Posts

Showing posts from June, 2019

పార్లమెంటులో ఈ వారం

ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటులో మాట్లాడుతూ భారతదేశాన్ని తమ ప్రభుత్వం మరింత ఉన్నత స్థాయికి తీసుకువెడుతుందన్నారు. ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ ప్రతిపాదన ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతిపక్షాలు తమ సహకారాన్ని అందించాలని కోరారు. పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి కృతజ్ఘతలు తెలిపే తీర్మానం సందర్భంగా ఆయన మాట్లాడారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేలా ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. ప్రగతి పథంలో దూసుకుపోవడానికి అందివచ్చే ఏ అవకాశాన్ని భారత్ వదలదని ఆయన అన్నారు. భారత ప్రగతి, సుసంపన్నతలే ప్రభుత్వ ప్రాధాన్యతా అంశాలన్నారు. దేశం ఎదుర్కొంటున్న అన్ని రకాల సవాళ్లను ప్రభుత్వం, ప్రతిపక్షం రెండూ కలిసి పరిష్కరించే దిశగా పనిచేస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. దృఢమైన, సురక్షితమైన, అందరినీ కలుపుకుపోయే భారతాన్ని ఆవిష్కరించాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అవినీతి ప్రక్షాళణ, రైతుల సంక్షేమం, ఉద్యోగ అవకాశాలు వంటి అంశాలను లేవనెత్తారు. దేశంలో అవినీతికి తావే లేదని ప్రధాని స్పష్టంచేశారు. అవినీతి ప్రక్షాళన కోసం తమ ప్రభుత్వం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుందని ఆయన అన్నారు. దేశంలోని నీటికర...

ఒసాకాలో బ్రిక్స్ నాయకుల అనధికార సమావేశం

బ్రెజిల్ ప్రభుత్వం, రష్యా సమాఖ్య, భారత్, చైనా, దక్షిణ ఆఫ్రికా (బ్రిక్స్) జపాన్‌లోని ఒసాకాలో జి20 శిఖరాగ్ర సదస్సులో కలిసారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రెజిల్ ప్రెసిడెంట్ జైయిర్ బోల్సోనారో, రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమర్ పుతిన్, చైనా ప్రెసిడెంట్ గ్జి జింపింగ్, దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్ సిరిల్ రామఫోసాలు జి20 అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న జపాన్‌కు అభినందనలు తెలిపారు. అలాగే జపాన్ చేపట్టిన ప్రాధాన్యాలపై కూడా ప్రశంసలు గుప్పించారు. వాటిల్లో వాణిజ్యం, సైన్స్, టెక్నాలజీ, నూతన ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాలు, వాతావరణంలో మార్పులు, విశ్వజనీన ఆరోగ్య కవరేజి, సీనియర్ సిటిజన్స్, సుస్థిర అభివృద్ధి అంశాలు కూడా జపాన్ ప్రాధాన్య అంశాలలో ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక అభివృద్ధి సుస్థిరమవుతోందని ఈ సందర్భంగా ‘బ్రిక్స్’ నాయకులు అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాదికి మరికొంతమేర పెరుగుతుందని, 2020 నాటికి పుంజుకుంటుందని అంచనావేశారు. అయితే, దృఢమైన అభివృద్ధి అనిశ్చితంగానే కొనసాగుతోంది. పెరుగుతున్న వాణిజ్యం, భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు దీనికి ఒక కారణం. అంతేకాదు సరుకుల ధరల్లో అస్థిరత, అసమానత్వం, కలుపుకుపోయే అభివృద్ధి లోటు, ఆర్థిక పరిస...

భారత్-అమెరికా సంబంధాలు: కొనసాగుతున్న చర్చలు

అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పోంపియో ఢిల్లీ పర్యటన ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. తన పర్యటనలో భాగంగా ఆయన ప్రధాన మంత్రి, విదేశీ వ్యవహారాల మంత్రి, భారత రక్షణ సలహాదారులతో భేటీ అయ్యారు. అమెరికా, భారత్‌ల నడుమ ఇటీవల కొన్ని ద్వైపాక్షిక విభేధాలు తలెత్తాయి. అందులో ముఖ్యమైనవి సుంకాలు, వ్యాపారం, ఇరాన్‌పై ఆంక్షలు, భారత సరకులను అమెరికా ప్రత్యేకంగా పరిగణించడం, భారతీయ టెకీలకు హెచ్1బీ విసాల మంజూరు, వెనిజులాతో విద్యుత్ వ్యాపారం, రష్యా నుంచి భారత్ ఆయుధాలు కొనుగోలు చేయడంలాంటి అంశాలున్నాయి. వీటిపై ఇరు దేశాల అధినేతలు కూర్చొని నేరుగా పరస్సర చర్చలు జరపాల్సిన పరిస్థితి ఉంది. పోంపియో భారత్ పర్యటనలో ప్రధాన ఉద్దేశం ఇరు దేశాధి నేతల మధ్య చర్చలకు సానుకూల వాతావరణం ఏర్పర్చడమే. జపాన్‌లోని ఒసాకాలో జరిగే జీ-20 దేశాల సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ద్వైపాక్షిక చర్చలకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకే ఆయన భారత్ పర్యటనకు వచ్చారు. దీనితోపాటు జీ-20 సదస్సుకు సమాంతరంగా భారత్, అమెరికా, జపాన్‌ల మధ్య త్రైపాక్షిక భేటీ ఏర్పాటు చేసి అమెరికా అధ్యక్షుడు, భారత్ ప్రధాన మంత్రి, జపాన్ ప్రధాన ...

అభివృద్ధి ఎజెండాను మరోసారి నొక్కిచెప్పిన ప్రధాని

రెండవసారి మోదీ భారత ప్రధానిగా పదవీ పగ్గాలను చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పేద ప్రజల సంక్షేమం, అత్యాధునిక మౌలికసదుపాయాల అభివృద్ధి తన ప్రభుత్వం యొక్క రెండు అంశాలతో కూడిన ప్రధాన ఎంజెండా అని ప్రపంచానికి చాటారు. పార్లమెంట్ రెండు సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంలో మోదీ ఈ విషయాన్ని పునరుద్ఘాటించారు. దేశానికి, ప్రజల ప్రయోజనాలకు కావలసినవి ఏమిటన్నదానిపై మోదీ సుదీర్ఘంగా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ దృక్కోణాన్ని వివరిస్తూ ప్రధాని మోదీ ప్రజాసంక్షేమాన్ని ప్రభుత్వం అమితంగా విశ్వసిస్తుందన్నారు. అలాగే అత్యాధునిక మౌలికసదుపాయాల విషయంలో కూడా కేంద్రం ఎంతో నమ్మకంతో ముందుకు అడుగేస్తుందన్నారు. అభివృద్ధి లక్ష్యం నుంచి ప్రభుత్వం పక్కదారి పట్టే ప్రసక్తే లేదని ప్రధాని స్పష్టంచేశారు. అంతేకాదు ఎలాంటి పరిస్థితుల్లోనూ అభివృద్ధి ఎజెండాను నీరుగార్చే ఉద్దేశం కూడా లేదని తెలిపారు. ‘దేశం ప్రగతి దిశగా సాగడం చాలా ముఖ్యం. దీనివల్ల ప్రతి భారతీయుడు సాధికారతను సాధించగలుగుతాడు. అంతేకాదు మనదేశంలో అత్యాధునిక మౌలిక సదుపాయాలు కూడా అందుబాటులో ఉంటాయి’ అని మోదీ వివరించారు. గత ఐదు సంవత్సరాల కాలంల...

అభివృద్ధిని వేగవంతం చేయడంపై దృష్టి పెడుతున్న ప్రభుత్వం

వరుసగా రెండవ పర్యాయం భారీ మెజారిటీతో పదవీ పగ్గాలు చేపట్టిన జాతీయ ప్రజాస్వామ్య కూటమి (నేషనల్ డెమోక్రాటిక్ అలయెన్స్, ఎన్డీఎ) ప్రభుత్వం మరింత బలం పుంజుకుని ముందుకు సాగుతోంది. భారత ఆర్థిక ప్రగతిని అత్యున్నత అభివృద్ధి పంథంలో కొనసాగించేందుకు సంసిద్ధమవుతోంది. తద్వారా ప్రజలకు ఉపాధి అవకాశాలతోపాటు సాధారణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ప్రధాన లక్ష్యాలతో ముందుకు సాగుతోంది. విస్తృతస్థాయిలో ఆర్థిక కార్యకలాపాలు జరిగే విధంగా సంస్కరణలను చేపట్టాలని ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకుందని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టంచేశారు. తద్వారా ఆర్థిక రంగ కార్యకలాపాలు వేగవంతం చేయాలని నిశ్చయించారు. నీతిఆయోగ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో కొంతమంది ఆర్థిక శాస్త్రవేత్తలు, నిపుణులతో ప్రధాని మోదీ సంభాషించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను భారీగా ఆకర్షించేందుకు భారత ఆర్థిక వ్యవస్థను గట్టిపోటీకి నిలబడేలా తయారుచేయాలనుకుంటున్నట్టు నొక్కిచెప్పారు. నిపుణులతో కార్మిక, ఉపాధి, వ్యవసాయం, ఆరోగ్యం, విద్య వంటి రంగాలపై ప్రధాని చర్చలు జరిపారు. ఈ అంశాలు పూర్తిస్థాయిలో బిజెపి సారథ్యంలోని ఎన్డీఎ ప్రభుత్వం ప్రవేశపెట్టే తొలిబడ్జెట్‌కు ఎంత...

మత స్వేచ్ఛపై అమెరికా నివేదికను కొట్టిపారేసిన భారత్

భారతదేశంలోని మత స్వేచ్ఛపై అమెరికా మరోసారి తన నివేదికలో విమర్శలు చేసింది. ఇలా భారతదేశంపై విమర్శలు చేసే నైతికాధికారం అమెరికాకు ఏం ఉంది అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. అంతర్జాతీయ మత స్వేచ్ఛపై అమెరికా రూపొందించిన నివేదికలో ఇతర దేశాల మతస్వేచ్ఛా పరిస్థితులపై దాడి చేసే విధానం అనుసరించడం కనిపిస్తుంది. దీనిపై ఇతర దేశాల తీరుకు సంబంధించి నైతిక తీర్పులను అమెరికా వెలువరిస్తోంది. ఆ నివేదికలో ‘గత ఏడాది మైనారిటీ కమ్యూనిటీలపై హింసాత్మక మూకలు దాడులకు పాల్పడ్డాయంటూ పేర్కొంది. అయితే భారత్ ఈ నివేదికను గట్టిగా కొట్టిపారేసింది. ‘మా దేశ పౌరులపై అలాంటి ప్రకటనలు చేయడానికి అమెరికాకి ఎలాంటి ‘లోకస్ స్టాండి’ లేదని భారత ప్రభుత్వం స్పష్టంచేసింది. అంతేకాదు ‘భారత్‌ లౌకికరాజ్యమని, దానికి ఆధారాలు ఎన్నో ఉన్నాయని పేర్కొంది. అతి పెద్ద ప్రజాస్వామిక దేశం కూడా తమదని భారత ప్రభుత్వం పేర్కొంది. భిన్న సంస్కృతుల, జాతుల, ప్రజల సమ్మేళనమని పేర్కొంది. సహనం, అందరినీ కలుపుకుపోయే సంస్కృతి భారత ప్రత్యేకతలని స్పష్టంచేసింది. అమెరికాకు చెందిన అంతర్జాతీయ మత స్వేచ్ఛ సంఘం ఛైర్మన్ తెంజిన్ దోర్జీ ఇందుకు విరుద్ధంగా వ్యాఖ్యానించడం ఆసక్తికరం. ‘ భారత్...

ఎఫ్ఎటిఎఫ్ పట్ల పాకిస్తాన్ కొనసాగిస్తున్న నిర్లక్ష ధోరణి

ఆరు రోజుల ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్సు (ఎఫ్ఎటిఎఫ్) ప్లీనరి గతవారం అమెరికాలోని ఆర్లండ్‌లో జరిగింది. అక్టోబర్ నాటికి గ్లోబల్ ఫైనాన్షియల్ వాచ్‌డాగ్ గా వ్యవహరిస్తున్న ఎఫ్ఎటిఎఫ్‌కి పాకిస్తాన్ కట్టుబడిన నిబంధనలను గౌరవించాలి. లేకపోయినట్లయితే పాకిస్తాన్ ఇప్పుడున్న‘గ్రే లిస్టు’ స్థానం నుంచి ‘బ్లాక్ లిస్టు’ జాబితాకు ఎక్కే ప్రమాదం ఉంది. ఎఫ్ఎటిఎఫ్‌ నిబంధనలకు కట్టుబడి పనిచేస్తానని పాకిస్తాన్ సంవత్సరం క్రితం మాట ఇచ్చింది. దాంతోపాటు ఆసియా ఫసిఫిక్ గ్రూపు (ఎపిజి)తో కలిసి హవాలా కార్యకలాపాలకు  వ్యతిరేకంగా (ఎఎంటి) పనిచేస్తానని పాకిస్తాన్ పేర్కొంది. అలాగే ఉగ్రవాదానికి అందుతున్న నిధులకు వ్యూహాత్మకంగా అడ్డుకట్ట వేయడాన్ని(సిటిఎఫ్) కూడా చర్చించింది. అలాగే దీనికి సంబంధించిన ఇతర లోపాలపై సైతం దృష్టి పెడతానంది. ఈ విషయాలన్నింటిలో ఇస్లామాబాద్ రికార్డు  సరిగాలేదు. ఏవో కొన్ని పైపై చర్యలు మాత్రం పాక్ తీసుకుంది. తనతో ఉగ్రసంబంధాలున్న సంస్థల ఉగ్ర కార్యకలాపాలను అడ్డుకట్టేవేసేలా ముఖ్యమైన చర్యలేమీ పాకిస్తాన్ చేపట్టలేదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎఫ్ఎటిఎఫ్ తన 30వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఈ గ్ర...

పార్లమెంటులో ఈ వారం

దేశ ప్రజల అభిలాషలకు అనుగుణంగా భారతీయ జనతాపార్టీ సారథ్యంలోని జాతీయ ప్రజాస్వామిక కూటమి (నేషనల్ డెమోక్రాటిక్ అలయెన్స్, ఎన్డీఎ) ప్రభుత్వం దృఢమైన, భద్రతతో కూడిన, సంపద్వంతమైన, సమ్మిశ్రితమైన భారత నిర్మాణం దిశగా పయనిస్తోందని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్’ స్ఫూర్తితో ఎన్డీఎ ప్రభుత్వం ముందుకు సాగుతోందని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ ప్రాంగణంలో ఉభయసభలైన లోక్‌సభ, రాజ్యసభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచీ ఎన్డీఎ ప్రభుత్వం ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించే దిశగా కృషి మొదలెట్టింది అన్నారు. పరిపాలనా పరంగా తలెత్తుతున్న రకరకాల సమస్యల నుంచి ప్రజలను విముక్తులను చేయడం ద్వారా, అలాగే వారికి అవసరమైన అన్ని రకాల సదుపాయాలను కల్పించడం ద్వారా ప్రజల జీవనప్రమాణాల పెంపుదలకు ఎన్డీఎ ప్రభుత్వం పూనుకుందన్నారు.  మొదటి పర్యాయం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వం చేపట్టిన కార్యకలాపాలను ప్రజలు సునిశితంగా అంచనావేశారని అందుకే రెండవ పర్యాయం కూడా బిజెపి సారథ్యంలోని ఎన్డీఎ కూటమికే అధికార పగ్గాలు కట్టబెట్టారని భారత రాష్ట్రపతి రామ్ న...

సమస్థితిలో భారత-అమెరికా సంబంధాలు

జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రివరెన్సెస్ (జిఎస్‌పి) ప్రయోజనాలు అందకుండా భారత్‌ను ఆ జాబితా నుంచి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం తొలగిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో అమెరికా నుంచి దిగుమతి చేసుకునే 28 ఉత్పత్తులపై టారిఫ్‌లు పెరిగాయి. ప్రధాని నరేంద్ర మోదీ రెండవసారి అధికార పీఠం ఎక్కిన కొద్ది రోజుల్లోనే ఈ పరిణామం వార్తాపత్రికల పతాక శీర్షికలకు ఎక్కింది. ఈ రెండు దేశాలు ‘వ్యూహాత్మక భాగస్వామ్యం’ విషయంలో ఒకే రీతిలో వ్యవహరిస్తున్నాయి. జపాన్‌లోని ఒసాకాలో జి20 శిఖరాగ్ర సదస్సు జరగడానికి ముందు అమెరికా విదేశాంగ మంత్రి మైఖైల్ ఆర్. పోంపే జూన్ 25 నుంచి 27వ తేదీ వరకూ భారత్‌లో పర్యటించనున్నారు. భారతదేశంలో ఎన్నికల అనంతరం చోటుచేసుకుంటున్న తొలి అత్యున్నత స్థాయి సమావేశం ఇది. తన భారత పర్యటనలో పోంపే కేంద్ర విదేశాంగ వ్యవహారాల మంత్రితో చర్చలు జరుపుతారు. ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తారు. అలాగే భారత ప్రభుత్వానికి సంబంధించిన అత్యున్నత అధికార ప్రతినిధులను కూడా కలుస్తారు. భారత-అమెరికాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత దృఢపరచుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. రెండు దేశాల పరస్పర ప్రయోజనాలకు సంబంధించ...

