మత స్వేచ్ఛపై అమెరికా నివేదికను కొట్టిపారేసిన భారత్
భారతదేశంలోని మత స్వేచ్ఛపై అమెరికా మరోసారి తన నివేదికలో విమర్శలు చేసింది. ఇలా భారతదేశంపై విమర్శలు చేసే నైతికాధికారం అమెరికాకు ఏం ఉంది అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. అంతర్జాతీయ మత స్వేచ్ఛపై అమెరికా రూపొందించిన నివేదికలో ఇతర దేశాల మతస్వేచ్ఛా పరిస్థితులపై దాడి చేసే విధానం అనుసరించడం కనిపిస్తుంది. దీనిపై ఇతర దేశాల తీరుకు సంబంధించి నైతిక తీర్పులను అమెరికా వెలువరిస్తోంది. ఆ నివేదికలో ‘గత ఏడాది మైనారిటీ కమ్యూనిటీలపై హింసాత్మక మూకలు దాడులకు పాల్పడ్డాయంటూ పేర్కొంది. అయితే భారత్ ఈ నివేదికను గట్టిగా కొట్టిపారేసింది. ‘మా దేశ పౌరులపై అలాంటి ప్రకటనలు చేయడానికి అమెరికాకి ఎలాంటి ‘లోకస్ స్టాండి’ లేదని భారత ప్రభుత్వం స్పష్టంచేసింది. అంతేకాదు ‘భారత్ లౌకికరాజ్యమని, దానికి ఆధారాలు ఎన్నో ఉన్నాయని పేర్కొంది. అతి పెద్ద ప్రజాస్వామిక దేశం కూడా తమదని భారత ప్రభుత్వం పేర్కొంది. భిన్న సంస్కృతుల, జాతుల, ప్రజల సమ్మేళనమని పేర్కొంది. సహనం, అందరినీ కలుపుకుపోయే సంస్కృతి భారత ప్రత్యేకతలని స్పష్టంచేసింది.
అమెరికాకు చెందిన అంతర్జాతీయ మత స్వేచ్ఛ సంఘం ఛైర్మన్ తెంజిన్ దోర్జీ ఇందుకు విరుద్ధంగా వ్యాఖ్యానించడం ఆసక్తికరం. ‘ భారత్ అన్ని మతాల వారినీ కలుపుకుపోయే సమాజం. పటిష్టమైన ప్రజాస్వామ్యం, న్యాయ వ్యవస్థ ఉన్న దేశం’ అని పేర్కొన్నారు. ఈ కమిషన్ తరచూ నివేదికలను వెలువరిస్తుంటుంది. ముఖ్యంగా మత స్వేచ్ఛ పరంగా తీవ్ర అతిక్రమణలకు పాల్పడిన దేశాలను తక్కువ చేస్తూ నివేదికలను రూపొందిస్తుంది. ట్రంప్ ప్రభుత్వం సరళిని ఈ నివేదిక ప్రతిఫలిస్తోంది. దేశీయంగా మద్దతు పొందడమే ఈ నివేదిక ప్రధాన లక్ష్యం. గత ఏడాది అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ తొలి ‘మినిస్టీరియల్ టు అడ్వాన్స్ రెలిజియస్ ఫ్రీడం’ మీద వాషింగ్టన్ డిసిలో ప్రసంగించారు. ఆ సందర్భంలో మత స్వేచ్ఛ ట్రంప్ ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతా అంశం’ అంటూ పేర్కొన్నారు. మత స్వేచ్ఛ ఎదుర్కొంటున్న పలు సవాళ్లను నివేదిక చర్చంచింది. వివిధ మత బృందాల పట్ల వివక్ష చూపిన వారిని శిక్షించడానికి సంబంధించిన అంశాలను గుర్తించి వాటిని అందులో చర్చించారు.
ఆ అంశాలు మానవహక్కులైనా, మతస్వేచ్ఛకు, పత్రికా స్వాతంత్రానికి సంబంధించినవైనా వాటి పట్ల అమెరికా వ్యవహరిస్తున్న తీరు ప్రపంచానికి తెలిసిందే. ఈ హక్కులను అమెరికా హేళన చేసిన సందర్భాలు ఉన్నాయి. తమ శత్రుదేశాలలో ఇలాంటివి జరిగినపుడు తీవ్రంగా నిందించే అమెరికా అదే తన దేశంలో లేదా తన మిత్రదేశాలలో అలాంటి నేరాలు జరుగుతున్నప్పుడు మాత్రం పెదవి విప్పదు. స్వేచ్ఛ గలవి, కొంత స్వేచ్ఛ మాత్రమే ఉన్నవి, స్వేచ్ఛ లేనివి అని మొత్తం దేశాలను మూడు రకాలుగా ‘ఫ్రీడం హౌస్’ (అంతర్జాతీయంగా పత్రికా స్వేచ్ఛకొరకు పనిచేస్తున్న లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థ) విభజించింది. ఈ సంస్థ తరచూ భారత్‌ను పత్రికా స్వేచ్చ లేని దేశాల జాబితాలో పేర్కొంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం పత్రికా స్వేచ్ఛ గురించి ఈ సంస్థ వెలువరించిన వివరాల జాబితా చూస్తే ఎవరైనా నవ్వుతారు. ఈ రిపోర్టులను పరిగణించాల్సిన అవసరం లేదు. అది ఇచ్చిన కపటమైన ముద్రను సీరియస్‌గా పట్టించుకోనవసరం లేదు.
