మోదీ-గ్జి సమావేశం-అభివృద్ధి భాగస్వామ్యం పునరుద్ఘాటన
ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు గ్జి జిన్‌పింగ్‌ను మామల్లపురంలో సమావేశమ్యారు. ఈ అనధికార సమావేశం ఫలవంతంగా సాగింది. ముఖ్యమైన అంశాలపై, వాటి పరిణామాలపై ఇరు దేశాల నాయకులు సూటిగా చర్చించారు. దీనివల్ల ప్రస్తుతం ప్రాంతీయంగా, గ్లోబల్గా ఉన్న అల్లకల్లోల పరిస్థితుల్లో సుస్థిరమైన, విస్తృతమైన ద్వైపాక్షిక సంబంధాలు మరింతగా బలపడే అవకాశాలు ఉన్నాయని ఆశిస్తున్నారు.
రెండవ అనధికార సదస్సు రెండు దేశాల నాయకుల మధ్య జరిగింది. ఆసియాలోని రెండు పెద్ద దేశాలైన భారత్, చైనాలు ఈ వారాంతంలో మరింత దగ్గర అయ్యాయి. సంభాషణలు జరిపాయి. మొదటి రోజు ముఖ్యమైన వ్యూహాత్మక అంశాలు, నాగరికతా సంబంధాలు, దేశాభివృద్ధి గమనం, వాణిజ్యం, ఉగ్రవాదాలకు సంబంధించిన భద్రతా అంశాలు వంటి వాటిపై చర్చించారు. రెండవ రోజు ద్వైపాక్షిక అంశాలు, ద్వైపాక్షిక సంబంధాలు అంటే సరిహద్దు సుస్థిరత, ఉగ్రవాదం, వాణిజ్యం, పెట్టుబడులు, ఇరుదేశాల ప్రజల మధ్య సంబంధాలు వంటి వాటిపై చర్చలు జరిపారు.
మామల్లాపురం దేవాలయ పర్యటన, పల్లవుల కాలం నాటి నుంచి అక్కడి నాగరికతా ప్రాధాన్యం గురించి చైనా అధ్యక్షుడితో ప్రధాని మోదీ పంచుకున్నారు. ఈమధ్యకాలంలోనే బీజింగ్ ఆసియా నాగరికతలపై సదస్సు నిర్వహించింది. ఇండియా ఈ సంభాషణల్లో పాల్గొనలేదు. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ సమ్మిట్లు 2017, 2019 సంవత్సరాల్లో జరిగాయి. వాటిల్లో కూడా భారత్ పాల్గొనలేదు. అయితే ఈ దిశగా అనుకూల పరిణామం చోటుచేసుకుందని తెలుస్తోంది.
పలు అంశాలపై రెండు దేశాల సుస్థిర అభిప్రాయాలను సూటిగా చర్చించాయి. భారత విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలె మాట్లాడుతూ కశ్మీర్ అంశం సమావేశంలో లేవనెత్తలేదన్నారు. అలాగే ఇటీవల న్యూయార్కులో జరిగిన సమావేశంలో చైనా క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ సంభాషణలకు సంబంధించి కూడా ఎత్తలేదు. అయితే ప్రస్తుతం వాణిజ్య వాల్యూ చెయిన్, బలహీనంగా ఉన్న ఆర్థిక పెరుగుదల రేట్లు, పెట్టుబడుల ప్రవాహం వంటి అంశాలలో నెలకొన్న అనిశ్చితుల పరిష్కారానికి, పరస్పర ప్రయోజనకరమైన అంశాలపై కలిసి పనిచేయాలని ఇరుదేశాల నాయకులు అంగీకరించారు. భారత్, చైనాలు బహుధృవ ప్రపంచ అంశాలపై, గ్లోబలైజేషన్‌ను పెంపొందించడంపై ముందుకొచ్చాయి.
విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే మాట్లాడుతూ ఉన్నత స్థాయి సంభాషణల్లో మొత్తం 17 విస్తృత అంశాలపై ఇరు దేశాల నాయకులు ఈ సమావేశాల్లో ప్రసంగించారు. వుహాన్ శిఖరాగ్ర సదస్సులో ఐదు అంశాలు చర్చకు వచ్చాయి. వాటిల్లో వ్యూహాత్మక కమ్యూనికేషన్, సరిహద్దుల సుస్థిరతా నిర్వహణ వంటివి చర్చించారు. దీనికి సరికొత్త ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే చర్యలను, వాణిజ్య లోటు అంతరాన్ని తొలగించడం, ఆఫ్ఘనిస్తాన్‌లో ఇరు దేశాలు కలిసి సమిష్టి వెంచర్లు చేపట్టడం ద్వారా వాణిజ్య లోటును భర్తీ చేయడం ఉన్నాయి. అంతేకాదు ఇరుదేశాల ప్రజల మధ్య సంబంధాలను మరింత విస్తృతం చేయాల్సి ఉంది.
ఆఫ్ఘనిస్తాన్ తప్ప మిగతా ఐదు అంశాలను మామల్లపురం సమావేశంలో పునరుద్ఘాటించారు. ఇటీవల అమెరికాలో తలెత్తిన పరిణామాల నేపథ్యంలో , తాలిబాన్‌తో ఎలాంటి ఒప్పందం చేసుకునే ప్రసక్తే లేదని యుఎస్ తెగేసి చెప్పిన నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్‌పై చర్చించకుండా వదిలిపెట్టడంతో ప్రాంతీయ భద్రతా పరిస్థితి ఆసక్తికరంగా మారింది.
భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, చైనా ఉపాధ్యక్షుడు హు చున్హువాలతో అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు విషయంలో మంచి ప్రగతి కనిపిస్తోంది. వాణిజ్యం, పెట్టుబడుల గురించి వీరిరువురు చర్చిస్తారు. వాణిజ్య లోటు వివాదాస్పదమైంది. 65 బిలియన్ అమెరికా డాలర్ల లోటు బీజింగ్‌కు అనుకూలంగా ఉంది. దాని పక్షపాత వాణిజ్య విధానాలతో ఎలాంటి చైనీస్ పెట్టుబడులు ఇండియాలో లేవు.
ఇరుదేశాల నాయకులు ప్రజల మధ్య సంబంధాల పెంపుదలను నొక్కిచెప్పారు. గత డిసెంబరులో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఇ న్యూఢిల్లీలో పర్యటించారు. అప్పుడు ‘టెన్ పిల్లార్’ ఒప్పందాన్ని చేసుకున్నారు. అందులో పర్యాటక రంగ అభివృద్ధి, రెండు దేశాలకు చెందిన యువత పరస్పర పర్యటనలు, మీడియా, థింక్ టాంక్ వేదికలు, మ్యూజియం నిర్వహణ, చైనా భాషను బోధించే ఉపాధ్యాయులు వంటి అంశాలు ఈ ఒప్పందంలో ఉన్నాయి. విదేశాంగ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ ఈ ఏడాది ఆగస్టులో బీజింగ్‌లో పర్యటించారు. ఆయన కూడా ఈ అంశాలను ప్రచారం చేశారు. కొన్ని రోజుల క్రితం, ఇండియా మరింత సరళీకృత ఇ-వీసాలను భారత పర్యటనకు వచ్చే చైనా పౌరులకు ఇవ్వాలని కూడా నిశ్చయించుకుంది.
అనధికార సమావేశం ద్వారా తెలుస్తున్నదేమిటంటే సిస్టర్-స్టేట్ సంబంధాలను తమిళనాడు, ఫుజియాన్ ప్రావిన్స్ ల మధ్య సముద్రయాన అనుసంధానం ద్వారా విస్తృత పరచుకోవాలనే సూచన కూడా ఈ సమావేశంలో వచ్చింది. సముద్రయాన అనుసంధానానికి రెండు దేశాల మధ్య పరిశోధనల లక్ష్యంగా ఒక అకాడమీని స్థాపించాల్సిన అవసరాన్ని కూడా లేవనెత్తింది.
అయితే అనధికార శిఖరాగ్ర సమావేశంలో ఎలాంటి సుస్థిర, సుసాధ్యమైన ఫలితాలేమీ చోటుచేసుకోలేదు. ఈ సమావేశం ముఖ్యోద్దేశం రెండు దేశాల మధ్య స్నేహ వాతావరణం ఏర్పడాలన్నదే. అనధికార శిఖరాగ్ర సదస్సులను తరచూ ఏర్పాటు చేయడం వల్ల రెండు దేశాల మధ్య పాజిటివ్ వాతావరణం, సంభాషణా అవకాశాలు ఏర్పడతా యి. అంతేకాదు పరస్పర అవగాహన, అర్థంచేసుకోవడం కూడా నాయకుల స్థాయిలో వుహాన్ స్పిరిట్, చెన్నై కనెక్ట్ లో మల్లే చోటుచేసుకునే అవకాశం ఉంటుందని చైనా అధ్యక్షుడు గ్జి ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. భవిష్యత్‌లో ఈ విధానాన్ని కొనసాగించాలని ఇరుదేశాల నాయకులు అంగీకరించారు. చైనా అధ్యక్షుడు గ్జి భారత ప్రధాని నరేంద్ర మోదీని మూడవ అనధికార శిఖరాగ్ర సదస్సు సందంర్భంగా చైనాలో పర్యటించవలసిందిగా ఆహ్వానించారు. ప్రధాని మోదీ గ్జి ఆహ్వానాన్ని ఆమోదించారు.

రచన: ప్రొ. శ్రీకాంత్ కొండపల్లి, ఛైర్మన్, సెంటర్ ఫర్ ఈస్ట్ ఆసియన్ స్టడీస్, జెఎన్‌యు
Comments
Post a Comment