పర్షియన్ గల్ఫ్‌ లో అదనపు సైనిక బలగాల మోహరింపు

గత వారంలో గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో రెండు చమురు ట్యాంకర్ల మీద దాడులు జరిగాయి. ఈ దాడులకు ప్రతిగా పర్షియన్ గల్ఫ్‌లో భద్రతను పెంచేందుకు అదనంగా వెయ్యిమంది సైనిక బలగాలను దించనున్నట్టు అమెరికా రక్షణ విభాగం ప్రకటించింది. గత ఏడాది మేలో ఇరాన్ అణు ఒప్పందం (జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, సిపిఒఎ) నుంచి అమెరికా వైదొలగాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఉద్రిక్తలు ఎక్కువయ్యాయి. అమెరికా మళ్లా ఆర్థిక ఆంక్షలను ఇరాన్ మీద విధించింది. గత నెలలో ఇరాన్ చమురు దిగుమతులన్నింటినీ ఎత్తివేయడం జరిగింది. దాంతోపాటు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త ఆంక్షలను విధించాలని నిర్ణయించుకున్నారు. రెండవసారి విధించే ఆంక్షలు వ్యక్తులు, సంస్థలు, కంపెనీలు ఇరాన్ పారిశ్రామికవేత్తలతో చేసే వాణిజ్యలావాదేవీలకు వర్తించనుంది.  జెసిపిఒఎలోని ఒప్పందంపై సంతకాలు చేసిన ఇతర దేశాలకు, ముఖ్యంగా యుకె, ఫ్రాన్స్, జర్మనీలకు కూడా ఇరాన్ హెచ్చరికతో స్పందించింది. ఆంక్షల ప్రభావం నుంచి ఇరాన్ ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు టెహ్రాన్ కూడా ఒప్పందం నుంచి తప్పనిసరిగా వెనకడుగు వేసే పరిస్థితులు తలెత్తనున్నాయంటూ హెచ్చరించింది. దీంతో అమె...

అసమ్మతి గళాలను అణిచివేస్తున్న పాకిస్తాన్

పాకిస్తాన్‌ రాజకీయ తిరుగుబాటు పరిస్థితుల మధ్య చిక్కుకుని ఉంది. అధికారంలో ఉన్న పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్‌సాఫ్ (పిటిఐ) ప్రభుత్వ వ్యతిరేక గళాలకు ముక్కుతాడు వేస్తుండడమే ఇందుకు కారణం. ప్రతిపక్ష పార్టీ నాయకులైన పీపుల్స్ పార్టీకి చెందిన అసిఫ్ ఆలి జర్దారీ, పాకిస్తాన్ ముస్లింలీగ్-నవాజ్‌కు చెందిన హమజ్ షహ్‌బాజ్‌ల గళాలను అణగదొక్కడంతో పాటు పష్తూన్ తహఫజ్ మూవ్‌మెంట్ (పిటిఎం) వంటి గ్రూపులను విచ్ఛేదం చేయడం వంటి చర్యలతో ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని ప్రభుత్వం వ్యూహాత్మకంగా నిరసన గళాలను అణిచివేస్తోంది. ముత్తాహిదా క్వామి మూవ్‌మెంట్‌కు (ఎంక్యూఎం) చెందిన నిర్వాసిత నాయకుడు అల్తాఫ్ హుస్సేన్‌ని బ్రిటిష్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీని వెనుక కూడా పాకిస్తాన్ హస్తం ఉంది. పాక్ సైన్యం చెప్పిన విధంగా ఏ దిశ నుంచి విమర్శలు వెల్లువెత్తినా వారిపై పాక్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయితే ప్రతిపక్షాల గళాలపై ఉక్కుపాదం పెట్టడం, అసమ్మతిని అణచివేయడం వంటి పాక్ ప్రభుత్వ చర్యలు దానినే తిరిగి కొట్టే ప్రమాదం ఉంది. నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్ఎబి) మాటున ప్రతిపక్ష నాయకులను అవినీతి ఆరోపణలపై అరెస్టు చేయడం పార్లమెంట్...

