టర్కీ ‘ఆపరేషన్ పీస్ స్ప్రింగ్’ ఒక మోసం

టర్కీ సైన్యం ‘ఆపరేషన్ పీస్ స్ప్రింగ్’‌ను బుధవారం మూడు ప్రధాన లక్ష్యాలతో ప్రారంభించింది. సిరియాతో టర్కీ సరిహద్దుల భద్రత లక్ష్యంగా దీన్ని చేపట్టింది. తద్వారా ఆ ప్రాంతంలో పనిచేస్తున్న ఉగ్రవాదులను తటస్థం చేయడం లక్ష్యం. ఆ ప్రాంతంలో ఉగ్రవాదం మధ్య బతుకుతున్న ప్రజలను రక్షించాలన్నది దీని మరో లక్ష్యం. 

అధికారిక ప్రకటనలో, ఈశాన్య సిరియాలో టర్కీ సైన్యం పాల్పడుతున్న దురాగతాలపై దృష్టి పెట్టినట్టు భారత్ పేర్కొంది. టర్కీ చర్యలు ఆ ప్రాంతంలో భద్రతపై, సుస్థిరతపై ప్రభావం చూపుతున్నాయని భారత్ అభిప్రాయపడింది. అలాగే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరుకు ఆటంకంగా నిలుస్తుంది. అంతేకాదు ఈ పరిణామాల వల్ల మానవత్వం, పౌరుల జీవనంపై తీవ్ర వ్యతిరేక పరిణామాలు చూపుతుంది. టర్కీ అదుపులో ఉంటూ వ్యవహరించాలని భారత్ సందర్భంగా పిలుపునిచ్చింది. సిరియా సార్వభౌమాధికారం, సిరియా ప్రాంతీయ సమగ్రతలకు గౌరవం ఇవ్వాలని అభిప్రాయపడింది. 

గత నెల జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమావేశంలో మాట్లాడుతూ టర్కీ ప్రెసిడెంట్ ఎర్డోగన్ ఈశాన్య సిరియాలోని పరిస్థితులపైనే దృష్టిసారించారు. ఈ ప్రాంతంలో ‘సేఫ్ ఏరియా’ను సృష్టించాలని ప్రతిపాదన చేశారు. అక్కడ టర్కీ కూడా సిరియా నుంచి వచ్చి ప్రస్తుతం టర్కీలో జీవిస్తున్న రెండు మిలియన్ల శరణార్థులను ఉంచవచ్చని అభిప్రాయపడ్డారు. అంతేకాదు అలాంటి సురక్షిత జోన్ ఏర్పాటు వల్ల సిరియా ప్రాంతీయ సమగ్రత అతిక్రమించినట్టు కాదని వ్యాఖ్యానించారు. 

ఏమైనప్పటికీ, టర్కీ ఏకపక్ష చర్యలు సిరియా సార్వభౌమాధికారాన్ని, ప్రాంతీయ సమగ్రతలను భంగపరుస్తోంది. ఇది ఐక్యరాజ్యసమితిని స్థాపించిన దేశాలలో ఒక దేశం. ఏకపక్షంగా టర్కీ ప్రయోగిస్తున్న సైనిక ఒత్తిడి టర్కీ ప్రెసిడెంట్ పేర్కొన్న సామరస్యం, సంభాషణలు అంటూ ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమావేశంలో చేసిన సుదీర్ఘ ప్రసంగానికి పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి. 


ఐక్యరాజ్యసమితి సభ్యదేశమైన సిరియా సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతలపై ఏకపక్షంగా సైనిక శక్తిని ప్రయోగించడం ఇది తొలిసారి కాదు. 1974 సంవత్సరంలో టర్కీ సైనిక దళాలు సైప్రస్‌పై దాడికి పాల్పడ్డాయి. 1974, నవంబరులో ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమిష్టిగా 3212 తీర్మానాన్ని చేపట్టింది. అది సైప్రస్ ప్రాంతీయ సమగ్రతకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. సైప్రస్ నుంచి విదేశీ సైన్యం విరమించుకోవాలంటూ పిలుపునిచ్చింది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి కూడా 365వ తీర్మానాన్ని 1974, డిసెంబరు 13న చేపట్టింది. ఇది ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ అన్ని సభ్యదేశాల సమైక్య అభిప్రాయాన్ని అద్దంపడుతోంది. ఇప్పటివరకూ టర్కీ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి చేపట్టిన 365వ తీర్మానాన్ని అమలు చేయలేదు. దాని సైన్యాన్ని సైప్రస్ నుంచి వెనక్కి మళ్లించలేదు. 

