Posts

Showing posts from October, 2019

దక్షిణ చైనా సముద్రం : ఒక శక్తివంతమైన క్రొత్త ఫ్లాష్ పాయింట్

చైనా, దక్షిణ సముద్రంలో రెడ్ లైన్ దాటిందని, వియత్నాం ప్రత్యేక ఆర్థిక జోన్ ని ఆక్రమించి అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించిందని ఆరోపణ ఉంది. చైనా సర్వే ఓడ, వియత్నాంకు అరవై నాటికల్ మైళ్ల దూరంలో ఉందని ఆరోపణ. ఈ చర్య, వియత్నాం ఆర్థిక భద్రతకు ముప్పు వాటిల్లే సూచన గా తోస్తోంది. నాలుగు ఎస్కార్ట్ నౌకలు వెంటరాగా, చైనా నౌక, వియత్నాం ప్రత్యేక ఆర్థిక మండలిని సర్వే చేస్తున్నదన్నది ఆరోపణ. ఆ నౌక అక్కడి నుంచి నూట రెండు కిలోమీటర్ల దూరంలోను,దక్షిణ వియత్నాం నగరం ఫుకి సముద్ర తీరం నుంచి 185 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు సమాచారం.  అంతర్జాతీయ సమావేశ తీర్మానం మేరకు, ఒక దేశపు ఆర్థిక జోన్ సాధారణంగా దాన్ని తీరం నుంచి రెండు వందల నాటికల్ మైళ్ళ దూరం వరకు విస్తరించి ఉంటుంది. ఆ ప్రాంతాల్లో ఉన్న సహజ వనరులపై సార్వభౌమ హక్కులను కలిగి ఉంటుంది. దక్షిణ చైనా సముద్రంలో వాటా ఉన్న దేశాలు తక్షణమే ఈ సర్వే నౌకను ఇతర నౌకలను ఉపసంహరించుకోవాలని చైనాని కోరవలసి ఉంది. వియత్నాం తీర ప్రాంతానికి ఓడ దగ్గరగా చేరడాన్ని బట్టి, బీజింగ్, సముద్ర సామర్థ్యాన్ని విస్తరించే ఉద్దేశ్యంలో ఉన్నట్లు కనబడుతోంది. ఈ చర్య రష్యన్ పెట్రోలియం సంస్థ...

లావాదేవీల స్థాయిని అధిగమించిన న్యూఢిల్లీ రియాద్ సంబంధాలు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ వారంలో జరిపిన సౌదీ అరేబియా పర్యటన, రియాద్ పై, ఆ దేశ సమర్థవంతమైన ప్రయోజనాలపై, భారత విధానంలో చోటు చేసుకుంటున్న మార్పులను ప్రస్ఫుటంగా తెలియజేస్తోంది .సాంప్రదాయంగా ఈ సంబంధాలు హజ్ యాత్ర, ఇంధన దిగుమతుల ఆధారంగా ఉంటుండేవి .అయితే ఈ లావాదేవీల స్థాయిని అధిగమించి రూపాంతరం చేసేలా ఇటీవల కాలంలో ఇరు దేశాలు కృషి చేస్తున్నాయి మూడవ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఇనిషియేటివ్, ఎఫ్ ఐ ఐ, లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన కీలక ఉపన్యాసం ఈ దిశలో కీలకమైనది .సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు .దావోస్ ఇన్ ద డిజర్ట్ గా కూడా వ్యవహరించే ఈ ఎఫ్ఐఐ, ఆ దేశంలో ఇంధనేతర రంగాల లో పెట్టుబడులకు, ఆర్థికపరమైన అవకాశాలను తెలియజేసే వేదికగా ఉంది. సాంప్రదాయేతర ఇంధనం, పర్యాటకం, వినోదం తదితరాల వలన, ఇంధన రంగంపై సౌదీ ఆధారపడటం తగ్గుతుంది. రెండు వేల ఇరవై నాలుగు నాటికి భారత అర్ధ వ్యవస్థ అయిదు ట్రిలియన్ల అమెరికా డాలర్లకు రూపాంతరం చేయాలన్న ప్రధానమంత్రి ఆకాంక్షకు అనుగుణంగా క్రౌన్ ప్రిన్స్ నాయకత్వంలోని ఈ చొరవలు ఏకాభిప్రాయంతో ఉన్నాయి. సౌదీ అరేబియాతో పెరుగుతున్న సంబంధాలలో భాగంగా ...

బాగ్దాదీ అంతం అరబ్ ప్రపంచం లో నూతన శకానికి దారి చూపుతుందా? 

స్వయం ప్రకటిత ఐసిస్ ఖలీఫా, అబు బకర్ అల్ బాగ్దాది మరణవార్త ఇరాక్ లోని మోసుల్ వీధుల్లో హర్షతిరేకాల్ని రేకెత్తించింది. 2014 లో ఈ చోటనే ఆ క్రూరుడు 'ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా ‘స్థాపనను ప్రకటించాడు. తదనంతరం అగుపించినవి మారణహోమాలు, సామూహికహననాలు, సామూహిక బలత్కారాలు, వీధుల్లోహింసలు, విధ్వంసాలు, వ్యక్తుల అపహరణలు, దోపిడీలు, ఒకటని యేం చెప్పాలి. మోసుల్ పట్టణాన్ని మూడు లక్షలమంది బలవంతంగా వీడి తరలిపోవాల్సి వచ్చింది. వేలాది మంది తమ ఆప్తుల్ని కోల్పోయారు గతంలో అనేకరూపాంతరాలు చెంది, యునైటెడ్ కింగ్డంతో సరిసమానమైన పరిమాణం గల సిరియా ఇరాక్ సరిహద్దుల మధ్య ఉన్న పోడుగాటి ప్రాంతాన్ని తమ అధీనం లో కి తెచ్చుకున్న ఐసిస్ ఉగ్రసంస్థ కు అధినేత అల్ బాగ్దాది. ఈయన కు చెందిన ఐసిస్, సిరియా నాగరికత పై చెరగని మరకలు మిగిల్చింది. అతడు పల్మైర పట్టణాన్ని ధ్వంసం చేసాడు. చరిత్రాత్మక అల్ నురి మసీద్ ని 2017 లో పేల్చివేసాడు. 2014 లో ఇదే ప్రాంతం లో అతడు ఇస్లామిక్ ఖలిఫా సామ్రజ్యాన్ని ప్రకటించాడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావించాలి. అమెరికా నేతృత్వం లో ఇరాక్, సిరియాలలో జరిగిన యుద్ధం, సిరియా లో సాహసోపేతంగా కుర్దులు...

18వ నామ్ సదస్సు

నామ్ ఇంకా సజీవంగా పరిఢవిల్లుతోందని ప్రపంచవ్యాప్తంగా పరిశీలకులకు తెలియజేస్తున్నట్లుగా సముద్రతీర దేశం అజేర్బైజాన్ రాజధాని బకు లో రెండురోజుల 18 వ అలీనఉద్యమ సదస్సు ముగిసింది. దాదాపు ఆరు దశాబ్దాల కంటే ముందు ఏర్పడిన నాటి నుంచి ఆ ఉద్యమానికి కేవలం శ్రద్ధాంజలి ఘటించేందుకు సమాయత్తమయే లేఖకులకు పశ్చిమ దేశాలలో కొరత లేకుండా ఉంది. అయితే వారి అభిప్రాయం తప్పని పదే పదే రుజువు కాసాగింది. వేగవంతంగా మారిపోతున్న ప్రపంచానికి అలీనఉద్యమ కొనసాగింపు అర్ధవంతమైనది అని సభ్యదేశాలకు తెలియజేసేలా ఉన్నట్లుగా అజేర్బైజాన్ ఆతిధ్యం ఇచ్చిన 18 వ సదస్సు జరిగింది. వాస్తవానికి ఇటీవలే 2011 లో నామ్ లో అజేర్బైజాన్ చేరింది. మూడవ ప్రపంచ దేశాల పక్షాన ,ఒక్కటై ,గళం వినిపించగల విశ్వాసాన్ని నామ్ వేదిక కలిగించిందని ప్రపంచ వ్యాప్తంగా నమ్మే తగినంతమంది ఇంకా ఉన్నారు.శక్తివంతమైన రాజకీయాల ప్రాబల్యం ఉన్న ప్రస్తుత ప్రపంచం లో వారూ తమగళం వినిపించగలిగేందుకు ఇది వారి కి అవకాశం కల్పిస్తున్నది. అలీనఉద్యమ వ్యవస్థాపకుల్లో ఒకరి గా భారత్,సంస్థ ప్రగతికి చారిత్రాత్మక కృషి సలిపింది. భారత్, నామ్ సూత్రాలకు,లక్ష్యాలకు కట్టుబడి ఉందన్న వాస్త...

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై అధిపత్య ధోరణి కొనసాగుతోంది. దేశం లో అల్పసంఖ్యాకుల సంఖ్య క్రమేపి తగ్గుతోంది. పాకిస్తాన్ ఏర్పడినపుడు హిందువులు, సిక్కులు, క్రిస్టియన్లు, పారసీలు, బౌద్ధులతో సహా హిందూ జనాభా 22% కాగా, నేడు ఆ దేశం లో మైనారిటీలు 4% కంటె తక్కువగా ఉన్నారు.  పాకిస్తాన్ జాతిపిత మహమ్మదాలి జిన్నా లౌకిక పాకిస్తాన్ ఆవిర్భావాన్ని ఊహించారు.ఐతే ఆయన జీవితకాలం లో కూడా మతమౌడ్య వాదులు మతపరమైన దేశ ఆవిర్భావానికి తలపడ్డారు . అది తదనంతర కాలం లో 1980 లో దేశాధ్యక్షుడు జియా ఉల్ హక్ పాలనలో మతపరమైన దేశ ఆవిర్భావంగా ముగిసింది.  దశాబ్దాలుగా అల్పసంఖ్యాక వర్గాలపై పాకిస్తాన్ లో దౌర్జన్యాల కధనాలు వినవస్తూనే ఉన్నాయి.పురాతన చట్టాలు, పనికి మాలిన ఆరోపణలు చేస్తారన్న భయాలు, మతపరమైన మైనారిటీలను తీవ్ర అభద్రతా భావానికి గురిచేసాయి.  పాకిస్తాన్ లోని మానవహక్కుల ఉల్లంఘన, మత విశ్వాసం ప్రాతిపదికన అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న వివక్షలకు సంబంధించిన నివేదికల పట్ల, తాము తీవ్రంగా కలత చెందినట్లు అమెరికా పేర్కొంది. ఆ దేశ రాజ్యాంగం లో పేర్కొన్న రీతిలో చట్టాలను, స్వాతంత్ర్యాలను నిలబెట్ట వలసిందిగా వాషి...