ఇతర దేశాల ప్రజాస్వమ్య, మానవ హక్కుల రికార్డులపై నిమ్మళంగా కూర్చుని అమెరికా తీర్పులను ఇస్తుంటుంది. ఇప్పుడు అమెరికాపైనే ఫ్రీడం హౌస్ నివేదిక విమర్శల వర్షం కురిపించింది. అమెరికాలో అంతర్జాతీయ ప్రమాణాలలో ప్రజాస్వామ్యం బలోపేతంగా ఉన్నప్పటికీ కూడా ట్రంప్ ప్రభుత్వం పాలనాపరంగా కొనసాగిస్తున్న దాడుల వల్ల బలహీనపడిందని అభిప్రాయపడింది. అలాగే సత్యాలతో కూడిన జర్నలిజంపై జరుగుతున్న దాడులను పేర్కొంది. అంతేకాదు ప్రజాస్వామ్యానికి సంబంధించిన ఇతర నియమాలు, నిబంధనలపై జరుగుతున్న దాడులు అమెరికా ప్రజాస్వామ్యం మరింతగా క్షీణించే ప్రమాదాన్ని సూచిస్తోందని అభిప్రాయపడింది. ఇలాంటి దాడుల ద్వారా అమెరికా ప్రజాస్వామిక సంస్థలను ఇష్టం వచ్చినట్టు దెబ్బతీయడాన్ని చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని ఈ సందర్బంగా ఫ్రీడం హౌస్ అమెరికాను తీవ్రంగా హెచ్చరించింది.
అమెరికా ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడమ్స్ సంఘం భారత్‌ను 2009 నుంచి తన ‘వాచ్ లిస్ట్’ లో పెట్టి కొనసాగిస్తోంది. భారత విదేశాంగ వ్యవహారాల శాఖ ఈ రిపోర్టను గట్టిగా కొట్టిపడేసింది. 2015, 2016 సంవత్సరాలలో ఇది చేసిన ఆరోపణలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా కూడా భారత మత స్వేచ్ఛ, సహనాలకు సంబంధించిన రికార్డును మనదేశానికి వచ్చినపుడు సవాలు చేయడం గుర్తుండే ఉంటుంది.
ఏ దేశం కూడా తమ దగ్గర మత స్వేచ్ఛ పరంగా అతిక్రమణలు తీవ్రంగా జరిగాయన్న ఆరోపణలను ఒప్పుకోదు. అయితే భారత విషయానికి వస్తే మనదేశం బలమైన ప్రజాస్వామ్యం ఉన్న దేశం. అంతేకాదు మరింత పటిష్టమైన న్యాయవ్యవస్థ, మానవహక్కుల సంఘం, జాతీయ మైనారిటీలు, మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖ వంటి సంస్థలు భారత్‌లో ఉన్నాయి. అయితే వీటిల్లో చాలా విభాగాలకు స్వతంత్రంగా అధికారాలను ఉపయోగించుకునే అవకాశం లేకపోయిండవచ్చు కానీ మతపరమైన, మానవహక్కుల పరమైన అతిక్రమణలు జరిగినపుడు విచారణకు ఆదేశించే హక్కు వీటికి ఉన్నాయి.
భారతదేశంలోని మత స్వేచ్ఛను అమెరికాలో తప్పుగా అర్థం చేసుకుంటుంటారు అని చాలామంది అంటారు. ఇలాంటి నివేదికలు ప్రయోజనకరమైనవి కావు. అవి మనదేశ వ్యవహారాలలో జోక్యం చేసుకోవడంలాంటివి. భారతదేశంలోని లౌకికతత్వం పలుమార్లు ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనడమే కాదు వాటికి తట్టుకుని నిలబడింది కూడా. భారతదేశంలోని మైనారిటీ వర్గాల ప్రజలు అందరితో సమానంగా రాజ్యాంగహక్కులను అనుభవిస్తున్నారు. వారి హక్కులను భారత రాజ్యంగం కాపాడుతోంది. చాలా దేశాల్లో ఇలాంటి హక్కులు మైనారిటీలకు ఉండడాన్ని చూడం. భారత మాజీ ప్రధాని వాజ్‌పేయి ఒక సందర్బంలో ‘ఎవ్వరూ భారత లౌకికతత్వాన్ని సవాలు చేయలేరు’ అనడం మర్చిపోలేం.

Comments
Post a Comment