దక్షిణ చైనా సముద్రం : ఒక శక్తివంతమైన క్రొత్త ఫ్లాష్ పాయింట్

చైనా, దక్షిణ సముద్రంలో రెడ్ లైన్ దాటిందని, వియత్నాం ప్రత్యేక ఆర్థిక జోన్ ని ఆక్రమించి అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించిందని ఆరోపణ ఉంది. చైనా సర్వే ఓడ, వియత్నాంకు అరవై నాటికల్ మైళ్ల దూరంలో ఉందని ఆరోపణ. ఈ చర్య, వియత్నాం ఆర్థిక భద్రతకు ముప్పు వాటిల్లే సూచన గా తోస్తోంది.

నాలుగు ఎస్కార్ట్ నౌకలు వెంటరాగా, చైనా నౌక, వియత్నాం ప్రత్యేక ఆర్థిక మండలిని సర్వే చేస్తున్నదన్నది ఆరోపణ. ఆ నౌక అక్కడి నుంచి నూట రెండు కిలోమీటర్ల దూరంలోను,దక్షిణ వియత్నాం నగరం ఫుకి సముద్ర తీరం నుంచి 185 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు సమాచారం. 

అంతర్జాతీయ సమావేశ తీర్మానం మేరకు, ఒక దేశపు ఆర్థిక జోన్ సాధారణంగా దాన్ని తీరం నుంచి రెండు వందల నాటికల్ మైళ్ళ దూరం వరకు విస్తరించి ఉంటుంది. ఆ ప్రాంతాల్లో ఉన్న సహజ వనరులపై సార్వభౌమ హక్కులను కలిగి ఉంటుంది. దక్షిణ చైనా సముద్రంలో వాటా ఉన్న దేశాలు తక్షణమే ఈ సర్వే నౌకను ఇతర నౌకలను ఉపసంహరించుకోవాలని చైనాని కోరవలసి ఉంది.

వియత్నాం తీర ప్రాంతానికి ఓడ దగ్గరగా చేరడాన్ని బట్టి, బీజింగ్, సముద్ర సామర్థ్యాన్ని విస్తరించే ఉద్దేశ్యంలో ఉన్నట్లు కనబడుతోంది. ఈ చర్య రష్యన్ పెట్రోలియం సంస్థ రోజ్నెఫ్ట్ భాగస్వామ్యంతో, వియత్నాం సలుపుతున్న చమురు వాయువుల అన్వేషణకు కూడా ఆటంకం కలగ జేస్తుంది.

అయితే వియత్నాం, చైనాలు, కొద్ది సంవత్సరాలుగా సముద్ర జలాల వివాదంలో ఉన్నాయి. వియత్నాం ఆర్థిక జోన్ లో, బీజింగ్ ఆక్రమణలు ఇటీవల కాలంలో మరీ ముఖ్యంగా గత కొన్ని నెలలుగా తీవ్రతరమయ్యాయి. ఈ ప్రాంతాల్లో చైనా ఆధిపత్యం గురించి అధ్యక్షుడు జీ జిన్పింగ్ కల సాకారం కావచ్చు. కమ్యూనిస్టు రిపబ్లిక్ స్థాపించిన డెబ్బై సంవత్సరాల వేడుకలతో బాటుగా ఇది జరుగవచ్చు. చైనా ఏకపక్షంగా ప్రకటించిన తొమ్మిది డాష్ లైన్, దక్షిణ చైనా సముద్రపు విస్తారమైన, యు ఆకారపు, విస్తరణను సూచిస్తుంది. ఈ ప్రాంతాల్లోనే హనోయ్ రష్యాకు, భారత్ కు చమురులో రాయితీలు అందజేస్తోంది.

యంత్రాంగాలు, సంస్థాగత ఏర్పాట్ల ద్వారా చైనా ప్రవర్తనను నిరోధించడానికి, గతంలో ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. అవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి .అయితే ఇప్పటి వరకు ఆ ప్రయత్నాలేవీ సఫలం కాలేదు. అందువల్ల శాంతి, స్థిరత్వం, దక్షిణ చైనా సముద్రంలో సంఘర్షణను నివారించడం కోసం, ఒక యంత్రాంగాన్ని రూపొందించడం కోసం, ఆసియాన్ బాధ్యత తీసుకోవచ్చు 

రెండు వేల పందొమ్మిది జూన్లో ఆసియాన్ విదేశాంగ మంత్రుల సమావేశంలో దక్షిణ చైనా సముద్రంలో బీజింగ్ కార్యకలాపాలపై ఆందోళన వెలిబుచ్చుతూ చైర్మన్ ఒక ప్రకటన చేశారు. బ్యాంకాక్ లో జరగబోయే సదస్సులో ఈ సంస్థ మరింత ఐక్యతను చూపి దక్షిణ చైనా సముద్రంలో శాంతికి స్థిరత్వానికి భంగం వాటిల్లే చర్యలకు చైనా పాల్పడకుండా ఉండేలా చూడాల్సిన అవసరం ఉంది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించి, ఆతిథ్యమిస్తున్న థాయిలాండ్, తమ ఆసియాన్ సదస్సు ముప్పై లేదు లేదా తూర్పు ఆసియా సదస్సు పధ్నాలుగు తీర్మానాల్లో దక్షిణ చైనా సముద్ర అంశాన్ని ప్రస్తావించాలి 

దక్షిణ చైనా సముద్ర సమస్యపై భారతదేశ వైఖరి ఐక్యరాజ్య సమితి సముద్ర చట్టాల తీర్మానంపై ఆధారపడి ఉంది. దక్షిణ చైనా సముద్రంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ సముద్ర వాణిజ్యంలో అంతరాయం కలిగిస్తాయని భారత్ అభిప్రాయపడింది. దక్షిణ చైనా సముద్రం ఒక ప్రధానమైన జలమార్గం. దీని ద్వారా ఏటా అయిదు ట్రిలియన్ అమెరికా డాలర్ల విలువైన వాణిజ్యం జరుగుతూ ఉంటుంది. హిందూ మహాసముద్రాన్ని దక్షిణ చైనా సముద్రంతో కలిపే మలక్కా జలసంధి, సూయజ్ కాలువ కంటే ఐదు రెట్లు చమురు పరిణామాన్ని నిర్వహిస్తోంది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ యాక్ట్ ఈస్ట్ విధానం మేరకు ఈ ప్రాంతంలోని దేశాలు ముఖ్యంగా ఇండోనేసియా, సింగపూర్, వియత్నాం, ఫిలిప్పీన్స్ లతో భారతదేశ వ్యూహాత్మక సంబంధాలు బలపడుతున్నాయి. అందువలన తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సులో దీనిని ఆశించవచ్చు .తూర్పు ఆసియా దేశాల ఉన్నత నాయకత్వం, ఆసియాన్ నాయకులు, దక్షిణ చైనా సముద్ర సమస్యలపై తీవ్రంగా ఆలోచిస్తారు. నావిగేషన్ స్వేచ్ఛ, నియమాల మేరకు సముద్ర విధానం,శాంతియుత మార్గాలద్వారా వివాదాల పరిష్కార అంశాలను భారత్ నొక్కి వక్కాణిస్తుంది.

రచన:ప్రొఫెసర్ బాలదాస్ ఘోషాల్, తూర్పుఆసియా,హిందూసముద్రాలపైని విశ్లేషకులు

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన