చైనా-భారత్‌ల మధ్య పెరుగుతున్న ఉల్లాసకర వాతావరణం

ప్రధాని నరేంద్ర మోదీ రెండవసారి అధికార పగ్గాలు చేపట్టడంతో భారత్ చైనా పట్ల అనుసరిస్తున్న విధానం మార్పు లేకుండా స్థిరంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. గ్లోబల్ రాజకీయాల్లో అమెరికా-చైనాల మధ్య విభేదాలు కొననసాగుతున్నా భారత్, చైనాల మధ్య స్థిరమైన సంబంధాలు కొనసాగుతూనే వస్తున్నాయి. 2017లో రెండు దేశాల మధ్య దోక్లామ్ ప్రతిష్ఠంభనం అనంతరం రెండు దేశాలూ మధ్య ఉన్న అభిప్రాయవిభేదాలను తగ్గించుకునే దిశగా అన్ని మార్గాల ద్వారా కృషిచేశాయి. 2018లో జరిగిన వుహాన్ అనుకూల శిఖరాగ్రసభ ఈ పరిణామాల నుంచి చోటుచేసుకున్నదే. వుహాన్ శిఖరాగ్ర సభ, అనధికార చర్చలు ఇరు దేశాల మధ్య ఆత్మవిశ్వాసం పెంచే పలు చర్యలు చేపట్టేలా చేశాయి. అలా సినో-భారత్ దేశాల మధ్య సంబంధాల పరంగా అనుకూల అభివృద్ధికర వాతావరణం ఏర్పడింది. అంతేకాదు జైష్-ఇ-మొహమ్మద్ (జెఇఎం) ఛీఫ్ మసూద్ అజర్‌ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడంలో చైనా సహకరించింది. గతంలో ఈ ప్రతిపాదనను చైనా నాలుగుసార్లు వీటో చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రెండు దేశాల మధ్య సంబంధాలు వూహాన్ శిఖరాగ్ర సమావేశం ఉత్ప్రేరకంగా పనిచేస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాన మంత్రి మోదీ కిర్గిజిస్తాన్‌లోని బిష్‌కెక్‌లో జరిగిన షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సివొ) సదస్సు సమయంలో చైనా ప్రెసిడెంట్ గ్జి జిన్‌పింగ్‌తో తొలి ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. జూన్ 28-29 తేదీల్లో ఒసాకాలో జరగనున్న జి-20 సదస్సులో ఇరు దేశాల నాయకులు తిరిగి సమావేశమయ్యే అవకాశం ఉంది. అంతేకాదు చైనా, భారత్ నాయకులు బ్రెజిల్‌లో జరిగిన ‘బ్రిక్స్’ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా) సదస్సులో, అలాగే వచ్చే ఏడాదిలో థాయ్‌లాండ్‌లో జరగనున్న 14వ ఈస్ట్ ఆసియాలో ఈ ఇద్దరు నాయకులు సమావేశమయ్యే అవకాశం ఉంది. 

ఇరు దేశాల మధ్య అనుకూల వాతావరణం వృద్ధి చెందడం ప్రారంభమైన తర్వాత ఈ దేశ నాయకులు మరోసారి అనధికార సమావేశం జరపాలని భావించారు. వీరి రెండవ అనధికార సమావేశం భారతదేశంలోని వారణాశిలో అక్టోబర్ 11న జరగనుంది. చైనా, భారత్‌ల మధ్య సంబంధాల్లో కీలకమైన మెరుగుదల కనిపించింది. ప్రధాని నరేంద్ర మోదీ, చైనా ప్రెసిడెంట్ గ్జి ఇరువురూ తమ భాగస్వామ్యాన్ని పెంచుకునేందుకు కలిసి పనిచేస్తున్నారు. వీరిరువురి మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలే ఈ దేశాల మధ్య సంబంధాల మెరుగుదలకు కారణమని చెప్పాలి. రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి అంటే ఈ రెండు దేశాల మధ్య విభేదాలు సమసిపోయాయని అర్థం కాదు అనేది గమనించుకోవాలి. 2019 ఎస్‌సివొ నాయకుల జాయింట్ కమ్యూనిక్‌లో చోటుచేసుకున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బిఆర్ఐ) కి రెండవసారి కూడా భారత్ హాజరుకాలేదు. నిజానికి భారత్ ఒక్కటే రెండు సార్లు బెల్ట్ అండ్ రోడ్ ఫోరమ్స్ సమావేశాలకు హాజరుకాలేదు. పాకిస్తాన్‌కు చైనా తోడ్పాటును అందిస్తోంది. అంతేకాదు చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (సిపిఇసి) అంశాలు ఇప్పటికి కూడా భారత్‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టే అంశాలే. స్పెషల్ రిప్రజెంటేటివ్ - లెవెల్ టాక్స్‌ తో పాటు పలు పర్యాయాలు సంభాషణల తర్వాత కూడా ఇరుదేశాల సరిహద్దులకు సంబంధించిన విభేదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. న్యూక్లియర్ సప్లైయర్స్ గ్రూప్‌లో భారత్ సభ్యత్వంపై చైనా తీవ్ర వ్యతిరేకతను ఇప్పటికీ కలిగి ఉంది. ఏది ఏమైనప్పటికీ రెండు వైపులా ‘విభేదాలు వివాదాలు కాకూడదనే’ నిబంధనపై ఇరు దేశాల నాయకులు ఒక అంగీకారానికి వచ్చారు. 


చైనా పట్ల భారత విధానం ఆశావహంగా, అనుకూల ధోరణిలోనే ముందుకు సాగుతోంది. అయితే న్యూఢిల్లీ కొన్ని వివాదాస్పద అంశాల విషయంలో మాత్రం తన పంథాను అలాగే కొనసాగిస్తోంది. రెండు దేశాల మధ్య తరచూ జరుగుతున్న అత్యున్నత స్థాయి సమావేశాల వల్ల విభేదాలు తీవ్రతరం కాకుండా నిరోధించబడుతున్నాయి. పెద్ద వివాదాలుగా మారకుండా ఉన్నాయి. పరస్పర ప్రయోజనకరమైన అంశాలపై ఇరు దేశాలూ దృష్టిసారించాలని నిర్ణయించుకున్నాయి. విస్తృతస్థాయిలో సహకారం అందించుకోవాలని భావించాయి. తద్వారా వ్యక్తిగత ప్రయోజనాలను సాధించుకోవాలనుకుంటున్నాయి. ఎస్‌సివొ ప్రణాళికలో ఉన్న ఉగ్రవాద వ్యతిరేక చర్యలు రెండు దేశాల ప్రయోజనాలను కాపాడతాయి. చైనా విషయానికి వస్తే అమెరికా చర్యలు గ్లోబల్ స్థాయిలో విస్తరించడానికి ఆటంకంగా నిలుస్తాయి. చైనా-అమెరికాల మధ్య వాణిజ్య యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్నా కూడా బీజింగ్ ఇతర దేశాలతో స్నేహ సంబంధాలను కొనసాగిస్తోంది. అంతేకాదు బిఆర్ఐకి సంబంధించి కూడా అనుమానాలు పెరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భారత్ పాల్గొనకపోతే పాన్ ఆసియన్ ఇనిషియేటివ్ కన్నా కూడా చైనా బిఆర్ఐ తక్కువ స్థితికి దిగజారుతుంది. 


ప్రధాని మోదీ, చైనా ప్రెసిడెంట్ గ్జి ఈ సంవత్సరాంతంలో వారణాశిలో సమావేశమవుతారు. వీరి సమావేశంతో రెండు దేశాల మధ్య సంబంధాలు ఉన్నత పథంలోకి సాగుతాయని పలువురు భావిస్తున్నారు. భారత-చైనా సరిహద్దు వివాద అంశానికి సంబంధించి పురోగతి కనిపిస్తున్నా, ఇరుదేశాల సంధానకర్తలను ముందుకు నడిపించేలా ఇరువురు నాయకులు స్ఫూర్తినివ్వాలి. చైనాతో భారత్‌కు పెద్ద ఎత్తున వాణిజ్య లోటు (2018-19 సంవత్సరంలో 53.37 బిలియన్ అమెరికన్ డాలర్లు) ఉంది. ఇది చైనాకు సానుకూలంగా వంగేలా చేస్తోంది. గ్వాదర్ పోర్టలో అనుసంధానం, మౌలిక సదుపాయాల అభివృద్ధి అంశాలు భారత్‌కు సమస్యాత్మకంగా నిలిచి ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఇది రెండు దేశాల నాయకుల సంభాషణల్లో చోటుచేసుకునే అవకాశం ఉంది. మిగతా అంశాలలో బిఆర్ఐ, చైనా-అమెరికా వాణిజ్య యుద్ధం, పరస్పర ప్రాంతీయ ప్రయోజనాలను తీర్చడం వంటివి కూడా ఉన్నాయి. 

2020 సంవత్సరం నాటికి భారత్, చైనాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 70 సంవత్సరాలు పూర్తవుతాయి. రెండు అతిపెద్ద ఆసియా దేశాలైన చైనా, భారత్ నాయకుల మధ్య సహకారం ఆ దేశాల ద్వైపాక్షిక సంబంధాలను వృద్ధిపరుస్తాయి. మార్గనిర్దేశం చేస్తాయి. దీనివల్ల ఇరుదేశాల మధ్య ఏళ్ల తరబడి కొనసాగుతున్న పలు లోతైన అంశాలను పరిష్కరించుకోవడం సాధ్యం కావడమే కాదు రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత ముందుకు తీసుకువెడతాయి.


రచన: సనా హష్మి, తూర్పు ఆసియా, యురేషియన్ వ్యవహారాల విశ్లేషకులు

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన