పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన
పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై అధిపత్య ధోరణి కొనసాగుతోంది. దేశం లో అల్పసంఖ్యాకుల సంఖ్య క్రమేపి తగ్గుతోంది. పాకిస్తాన్ ఏర్పడినపుడు హిందువులు, సిక్కులు, క్రిస్టియన్లు, పారసీలు, బౌద్ధులతో సహా హిందూ జనాభా 22% కాగా, నేడు ఆ దేశం లో మైనారిటీలు 4% కంటె తక్కువగా ఉన్నారు.
పాకిస్తాన్ జాతిపిత మహమ్మదాలి జిన్నా లౌకిక పాకిస్తాన్ ఆవిర్భావాన్ని ఊహించారు.ఐతే ఆయన జీవితకాలం లో కూడా మతమౌడ్య వాదులు మతపరమైన దేశ ఆవిర్భావానికి తలపడ్డారు . అది తదనంతర కాలం లో 1980 లో దేశాధ్యక్షుడు జియా ఉల్ హక్ పాలనలో మతపరమైన దేశ ఆవిర్భావంగా ముగిసింది.
దశాబ్దాలుగా అల్పసంఖ్యాక వర్గాలపై పాకిస్తాన్ లో దౌర్జన్యాల కధనాలు వినవస్తూనే ఉన్నాయి.పురాతన చట్టాలు, పనికి మాలిన ఆరోపణలు చేస్తారన్న భయాలు, మతపరమైన మైనారిటీలను తీవ్ర అభద్రతా భావానికి గురిచేసాయి.
పాకిస్తాన్ లోని మానవహక్కుల ఉల్లంఘన, మత విశ్వాసం ప్రాతిపదికన అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న వివక్షలకు సంబంధించిన నివేదికల పట్ల, తాము తీవ్రంగా కలత చెందినట్లు అమెరికా పేర్కొంది. ఆ దేశ రాజ్యాంగం లో పేర్కొన్న రీతిలో చట్టాలను, స్వాతంత్ర్యాలను నిలబెట్ట వలసిందిగా వాషింగ్టన్, ఖాన్ ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుత ఐఎంఎఫ్ ప్రణాళిక క్రింద పాకిస్తాన్ చేబడుతున్న సంస్కరణలు మెరుగైన ఆర్ధిక యాజమాన్యానికి, పెరుగుదలకు పునాది వేసి, ప్రజాస్వామ్య వ్యవస్థ లోను, మానవహక్కుల పరిరక్షణలోను. మెరుగుదల సాధించగలదని దక్షిణ మధ్య ఆసియా వ్యవహారాల తాత్కాలిక మంత్రి అలిస్ జి వెల్స్ ఒక ప్రకటనలో అన్నారు.
ఇటీవలి కాలం లో, పాకిస్తాన్ లో, పౌరసమాజానికి, పత్రికాస్వేచ్చకు ప్రాబల్యం సన్నగిల్లడం వంటి అంతర్గత ధోరణులు పెరగ సాగాయి. గత ఏడాది కాలంగా, వేధింపు చర్యలు, అస్తిత్వానికి ఎదురుదెబ్బలు, ఆర్ధిక, నియంత్రణా చర్యలతో సహా పత్రికలపైనా ,పౌరసమాజం పైనా ఒత్తిడి పెరిగింది.
పాకిస్తాన్ ప్రభుత్వం చట్టాన్ని అతిక్రమించరాదని తాము కోరుతూనేఉంటామని వెల్స్ అన్నారు. నాయకత్వాన్ని, భద్రతావ్యవస్థను విమర్శించే బృందాల హక్కు కూడ ఇందులో ఇమిడి ఉంది. అంతార్జాతీయ ప్రభుత్వేతర సంస్థలను పాకిస్తాన్ నమోదు చేసే విధానంపై కూడ అంతార్జాతీయ సమాజం ఆందోళన వెలిబుచ్చుతోంది. దీంతో పాకిస్తాన్ ప్రజలకు మేలు చేకూర్చే ప్రముఖ, గౌరవనీయ సంస్థల సామర్ధ్యం పై ప్రభావం ఉంటుంది .
ప్రాదేశిక, ఫెడరల్ అధికారవ్యవస్థల తోను, ఇతరభాగస్వామ్య సంస్థలతోను తాము నిత్యం సంప్రదింపుల్లో ఉంటామని వెల్స్ అన్నారు. వీరిలో పౌరసమాజ సంస్థలు, రాజకీయనాయకులు, ఉద్యమకారులు, మతపెద్దలు, పాత్రికేయులు ఉన్నారు. పాకిస్తాన్ ప్రజలజీవితాలను మెరుగు పరిచేందుకు పనిచేసే వీరికి ఈ సందేశం అందించి, మద్దతు తెలిపేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు అమెరికా మంత్రి వెల్స్ అన్నారు.
మత విశ్వాస ప్రాతిపదికన పాకిస్థానీలు మానవహక్కుల ఉల్లంఘన , వివక్షలకు గురవుతున్నారన్న వార్తలపై అమెరికా పరిపాలన తీవ్ర ఆందోళన వెలిబుచ్చింది. అనేకసందర్భాలలో ఆ దేశానికి చెందని సంస్థలు ఈ దుష్కార్యాలకు పాల్పడుతున్నాయి. దేశానికే పెనుముప్పు వాటిల్లేలా లష్కరే ఝాన్గవి,తెహ్రీక్ ఏ తాలిబన్ పాకిస్తాన్ వంటి తీవ్ర బీభత్సం కలిగించే ఉగ్రసంస్థలతో పాకిస్తాన్ జతకట్టిందని ఆమె పేర్కొన్నారు.
దైవదూషణ అభియోగం ఉన్న ఒక మహిళను పాకిస్తాన్ సుప్రీం కోర్టు 2018 అక్టోబర్ లో విడిచిపెట్టిన తీర్పును ,2019 జనవరిలో సమర్ధించి, ఒక ముఖ్యమైన చర్య చేబట్టింది.ఈ చర్య తో ఆ మహిళ దేసాన్ని క్షేమంగా విడిచి బయటకు వెళ్ల గలిగింది.
ఈ తీర్పు మతాలమధ్య సంయమనం పాటించాలని,మత పరంగా అల్పసంఖ్యాకుల హక్కులను తగ్గించరాదన్న ఆవశ్యకతను వక్కాణించింది. పాకిస్తాన్ లో మతస్వేచ్ఛ పెంపొందేందుకు ఈ రెండు కీలకమే.
అయితే దేశంలోని కరుడుకట్టిన మత విశ్వాసులు ఈ తీర్పు పై తీవ్రంగా విరుచుకు పడ్డారు. న్యాయస్థాన తీర్పును ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం సమర్ధించాల్సి వచ్చింది. ఈ తీర్పు పాకిస్తాన్ రాజ్యాంగానికి అనుకూలంగా వెలువడిందని ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు.
ఏదేమైనా,షియాలు,అహమదియాలు వంటి మైనారిటీ వర్గాలపై పాకిస్తాన్ చట్టాలు,విధానాలు వివక్ష కనబరుస్తూనే ఉన్నాయి.ఇస్లామాబాద్ దైవదూషణ చట్టాల అమలును కొనసాగిస్తూనే ఉండటం వల్ల డజన్ల కొద్దీ పాకిస్టానీలు, మరణశిక్ష కు గురవుతూనే ఉన్నారు,కారాగారాలలో యావజ్జివ శిక్ష అనుభవిస్తూనే ఉన్నారు. దైవదూషణ ఆరోపణతో మూకదాడులు కొనసాగుతూ ఇక్కట్లపాలు గావిస్తున్నాయి.
మొత్తంమీద పరిస్థితి అంతా, అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పొంపేను, అమెరికా అంతర్జాతీయ మతస్వేచ్ఛ చట్టం 2018 మేరకు ఒక ప్రత్యేక ఆందోళన కలిగించే దేశంగా పాకిస్తాన్ ను పేర్కొనేలా చేసింది.
రచన : కౌశిక్ రాయ్, ఆకాశవాణి వార్తా విశ్లేషకులు
Comments
Post a Comment