ఎకనామిక్ విజన్ ను బలపరచిన భారత్ – అమెరికా వ్యూహాత్మక వేదిక

భారత్ – అమెరికా వ్యూహాత్మక వేదిక రెండవ సమావేశం ద్వైపాక్షిక సంబంధాలను దృఢతరం చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోది తమ ఇటీవలి అమెరికా పర్యటన సందర్భంగా వచ్చే ఐదేళ్లలో భారత్ ను 5 ట్రిలియన్ అమెరికా డాలర్ల ఆర్థిక వ్యవస్థగా చెయ్యాలన్న తమ నిర్ణయాన్ని వివరించి చెప్పారు. తన అర్థ వ్యవస్థ పరిమాణాన్ని రెట్టింపు చెయ్యాలన్న భారత్ నిర్ణయం పట్ల భారత్ – అమెరికా వ్యూహాత్మక ఫోరం ప్రతినిధి బృందం విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. భారత్ వచ్చే ఐదేళ్ల కాలం ప్రపంచానికి తదుపరి 25 ఏళ్లను నిర్వచిస్తుందని సమావేశంలో పాల్గొన్న అగ్ర కార్పొరేటు సిఐఒలు, దౌత్యవేత్తలు అంగీకరించారు. జాన్ ఛాంబర్స్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రిని కలుసుకున్న ఫోరం ప్రతినిధి బృందంలో అమెరికా ప్రచ్ఛన్న యుద్ధ శకపు దౌత్యవేత్త హెన్రీకిస్సింజర్, మాజీ అమెరికా విదేశాంగ మంత్రి కండొలిజా రైస్, అగ్రస్థాయి కార్పొరేట్ సంస్థలకు చెందిన 300 మందికి పైగా సిఈఓలు ఉన్నారు. గడచిన కొద్ది దశాబ్దాలలో భారత్ – అమెరికా దేశాల మధ్య సంబంధాలు గుణాత్మకంగా వృద్ధి చెందాయి. ఈ విషయాన్ని వాణిజ్య – పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఒప్పుకున్నారు; ద్వైపాక్షిక సంబంధాలు ప్రస్తుతం అత్యంత పరిప...

RCEP సంప్రదింపులపై కృతనిశ్చయంతో ఉన్న భారత్

నవంబరు 2 నుంచి 4వ తేదీ వరకు జరిగే తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సు ఆసియాన్ తో పాటు ఇతర సంబంధిత సమావేశాలకు ముందుగానే ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం – RCEP ఖరారుపై సంప్రదింపులు ముగుస్తాయని భావిస్తున్నారు. తద్వారా 2020లో ఈ వ్యవహారంపై లాంఛనంగా సంతకాలకు మార్గం ఏర్పడుతుంది. వచ్చే నెల మొదట్లో జరుగనున్న తూర్పు ఆసియా శిఖరాగ్ర సభలో, ఇతర సమావేశాల్లో ప్రధానమంత్రి నరేంద్రమోది పాల్గొంటారు. అజెండాలో RCEP సమావేశం ప్రధానంగా ఉంటుంది. నవంబరు 2012లో ఆరంభమైన RCEP సంప్రదింపులలో సంభాషణల భాగస్వాములైన ఆరు దేశాలు పాల్గొంటాయి. ఆగ్నేయాసియా దేశాల (ఆసియాన్) సంఘంలో భారత్, జపాను, దక్షిణ కొరియా, న్యూజిలాండు, ఆస్ట్రేలియా, చైనా దేశాలు సభ్యులుగా ఉన్నాయి. గడచిన 7 ఏళ్లలో ఆసియాన్ ఆధ్వర్యంలో నడచిన బహుముఖ సంప్రదింపులలో ప్రధానమైన ఆసియా ఆర్థిక వ్యవస్థలు పాల్గొన్నాయి. ఈ భారీ ప్రాంతీయ వాణిజ్య బ్లాకు తాజా సమావేశం బ్యాంకాకులో ఈ వారమే ముగిసింది. సంప్రదిపులకు సంబంధించి 80 శాతానికి పైగా ఒప్పందాలు పూర్తయినాయి. మొత్తం 225 ఒప్పందాలకు గాను 185 ఒప్పందాలను సంప్రదింపుల ద్వారా దేశాలు ఆమోదించినట్టు తెలుస్తోంది. కీలక అంశాలైన వస్తువులు, సేవ...

భారత యాక్ట్ ఈస్ట్ విధానం మరింత ముందుకు

రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ - ఫిలిప్పీన్స్, జపాను దేశాలలో ఇటీవల పర్యటించారు. ఈ రెండు దేశాలు కూడా భారత్ యాక్ట్ ఈస్ట్ విధానంలో ప్రధాన పాత్రధారులుగా ఉన్నాయి. పర్యటనలో భాగంగా రాష్ట్రపతి కోవింద్ తొలుత ఫిలిప్పీన్స్ సందర్శించారు. దౌత్య సంబంధాల 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ పర్యటన జరిపారు. అనంతరం రాష్ట్రపతి చక్రవర్తి నరుహిటో పట్టాభిషేక మహోత్సవానికి హాజరయ్యేందుకు జపాను వెళ్ళారు. ఒకేరకమైన విలువలు, పరస్పర వ్యూహాత్మక ప్రయోజనాల దృష్ట్యా భారత యాక్ట్ ఈస్ట్ విధానంలో ఫిలిప్పీన్స్ ప్రధాన భూమిక వహిస్తోంది. నిబంధనల ఆధారిత ప్రపంచ క్రమాన్ని బట్టి అంతర్జాతీయంగా దేశాల శాంతి - సార్వభౌమ సమానత్వాలను నిలిపివుంచటంలో భారత్ - ఫిలిప్పీన్స్ దేశాలు రెండు కూడా సహజ భాగస్వాములుగా ఉన్నాయి.  దక్షిణ - దక్షిణ సహకారం పైనా సుదృఢ ప్రజాస్వామ్య పాలిటీ ఆధారంగా ఏర్పడిన ఇరు దేశాల సంబంధాలు యాక్ట్ ఈస్ట్ విధానం చట్రం పరిధిలో మరింత బలపడి వేగం పుంజుకున్నాయి. రాష్ట్రపతి సందర్శన సందర్భంగా సంతకాలు జరిగిన నాలుగు కొత్త ఒప్పందాల వల్ల భారత - ఫిలిప్పీన్స్ సంబంధాలు ఇంకా పటిష్ఠంగా, లోతుగా మారాయి. సముద్ర ప్రాంత భద్రత, పర్యాటకం, ...

74 వసంతాల యునైటెడ్ నేషన్స్

భారత్ లో 1948 నించి యునైటెడ్ నేషన్స్ దినోత్సవాన్ని ప్రతి ఏటా అక్టోబరు 24వ తేదీన జరుపుకుంటారు. శాన్ ఫ్రాన్సిస్కోలో జరగిన సమావేశంలో 50 సంస్థాపక సభ్యదేశాలలో ఒకటిగా UN ఛార్టర్ పై భారత్ 1945 జూన్ 26న సంతకం చేసింది. ఐదుగురు ప్రాథమిక శాశ్వత సభ్యులతో పాటు సంతకాలు చేసిన అత్యధిక దేశాల ఆమోదంతో 1945 అక్టోబరు 24న తేదీన ఛార్టరు అమల్లోకి వచ్చింది. అక్టోబరు 31, 1947లో జరిగిన UN సర్వ ప్రతినిధి సభ సమావేశంలో అక్టోబరు 24వ తేదీని ఐక్యరాజ్య సమితి దినంగా ప్రకటిస్తూ తీర్మానం ఆమోదించారు. ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు, సాధించిన విజయాలను ప్రముఖంగా చెప్పి ఈ సార్వత్రిక అంతర ప్రభుత్వ సంస్థ చేస్తున్న పనికి సుస్థిర మద్దతు అందించాలనేది దీని ముఖ్యోద్దేశం. బ్రిటీష్ వలసపాలన నుండి భారత్ 1947 ఆగస్టు 15వ తేదీన విముక్తి పొందింది. స్వాతంత్య్రం సిద్ధించిన రెండు నెలల లోపునే UN దినోత్సవ తీర్మానం లక్ష్యాలకు అనుగుణంగా పని చేసే గొప్ప అవకాశం భారత్ లభించింది. గడచిన 72 ఏళ్ళలో ఐక్యరాజ్యసమితి 3 ప్రధాన విజయాలు సాధించింది. వలస పాలన రద్దు, సుస్థిరాభివృద్ధికి సార్వత్రిక ప్రణాళిక, ప్రాథమిక మానవ హక్కులు - స్వతంత్రాలను నిలిపే తొలి న...

అంశం : భారీ మొత్తంలో వంటగ్యాసు (LPG) దిగుమతులపై భారత్ – బంగ్లాదేశ్ మధ్య అవగాహన ఒప్పందం (MOU)

బంగ్లాదేశ్ భారీ మొత్తంలో వంటగ్యాసు – LPG దిగుమతులపై భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాల మధ్య ఇటీవల కుదిరిన అవగాహన ఒప్పందం ఒక ప్రధానమైన మైలురాయిగా నిలుస్తుంది. దీనివల్ల ఇరు పొరుగు దేశాల నడుమ పరస్పర సంబంధాలు మరింత పటిష్ఠమవుతాయి. ఈశాన్య రాష్ట్రమైన త్రిపురకు వంటగ్యాసు సరఫరా సాఫీగా జరిగేలా చూసే ప్రత్యేక సవాలును మదుర్కొనేందుకుగాను భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ తో ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించింది. పరస్పర కష్టాలను అర్థం చేసుకొని వాటిని తీర్చే మార్గాలను కనుగొనటంలో ఇరుదేశాల మధ్య పెరుగుతున్న సుహృద్భావ వాతావరణానికి ఇది అద్దం పడుతుంది. బంగ్లాదేశ్ నుంచి భారత సరిహద్దు రాష్ట్రానికి భారీ మొత్తంలో LPG దిగుమతి ద్వారా ఏడాది పొడవునా LPG సరఫరా జరగటమేకాక రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి; సమయం కూడా కలసి వస్తుంది. ప్రస్తుతం త్రిపుర రాష్ట్రానికి గౌహతి నుంచి మేఘాలయ లేదా సిల్చార్ (287 కి.మీ) మీదుగా LPG సరఫరా జరుగుతున్నాయి. గౌహతి నించి బయలుదేరే LPG ట్యాంకర్లు 600 కిలోమీటర్ల సుదూర ప్రయాణం ఎంతో క్లిష్టంగా వుంటుంది. కొండలు, కొండ చరియలు విరిగిపడే ప్రమాదం వున్న మార్గాల ద్వారా అవి ప్రయాణించాలి. ఇ...

అంశం : FATF హెచ్చరిక అనంతరం గ్రే లిస్ట్ లోనే పాకిస్థాన్ కొనసాగింపు

కశ్మీర్ ఆక్రమిత పాకిస్థాన్ లో కొన్ని సైనిక స్థావరాలు, ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను లక్ష్యంగా చేసుకుని భారత్ సైన్యం కాల్పులు జరిపింది. నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ అతిక్రమించటంతో అందుకు ప్రతిగా భారత్ ఈ చర్యకు దిగింది. ఈ సందర్భంగా పలువురు పాకిస్థాన్ సైనికులతో పాటు ఉగ్రవాదులు హతమయ్యారని భారత సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్ చెప్పారు. ముఖ్యంగా జమ్ము-కశ్మీర్ లో 370 అధికరణ రద్దు తర్వాత పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు పాల్పడుతోంది. కశ్మీరు అంశంపై అంతర్జాతీయ సమాజం నుంచి సానుభూతిని కూడగట్టడంలో ఇస్లామాబాద్ ఘోరంగా విఫలమైంది. ఇక చేసేది లేక నిస్సహాయ స్థితిలో ఇటువంటి ఉల్లంఘనలకు, ఉగ్రవాదుల చొరబాట్లకు పాల్పడుతోంది. అయితే దాని చర్యలన్నింటినీ భారత సైనిక దళాలు సమర్ధంగా విజయవంతంగా తిప్పికొడుతున్నాయి. ఇలా ఉండగా పారిస్ లో జరిగిన ఆర్థిక కార్యాచరణ టాస్కుఫోర్సు - FATF – ప్లీనరీ సమావేశంలో పాకిస్థాన్ ను ఫిబ్రివరి 2020 వరకు తన త్రిశంకు జాబితా – గ్రేలిస్ట్ లో కొనసాగించాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ విధంగా ఉగ్రవాదులకు ఆర్థిక సహాయాన్నీ, ఉగ్రవాదులు వారి సంస్థలచే మనీలాండరింగునూ గట్ట...

క‌ర్తార్‌పూర్ మార్గం... రాక‌పోక‌లకు సిద్ధం

భార‌త్‌, పాకిస్థాన్‌ల మ‌ధ్య ద్వైపాక్షిక ఉద్రిక్త‌త‌ల నడుమ క‌ర్తార్‌పూర్ సాహిబ్ మార్గంలో యాత్రికుల రాక‌పోక‌ల‌కు రెండు దేశాలూ అంగీకారానికి వ‌చ్చాయి. పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రం న‌రోవాల్ జిల్లాలోగ‌ల ద‌ర్బార్ సాహిబ్ గురుద్వారాలో ప్రార్థ‌న‌ల కోసం సిక్కులు ఈ మార్గంలోనే వెళ్లాల్సి ఉంటుంది. సిక్కుమ‌త ఆవిష్క‌ర్త శ్రీ గురునాన‌క్ దేవ్ నివ‌సించిన ప్ర‌దేశ‌మే క‌ర్తార్‌పూర్ సాహిబ్. సిక్కుల ఆరాధ్య‌దైవమైన గురునాన‌క్ 18 ఏళ్ల‌పాటు ప్రబోధం చేయ‌డ‌మేకాకుండా తుదిశ్వాస విడిచింది కూడా అక్క‌డే కావ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో సిక్కుల తొలి గురువు నాన‌క్ 550వ జ‌యంతి సంద‌ర్భంగా న‌వంబ‌రులో క‌ర్తార్‌పూర్ మార్గాన్ని తిరిగి తెర‌వ‌బోతుండ‌టం విశేషం. ఈ మార్గంలో నాలుగు వ‌రుస‌ల ర‌హ‌దారి నిర్మాణాన్ని భార‌త ప్ర‌భుత్వం నిరుడు న‌వంబ‌రులో పూర్తిచేసింది. మన దేశ పరిధిలోని గురుదాస్‌పూర్ జిల్లాలోగ‌ల డేరా బాబా నాన‌క్ నుంచి ప్రారంభ‌మై అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దు వ‌ర‌కూ ఈ రహదారి సాగుతుంది. పాకిస్థాన్‌లోగ‌ల‌ సుమారు 173 సిక్కు ప్రార్థ‌న స్థ‌లాల్లో కొన్ని మాత్ర‌మే సిక్కు యాత్రికుల‌కు అందుబాటులో ఉన్నాయి. భార‌త‌-పాకిస్థాన్‌ల మ‌ధ్య 1974లో కు...

అలీనోద్యమం ముందున్న సవాళ్లు

ఒకనాడు ప్రపంచ దృష్టిని ఆకర్షించిన అలీనోద్యమం-NAMకు నేడు ఆ గుర్తింపు లభించడంలేదు. ఇలాంటి నేపథ్యంలో నామ్ 18వ శిఖరాగ్ర సదస్సుకు వచ్చేవారం అజ‌ర్‌బైజాన్‌ ఆతిథ్యమివ్వనుంది. అయితే ఇప్పటి పరిస్థితిరీత్యా అలీనోద్యమం తన ఔచిత్యాన్ని కోల్పోయినట్లు భావించరాదు. ప్రపంచవ్యాప్తంగా అధికార శక్తిలో మార్పులు అంతర్జాతీయ సంబంధాల్లో కొత్త కూటమికి దారితీయడమే అలీనోద్యమంపై ఉదాసీనతకు కారణం. అట్లాంటిక్ శకం అంతమవుతూ, ఆసియా శతాబ్ది ఆవిష్కృతమవుతున్న పరిస్థితుల్లో ప్రపంచం నేడు కొత్త భౌగోళిక-రాజకీయ మార్పులకు సాక్షీభూతంగా మారింది. ఓ నిపుణుడి అభిప్రాయం ప్రకారం... వాస్తవానికి 21వ శతాబ్దంలో ప్రాంతీయ, అంతర్జాతీయ సంస్థల విస్తరణ ఫలితంగా ‘‘కూటమి-శూన్య ప్రపంచం’’ ఏర్పడింది. ఏ వాస్తవ అంతర్జాతీయ అంశాన్నయినా ముందుకు తీసుకెళ్లగల రాజకీయ, ఆర్థిక, వ్యూహాత్మక ఏకీకరణ శక్తి ఏ ఒక్క దేశం లేదా కూటమికి లేదన్నదే ‘కూటమి-శూన్య ప్రపంచం’లోని అంతర్లీన సందేశం! భారత అగ్రశ్రేణి వ్యూహ నిపుణులు కొన్నేళ్ల కిందట అలీనోద్యమం 2.0 పేరిట ఒక పత్రాన్ని రూపొందించారు. మన దేశం అలీనోద్యమ మూల సిద్ధాంతాలకు కట్టుబడినందువల్ల ప్రపంచ యవనికపై భారత్ కీలకపాత్ర పోషిస్తూ ...

