇది ఉపయోపడుతోంది యురేసియన్ ప్రాంతం వివిధ దేశాలతో ఉగ్రవాదం వంటి సవాళ్లతో పాటు అనుసంధానత లోపించడం, ప్రాంతీయంగా శాంతి, సుస్థిరతలు లేకపోవడం, నత్త నడకన సాగుతున్న ప్రాంతీయ ఆర్థిక రంగ సమైక్యతా కదలికలు వంటి పలు సమస్యలను ఎదుర్కొంటోంది. ఇవన్నీ ప్రతిబంధకంగా నిలుస్తున్న ప్రధాన సమస్యలు. అయితే ఎస్‌సివొతో భారత సంబంధాలు గతంలో ఎన్నడూ లేని రీతిలో మరింత పటిష్టమయ్యేలా కనిపిస్తున్నాయి. ఈ కారణాలే భారత్ ఎస్‌సివొలో ప్రవేశించేట్టు చేశాయి.
ఎన్నో ఏళ్ల నుంచి ఎస్‌సివొ తనను తాను పటిష్టమైన ప్రాంతీయ బృందంగా బలోపేతచేసుకుంది. ఈ వేదికపై వివిధ దేశాలు విభిన్న అంశాలపై చర్చించుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ పరిణామాలను భారత్ ఎంతగానో ప్రశంసిస్తోంది. అంతేకాదు దేశాలన్నింటినీ ఎస్‌సివొ గొడుగు కింద ఉత్సాహంగా పనిచేసేలా ఎంతో స్ఫూర్తివంతంగా భారత్ వ్యవహరిస్తోంది.
రచన: సనా హష్మి, చైనా, యురేసియన్ వ్యవహారాల వ్యూహాత్మ విశ్లేషకులు

Comments
Post a Comment