సమస్థితిలో భారత-అమెరికా సంబంధాలు
జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రివరెన్సెస్ (జిఎస్‌పి) ప్రయోజనాలు అందకుండా భారత్‌ను ఆ జాబితా నుంచి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం తొలగిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో అమెరికా నుంచి దిగుమతి చేసుకునే 28 ఉత్పత్తులపై టారిఫ్‌లు పెరిగాయి. ప్రధాని నరేంద్ర మోదీ రెండవసారి అధికార పీఠం ఎక్కిన కొద్ది రోజుల్లోనే ఈ పరిణామం వార్తాపత్రికల పతాక శీర్షికలకు ఎక్కింది. ఈ రెండు దేశాలు ‘వ్యూహాత్మక భాగస్వామ్యం’ విషయంలో ఒకే రీతిలో వ్యవహరిస్తున్నాయి. జపాన్‌లోని ఒసాకాలో జి20 శిఖరాగ్ర సదస్సు జరగడానికి ముందు అమెరికా విదేశాంగ మంత్రి మైఖైల్ ఆర్. పోంపే జూన్ 25 నుంచి 27వ తేదీ వరకూ భారత్‌లో పర్యటించనున్నారు.
భారతదేశంలో ఎన్నికల అనంతరం చోటుచేసుకుంటున్న తొలి అత్యున్నత స్థాయి సమావేశం ఇది. తన భారత పర్యటనలో పోంపే కేంద్ర విదేశాంగ వ్యవహారాల మంత్రితో చర్చలు జరుపుతారు. ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తారు. అలాగే భారత ప్రభుత్వానికి సంబంధించిన అత్యున్నత అధికార ప్రతినిధులను కూడా కలుస్తారు. భారత-అమెరికాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత దృఢపరచుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. రెండు దేశాల పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ద్వైపాక్షిక, ప్రాంతీయ, గ్లోబల్ అంశాలపై అత్యున్నతస్థాయి కార్యక్రమాలను కొనసాగించాలని ఇవి నిర్ణయించు కున్నాయి.
భారత విదేశాంగ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్‌ను విదేశాంగ మంత్రిగా బాధ్యతలను చేపట్టిన నేపథ్యంలో అమెరికా విదేశాంగమంత్రి పోంపే అభినందనలు తెలిపారు. అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో ‘భారతదేశంలో ఏర్పడ్డ నూతన ప్రభుత్వంతో సన్నిహితంగా పనిచేయడానికి అమెరికా గట్టి నిబద్ధతతో ఉంది. తద్వారా అమెరికా, భారత దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెడతాం’ అని ఆ అందులో పోంపే పేర్కొన్నారు.
అమెరికా విదేశాంగమంత్రి పోంపే, భారత విదేశాంగమంత్రి తమ లక్ష్యాలను పరస్పరం పంచుకన్నారు. స్వేచ్ఛతో కూడిన ఇండో- ఫసిఫిక్ పరిరక్షణ కూడా అందులో ఉంది. అలాగే అమెరికా-ఇండియాల మధ్య భద్రతా సహకారం, అమెరికా-ఇండియాల మధ్య ఆర్థిక భాగస్వామ్యం’ వంటి అంశాలను కూడా అమెరికా ప్రకటన ప్రస్తావించింది.
అమెరికా విదేశాంగమంత్రి భారత పర్యటనకు చాలా ముందే పోంపే నుంచి ఫోను కాల్ వచ్చింది. దానికనుగుణంగా ఒసాకాలో జరిగే జి20 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీల మధ్య సమావేశానికి రంగం సిద్ధం చేయడానికి పోంపే భారత్ పర్యటన రూపుదిద్దుకుంది. మోదీ, ట్రంప్‌లు ఇరువురూ జపాన్ ప్రధాని షింజో అబెతో సమావేశమై ఇండియా-అమెరికా-జపాన్ త్రైపాక్షిక సమావేశం సైతం అప్పుడు చోటుచేసుకోనుంది. అందులో ఇండో-ఫసిఫిక్ వ్యూహం గురించి ఈ దేశాలు చర్చిస్తాయి.
