సిరియాలో టర్కీ దాడిపై అంతర్జాతీయ అసమ్మతికి ట్రంప్ సంకేతాలు
టర్కీపై ఆంక్షల విధింపు దిశగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం నిత్య కల్లోల మధ్యప్రాచ్యాన్ని కుదిపేసింది. కుర్దులకు మద్దతుగా పంపిన తమ సైనిక బలగాలను సిరియా నుంచి ఉపసంహరించాలని ఆయన నిర్ణయించిన కొద్ది రోజుల్లోనే తాజా నిర్ణయం వెలువడటం గమనార్హం. కుర్దు ఆధిపత్య సిరియా ప్రజాస్వామ్య బలగాలు-SDFతో నిమిత్తం లేకుండా తటస్థ ప్రాంతం సృష్టించే యోచనతో సిరియాలో టర్కీ దాడికి దిగడంపై ట్రంప్ ఆగ్రహాన్ని ఆయన తాజా నిర్ణయం ప్రతిబింబించింది. అయితే, తమ దేశంలోని కుర్దిష్ వర్కర్స్ పార్టీ-PKKతో సంబంధాలు నెరపుతున్న SDFను టర్కీ అధ్యక్షుడు ‘రెజిప్ తయ్యిప్ ఎడుడాన్’ ఉగ్రవాద సంస్థగా పరిగణిస్తున్నారు. ఆ మేరకు సిరియాలో కుర్దులపై దాడిద్వారా టర్కీలో వారి ప్రభావాన్ని పరిమితం చేయాలని ఆయన భావిస్తున్నారు.
మరోవైపు ‘సిరియాలో పరిస్థితిని ఇతర దేశాలకు స్పష్టంచేసే’ పేరిట అక్కడి నుంచి తమ దళాల ఉపసంహరణకు అధ్యక్షుడు ట్రంప్ హఠాత్తుగా నిర్ణయించారు. కానీ, సిరియాలో కరడుగట్టిన ఐసిస్-ISIS ఉగ్రవాద సంస్థను సైనికంగా నిర్వీర్యం చేయడంలో ప్రధాన బలగంగా వ్యవహరించిన సిరియా-ఇరాక్ కుర్దులు మాత్రం అమెరికా తాజా నిర్ణయం తమను వంచించడమేనని అభిప్రాయపడుతున్నారు. ఐసిస్ సంపూర్ణ పరాజయంపై 2019 మార్చిలో ప్రకటన వెలువడినప్పటికీ ఆ ఉగ్రవాద సంస్థ అవశేషాలు అక్కడక్కడా మిగిలి ఉండవచ్చునన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ పరిస్థితుల నడుమ సరిహద్దులలో శూన్యాన్ని అవకాశంగా తీసుకున్న టర్కీ గతవారం ఈశాన్య సిరియాలో భారీ సైనికదాడికి దిగింది. కాగా, 3.6 మిలియన్ల సిరియా శరణార్థులు టర్కీలో తలదాచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తమ సరిహద్దునుంచి సిరియాలో 30 కిలోమీటర్ల ఆవల వారిలో కొందరికి సురక్షిత ప్రాంతం ఏర్పాటు అవసరమని ఎడుడాన్ భావిస్తున్నారు. శరణార్థులకు పునరావాస కల్పన సదుద్దేశమే అయినా, ఆ కారణంతో చేపట్టిన సైనిక చర్య వివాదాస్పదమై అంతర్జాతీయంగా దాదాపు సంపూర్ణ అసమ్మతి, ఖండనలకు దారితీసింది.
టర్కీ దాడిపై సత్వరం స్పందించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్- నాటో సభ్యత్వంగల ఆ దేశంపై వరుస ఆంక్షలను ప్రకటించారు. ఆ మేరకు టర్కీ నుంచి ఉక్కు దిగుమతులపై 50 శాతం సుంకం విధింపు పునరుద్ధరణసహా 100 బిలియన్ డాలర్ల విలువైన వాణిజ్య ఒప్పందాన్ని స్తంభింపజేశారు. అలాగే అక్రమార్జన తరలింపు, ఇరాన్ మీద అమెరికా ఆంక్షలను పాటించకపోవడం వంటి కారణాలతో టర్కీకి చెందిన అగ్రశ్రేణి బ్యాంకింగ్ సంస్థ ‘హాక్‌బ్యాంక్’పై విచారణ చేపడతామని అమెరికా న్యాయశాఖ ప్రకటించింది. అంతేకాకుండా టర్కీ రక్షణ, ఇంధన, హోంశాఖలపైనా ఆంక్షల్లో భాగంగా అమెరికాలో ఆయా మంత్రిత్వ శాఖల ఆస్తులను స్తంభింపజేయడమేగాక వాటితో లావాదేవీలను ట్రంప్ పాలన యంత్రాంగం నిషేధించింది. పైగా....