ఈ పర్యాయం ఈశాన్య సిరియాలో టర్కీ ఏకపక్ష సైనిక చర్యలు నాన్-స్టేట్ టెర్రరిస్ట్ యాక్టర్లకు వ్యతిరేకంగా నిర్దేశించడం జరిగింది. సిరియాలో కొనసాగుతున్న తీవ్రమైన హింసాత్మక ఘర్షణలు 2011లో ప్రారంభమయ్యాయి. ఈ మొత్తం ప్రాంతమంతా వ్యాపించాయి. ఇందులో నాన్-స్టేట్ టెర్రరిస్ట్ యాక్టర్స్ అయిన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవాంట్ (ఐఎస్ఐఎల్) వినాశకర ఉనికి సైతం అక్కడ ఏర్పాటైంది. ఐఎస్ఐఎల్‌నే దయేష్ అంటారు. 

ఈశాన్య సిరియాలో టర్కీ చర్యల వెనుక ప్రకటించిన ప్రధాన లక్ష్యం పొలిటికల్ డెమోక్రాటిక్ యూనియన్ పార్టీ లేదా పివైడిని తొలగించడం. దీన్ని టర్కీలోని కుర్దీస్తాన్ వర్కర్స్ పార్టీ లేదా పికెకె ‘సిరియన్ శాఖ’గా టర్కీ భావించింది. 1984 సంవత్సరం నుంచి పికెకె టర్కీతో సాయుధ పోరాటం చేస్తోంది. కుర్దులకు కూడా సమానహక్కులు కావాలని పికెకె ఈ సాయుధ పోరాటం చేపట్టింది. అమెరికా, యూరోపియన్ కూటమి, టర్కీలు పికెకెని ఉగ్రవాద గ్రూపుగా గుర్తిస్తోంది. 

సిరియన్ సంఘర్షణా సమయంలో, వైపిజి మిలీషియా సిరియా కుర్దిష్ జనాలపై ఆల్‌ఖైదా అనుబంధ సంస్థ ఆల్ నుస్రా ఫ్రంట్ చేసిన దాడులను విజయవంతంగా తిప్పిగొట్టింది. వైపిజి మిలీషియా సిరియన్డెమోక్రాటిక్ ఫోర్సస్‌ (ఎస్‌డిఎఫ్)కన్నా ఆధిక్యంలో ఉంది. 2015 నుంచి ఐఎస్ఐఎల్‌ని ఎదుర్కోవడానికి అమెరికా మద్దతునిచ్చింది. 

‘ఆపరేషన్ పీస్ స్రింగ్’ ఏర్పాటును సమర్థించుకుంటూ టర్కీ యుఎన్ చార్టర్‌లోని అంశాలను లేవనెత్తింది. అలాగే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలు, అంతర్జాతీయ చట్టాన్ని కూడా లేవనెత్తింది. యుఎన్ చార్టర్ 51వ అధికరణం ప్రకారం సభ్యదేశాలు స్వీయరక్షణ హక్కు సహాయాన్ని కోరాలి. అలా వారి చర్యలను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి వెంటనే నివేదించాల్సి ఉంటుంది. 

తాము చేపడుతున్న చర్యల గురించి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ప్రెసిడెంట్‌కు తెలియపరిచినట్టు టర్కీ ధృవీకరించింది. 2019 అక్టోబర్ 10 వ తేదీన జరిగిన సమావేశంలో, అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జర్మనీలు ఈశాన్య సిరియాలో యుద్ధ చర్యలకు బదులు సంభాషణలు కొనసాగించాలంటూ పిలుపునిచ్చినా కూడా, టర్కీ తను చేపట్టదలచుకున్న చర్యలను యుఎన్ భద్రతామండలికి తెలియజేసింది. టర్కీ ఈశాన్య సిరియాలో ఏకపక్షంగా చేపట్టిన సైనిక చర్యను ఐక్యరాజ్యసమితి ఆపలేకపోయింది. అంతర్జాతీయ శాంతి, భద్రతల కొనసాగింపులో పునరుద్ధరణకు నోచుకోని పాత ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అసహాయతను ఇది తెలియజేస్తోంది.


రచన: అంబాసిడర్ అశోక్ ముకర్జీ, ఐక్యరాజ్యసమితి మాజీ భారత శాశ్వత ప్రతినిధి

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన