భారత ఐటిఇసి భాగస్వామ్యం: సరికొత్త ఎత్తుల్లో

భాగస్వామ్య దేశాలతో అభివృద్ధి సహకారపరంగా భారత్ బద్ధురాలై ఉందని మరోసారి మనదేశం నొక్కిచెప్పింది. అది కూడా సమానత్వం, సార్వభౌమాధికారం విషయంలో పరస్పర గౌరవం వంటి విలువల ప్రాతిపదికగా సాగుతుందని వెల్లడించింది. భారత్ ఇటీవల ఇ-విద్యా భారతి, ఇ-ఆరోగ్య భారతిలతో పాటు టెలి ఎడ్యుకేషన్, టెలి-మెడిసెన్ ప్రాజక్టులను ఆఫ్రీకా కోసం ప్రారంభించింది. భారత టెక్నికల్ అండ్ ఎకనామిక్ కో-ఆపరేషన్ (ఐటిఇసి) 55 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ అతిపెద్ద ప్రాజక్టులను భారత విదేశాంగ మంత్రిత్వశాఖ చేపట్టింది. 

ఈ ప్రాజక్టుల వల్ల ఆఫ్రికా విద్యార్థులు భారత ఉన్నత విద్యను వారి ఇంటి నుంచే అభ్యసించగలరు. అంతేకాదు భారత వైద్య ప్రతిభాసామర్థ్యాలను ఆఫ్రికన్ వైద్యులకు, రోగులకు కూడా ఒకే రీతిలో అందజేయగలం. అభివృద్ధి సహకారం భారత విదేశాంగ విధానంలో కీలకపాత్ర పోషిస్తుంది. భారత్ నిజమైన, వేగవంతమైన అభివృద్ధి భాగస్వామిగా నిలవాలని కోరుకుంటోంది. అంతేకాదు తన విస్తృతమైన అభివృద్ధి అనుభవాన్ని ఏడు దశాబ్దాలుగా ఆఫ్రికాతో పంచుకుంటోందని 55 ఏళ్ల ఐటిఇసి ఉత్సవాల సందర్భంగా ప్రసంగిస్తూ భారత విదేశాంగమంత్రి డాక్టర్ జైశంకర్ అన్నారు.

ఐటిఇసి పాన్-ఆఫ్రికన్ కార్యక్రమం. ఆఫ్రికాలోని 54 దేశాలు భారత ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన డిజిటల్ విప్లవం ప్రయోజనాలను ఆఫ్రికన్ యువతకు అందేలాగ ఐటిఇసి పనిచేస్తోంది. భారత అభివృద్ధిలో సహకారంలో మానవాభివృద్ధి చాలా ముఖ్యమైంది. అంతేకాదు భారత విదేశాంగ విధానంలోనూ ఎంతో కీలకమైంది. ఐటిఇసి, ఇతర సామర్థ్య పెంపుదల కార్యక్రమాలు ప్రపంచ అభివృద్ధి, సంపదలు విడదీయలేనటువంటివనే భారత నమ్మకాన్ని అద్దంపడుతున్నాయి. భారత అభివృద్ధిలోని దశాబ్దాల ప్రతిభాసామర్థ్యాలు, సాంకేతిక నైపుణ్యాల్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉందని భారత్ ఈ సందర్భంగా స్పష్టంచేసింది. 

భారత విదేశాంగ మంత్రి డా.జైశంకర్ మాట్లాడుతూ గ్లోబల్ సౌత్ దేశాలు భారత అతిముఖ్య భాగస్వామ్య దేశాలు’ అంటూ చేసిన ప్రకటన ఈ నేపథ్యంలో ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. భారత్, ఆఫ్రికాలు కలిసి ప్రపంచంలోని 6.3 బిలియన్ ప్రజల ఆకాంక్షలకు ప్రాతినిధ్యం ఇస్తాయి. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ ‘పలు ఆఫ్రికా దేశాలతో చారిత్రక సంబంధాలన భారత్ కలిగి ఉంది. అవి వాణిజ్యపరమైనవి కావొచ్చు, సాంస్కృతికపరమైనవి కావొచ్చు’ అని పేర్కొన్నారు. అంతేకాదు ‘ మా పూర్వీకులు వలసపాలన బానిసత్వానికి వ్యతిరేకంగా తీవ్రంగా పోరాడారు. ఈరోజు, ఆఫ్రికా దేశాలతో మా సమిష్టి ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు 2.20 బిలియన్ అమెరికన్ డాలర్లు ఉంది’ అని మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. 

గత 55 సంవత్సరాల కాలంలో, ఐటిఇసి భారత విస్తృతమైన, విలక్షణమైన అభివృద్ధి పెరుగుదల, సామర్థ్య పెంపుదల, శిక్షణ ద్వారా గ్లోబల్ సౌత్‌కు చెందిన 161 భాగస్వామ్య దేశాలకు చెందిన రెండు లక్షల ప్రభుత్వ అధికారులకు, ప్రొఫెషనల్స్‌ కు భారతదేశంలోని ప్రముఖ సంస్థలలో శిక్షణ ఇస్తోంది. భారత పొరుగుదేశాలతో పాటు ఆఫ్రికన్ భాగస్వాములపై దృష్టిపెట్టింది. 12 వేల స్కాలర్‌షిప్పులను ప్రతి ఏడాది వివిధరంగాలకు చెందిన ప్రొఫెషనల్స్‌కు ఇవ్వనుంది. వాటిల్లో ఐటి, హెల్త్‌ కేర్, వ్యవసాయం, పరిపాలన, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఎనర్జీ, పార్లమెంటరీ స్టడీస్ వంటివి కొన్ని మాత్రమే . వీటిని విస్తృతంగా పెంచే దిశగా ఆలోచన ఉంది.

పరస్పరం అనుసంధానం ద్వారా భారత అభివృద్ధి సహకారం, బహుళత్వానికి మద్దతు , పరస్పరం ఆధారపడ్డం ఇవన్నీ వసుదేవ కుటుంబకం (వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ) స్ఫూర్తిని ప్రతిఫలిస్తుందని డా. జైశంకర్ ఐటిఇసి కార్యక్రమంలో అన్నారు. 

ఇటీవల ద్వైపాక్షిక పర్యటనల సమయంలో ఐటిఇసి ట్రైనింగ్ స్లాట్స్‌ కు పలు ప్రకటనలు చేశారు. అంతేకాదు బహుపాక్షిక కార్యక్రమాలు అంటే బే ఆఫ్ బెంగాల్ కార్యక్రమం అయిన మల్టీ-సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కో-ఆపరేషన్ (బిఐఎంఎస్‌టిఇసి), అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియన్ నేషన్స్ (ఎఎస్ఇఎఎన్, ఆసియాన్), కరేబియన్ కమ్యూనిటీ, ఎఫ్ఐపిఐసి వంటివాటిల్లో కూడా ప్రకటనలు చేశారు. భారత విదేశాంగ మంత్రి చెప్పినట్టు ఈ సామర్థ్య పెంపుదల ప్రయత్నాలు కూడా ప్రాంతీయ ప్రాధాన్యాలకనుగుణంగా ‘నైబర్‌హుడ్ కంట్రీస్ బీయింగ్ ఫస్ట్’ పాలసీకనుగుణంగా, అలాగే ఆఫ్రికా బీయింగ్ సెంట్రల్ అన్ని పథకాలకు అనుగుణంగా ఉండే పద్ధతిలో చేపట్టడం జరుగుతోందని భారత విదేశాంగ మంత్రి అన్నారు. 

ఐటిఇసి కింద ఆసియా, యూరప్, మధ్య ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలకు చెందిన 161 దేశాలు భారత అభివృద్ధి అనుభవాన్ని స్వతంత్ర దేశాలుగా ఏడు దశాబ్దాలలో పంచుకునేందుకు ఆహ్వానించారు. దీన్ని ప్రారంభించినప్పటి నుంచి ఈ కార్యక్రమంపై రెండు బిలియన్ అమెరికన్ డాలర్లను వెచ్చించింది. దీనివల్ల ప్రపంచంలోని వెయ్యి మంది విద్యార్థులు, ప్రొఫెషనల్స్ లబ్దిపొందారు. ప్రతి ఏటా ఈ కార్యక్రమం కింద 100 మిలియన్ అమెరికన్ డాలర్లు ఇటీవల సంవత్సరాలలో గరిష్టంగా ఖర్చు అవుతోంది.

అభివృద్ధి చెందిన దేశాలలో ప్రకృతి సంపద పుష్కలంగా ఉండడాన్ని భారత దేశం గుర్తించింది. అంతేకాదు భౌగోళిక వేర్పాటును కూడా ఎంజాయ్ చేస్తోంది. అంతేకాదు ఇవన్నీ పలు సవాళ్లను అంటే జనాభా వనరులలో అసమతుల్యత, పెరుగుతున్న అసమానతలతో పాటు పెరుగుతున్న యువత ఆకాంక్షలు, వాతావరణ మార్పులు వంటివి ఎన్నో సవాళ్లు ఉన్నాయి. ఈ సవాళ్ల నేపథ్యంలో, విదేశీ సహకారం కోసం మనం భాగస్వామ్య అవకాశాలను విస్తృతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల దిశగా వెళ్లేందుకు కలిసి పనిచేస్తూ సన్నిహితంగా ముందుకు సాగుతూ పనిచేయాలి అని డాక్టర్ జైశంకర్ అన్నారు. 

రచన: వినీత్ వాహి, పాత్రికేయులు

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన