అత్యున్నతస్థాయి ఆర్థిక, వాణిజ్య సంభాషణల యంత్రాంగాన్ని ఏర్పాటుచేయాలనుకుంటున్న భారత్-చైనాలు
భారత ప్రధాని నరేంద్ర మోది, చైనా ప్రెసిడెంట్ గ్జి జిన్‌పింగ్‌ల మధ్య మామల్లపురంలో జరిగిన అనధికార శిఖరాగ్ర సదస్సులో అత్యున్నత స్థాయి ‘ఎకనామిక్ అండ్ ట్రేడ్ డయొలాగ్’ మెకానిజం ఏర్పాటు చేయాలన్న ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకున్నారు.ఇది భారత్, చైనాల మధ్య సరిహద్దు అంశాల గురించి మాట్లాడే స్పెషల్ రెప్రజెంటేటివ్స్ నియామక నిర్ణయం లాంటిదే. భారత ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్, చైనా ఉపాధ్యక్షుడు హు చున్ హువాలు ఈ యంత్రాంగానికి కో-ఛైయిరింగ్ వ్యవహరిస్తారు.
రెండు అతిపెద్ద దేశాల మధ్య జరిగిన ఈ అనధికార సమావేశం ముఖ్యోద్దేశం అత్యున్నతస్థాయిలో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయాలన్నదే. రెండు దేశాలు కూడా ఈ యంత్రాంగ ఏర్పాటు అత్యవసర ఆవశ్యకతను గుర్తించాయి. కారణం ఒకవైపు వ్యాపార లోటు 50 బిలియన్ అమెరికన్ డాలర్లు చైనాకు అనుకూలంగా పెరిగిపోతోంది. ఈ ప్రతిపాదిత యంత్రాంగం గురించిన మరిన్ని వివరాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతోంది. భారత పరిశ్రమలు తమ అభిప్రాయాలను ముందు పెట్టే అవకాశం అనేది ఇందులో ఉంటుందా?
ఈ ద్వైపాక్షిక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి ఉన్న ఒక బలమైన కారణం బహుపక్ష వేదికలైన ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటివొ) వంటివి ఈ యంత్రాంగంలో చర్చించాలనుకుంటున్న అంశాలను చర్చించే పరిస్థితి లేకపోవడం. డబ్ల్యుటివొకి చెందిన వివాదాల పరిష్కార వేదికలో ప్రస్తుతం ముగ్గురు న్యాయమూర్తులు ఉన్నారు. ఈ వ్యవస్థ పనిచేయాలంటే కనీసం ఆమేరైనా వ్యక్తులు ఉండాలి. అయితే 2019 నాటికి ఇది కూలబడింది. కారణం ఆ ఇద్దరు జడ్జీలు రిటైర్‌మెంట్ దగ్గరపడ్డమే.
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖపై సమర్పించిన ఒక నివేదిక భారత-చైనా వ్యాపార అంశాలు, భారత్‌పై వాణిజ్య లోటు పెద్ద బరువుగా ఉండడం, దాదాపు 56 బిలియన్ అమెరికన్ డాలర్ల పైగా అది ఉండడం గమనించాల్సిన అంశాలు. అలాగే భారత సరుకులు, సేవలు చైనా నుంచి నాన్-టారిఫ్ ప్రతిబంధకాలను ఎదుర్కోవడం వంటివి కూడా ఎన్నో ఉన్నాయి. వీటికి తోడు సరుకులను పంపడం, చైనా వైపు నుంచి వాస్తవమైన పెట్టుబడులు లేకపోవడం వంటి వాటి వల్ల రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు సమస్యాత్మకంగా తయారయ్యాయి. భద్రతా అంశాల నుంచి కొత్త వాణిజ్య సంబంధాల కోణం ఆవిష్కరించారు. దానివల్ల ఇండియాలో హువై శక్తివంతమైన 5జి సేవలు అందుతాయి. ఇటీవల జరిగిన చైనాస్ డిజిటల్ సిల్క్ రోడ్ సదస్సును న్యూఢిల్లీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చైనీస్ స్టడీస్ నిర్వహించింది. ఆ డేటాలో హువై, జెటిఇలు టెలికమ్యూనికేషన్ రంగంలో 42 శాతం మార్కెట్ వాటా ఉంది. చైనా బ్రాండ్లు అయిన స్మార్ట్ ఫోన్లు 66 శాతం మార్కెట్ వాటాను భారత్‌లో కలిగి ఉన్నాయి. దీంతోపాటు చైనాలోని వెంచర్ పెట్టుబడిదారుల నుంచి వచ్చినవి పది బిలియన్ల అమెరికన్ డాలర్ల మించే ఉన్నాయి.
యంత్రాంగం అవసరాలు విస్తృతమైనప్పుడు ముఖ్యంగా రీజినల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్టనర్‌షిప్ (ఆర్‌సిఇపి) వంటివాటిల్లో అనుకున్నవి సాధ్యమవుతాయో లేదో చూడాలి. టెక్నాలజీ బదిలీ లేకుండానే, అలాగే ఇ-కామర్స్ పరంగా స్థానిక అవసరాల గణాంకాలు లేకుండానే చైనా సరుకులతో, పెట్టుబడులతో భారత శక్తివంతమైన మార్కెట్లు నిండిపోతున్నాయన్నది భారత్‌ని ఎంతగానో ఆలోచింపచేస్తున్న మరో విషయం. భారత ఐటి రంగంలో చైనా బలమైన మార్కెట్‌ను ఇప్పటికే కలిగి ఉంది.
ప్రతిపాదిత యంత్రాంగ రాజ్యాంగ స్వభావం గురించిన ప్రశ్నలు అలాగే ఉన్నాయి. దీనికి ఇటీవల జపాన్ అనుభవం ఉదాహరణగా ఉంది. అది ఎలాంటి ఫలితాలను చూపలేదు. 2014లో, డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రొమోషన్ (డిఐపిపి), భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలు కలిసి ‘జపాన్ ప్లస్’ అనే ప్రత్యేకమైన మేనేజ్‌మెంట్ బృందాన్ని మంచి ఫలితాలు సాధించడం కోసం ఏర్పాటుచేసింది. దీనివల్ల ఫాస్ట్ ట్రాక్ పెట్టుబడుల ప్రతిపాదనలు జపాన్ నుంచి వచ్చే అవకాశాల ఆలోచన దాగి ఉంది. ఫాస్ట్ ట్రాక్ పెట్టుబడుల వల్ల మంచి ఫలితాలు వస్తాయి. కానీ అప్పటి నుంచి పురోగతి నత్తనడకన సాగుతోంది. ప్రతిపాదిత చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కూడా పనులు ఇంకా కొనసాగుతున్నాయి. భారత్‌లోని తొమ్మిది రాష్ట్రాలలోని 12 జపాన్ ఇండస్ట్రియల్ టౌన్‌షిప్ ప్రాజక్టుల్లో కొంత పురోగతి సాధించాం. ఇండో-జపాన్ ప్రయోగంలో తలెత్తే చిన్న చిన్న ఇబ్బందులను ఎదుర్కొనేందుకు ప్రతిపాదిత యంత్రాంగాన్ని ఏర్పాటుచేయడమైంది.
ఈ ద్వైపాక్షిక యంత్రాంగం అలాంటి ఎన్నో అంశాలపై దృష్టిసారిస్తోంది. వాటిపై సంభాషణలు చేస్తోంది. ఇది ఎలాంటిదంటే చైనాతో అమెరికాకు ఉన్నతరహా లాంటిదనమాట. అమెరికా చైనాతో సరిసమానంగా బలంగా నిలిచింది. కొన్ని నష్టాలను భరాయించగలిగే స్థితిలో ఉంది. భారత్ ఈ దిశగా చైనా కన్నా కొంత అభివృద్ధి చెందాలి. సేవల రంగం, ఫార్మాస్యూటికల్ రంగాలలో భారత కంపెనీలు ప్రతిపాదిత యంత్రాంగంలో ఉన్నాయి. ఇవి బీజింగ్‌తో బేరసారాలు నడపగలగడంలో సహాయపడతాయి. భారత వాస్తవ వాణిజ్య సమస్యలను చర్చించడంలో ప్రగతి కనిపించడం ఒక మంచి సూచిక. చైనా సూచించినట్టు ‘ఎకనామిక్ అండ్ ట్రేడ్ డయలాగ్’ మెకానిజం ఇద్దరికీ లాభకర పరిస్థితులను సృష్టిస్తుంది. ప్రతిపాదిత కొత్త యంత్రాంగం ప్రతిపాదన ప్రస్తుత సమస్యలను లేవనెత్తుతుందా? లేదా కొత్త ఆర్థిక కార్యక్రమాల కోసం కొత్త రంగాలను ఎంచుకోవాలని కోరుకుంటోందా అనే అంశాలు తెలియాలంటే వేచి చూడాల్సిందే.
Comments
Post a Comment