రెట్టింపు అవుతున్న ఇమ్రాన్ బాధలు
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చైనాలో రెండు రోజులు పర్యటించారు. పాక్ సైనికాధికారి జనరల్ కామర్ జావెద్ బజ్వాస్ కూడా ఒకరోజు ముందే చైనా చేరారు. ఆ దేశ సైనికాధికారి కమర్ ఝాంగ్ యుగ్జియాతో సమావేశమయ్యారు. అంతేకాదు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఉన్నతాధికారులతో కూడా సమావేశమయ్యారు. ఇమ్రాన్ ఖాన్‌తో పాటు జనరల్ బాజ్వా కూడా చైనా అధ్యక్షుడు గ్జి జిన్‌పింగ్‌తో సమావేశాల్లో పాల్గొన్నారు. అలాగే ఆ దేశ ప్రధాని లి కెకియాంగ్‌తో సమావేశంలో కూడా ఇమ్రాన్ ఖాన్‌తోపాటు సమావేశమయ్యారు. ఒక్క ఏడాదిలోనే ఇమ్రాన్ ఖాన్ మూడవసారి చైనాలో పర్యటించారు.
ఆ పర్యటన సంయుక్త ప్రకటనలో రెండు దేశాలు పటిష్ట సంబంధాలు కొనసాగిస్తాయని నాయకులు ఉద్ఘాటించారు. మరింతగా పాకిస్తాన్-చైనా ఆల్-వెదర్ స్ట్రాటజిక్ కో-ఆపరేటివ్ పార్టనర్‌షిప్‌ను మరింత బలోపేతం చేసుకోవాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నాయి. తద్వారా ‘కమ్యూనిటీ ఆఫ్ షేర్డ్ ఫ్యూచర్ ఇన్ ది న్యూ ఎరా’ ను నిర్మించుకోవచ్చు. అనుకున్నట్టుగానే వీరి సంయుక్త ప్రకటనలో జమ్ము, కశ్మీర్ గురించి ప్రత్యేకంగా ఒక పేరా ఉంది. ఐక్యరాజ్యసమితి తీర్మానాలను పాకిస్తాన్ ప్రస్తావించింది. ఈ తీర్మానాలు చైనాకు తెలుసు. ఆ తీర్మానాలు అమలు అసాధ్యం. అందుకే బీజింగ్ ఈ సమస్యను భారత్‌తో ద్వైపాక్షికంగానే పరిష్కరించుకోవాలంటూ పాకిస్తాన్‌కు గట్టి సందేశాన్నే పంపింది.
భారత దేశంలో చైనా అధ్యక్షుడు గ్జి జిన్‌పింగ్ పర్యటన చేయడానికి కొద్ది రోజుల ముందు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చైనా సందర్శించడం గమనించాల్సిన ముఖ్య అంశం. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఎటిఎఫ్) సమావేశం పాకిస్తాన్ ఇచ్చిన మాటను ఎంతవరకూ పాటించిదన్నది గమనించి దాన్ని బట్టి దాన్ని గ్రే జాబితా నుంచి బ్లాక్ జాబితాలో చేర్చడం ఉంటుంది. చైనా అత్యున్నత నాయకత్వంతో సమావేశంలో తప్పనిసరిగా ఇమ్రాన్ ఖాన్, బజ్వాలు కశ్మీర్ అంశాన్ని తప్పనిసరిగా ఎత్తుతారు. అంతేకాదు రెండు దేశాల వైఖరి ఒకటే అనే సందేశాన్ని పాకిస్తాన్ పంపుతుందన్నది విస్పష్టం. చైనా అధ్యక్షుడు గ్జి భారత ప్రధాని నరేంద్రమోదీతో మామల్లపురంలో జరిగిన అనధికార సమావేశంలో జమ్ముకశ్మీర్ అంశాన్ని ఎత్తలేదు.
ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమావేశంలో ఇమ్రాన్ ఖాన్ ఇఛ్చిన ప్రసంగం, అలాగే ఆయన చైనా పర్యటనపై స్వదేశంలో మిశ్రమ స్పందన వచ్చింది. పాకిస్తాన్‌లోని పలువురు వ్యాఖ్యాతలు వాస్తవిక విశ్లేషణ చేశారు. పాకిస్తాన్‌లో తన రాజకీయ సుస్థిరత విషయంలో ఎంత కఠినంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నా, జమ్ముకశ్మీర్ విషయంలో భారత్ తీసుకున్న 370 రాజ్యంగ అధికరణ రద్దు విషయంలో, భారత రాజ్యాంగంలోని 35ఎ అధికరణ రద్దు విషయంలో ఇమ్రాన్ ఖాన్ ప్రయత్నాల ప్రభావం శూన్యం. అంతేకాదు జమ్ము, కశ్మీర్‌ను పునర్నిర్మించాలన్న దానిపై కూడా ఇమ్రాన్ ప్రయత్నాల ప్రభావం అస్సలు కనపడలేదు.
జులిఫికర్ ఆలీ భుట్టో, బెనజీర్ భుట్టో, నవాజ్ షరీఫ్‌ల ప్రసంగాలు కూడా కశ్మీర్ విషయంలో భారత విధాన పరంగా ఎలాంటి ప్రభావం చూపలేదని కూడా కొందరు వ్యాఖ్యానించారు. మెల్లగా గ్లోబల్ స్ట్రాటజిక్ ల్యాండ్‌స్కేప్ పెంపొందుతోంది. అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న భారత పేరుప్రతిష్టల పరంగా కక్షపూరితంగా వ్యవహరించడం , అలాగే ప్రపంచంలో భారత్ శక్తియుక్తులను గుర్తించడం, నేటి ప్రపంచ శక్తుల్లో కీలకమైందిగా భారత్‌ను చైనాతో సహా ప్రపంచ సూపర్ పవర్స్ గుర్తించడం పాకిస్తాన్‌కు మింగుడుపడడం లేదు. సరికొత్త ప్రపంచక్రమాన్ని అభివృద్ధి చేయడంలో కూడా భారత్ సహజ భాగస్వామి కావడం కూడా పాక్‌కి సరిపడ్డంలేదు.
భారత చర్యలు ఇమ్రాన్ ఖాన్‌ను స్వదేశ రాజకీయాల్లో బలహీనపరుస్తోంది. దీంతో ప్రతిపక్షం ఇమ్రానఖాన్‌ను అణచివేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇమ్రాన్ ఖాన్ రాజకీయ అమాయకత్వాన్ని ఉపయోగించుకుంటున్నారు. అతని అసమర్థతను తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. కశ్మీర్ విషయంలో భారత చర్యలను సమర్థవంతంగా అడ్డుకోలేక పోవడాన్ని ఎత్తిచూపుతున్నారు. బిల్వాల్ భుట్టో ఇమ్రాన్ ఖాన్‌పై రాజకీయ విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన్ని మలిచిన సైనికాధికారులపై విమర్శలు చేస్తున్నారు. సైన్యం చేతిలో ఇమ్రాన్ ఖాన్ తోలుబొమ్మ అని అన్నారు. కళ్లాలు పాకిస్తాన్ సైన్యాధికారుల చేతుల్లో ఉన్నాయని విమర్శలు గుప్పించారు. మౌలానా ఫజలూర్ రహ్మాన్ ఇస్లామాబాద్‌కు తన లాంగ్ మార్చ్ కార్యక్రమానికి సర్వం సిద్ధమయ్యారు. తద్వారా రాజకీయ లబ్ది పొందడానికి ప్రయత్నిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ విధానాల పట్ల ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తన ఈ కార్యక్రమంలో లేవనెత్తి రాజకీయ లబ్ది పొందడానికి సిద్ధమయ్యారు.
దేశంలో తీవ్రతరంగా ఉన్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రెవన్యూ, పెట్టుబడుల సమీకరణ పడిపోవడం వంటి అంశాలతో ఖాన్ ప్రభుత్వంపై రాజకీయ దాడులు ప్రత్యర్థులు చేస్తున్నారు. గ్లోబల్ మార్కెట్ రీసెర్చ్, కన్‌సల్టింగ్ ఫమ్‌లు ఇటీవల చేసిన ఒక సర్వేలో పాకిస్తాన్ ఆర్థిక రంగం పరంగా ప్రజల ఆత్మవిశ్వాసం తగ్గుతోందని వెల్లడైంది. పాకిస్తాన్ స్కోరు 33.8 ఉంది. భారత్‌ది చూస్తే 62.9 ఉంది. వచ్చే ఆరునెలల కాలం ఎలా ఉండబోతోందని చూస్తే చాలా నిరాశాజనకంగా ఉంది. 79 శాతం మంది ప్రజలు పాకిస్తాన్ తప్పు దోవలో వెడుతోందని అభిప్రాయపడ్డారు.
పాకిస్తాన్‌లో ఇమ్రాన్ ఖాన్ పాప్యులారిటీ అటు ఇటూ ఊగిసలాడుతూ ఉంది. మరోవైపు ప్రతిపక్షం తమ రాజకీయ అదృష్టం తిరిగి పొందే అవకాశం వస్తోందని గ్రహించింది. బిల్వాల్, నవాజ్ షరీఫ్‌లు ఫజలూర్ రెహ్మాన్ లాంగ్ మార్చ్ కు పూర్తి మద్దతును ఇవ్వడం ద్వారా ఇమ్రాన్ ఖాన్‌ని మరింత అస్థిరపరచాలని చూస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్‌కి సైన్యంతో ఉన్న సంబంధాల బలాన్ని పరీక్షిస్తున్నారు.
రచన: డా. అశోక్ బెహూరియా, సీనియర్ ఫెలో అండ్ కో-ఆర్డినేటర్, దక్షిణ ఆసియా కేంద్రం, ఐడిఎస్ఎ

Comments
Post a Comment