ఇండో-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు ఎంతో పాజిటివ్ మార్గంలోనే సాగుతున్నాయని ఇండియా అభిప్రాయపడుతోంది. రెండు దశాల మధ్య కొన్ని సంవత్సరాలుగా ద్వైపాక్షిక వాణిజ్యం సాగుతోందని అది 150 బిలియన్ డాలర్లకు చేరుకుందని భారత్ తెలిపింది. అలాగే వాణిజ్య సంబంధాలకు సంబంధించి ఏవైనా అభిప్రాయ విభేదాలు ఉంటే, వాటిని న్యూఢిల్లీ, వాషింగ్టన్‌లు సంయుక్తంగా సమసిపోయేలా కృషిచేస్తాయని భారత్ అభిఫ్రాయపడింది. అదే సమయంలో ఐటి ప్రొఫెషనల్స్ హెచ్1బి వీసా (ఉన్నత శిక్షణ ఉన్న విదేశీయులకు అమెరికా ఇచ్చే వీసా)ల గురించి ఇండియాకు అమెరికా తమ ప్రణాళికల గురించి అధికారికంగా ఎలాంటి సమాచారాన్ని ఇప్పటివరకూ అందించలేదు.
ఇరాన్‌పై ఆంక్షల అంశం ట్రంప్-మోదీ ద్వైపాక్షిక సమావేశంలో లేవనెత్తే అవకాశం ఉంది. అలాగే ఎనర్జీ భద్రతపై భారత ఆందోళనను కూడా పాంపే న్యూఢిల్లీ పర్యటనలో చోటుచేసుకోవచ్చు.
పోంపే, జైశంకర్‌లు ఇరువురూ కలిసి ఇరుదేశాలకు సంబంధించిన భవిష్యత్ కార్యక్రమాలను సైతం రూపొందిస్తారు. రెండు దేశాల ప్రభుత్వాలు మరోసారి ట్రంప్, మోదీల మధ్య సమావేశానికి అవకాశాలు శోధిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది సెప్టెంబరులో జరిగే ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ సమావేశంలో ఇది సాధ్య పడొచ్చు. జైశంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లు ఈ ఏడాది వాషింగ్టన్‌లో జరిగే 2+2 శిఖరాగ్రసదస్సుకు సరిగ్గా అదే సమయంలో హాజరవుతున్నారు. భవిష్యత్తులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ న్యూఢిల్లీ పర్యటన సైతం చోటుచేసుకోవచ్చని భారత్ భావిస్తోంది.
చైనా టెలికం కంపెనీ హువై 5జ5 రోల్-అవుట్ కార్యక్రమంలో పాల్గొనడానికి సంబంధించి అమెరికా ఆందోళన చెందుతోంది. దీనిపై భారత ప్రభుత్వం ఇంకా అంతర్గతంగా చర్చలు కొనసాగిస్తుండడం వల్ల ఆర్థిక, భద్రతా పరమైన అంశాలపై ప్రస్తుతం భారత్ దృష్టిపెట్టే ఆలోచలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ అంశాలకు సంబంధించిన చర్చలు తొందరగా ముగియవు. భద్రత, ఆర్థికరంగం ఈ రెండింటిలో ఏది అతి ముఖ్య అంశంగా భారత్ భావిస్తోందో దాన్ని బట్టి ఈ కేసు పరంగా స్పష్టత వస్తుంది. దీనిపై భారత్ సరైన సమయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది.
డేటా లోకలైజేషన్, క్రాస్-బార్డర్ ఇ-కామర్స్, మేథోసంపత్తి హక్కులు వంటి పెద్ద అంశాలు కూడా వీరిచర్చల్లో కీలకంగా చోటుచేసుకోనున్నాయని భావిస్తున్నారు. రెండు వైపులా దృఢమైన ద్వైపాక్షిక సంబంధాల నిర్మాణావశ్యకతను గుర్తించాయి. ఏవో కొన్ని ఆర్థిక సమస్యలు ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలను దెబ్బతీయకూడదు. ఈ నేపథ్యంలో, రెండవసారి మోదీ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత అమెరికా విదేశాంగమంత్రి భారత పర్యటన చోటుచేసుకోనుంది. ఇది భారత్‌తో వాషింగ్టన్‌కు ఉన్న ప్రత్యేక సంబంధాలను వెల్లడిస్తోంది. 21వ శతాబ్దంలో రెండు అతిపెద్ద ప్రజాస్వామిక దేశాలు సన్నిహిత గ్లోబల్ భాగస్వాములుగా వ్యవహరిస్తాయనే భరోసా కనిపిస్తోంది.

రచన: సత్యజిత్ మొహంతీ, ఐఇఎస్, సీనియర్ ఆర్థిక విశ్లేషకులు
Comments
Post a Comment