టర్కీ జోక్యాన్ని ఖండించిన భారత్
టర్కీఅధ్యక్షుడు Recep Tayyip Erdogan ఇటీవల జరిపిన పాకిస్తాన్ పర్యటన సందర్భంగా కాశ్మీర్ పరిస్థితులపై ఆందోళన వ్యక్తబరిచారు.ఇటీవల తీసుకున్న చర్యల దరిమిలా అక్కడి పరిస్థితి సంక్షోభకరంగా మారింది అన్నారు. కాశ్మీరీల అంచనాల మేరకు,ఐక్యరాజ్య సమితి తీర్మానాల మేరకు ,భారత్ పాకిస్తాన్ లు చర్చల ద్వారా కాశ్మీర్ సమస్య పరిష్కారం కావాలన్నది టర్కీ అభిప్రాయం. కాశ్మీర్ తో టర్కీ సంఘీభావాన్ని ఆయన వ్యక్త పరిచారు. మొదటి ప్రపంచ యుద్ధ కాలం లో విదేశీ అధిపత్యానికి వ్యతిరేకంగా సలిపిన టర్కీ పోరాటం తో ఆయన పోల్చారు
టర్కీ అధ్యక్షుని అభిప్రాయం పై భారత్ తీవ్రంగా స్పందించింది. ఆ దేశ రాయబారికి ఈ మేరకు ఒక demarche ని జారీ చేసింది. ఆయన వ్యాఖ్యలు చరిత్ర పై ఆయన అవగాహనరాహిత్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని, దౌత్య ప్రవర్తనకు భిన్నంగా ఉందని, టర్కీ భారత్ సంబంధాలను అవి తీవ్రంగా ప్రభావితం చేస్తాయని మన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన లో తెలియజేసింది. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాలలో టర్కీ జోక్యానికి ఈ తాజా ఉదంతం మరో ఉదాహరణ అని ఆ ప్రకటన లో పేర్కొన్నారు. భారత్ దీన్ని సంపూర్ణంగా ఆమోదయోగ్యం కానిదిగా భావిస్తోంది. పాకిస్తాన్ బేఖాతరుగా పాల్పడుతున్న సరిహద్దు ఉగ్రవాదాన్ని టర్కీ పదే పదే సమర్ధించడాన్ని న్యూఢిల్లి తిరస్కరించింది. భారత్ లో కాశ్మీర్ విడదీయరాని అంతర్భాగమని భారత్ నొక్కి ఒక్కా ణించింది. అందుచేత వెలుపలి జోక్యం సహించజాలనిది.
జమ్మూకాశ్మీర్ లో గత సంవత్సరం 370 అధికరణం రద్దు దరిమిలా టర్కీ అధ్యక్షుని విమర్శల తదనంతరం భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టర్కీ పర్యటన రద్దయింది.కాశ్మీర్ సమస్య పై పాకిస్తాన్ కు అంకారా నిరంతరాయంగా మద్దతియ్యడంతో భారత్ టర్కీ ల మధ్య ద్వైపాక్షిక బంధాలు ఇటీవలి కాలం లో ఎగుడు దిగుళ్ళు గా ఉన్నాయి. Erdogan కాశ్మీర్ సమస్య పై వ్యాఖ్యానించడం ఇది మొదటి సారి కాదు.2019 లో ఆయన ఐక్యరాజ్యసమితి సర్వ సభ్య సమావేశం లో చేసిన ప్రసంగాన్ని కూడా భారత్ ఖండించింది.కాశ్మీర్ సమస్య పై అంతగా అంతర్జాతీయ దృష్టి లేదని,ఘర్షణ ద్వారా కాక,న్యాయం,సమానత్వాల ప్రాతిపదికిన చర్చల ద్వారా పరిష్కారం కుదరాలని ఆయన అన్నారు. అధికారం చేప్పట్టిననాటి నుండి భారత్ పాకిస్తాన్ ల మధ్య మధ్యవర్తిగాఉండే ప్రయత్నం Erdogan చేస్తూనే ఉన్నారు. అయితే ఆయన ప్రమేయాన్ని న్యూ ఢిల్లీ తిరస్కరించింది. అయితే ఆయన తన సొంత రికార్డ్ ని ఒకసారి సింహావలోకనం చే సుకోవాలి.టర్కీ ప్రజలు ప్రాధమికహక్కులు ఉపయోగించుకోలేకున్నారు. కాశ్మీర్ అంశం తమ ద్వైపాక్షిక సమస్య. ఇందులో మూడవ దేశపు జోక్యాన్ని భారత్ సహించదు.370 వ అధికరణం రద్దు తరువాత కాశ్మీర్ పై పాకిస్తాన్ లేదా మరే ఇతర మూడవ దేశ జోక్యం ఐక్యరాజ్యసమితి నిబంధనల మేర చట్ట విరుద్దమవుతుంది.
పాకిస్తాన్ కు టర్కీ మద్దతు ఇయ్యడాన్ని మతపరమైన, cyprus పరమైన కోణాల్లో చూడవచ్చు. మతపరంగా ఆ రెండు దేశాలూ ఒక్కటే.
ఇటీవలే ఆ దేశాలు మలేసియా తో కలిసి ఇస్లాం పైని అపోహలను తొలగించడానికి, ఇస్లామో ఫోబియా ను ఎదుర్కొవడానికి సరితగ్గ ఒక టెలివిజన్ ఛానల్ ను ప్రారంభించడానికి అంగీకరించాయి. Cyprus సమస్య విషయానికివస్తే ఉత్తర Cyprus ను ప్రత్యే క,స్వతంత్ర దేశంగా భారత్ గుర్తించలేదు . న్యూ ఢిల్లీ,అంకారా ల మద్ధ్య ఇది ఒక సమస్యగానే మిగిలిపోయింది.Greek-Cyprus స్వాతంత్య్రం, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత, ఐక్యతలకు భారత్ మద్దతిస్తుంది. ఈ ద్వీపపు చట్టబద్ధ ప్రభుత్వంగా గుర్తించింది. అయితే పాకిస్తాన్ వైఖరి భారత్ కు భిన్నంగా ఉంది. అంతేగాక Armenia,Greece లతో న్యూఢిల్లీ కి సత్సంబంధాలు ఉన్నాయి.ఈ రెండు దేశాలతో అంకారకు చారిత్రిక సమస్యల దృష్ట్యా ఉద్రిక్త ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయి.
ఈ సమస్యలు ఉన్నా, ద్వైపాక్షికసంబంధాన్ని పునరు జ్జివింపజేసేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. 'భారత్ టర్కీ ని విలువైన స్నేహితునిగా భావిస్తుంది, మా సంబంధాలు కాల పరీక్షకు నిలిచినవి'అని ప్రధాని మోదీ 2019 జూన్ లో tweet చేశారు. కాశ్మీర్ సమస్య అంశాన్ని అంకార నిరంతరం లేవనెత్తడం ద్వైపాక్షికసంబంధాలకు అవరోధం కాగలదు. ఉగ్రవాదం పై భారత్ స్పష్టమైన వైఖరితో ఉంది.ద్వంద్వ ప్రమాణాలను పాటించదు. బలమైన మతపరమైన సామీప్యాలున్నప్పటికి ఇతరులు కూడా దౌత్య ప్రామాణికతను పాటించాలని న్యూఢిల్లీ ఆశిస్తోంది. మానవత్వమే ముఖ్యం కానీ మతం కాదు.
రచన : Dr. Indrani Talukdar, CIS & Turkey లపైని వ్యూహాత్మక విశ్లేషకులు

Comments
Post a Comment