సమున్నత స్థాయికి భారత-డచ్ సంబంధాలు

భారత్-నెదర్లాండ్స్ స్నేహానుబంధం 17వ శతాబ్దం నాటిది కావడంవల్ల రెండు దేశాల మధ్య సంబంధాలకు సుదీర్ఘ చారిత్రక నేపథ్యం ఉంది. భారతదేశానికి 1947లో స్వాతంత్ర్యం వచ్చాక రెండు దేశాల నడుమ అధికారిక దౌత్య సంబంధాలు మొదలయ్యాయి. ఆ క్రమంలో ఆర్థిక సంబంధాలు 1970-1980 దశాబ్దాల మధ్య నిలకడగా పెరుగుతూ వచ్చినా 1990 దశకంలో భారత ఆర్థిక వ్యవస్థ సరళీకరణతో వేగం అందుకున్నాయి. తదుపరి కాలంలో రెండువైపుల నుంచీ ఉన్నతస్థాయి పర్యటనలతో రాజకీయ సంబంధాలు ఇనుమడించాయి. దీనివల్ల రాజకీయంగా, ఆర్థిక, సామాజిక-సాంస్కృతిక స్థాయులలోనూ ద్వైపాక్షిక సంబంధాలు ఊపందుకున్నాయి. డచ్ ప్రధానమంత్రి ‘యాన్ పీటర్ బాల్కనెండ’ 2006లో భారతదేశాన్ని సందర్శించారు. ఆ తర్వాత గడచిన నాలుగేళ్లుగా ప్రధానమంత్రుల స్థాయిలో రెండు దేశాల మధ్య మూడు పర్యటనలు జరిగాయి. ఇందులో భాగంగా 2018 మే నెలలో నెదర్లాండ్స్ ప్రధానమంత్రి ‘మార్క్ రట్టే’ అతిపెద్ద వాణిజ్య బృందంతో భార‌త్‌లో పర్యటించారు. రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాల్లో పెరుగుదలను ఈ పర్యటన ప్రస్ఫుటం చేసింది. డచ్ రాజదంపతులు విలెమ్ అలెగ్జాండర్, మాగ్జిమా ఇటీవల ఐదు రోజులపాటు భార‌త్‌లో పర్యటించారు. నెదర్లాండ్స్ రాజుగా 2013లో పట్ట...

సిరియాలో టర్కీ దాడిపై అంతర్జాతీయ అసమ్మతికి ట్రంప్ సంకేతాలు

టర్కీపై ఆంక్షల విధింపు దిశగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం నిత్య కల్లోల మధ్యప్రాచ్యాన్ని కుదిపేసింది. కుర్దులకు మద్దతుగా పంపిన తమ సైనిక బలగాలను సిరియా నుంచి ఉపసంహరించాలని ఆయన నిర్ణయించిన కొద్ది రోజుల్లోనే తాజా నిర్ణయం వెలువడటం గమనార్హం. కుర్దు ఆధిపత్య సిరియా ప్రజాస్వామ్య బలగాలు-SDFతో నిమిత్తం లేకుండా తటస్థ ప్రాంతం సృష్టించే యోచనతో సిరియాలో టర్కీ దాడికి దిగడంపై ట్రంప్ ఆగ్రహాన్ని ఆయన తాజా నిర్ణయం ప్రతిబింబించింది. అయితే, తమ దేశంలోని కుర్దిష్ వర్కర్స్ పార్టీ-PKKతో సంబంధాలు నెరపుతున్న SDFను టర్కీ అధ్యక్షుడు ‘రెజిప్ తయ్యిప్ ఎడుడాన్’ ఉగ్రవాద సంస్థగా పరిగణిస్తున్నారు. ఆ మేరకు సిరియాలో కుర్దులపై దాడిద్వారా టర్కీలో వారి ప్రభావాన్ని పరిమితం చేయాలని ఆయన భావిస్తున్నారు. మరోవైపు ‘సిరియాలో పరిస్థితిని ఇతర దేశాలకు స్పష్టంచేసే’ పేరిట అక్కడి నుంచి తమ దళాల ఉపసంహరణకు అధ్యక్షుడు ట్రంప్ హఠాత్తుగా నిర్ణయించారు. కానీ, సిరియాలో కరడుగట్టిన ఐసిస్-ISIS ఉగ్రవాద సంస్థను సైనికంగా నిర్వీర్యం చేయడంలో ప్రధాన బలగంగా వ్యవహరించిన సిరియా-ఇరాక్ కుర్దులు మాత్రం అమెరికా తాజా నిర్ణయం తమను వంచించడమేనని అభిప్ర...

కొమురోస్, సియెర్రా లియోన్ దేశాలతో భారత్ సంబంధాలు పటిష్ఠం

ఆఫ్రికా ఖండంతో స్నేహ సంబంధాలను మరింత పటిష్ఠం చేసుకోవడం లక్ష్యంగా భారత ఉప రాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్యనాయుడు కొమొరోస్, సియెర్రా లియోన్ దేశాల్లో పర్యటించారు. సముద్రతీర పొరుగు దేశమైన కొమొరోస్ ప్రజలతో తన పురోగమన అనుభవాలను పంచుకునేందుకు భారత్ సిద్ధమైంది. అంతేకాకుండా కొమొరోస్ ప్రగతిలో ముఖ్యమైన భాగస్వామి కావాలని కూడా భారత్ ఆకాంక్షిస్తోంది. ఈ నేపథ్యంలో దేశాధ్యక్షుడు ‘అజలీ అసుమని’తో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంభాషించారు. ఈ సందర్భంగా అనేక ఉత్తేజపూర్వక అవకాశాలపై నాయకులిద్దరూ చర్చించారు. తదనుగుణంగా ఆరోగ్య, పునరుత్పాదక ఇంధన, సమాచార సాంకేతిక, సముద్ర భద్రతసహా పలు రంగాల్లో ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాల విస్తృతిపై వారొక అంగీకారానికి వచ్చారు. అనంతరం రక్షణ రంగ సహకారంపై ఒక అవగాహన ఒప్పందంమీద సంతకాలు పూర్తయ్యాయి. దీంతోపాటు ఆరోగ్యం, సంస్కృతి సంబంధిత రంగాలపైనా ముఖ్యమైన ఒప్పందాలు కుదిరాయి. అలాగే దౌత్య, అధికారిక పాస్.పోర్టులుగల రెండు దేశాల పౌరులు స్వల్పకాలిక సందర్శనకు వచ్చినపుడు వీసా పొందాల్సిన నిబంధన నుంచి పరస్పర మినహాయింపు ఇవ్వాలని భారత్, కొమొరోస్ నిర్ణయించాయి. కొమొరోస్.లోని మొరోనీలో 18 మెగావాట్ల వ...

అత్యున్నతస్థాయి ఆర్థిక, వాణిజ్య సంభాషణల యంత్రాంగాన్ని ఏర్పాటుచేయాలనుకుంటున్న భారత్-చైనాలు

భారత ప్రధాని నరేంద్ర మోది, చైనా ప్రెసిడెంట్ గ్జి జిన్‌పింగ్‌ల మధ్య మామల్లపురంలో జరిగిన అనధికార శిఖరాగ్ర సదస్సులో అత్యున్నత స్థాయి ‘ఎకనామిక్ అండ్ ట్రేడ్ డయొలాగ్’ మెకానిజం ఏర్పాటు చేయాలన్న ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకున్నారు.ఇది భారత్, చైనాల మధ్య సరిహద్దు అంశాల గురించి మాట్లాడే స్పెషల్ రెప్రజెంటేటివ్స్ నియామక నిర్ణయం లాంటిదే. భారత ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్, చైనా ఉపాధ్యక్షుడు హు చున్ హువాలు ఈ యంత్రాంగానికి కో-ఛైయిరింగ్ వ్యవహరిస్తారు. రెండు అతిపెద్ద దేశాల మధ్య జరిగిన ఈ అనధికార సమావేశం ముఖ్యోద్దేశం అత్యున్నతస్థాయిలో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయాలన్నదే. రెండు దేశాలు కూడా ఈ యంత్రాంగ ఏర్పాటు అత్యవసర ఆవశ్యకతను గుర్తించాయి. కారణం ఒకవైపు వ్యాపార లోటు 50 బిలియన్ అమెరికన్ డాలర్లు చైనాకు అనుకూలంగా పెరిగిపోతోంది. ఈ ప్రతిపాదిత యంత్రాంగం గురించిన మరిన్ని వివరాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతోంది. భారత పరిశ్రమలు తమ అభిప్రాయాలను ముందు పెట్టే అవకాశం అనేది ఇందులో ఉంటుందా? ఈ ద్వైపాక్షిక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి ఉన్న ఒక బలమైన కారణం బహుపక్ష వేదికలైన ప్రపంచ ...

రెట్టింపు అవుతున్న ఇమ్రాన్ బాధలు

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చైనాలో రెండు రోజులు పర్యటించారు. పాక్ సైనికాధికారి జనరల్ కామర్ జావెద్ బజ్వాస్ కూడా ఒకరోజు ముందే చైనా చేరారు. ఆ దేశ సైనికాధికారి కమర్ ఝాంగ్ యుగ్జియాతో సమావేశమయ్యారు. అంతేకాదు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఉన్నతాధికారులతో కూడా సమావేశమయ్యారు. ఇమ్రాన్ ఖాన్‌తో పాటు జనరల్ బాజ్వా కూడా చైనా అధ్యక్షుడు గ్జి జిన్‌పింగ్‌తో సమావేశాల్లో పాల్గొన్నారు. అలాగే ఆ దేశ ప్రధాని లి కెకియాంగ్‌తో సమావేశంలో కూడా ఇమ్రాన్ ఖాన్‌తోపాటు సమావేశమయ్యారు. ఒక్క ఏడాదిలోనే ఇమ్రాన్ ఖాన్ మూడవసారి చైనాలో పర్యటించారు. ఆ పర్యటన సంయుక్త ప్రకటనలో రెండు దేశాలు పటిష్ట సంబంధాలు కొనసాగిస్తాయని నాయకులు ఉద్ఘాటించారు. మరింతగా పాకిస్తాన్-చైనా ఆల్-వెదర్ స్ట్రాటజిక్ కో-ఆపరేటివ్ పార్టనర్‌షిప్‌ను మరింత బలోపేతం చేసుకోవాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నాయి. తద్వారా ‘కమ్యూనిటీ ఆఫ్ షేర్డ్ ఫ్యూచర్ ఇన్ ది న్యూ ఎరా’ ‌ను నిర్మించుకోవచ్చు. అనుకున్నట్టుగానే వీరి సంయుక్త ప్రకటనలో జమ్ము, కశ్మీర్ గురించి ప్రత్యేకంగా ఒక పేరా ఉంది. ఐక్యరాజ్యసమితి తీర్మానాలను పాకిస్తాన్ ప్రస్తావించింది. ఈ తీర్మానాలు చైనాకు తెలుసు. ఆ తీర్మానాలు అమల...