ఐదవ సికా శిఖరాగ్ర సదస్సు, ఇండియా

గత వారాంతంలో ఐదవ ‘కాన్ఫరెన్స్ ఆన్ ఇంటరాక్షన్ అండ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెషర్స్ ఇన్ ఆసియా’ సికా (సిఐసిఎ) సదస్సు తజకస్తాన్‌లో జరిగింది. కజకిస్తాన్ తొలి ప్రెసిడెంట్ నూర్‌సుల్తాన్ నజర్‌బేవ్ సికా వ్యవస్థాపక సభ్యులు. నూర్‌సుల్తాన్ తన ఈ ఆలోచనను 1992లో ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో చేసిన ప్రసంగంలో ప్రతిపాదించారు. సికా సెక్రటేరియట్ 2006 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఇది ఆస్తానాలో ఉంది. ప్రస్తుతం దీనిని నూర్‌సుల్తాన్ అంటారు. ఇది ఇప్పుడు కజకస్తాన్ రాజధాని. 30 వరకూ ఆసియా దేశాలు ఇందులో సభ్యులుగా ఉన్నాయి. అంతేకాదు ఈ వేదికలో ఎన్నో అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పరిశీలకులుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకూ కజకిస్తాన్, టర్కీ, చైనా, తజకస్తాన్‌లు సికాకు ఛైర్మన్‌షిప్ బాధ్యత నిర్వహించాయి.  తొలి సికా శిఖరాగ్రసదస్సు 2002 లో కజకస్తాన్‌లోని ఆల్మాటిలో జరిగింది. ఇక్కడే దాని చార్టర్‌ని చేపట్టారు. ఈ చార్టర్‌నే ఆల్మాటీ యాక్ట్ అంటారు. అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పాయి ఈ శిఖరాగ్రసదస్సులో పాల్గొన్నారు. భారత పెట్రోలియం, సహజవాయువుల మంత్రి 2006లో ఆల్మాటీలో జరిగిన రెండవ శిఖరాగ్రసదస్సుకు భారత ప్రతినిధిగా ...

చైనా-భారత్‌ల మధ్య పెరుగుతున్న ఉల్లాసకర వాతావరణం

ప్రధాని నరేంద్ర మోదీ రెండవసారి అధికార పగ్గాలు చేపట్టడంతో భారత్ చైనా పట్ల అనుసరిస్తున్న విధానం మార్పు లేకుండా స్థిరంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. గ్లోబల్ రాజకీయాల్లో అమెరికా-చైనాల మధ్య విభేదాలు కొననసాగుతున్నా భారత్, చైనాల మధ్య స్థిరమైన సంబంధాలు కొనసాగుతూనే వస్తున్నాయి. 2017లో రెండు దేశాల మధ్య దోక్లామ్ ప్రతిష్ఠంభనం అనంతరం రెండు దేశాలూ మధ్య ఉన్న అభిప్రాయవిభేదాలను తగ్గించుకునే దిశగా అన్ని మార్గాల ద్వారా కృషిచేశాయి. 2018లో జరిగిన వుహాన్ అనుకూల శిఖరాగ్రసభ ఈ పరిణామాల నుంచి చోటుచేసుకున్నదే. వుహాన్ శిఖరాగ్ర సభ, అనధికార చర్చలు ఇరు దేశాల మధ్య ఆత్మవిశ్వాసం పెంచే పలు చర్యలు చేపట్టేలా చేశాయి. అలా సినో-భారత్ దేశాల మధ్య సంబంధాల పరంగా అనుకూల అభివృద్ధికర వాతావరణం ఏర్పడింది. అంతేకాదు జైష్-ఇ-మొహమ్మద్ (జెఇఎం) ఛీఫ్ మసూద్ అజర్‌ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడంలో చైనా సహకరించింది. గతంలో ఈ ప్రతిపాదనను చైనా నాలుగుసార్లు వీటో చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రెండు దేశాల మధ్య సంబంధాలు వూహాన్ శిఖరాగ్ర సమావేశం ఉత్ప్రేరకంగా పనిచేస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాన మంత్రి మోదీ కిర్గిజిస్తాన్‌లోని బిష్‌కెక్‌ల...

భారత ప్రధాని కిర్గిజిస్తాన్ పర్యటన

భారత ప్రధానిగా   రెండవ పర్యాయం అత్యధిక మెజారితో గెలిచి అధికార పగ్గాలను చేపట్టిన నరేంద్రమోదీ జూన్ 13-14 తేదీల్లో కిర్గిజిస్తాన్‌లోని బిష్‌కెక్‌లో పర్యటించారు. కిర్గిజిస్తాన్ ప్రెసిడెంట్ సూరోన్‌బే జీన్‌బెకోవ్‌ను కలిసి ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. అంతేకాదు షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సివొ) సదస్సుకు హాజరయ్యారు. కిర్గిజిస్తాన్ ప్రెసిడెంట్ జీన్‌బెకోవ్ ఎస్‌సివొ ప్రస్తుత ఛైయిర్‌గా వ్యవహరిస్తున్నారు. కిర్గిజిస్తాన్ ప్రెసిడెంట్ జీన్‌బెకోవ్‌తో ప్రధాని మోదీ సమావేశం వ్యూహాత్మకమైందిగా అభివర్ణించాలి. పది రోజుల వ్యవధిలో భారత ప్రధాని, కిర్గిజ్ ప్రెసిడెంట్‌లు పున: సమావేశం అయ్యారు. కిర్గిజ్ ప్రెసిడెంట్ మే 30న జరిగిన భారత ప్రధాని మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యారు కూడా. ఎస్‌సివొ శిఖరాగ్ర సదస్సుకు బిష్‌కెక్ వెళ్లినపుడు ప్రధాని మోదీ, కిర్గిజిస్తాన్ ప్రెసిడెంట్ జీన్‌బెకోవ్ ఇరువురూ జూన్ 14 వ తేదీన జరిగిన తొలి ఇండియా-కిర్గిజ్ బిజినెస్ ఫోరమ్ సమావేశాన్ని గురించి ప్రస్తావించారు. ఈ సమావేశం ఎంతో విజయవంతమైందనే ప్రశంసలు కూడా వెల్లువెత్తాయి. మొత్తానికి భారత్, కిర్గిజిస్తాన్‌ దేశాలు రెం...

