బాగ్దాదీ అంతం అరబ్ ప్రపంచం లో నూతన శకానికి దారి చూపుతుందా?
స్వయం ప్రకటిత ఐసిస్ ఖలీఫా, అబు బకర్ అల్ బాగ్దాది మరణవార్త ఇరాక్ లోని మోసుల్ వీధుల్లో హర్షతిరేకాల్ని రేకెత్తించింది. 2014 లో ఈ చోటనే ఆ క్రూరుడు 'ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా ‘స్థాపనను ప్రకటించాడు. తదనంతరం అగుపించినవి మారణహోమాలు, సామూహికహననాలు, సామూహిక బలత్కారాలు, వీధుల్లోహింసలు, విధ్వంసాలు, వ్యక్తుల అపహరణలు, దోపిడీలు, ఒకటని యేం చెప్పాలి. మోసుల్ పట్టణాన్ని మూడు లక్షలమంది బలవంతంగా వీడి తరలిపోవాల్సి వచ్చింది. వేలాది మంది తమ ఆప్తుల్ని కోల్పోయారు
గతంలో అనేకరూపాంతరాలు చెంది, యునైటెడ్ కింగ్డంతో సరిసమానమైన పరిమాణం గల సిరియా ఇరాక్ సరిహద్దుల మధ్య ఉన్న పోడుగాటి ప్రాంతాన్ని తమ అధీనం లో కి తెచ్చుకున్న ఐసిస్ ఉగ్రసంస్థ కు అధినేత అల్ బాగ్దాది. ఈయన కు చెందిన ఐసిస్, సిరియా నాగరికత పై చెరగని మరకలు మిగిల్చింది. అతడు పల్మైర పట్టణాన్ని ధ్వంసం చేసాడు. చరిత్రాత్మక అల్ నురి మసీద్ ని 2017 లో పేల్చివేసాడు. 2014 లో ఇదే ప్రాంతం లో అతడు ఇస్లామిక్ ఖలిఫా సామ్రజ్యాన్ని ప్రకటించాడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావించాలి. అమెరికా నేతృత్వం లో ఇరాక్, సిరియాలలో జరిగిన యుద్ధం, సిరియా లో సాహసోపేతంగా కుర్దులు సలిపిన యుద్ధం. గత రెండేళ్ళలో ఐసిస్ ప్రాభవాన్ని గణనీయంగా తగ్గించాయి.
బాగ్దాది మరణ వార్త వెలువడ్డాక, ఆ ఉగ్రవాది మరణించాడన్న వాస్తవాన్ని ప్రజలు జీర్ణించుకోలేక పోయారు.ఎందుకంటే అతడి మరణవార్త వెలువడటం ఇదే మొదటిసారి కాదు. అలాగే ఈ వార్తను అనేకులు పట్టించుకోకుండ కూడ ఉండలేకపోయారు. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయాన బాగ్దాది పిరికిపంద చావు, కుక్క చావు చచ్చాడని ప్రకటించాడు. ఐసిస్ పై పోరు సలిపి ఆ ఉగ్రసంస్థను మొత్తానికి నామరూపాలు లేకుండా చేసేయాలన్నది అమెరికా అధ్యక్షుడి అరబ్ విధానం. ఒక సొరంగం లో దాక్కున్న బాగ్దాది తాను ధరించిన ప్రేలుడుపదార్ధాలు కలిగిన చొక్కా ను పేల్చివేసుకున్నాడని ట్రంప్ ప్రకటించారు.
పాకిస్తాన్ లో ఒసామా బిన్ లాడెన్ ను మట్టుబెట్టి నట్లే అబు బకర్ అల్ బాగ్దాదిని తుదముట్టించేందుకు. అమెరికా ప్రత్యేక డెల్టా బలాగాలను వినియోగించారు. బాగ్దాదీ ఆచూకి తెలిపిన వారికి 25 మిలియన్ల అమెరికా డాలర్ల బహుమానాన్ని కూడ గతం లో ప్రకటించారు
బాగ్దాది మరణంతో ఇక ఇపుడు భౌగోళిక ఉగ్రవాదపు తీరుతెన్నులు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకునేందుకు అంతర్జాతీయ సమాజం ఆదుర్దాగా ఉంది. ఒసామా అంతమయాక కూడ ఇటువంటి ఆదుర్దా, ఆందోళనలే అప్పట్లో సర్వత్రా ఉన్న విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాలి. అయినా ఉగ్రవాదాం గ్రాఫ్ ఎక్కడా గణనీయంగా కిందకు దిగలేదు.పైగా ఆధునిక కాలపు ఉగ్రసంస్థలు అల్ నస్రా, ఐసిస్ లు అల్ ఖైదా ఆనవాళ్ళుగా ఆవిర్భావించాయి .
అల్ఖైదా బలహీనపడటంతోనే ఐసిస్ ప్రాబల్యం పెరగసాగింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థ శ్రేణులు అనేక క్రూరదాడులకు తెగబడ్డారు .బాగ్దాదీ, ఒసామాలు తమ సానుభూతిపరులను నియంత్రించినా వాస్తవానికి వారు కార్యనిర్వహకులు కారు. ప్తస్తుతం ఐసిస్ అనేక ఖండాలలో తమ నెట్ వర్క్ నెలకొల్పి తమ కార్య కలాపాలు కొనసాగిస్తోంది. నిజానికి కేంద్ర నాయకత్వ పాత్ర అల్పమే. ఐసిస్ పై బహుళ పార్శ్వ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ దిశలో కొంతమేర విజయం చేజిక్కింది. సిరియా, ఇరాక్ లలో వేలాదిగా ఐసిస్ పోరాటకుల్ని అరెస్టు చేసారు. వారిలో యూరోపియన్లు అనేకులు ఉన్నారు. వారందరిని వారి స్వంత దేశాలకు పంపీంచాలి ఐతే ఐసిస్ భావజాలానికి ప్రభావితులైన వారు వారిలో చాల మంది ఉన్నారు. వాళ్ళని తక్షణమే దారిలోకి తేవాలి
బాగ్దాది మరణంతో ఐసిస్ కధ ముగిసిపోయిందని అనుకోవడానికి వీలు లేదు. తాత్కాలికంగా కొన్నాళ్ళు స్తబ్దత నెలకొంటుంది. అయితే రాజకీయ శూన్యత, ప్రాంతం లో అస్థిరత ఉన్నన్నాళ్ళు ఐసిస్ కొనసాగుతూనే ఉంటుంది.
ఐసిస్ పై పోరు కొనసాగించాలని భారత్ అభిప్రాయపడుతోంది. ఐసిస్ ఉగ్రవాదుల దారుణాలను ప్రజలు గుర్తుంచుకోవాలి. అస్థిర దశలో ఉన్న అరబ్ ప్రపంచ రాజకీయ విధానం లో విశ్వాసాన్ని నమ్మకాన్ని తిరిగి ప్రోదుచేయాలి.
రచన: డా. ఫజర్ రహ్మాన్ సిద్దికి, పశ్చిమాసియా విశ్లేషకులు

Comments
Post a Comment