టర్కీ నాయకులు తమ విధ్వంసక, ప్రమాదకర మార్గాన్ని వీడకపోతే టర్కీ ఆర్థిక వ్యవస్థను సత్వరం నాశనం చేసే ప్రణాళిక కూడా తమవద్ద ఉందని అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. అలాగే ‘‘టర్కీ తక్షణం యుద్ధం విరమించకపోతే పరిస్థితులు విషమిస్తాయ’’ని మధ్యప్రాచ్యానికి బయల్దేరుతూ అమెరికా ఉపాధ్యక్షుడు కూడా హెచ్చరించారు. ఇక అమెరికా చట్టసభల అధికార, ప్రతిపక్ష సభ్యులు పార్టీలకతీతంగా విస్తృత ఆంక్షల విధింపును ప్రతిపాదించడం విశేషం.
సిరియాపై దాడిద్వారా అధ్యక్షుడు ఎడుడాన్ తన శత్రుసమూహాన్ని ఏకీకృతం చేశారు. ఇరాన్ మీద ట్రంప్ విధానంపై ఐరోపా సమాఖ్య ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ టర్కీపై ఆంక్షలను స్వాగతిస్తోంది. కుర్దులకు మద్దతు సంకేతాలిస్తూనే- సిరియాలో టర్కీ దాడిపై నిరసన వ్యక్తం చేస్తోంది. తమ సరిహద్దులు తెరిచి, సిరియా శరణార్థులను ఐరోపా దేశాల్లోకి వెల్లువెత్తిస్తామని టర్కీ అధ్యక్షుడు ఎడుడాన్ బెదిరిస్తూ శరణార్థి సంక్షోభంపై సమాఖ్య సామర్థ్యాన్ని సవాలు చేస్తుండటమే ఇందుకు కారణం. కాగా, టర్కీ సైనికదాడిని సిరియాతోపాటు దాని వ్యూహాత్మక మిత్రదేశం రష్యా కూడా నిలువరించలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో టర్కీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన ఆంక్షలను స్వర్గంనుంచి కురిసిన అమృత ధారలుగా సిరియా భావిస్తోంది. అయితే, ఇప్పటికే సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్ బలగాలపై పోరుకు విముఖంగా ఉన్న SDF ప్రసుతం టర్కీ దాడికి వ్యతిరేకంగా వ్యూహాత్మక ఒప్పందానికి సిద్ధమైంది.
ఏదేమైనా తన లక్ష్యాలు నెరవేరేదాకా సైనిక చర్యను కొనసాగించాలని అధ్యక్షుడు ఎడుడాన్ మొండి పట్టుదలతో ఉన్నారు. దేశంలో తన నిరంకుశత్వంపై పెరుగుతున్న వ్యతిరేకత పెనుముప్పు కావడం లేదా కొన్ని వ్యూహాత్మక ప్రయోజనాలు సిద్ధించేదాకా ఆయన దిగివచ్చే పరిస్థితి లేదు. ఇక ‘ఇరాన్, జెరూసలెం లేదా గోలన్ హైట్స్’ విషయంలో ఆయన విధానాలు వివాదాస్పదం కావడమేగాక వాటికి ప్రజామోదం కూడా స్వల్పమే. అయితే, టర్కీపై తన నిర్ణయాల మీద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జాతీయంగా, అంతర్జాతీయంగా మద్దతు పొందుతున్నారు. అదే సమయంలో ఎడుడాన్ మాత్రం అటు అరబ్, ఇటు అరబ్బేతర దేశాల నుంచి ఆగ్రహం ఎదుర్కొంటున్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు దేశీయంగా అధికార, ప్రతిపక్షాల మద్దతు లభిస్తుండగా ప్రాంతీయంగా టర్కీ ఏకాకి అవుతోంది. దీంతో రానున్న వారాల్లో టర్కీపై ఆయన ఆంక్షల కొరడాను మరింతగా ఝళిపించే అవకాశం కనిపిస్తోంది.
ఇక ఈశాన్య సిరియాలో టర్కీ ఏకపక్ష సైనిక దాడిపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. టర్కీ చర్యలతో ఆ ప్రాంతంలో సుస్థిరతకు భంగం కలగడమేగాక ఉగ్రవాదంపై పోరుకు అవరోధం ఏర్పడవచ్చునని సందేహం వెలిబుచ్చింది. అంతేగాక ఈ పరిస్థితులు మానవతావాద సంక్షోభానికి, పౌర కుంగుబాటుకు దారితీసే ప్రమాదం ఉందని స్పష్టం చేస్తోంది.

రచన: ప్రొఫెసర్ పి.ఆర్.కుమారస్వామి, పశ్చిమాసియా అధ్యయన కేంద్రం, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం
Comments
Post a Comment