17 ನೇ ಲೋಕಸಭೆಯ ಮೊದಲ ಅಧಿವೇಶನ

ಲೋಕಸಭೆ ಚುನಾವಣೆ ಗೆದ್ದು ಅಧಿಕಾರಕ್ಕೆ ಬಂದ ನರೇಂದ್ರ ಮೋದಿ ನೇತೃತ್ವದ ಸರ್ಕಾರ ಮೊದಲ ಅಧಿವೇಶನಕ್ಕೆ ಸಜ್ಜಾಗುತ್ತಿದೆ. 17 ನೇ ಲೋಕಸಭೆಯ ರಚನೆಯಾದ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ ಸಂಸತ್ತಿನ ಮೊದಲ ಬಜೆಟ್ ಅಧಿವೇಶನ ಈ ತಿಂಗಳ 17 ರಿಂದ ಪ್ರಾರಂಭವಾಗಲಿದೆ. ಸಬ್ ಕಾ ವಿಕಾಸ್-ಸಬ್ ಕಾ ವಿಶ್ವಾಸ್ ಎಂಬ ಘೋಷಣೆಯೊಂದಿಗೆ ದೇಶಾದ್ಯಂತ ನಡೆದ ಚುನಾವಣೆಯಲ್ಲಿ ಮೋದಿ ನಾಯಕತ್ವಕ್ಕೆ ಜನ ಮತ ಹಾಕಿದ್ದರು, ಸ್ಟಾರ್ ಪ್ರಚಾರಕರಾಗಿದ್ದ ಪ್ರಧಾನಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರು ಇನ್ನೂ ಅನೇಕ ಕಲ್ಯಾಣ ಯೋಜನೆಗಳ ಬಗ್ಗೆ ಜನರಿಗೆ ಭರವಸೆ ನೀಡಿದ್ದಾರೆ. ಲೋಕಸಭೆಯು ಜೂನ್ 19 ರೊಳಗೆ ಸ್ಪೀಕರ್ ಅನ್ನು ಆಯ್ಕೆ ಮಾಡಲು ನಿರ್ಧರಿಸಿದೆ. ಹೊಸ ಸ್ಪೀಕರ್ ಆಯ್ಕೆಯಾಗುವವರೆಗೂ ತಾತ್ಕಾಲಿಕ ಸ್ಪೀಕರ್ ಸದನದ ಕಲಾಪಗಳ ಉಸ್ತುವಾರಿ ವಹಿಸುತ್ತಾರೆ.  ರಾಷ್ಟ್ರಪತಿ ರಾಮ್ ನಾಥ್ ಕೋವಿಂದ್ ಅವರು ಚುನಾಯಿತ ಸದಸ್ಯರ ವಿಧ್ಯುಕ್ತ ಪ್ರಮಾಣವಚನ ಪೂರ್ಣಗೊಂಡ ನಂತರ ಜೂನ್ 20 ರಂದು ಉಭಯ ಸದನಗಳಾದ ಲೋಕಸಭೆ ಮತ್ತು ರಾಜ್ಯಸಭೆಯ ಜಂಟಿ ಸಭೆಯನ್ನು ಉದ್ದೇಶಿಸಿ ಮಾತನಾಡಲಿದ್ದಾರೆ. 2019-20ರ ಕೇಂದ್ರ ಬಜೆಟ್ ಅನ್ನು ಜುಲೈ 5 ರಂದು ಲೋಕಸಭೆಯಲ್ಲಿ ಮಂಡಿಸಲಾಗುವುದು. ನಂತರ, ಉಭಯ ಸದನಗಳನ್ನು ಉದ್ದೇಶಿಸಿ ರಾಷ್ಟ್ರಪತಿಗಳು ಮಾಡಿದ ಭಾಷಣಕ್ಕೆ ಧನ್ಯವಾದಗಳನ್ನು ಸಮರ್ಪಿಸಲಾಗುವುದು. ಐದು ವಾರಗಳಿಗಿಂತ ಹೆಚ್ಚು ಅವಧಿಯ ಬಜೆಟ್ ಅಧಿವೇಶನವು ಜುಲೈ 26 ರಂದು ಮುಕ್ತಾಯಗೊಳ್ಳಲಿದೆ. ಮೋದಿಯವರ ಗೆಲುವಿಗೆ ಒಂದು ಪ್ರಮುಖ ಕಾರಣವೆಂದರ...

బిష్కెక్‌లో ఎస్‌సీవో సదస్సు

ఇటీవలి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒక ముఖ్యమైన విదేశాంగ విధాన రూపకల్పన సదస్సులో పాలుపంచుకున్నారు . కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ ‌ లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ( ఎస్ ‌ సీవో ) వార్షిక సదస్సులో ఆయన పాల్గొన్నారు . ఈ సదస్సులో ఆయన ప్రసంగిస్తూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న , సహకరిస్తున్న , ఆర్థిక తోడ్పాటును అందజేస్తున్న దేశాలను గుర్తించాలని పిలుపునిచ్చారు . ఏకపక్ష ధోరణులు , స్వీయ రక్షణ ఎవరికి కూడా మేలు చేయలేదని ఆయన అన్నారు . ఎస్ ‌ సీవో సమావేశం ఆరోగ్యరంగంలో సహకారం , ఇంధన రంగంలో సహకారం , ప్రత్యామ్నాయ ఇంధన రంగం , సాహిత్యం , సంస్కృతి , ఉగ్రవాద రహిత సమాజం , మానవీయ సహకారం తదితర అంశాలపై కేంద్రీకరించి పని చేయాలని అన్నారు . మోదీ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఒక దేశానికీ మరో దేశానికి మధ్య అనుసంధానత అవసరమని చెబుతూ అందుకోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలను వివరించారు . అప్ఘనిస్తాన్ ‌ లో శాంతి , సుస్థిరతల గురించి ఆయన మాట్లాడుతూ ఆ ప్రక్రియ పూర్తిగా ఆప్ఘన్ నేతృత్వంలో , అప్ఘనీయుల చొరవతో , అప్ఘన్ ...