74 వసంతాల యునైటెడ్ నేషన్స్
భారత్ లో 1948 నించి యునైటెడ్ నేషన్స్ దినోత్సవాన్ని ప్రతి ఏటా అక్టోబరు 24వ తేదీన జరుపుకుంటారు. శాన్ ఫ్రాన్సిస్కోలో జరగిన సమావేశంలో 50 సంస్థాపక సభ్యదేశాలలో ఒకటిగా UN ఛార్టర్ పై భారత్ 1945 జూన్ 26న సంతకం చేసింది. ఐదుగురు ప్రాథమిక శాశ్వత సభ్యులతో పాటు సంతకాలు చేసిన అత్యధిక దేశాల ఆమోదంతో 1945 అక్టోబరు 24న తేదీన ఛార్టరు అమల్లోకి వచ్చింది.
అక్టోబరు 31, 1947లో జరిగిన UN సర్వ ప్రతినిధి సభ సమావేశంలో అక్టోబరు 24వ తేదీని ఐక్యరాజ్య సమితి దినంగా ప్రకటిస్తూ తీర్మానం ఆమోదించారు.
ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు, సాధించిన విజయాలను ప్రముఖంగా చెప్పి ఈ సార్వత్రిక అంతర ప్రభుత్వ సంస్థ చేస్తున్న పనికి సుస్థిర మద్దతు అందించాలనేది దీని ముఖ్యోద్దేశం.
బ్రిటీష్ వలసపాలన నుండి భారత్ 1947 ఆగస్టు 15వ తేదీన విముక్తి పొందింది. స్వాతంత్య్రం సిద్ధించిన రెండు నెలల లోపునే UN దినోత్సవ తీర్మానం లక్ష్యాలకు అనుగుణంగా పని చేసే గొప్ప అవకాశం భారత్ లభించింది.
గడచిన 72 ఏళ్ళలో ఐక్యరాజ్యసమితి 3 ప్రధాన విజయాలు సాధించింది. వలస పాలన రద్దు, సుస్థిరాభివృద్ధికి సార్వత్రిక ప్రణాళిక, ప్రాథమిక మానవ హక్కులు - స్వతంత్రాలను నిలిపే తొలి నిబంధనల చట్రాల ఏర్పాటు - అనేవి UN సాధించిన ఈ మూడు విజయాలు. ప్రతి ఒక్క దానిలో భారత్ పాత్ర వహించింది.
వలస పాలన నుండి స్వాతంత్ర్యం పొందిన మొట్ట మొదటి దేశంగా భారత్ UN సర్వప్రతినిధి సభ డిసెంబరు 1960లో వలస పాలన రద్దు తీర్మానాన్ని చేపట్టడంలో ప్రధాన భూమిక వహించింది. ఈ తీర్మానం వల్ల ఐక్యరాజ్య సమితి పని తీరులో రెండు ముఖ్యమైన మార్పులకు వేదికగా మారింది. ఈ మార్పులకు నూతన స్వతంత్ర వర్థమాన దేశాలు నాంది పలికాయి.
మొట్ట మొదట స్వతంత్రం పొందిన వలస పాలన దేశంగా భారత్ 1960 డిసెంబరులో వలన పాలనపై UN సర్వ ప్రతినిధి సభ చేపట్టే ప్రక్రియను ముందుండి నడిపించింది. ఐక్యరాజ్యసమితి పనితీరులో రెండు ప్రధాన పరిణామాలకు ఈ తీర్మానం బాట వేసింది. కొత్తగా స్వతంత్రం పొంది అభివృద్ధి చెందుతున్న దేశాల ఆకాంక్షలకు అనుగుణంగా స్పందించేలా UN పని చేసేందుకు వీలుగా ఈ రెండు మార్పులను చేపట్టారు.
తొలి అలీనోద్యమ శిఖరాగ్ర సభ 1961 సెప్టెంబరులో బెల్ గ్రేడులో జరిగింది. ఈ ఉద్యమ సంస్థాపక సభ్యుల్లో ఒకటిగా భారత్ ఉంది. మొదట్లో 24గా ఉన్న ఈ దేశాల సంఖ్య ఈరోజు 122 కి చేరింది. అంతర్జాతీయ సంబంధాలలో కొత్తగా స్వాతంత్ర్యం పొందిన దేశాలు తమ సార్వభౌమాధికారాన్ని నొక్కి చెప్పే అవకాశాన్ని అలీనోద్యమం కల్పించింది.
ఇక 1964లో యునైటెడ్ నేషన్సులో 77 వర్థమాన దేశాల గ్రూపు ఏర్పాటు కావటం రెండవ పరిణామం. జి-77 ఆవిర్భావం వల్ల UN ఛార్టరులోని ప్రజలందరి ఆర్థిక సామాజిక ప్రగతిని పెంపొందించాలనే నిబద్ధత గురించి పనరోలోచించుకోవల్సిన అవసరాన్ని కల్పించినట్టయింది. కట్టుబడి వుండాలని మరోమారు చెప్పినట్లయింది.
ఫలితంగా వర్ధమాన దేశాల వేగిరమైన జాతీయాభివృద్ధి లక్ష్యాలకు మద్దతుగా 1965 UNDP ఏర్పాటు జరిగింది. 1970లో భారత్ జి-77 దేశాల తొలి అధ్యక్ష పదవి చేపట్టింది.
అభివృద్ధి, వాతావరణ మార్పు అనే సమ్మిళిత జంట లక్ష్యాల కారణంగా 2030 UN అజెండాను చేపట్టారు. సుస్థిరాభివృద్ధిపై 2015 సెప్టెంబరులో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదితో పాటు, ప్రపంచ నాయకులు చేపట్టిన ఈ అజెండా లక్ష్యం బహు పక్ష వాటాదారుల సమ్మిళిత సహకారంతో పేదరిక నిర్మూలన చేయటం.
వచ్చే సంవత్సరం జరిగే ఐక్యరాజ్యసమితి 75వ వార్షికోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు బహుముఖ ప్రయోజనాలకు ఉమ్మడి కర్తవ్యంతో పునరంకితం కావాలన్న అంశాన్ని ఎంపిక చేశాయి. అంతర్జాతీయ సహకారానికి ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ సంవత్సరం సెప్టెంబరులో జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోది తమ ప్రసంగంలో ఈ సవాళ్లకు భారతీయ ప్రతిస్పందనను స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి బహుళ ప్రయోజనాలకు, ఐక్యరాజ్యసమితికి నూతన జవసత్వాలను ఇచ్చే దిశగా సభ్య దేశాలు చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఐక్యరాజ్య సమితి దినోత్సవానికి గుర్తుగా భారతదేశం జాతీయ ప్రయోజనాల పరిరక్షణకు సమ్మిళిత వృద్ధి, బహుముఖ వ్యూహం కట్టుబడి ఉంది.
Comments
Post a Comment