మోదీ-గ్జి సమావేశం-అభివృద్ధి భాగస్వామ్యం పునరుద్ఘాటన

ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు గ్జి జిన్‌పింగ్‌ను మామల్లపురంలో సమావేశమ్యారు. ఈ అనధికార సమావేశం ఫలవంతంగా  సాగింది. ముఖ్యమైన అంశాలపై, వాటి పరిణామాలపై ఇరు దేశాల నాయకులు సూటిగా చర్చించారు. దీనివల్ల ప్రస్తుతం ప్రాంతీయంగా, గ్లోబల్గా ఉన్న అల్లకల్లోల పరిస్థితుల్లో  సుస్థిరమైన, విస్తృతమైన ద్వైపాక్షిక సంబంధాలు మరింతగా బలపడే అవకాశాలు ఉన్నాయని ఆశిస్తున్నారు.  రెండవ అనధికార సదస్సు రెండు దేశాల నాయకుల మధ్య జరిగింది. ఆసియాలోని రెండు పెద్ద దేశాలైన భారత్, చైనాలు ఈ వారాంతంలో మరింత దగ్గర అయ్యాయి. సంభాషణలు జరిపాయి. మొదటి రోజు ముఖ్యమైన వ్యూహాత్మక అంశాలు, నాగరికతా సంబంధాలు, దేశాభివృద్ధి గమనం, వాణిజ్యం, ఉగ్రవాదాలకు సంబంధించిన భద్రతా అంశాలు వంటి వాటిపై చర్చించారు. రెండవ రోజు ద్వైపాక్షిక అంశాలు, ద్వైపాక్షిక సంబంధాలు అంటే సరిహద్దు సుస్థిరత, ఉగ్రవాదం, వాణిజ్యం, పెట్టుబడులు, ఇరుదేశాల ప్రజల మధ్య సంబంధాలు వంటి వాటిపై చర్చలు జరిపారు. మామల్లాపురం దేవాలయ పర్యటన, పల్లవుల కాలం నాటి నుంచి అక్కడి నాగరికతా ప్రాధాన్యం గురించి చైనా అధ్యక్షుడితో ప్రధాని మోదీ పంచుకున్నారు. ఈమధ్యకాలంలోనే బీజింగ్ ఆసియా నా...

టర్కీ ‘ఆపరేషన్ పీస్ స్ప్రింగ్’ ఒక మోసం

టర్కీ సైన్యం ‘ఆపరేషన్ పీస్ స్ప్రింగ్’‌ను బుధవారం మూడు ప్రధాన లక్ష్యాలతో ప్రారంభించింది. సిరియాతో టర్కీ సరిహద్దుల భద్రత లక్ష్యంగా దీన్ని చేపట్టింది. తద్వారా ఆ ప్రాంతంలో పనిచేస్తున్న ఉగ్రవాదులను తటస్థం చేయడం లక్ష్యం. ఆ ప్రాంతంలో ఉగ్రవాదం మధ్య బతుకుతున్న ప్రజలను రక్షించాలన్నది దీని మరో లక్ష్యం.  అధికారిక ప్రకటనలో, ఈశాన్య సిరియాలో టర్కీ సైన్యం పాల్పడుతున్న దురాగతాలపై దృష్టి పెట్టినట్టు భారత్ పేర్కొంది. టర్కీ చర్యలు ఆ ప్రాంతంలో భద్రతపై, సుస్థిరతపై ప్రభావం చూపుతున్నాయని భారత్ అభిప్రాయపడింది. అలాగే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరుకు ఆటంకంగా నిలుస్తుంది. అంతేకాదు ఈ పరిణామాల వల్ల మానవత్వం, పౌరుల జీవనంపై తీవ్ర వ్యతిరేక పరిణామాలు చూపుతుంది. టర్కీ అదుపులో ఉంటూ వ్యవహరించాలని భారత్ సందర్భంగా పిలుపునిచ్చింది. సిరియా సార్వభౌమాధికారం, సిరియా ప్రాంతీయ సమగ్రతలకు గౌరవం ఇవ్వాలని అభిప్రాయపడింది.  గత నెల జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమావేశంలో మాట్లాడుతూ టర్కీ ప్రెసిడెంట్ ఎర్డోగన్ ఈశాన్య సిరియాలోని పరిస్థితులపైనే దృష్టిసారించారు. ఈ ప్రాంతంలో ‘సేఫ్ ఏరియా’ను సృష్టించాలని ప్రత...

భారత ఐటిఇసి భాగస్వామ్యం: సరికొత్త ఎత్తుల్లో

భాగస్వామ్య దేశాలతో అభివృద్ధి సహకారపరంగా భారత్ బద్ధురాలై ఉందని మరోసారి మనదేశం నొక్కిచెప్పింది. అది కూడా సమానత్వం, సార్వభౌమాధికారం విషయంలో పరస్పర గౌరవం వంటి విలువల ప్రాతిపదికగా సాగుతుందని వెల్లడించింది. భారత్ ఇటీవల ఇ-విద్యా భారతి, ఇ-ఆరోగ్య భారతిలతో పాటు టెలి ఎడ్యుకేషన్, టెలి-మెడిసెన్ ప్రాజక్టులను ఆఫ్రీకా కోసం ప్రారంభించింది. భారత టెక్నికల్ అండ్ ఎకనామిక్ కో-ఆపరేషన్ (ఐటిఇసి) 55 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ అతిపెద్ద ప్రాజక్టులను భారత విదేశాంగ మంత్రిత్వశాఖ చేపట్టింది.  ఈ ప్రాజక్టుల వల్ల ఆఫ్రికా విద్యార్థులు భారత ఉన్నత విద్యను వారి ఇంటి నుంచే అభ్యసించగలరు. అంతేకాదు భారత వైద్య ప్రతిభాసామర్థ్యాలను ఆఫ్రికన్ వైద్యులకు, రోగులకు కూడా ఒకే రీతిలో అందజేయగలం. అభివృద్ధి సహకారం భారత విదేశాంగ విధానంలో కీలకపాత్ర పోషిస్తుంది. భారత్ నిజమైన, వేగవంతమైన అభివృద్ధి భాగస్వామిగా నిలవాలని కోరుకుంటోంది. అంతేకాదు తన విస్తృతమైన అభివృద్ధి అనుభవాన్ని ఏడు దశాబ్దాలుగా ఆఫ్రికాతో పంచుకుంటోందని 55 ఏళ్ల ఐటిఇసి ఉత్సవాల సందర్భంగా ప్రసంగిస్తూ భారత విదేశాంగమంత్రి డాక్టర్ జైశంకర్ అన్నారు. ఐటిఇసి పాన్-ఆఫ్రిక...