భారత్-అమెరికా సంబంధాలు: కొనసాగుతున్న చర్చలు
అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పోంపియో ఢిల్లీ పర్యటన ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. తన పర్యటనలో భాగంగా ఆయన ప్రధాన మంత్రి, విదేశీ వ్యవహారాల మంత్రి, భారత రక్షణ సలహాదారులతో భేటీ అయ్యారు.
అమెరికా, భారత్‌ల నడుమ ఇటీవల కొన్ని ద్వైపాక్షిక విభేధాలు తలెత్తాయి. అందులో ముఖ్యమైనవి సుంకాలు, వ్యాపారం, ఇరాన్‌పై ఆంక్షలు, భారత సరకులను అమెరికా ప్రత్యేకంగా పరిగణించడం, భారతీయ టెకీలకు హెచ్1బీ విసాల మంజూరు, వెనిజులాతో విద్యుత్ వ్యాపారం, రష్యా నుంచి భారత్ ఆయుధాలు కొనుగోలు చేయడంలాంటి అంశాలున్నాయి. వీటిపై ఇరు దేశాల అధినేతలు కూర్చొని నేరుగా పరస్సర చర్చలు జరపాల్సిన పరిస్థితి ఉంది.
పోంపియో భారత్ పర్యటనలో ప్రధాన ఉద్దేశం ఇరు దేశాధి నేతల మధ్య చర్చలకు సానుకూల వాతావరణం ఏర్పర్చడమే. జపాన్‌లోని ఒసాకాలో జరిగే జీ-20 దేశాల సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ద్వైపాక్షిక చర్చలకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకే ఆయన భారత్ పర్యటనకు వచ్చారు. దీనితోపాటు జీ-20 సదస్సుకు సమాంతరంగా భారత్, అమెరికా, జపాన్‌ల మధ్య త్రైపాక్షిక భేటీ ఏర్పాటు చేసి అమెరికా అధ్యక్షుడు, భారత్ ప్రధాన మంత్రి, జపాన్ ప్రధాన మంత్రిని ఒకే వేదిక మీదకు తీసుకురావాలనే ఉద్దేశం కూడా ఆయనకు ఉంది.
ఈ పర్యటనకు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇటీవలి లోకసభ ఎన్నికల్లో మోదీ ప్రభుత్వం తన ఐదేళ్ల పరిపాలనకు ఫలితంగా రికార్డు స్థాయితో గెలిచారు. ఆయన తిరిగి అధికార పగ్గాలు చేపట్టిన అనంతరం ట్రంప్ ప్రభుత్వం నుంచి ఒక ఉన్నత స్థాయి అధికారి భారత్‌కు రావడం ఇదే తొలిసారి.
ఇరు దేశాల మధ్య ఉన్న విబేధాల విషయానికి వస్తే, అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ భారత పర్యటనలో కొత్తగా ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు లేవని స్పష్టమైన సంకేతాలను ముందుగానే ఇచ్చారు. అంతేకాక కొత్త చర్యల గురించి కూడా ఎలాంటి ప్రకటనలు చేయవద్దని నిర్ణయించారు.
ఇరాన్ విషయంలో అమెరికా అనుసరిస్తున్న విధానాన్ని భారత్ అర్థం చేసుకోగలుగుతోంది. అయితే ఇరాన్ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందనే అమెరికా వాదనతో మాత్రం ఏకీభవించలేకపోతోంది. అదే సమయంలో అమెరికా కూడా అప్ఘన్ విషయంలో భారత దేశ ఆందోళనను అర్థం చేసుకోగలుగుతోంది. అయితే పోంపియో ట్రంప్ ప్రభుత్వం అత్యంత శ్రద్ధతో తాలిబన్లతో శాంతి చర్చలు జరుపుతోందని స్పష్టం చేశారు. అంతేకాదు ఈ ఏడాది సెప్టెంబర్‌లో అమెరికా తన దళాలను ఉపసంహరించుకుంటుందని తెలిపారు.
పోంపియో పర్యటన సందర్భంగా భారత దేశం తన ఉత్పత్తుల విషయంలో అమెరికా జీఎస్‌పీ (జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్)ని ఎందుకు ఉపసంహరించుకుందనే అంశాన్ని లేవనెత్తింది. అమెరికా తన వంతుగా తమ ఉత్పత్తులపై అధిక సుంకాన్ని ఎందుకు విధించారనే అంశాన్ని చర్చకు పెట్టింది. హెచ్1బి వీసాల విషయంలో పరిమితులు ఏమీ లేవని పోంపియో సూచనాప్రాయంగా తెలిపారు. కాగా అంతకుముందు తీసుకున్న విధానపరమైన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటామనే విషయంలో ఎలాంటి హామీ ఇవ్వలేదు. చర్చల సందర్భంగా భాతర దేశం, రష్యా నుంచి సేకరిస్తున్న
ఆయుధాల అంశం తెర మీదకు వచ్చింది. ఈ విషయంలో భారత దేశం తమ జాతీయ ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయనీ, అందులో తాము రాజీ పడలేమని స్పష్టం చేసింది.
భారత్, అమెరికాల మధ్య ఉన్న అనేక విబేధాలకు ఈ చర్చల సందర్భంగా పరిష్కారం లభించకపోయినా అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్, భారత విదేశీ వ్యవహారాల మంత్రికి మధ్య పరిణతితో కూడా సంభాషణ సాగింది. విభిన్నమైన అంశాలు గంభీరమైన చర్చకు దారి తీసింది.
ఇరు దేశాల మంత్రుల మధ్య విభిన్నమైన అంశాల మధ్య జరిగిన చర్చలపై భిన్నమైన అభిప్రాయలను పంచుకున్నారు. అనేక అంశాలను ఆసక్తితో చర్చించారు. విబేధాలు పరిష్కరించుకునేందుకు భవిష్యత్తులో మరింత లోతైన చర్చలు జరుపుదామని అంగీకారానికి వచ్చారు. రెండు అంశాల మీద మాత్రం ఒక స్పష్టతకు వచ్చారు. ఉగ్రవాదాన్ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదనీ, దీనిపై పోరాటం చేసేందుకు పరస్పరం సహకరించుకోవాలనే నిర్ణయానికి రావడం అన్నది ఒక అంశం. ఇక రెండోది ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలు నెలకొల్పేందుకు భారత్-అమెరికాల మధ్య సహకారం కొనసాగాలని, ఇందుకు ద్వైపాక్షిక, త్రైపాక్షిక (జెఎఐ), చతుర్పాక్షిక (క్యూయుఎడి), బహుపాక్షిక వ్యవస్థల ద్వారా చర్చలు జరపాలని నిర్ణయించారు.
ఇరు దేశాలు గత రెండు దశాబ్ధాలుగా ఎంతో శ్రమించి ఇండో-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం కృషి చేస్తున్నాయి. ఈ భాగస్వామ్యం కొన్ని ప్రత్యేక అంశాల్లోని విబేధాల కారణంగా దెబ్బ తినలేదు. ఇరాన్ విషయంలో వాషింగ్టన్ తీసుకున్న నిర్ణయం భారత దేశ ఇంధన భద్రతకు విఘాతం కలిగించే తీరులో ఉంది. అయితే అమెరికా భారత్ తమ వద్ద నుంచి ఇంధనం కొనుగోలు చేయవచ్చనే ప్రతిపాదన ముందుకు తీసుకువచ్చింది. ఈ క్రమంలో అమెరికా నుంచి భారత్ ఇంధన కొనుగోలు గణనీయంగా పెరిగింది.
ఇదే క్రమంలో, రష్యా నుంచి భారత్ ఎస్-400 క్షిపణులు కొనుగోలు చేయడాన్ని వ్యతిరేకిస్తున్న అమెరికా మన దేశాన్ని అతి పెద్ద రక్షణ రంగ భాగస్వామిగా భావిస్తోంది. అంతేకాదు ఇందుకోసం భారత్‌కి అత్యాధునికమైన ఆయుధాలు, ఇతర రక్షణ రంగ పరికరాలు విక్రయించేందుకు పలు నిబంధనలను సడలించింది. అమెరికా ఉత్పత్తులపై భారత దేశం అధిక సుంకాలను విధిస్తోందని ట్రంప్ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. అయితే ఇటీవల అమెరికా అల్యూమినియం, ఉక్కుపై పెంచిన సుంకం కారణంగా భారత ఆర్థిక వ్యవస్థపై విపరీతమైన భారం పడుతోంది. ఈ విషయాల్లో భారత్ చర్చలకు ఎప్పుడూ సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది. ఇటీవల బాదం పప్పులాంటి కొన్ని అమెరికన్ ఉత్పత్తులపై విధించిన సుంకాలను నియంత్రించేందుకు సిద్ధంగా ఉందని చెప్పింది.
ఇదిలా ఉండగా, ఇరు దేశాల మధ్య చర్చలకు సానుకూలమైన వాతావరణం ఉంది. అందుకే ఒసాకాలో జరగనున్న ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ల భేటీలో ఈ అంశాలపై స్పష్టతకు రావాలని నిర్ణయించారు.
రచన : ప్రొఫెసర్ చింతామణి మహాపాత్ర, ఛైర్మన్, అమెరికన్ స్టడీస్ సెంటర్, జెఎన్‌యు

Comments
Post a Comment