ఎఫ్ఎటిఎఫ్ పట్ల పాకిస్తాన్ కొనసాగిస్తున్న నిర్లక్ష ధోరణి

ఆరు రోజుల ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్సు (ఎఫ్ఎటిఎఫ్) ప్లీనరి గతవారం అమెరికాలోని ఆర్లండ్‌లో జరిగింది. అక్టోబర్ నాటికి గ్లోబల్ ఫైనాన్షియల్ వాచ్‌డాగ్ గా వ్యవహరిస్తున్న ఎఫ్ఎటిఎఫ్‌కి పాకిస్తాన్ కట్టుబడిన నిబంధనలను గౌరవించాలి. లేకపోయినట్లయితే పాకిస్తాన్ ఇప్పుడున్న‘గ్రే లిస్టు’ స్థానం నుంచి ‘బ్లాక్ లిస్టు’ జాబితాకు ఎక్కే ప్రమాదం ఉంది.

ఎఫ్ఎటిఎఫ్‌ నిబంధనలకు కట్టుబడి పనిచేస్తానని పాకిస్తాన్ సంవత్సరం క్రితం మాట ఇచ్చింది. దాంతోపాటు ఆసియా ఫసిఫిక్ గ్రూపు (ఎపిజి)తో కలిసి హవాలా కార్యకలాపాలకు  వ్యతిరేకంగా (ఎఎంటి) పనిచేస్తానని పాకిస్తాన్ పేర్కొంది. అలాగే ఉగ్రవాదానికి అందుతున్న నిధులకు వ్యూహాత్మకంగా అడ్డుకట్ట వేయడాన్ని(సిటిఎఫ్) కూడా చర్చించింది. అలాగే దీనికి సంబంధించిన ఇతర లోపాలపై సైతం దృష్టి పెడతానంది. ఈ విషయాలన్నింటిలో ఇస్లామాబాద్ రికార్డు  సరిగాలేదు. ఏవో కొన్ని పైపై చర్యలు మాత్రం పాక్ తీసుకుంది. తనతో ఉగ్రసంబంధాలున్న సంస్థల ఉగ్ర కార్యకలాపాలను అడ్డుకట్టేవేసేలా ముఖ్యమైన చర్యలేమీ పాకిస్తాన్ చేపట్టలేదు.

ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎఫ్ఎటిఎఫ్ తన 30వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఈ గ్రూపు పేరు ప్రతిష్ఠలు, స్థాయి కూడా బాగా పెరిగాయి. హవాలా లావాదేవీలకు వ్యతిరేకంగా గ్లోబల్ యాక్షన్‌కు సారథ్యం వహిస్తూ ముందుకు సాగుతున్న సమర్థవంతమైన బృందంగా ఎఫ్ఎటిఎఫ్ పేరు తెచ్చుకుంది. అలాగే ఉగ్రవాదానికి నిధులు సహాయం చేయడాన్ని వ్యతిరేకించడం, వాటికి సహాయసహకారాలు సమకూర్చడాన్ని   వ్యతిరేకించడం, శక్తివంతంగా టార్గెట్‌లపై దాడి చేయడంలో తోడ్పడడం వంటి వాటిపై నిరంతరాయంగా దృష్టిసారించి ఈ బృందం పనిచేస్తోంది.

ఎఫ్ఎటిఫ్ తనను తాను బలోపేతం చేసుకుంటూ ముందుకు వెడుతోంది. ఎఫ్ఎటిఎఫ్‌కి స్పందించని పాకిస్తాన్‌కి రానున్న రోజుల్లో రెండు ముఖ్య అంశాలైన హవాలా లావాదేవీలకు వ్యతిరేకంగాను, ఉగ్రవాదానికి నిధులు అందించడం పరంగా పాక్ వైఖరి వల్ల  దానికున్న కొన్ని మిత్రదేశాలు, రక్షకులనుకునే వారు కూడా చేతులు ఎత్తేసే అవకాశం ఉంది. ఎందుకంటే పైన పేర్కొన్న రెండు అంశాలు కూడా ప్రపంచమంతటా ఉగ్ర దాడులు జరగడానికి ముఖ్య కారకాలు అవుతున్నాయి.
ఈ ఏడాది ఫిబ్రవరిలో పుల్వామా దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిని ఎఫ్ఎటిఎఫ్ తీవ్రమైన హింసాత్మక దాడిగా పేర్కొంటూ ఖండించింది. ఈ దాడులు ఎంతోమందిని చంపేయడం, భయాన్ని రేకెత్తించడం  చేసింది. ఈ దాడులు నిధుల సహాయం లేకుండా జరిగే అవకాశం లేదు. అంటే ఉగ్రవాద మద్దతుదారుల మధ్య నిధుల పంపంకం జరుగుతోందనే అర్థం అని ఎఫ్ఎటిఎఫ్ స్పష్టంగా అభిప్రాయపడింది.

పరోక్షంగా పాకిస్తాన్‌ను ప్రస్తావిస్తూ, ‘ఉగ్రవాదులు, వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నవారు ఎక్కడ పొరపాట్లు దొరుకుతాయా అని జాగ్రత్తపడుతుంటారు. లేదా కొత్త విధానాలను పెంపొందిస్తుంటారు. దాడులతో వాళ్లు ముందుకు సాగుతారు. అందుకు నిధులు వాడతారు. ఉగ్రవాదులకు నిధుల సహాయం అందకుండా ఆ ప్రదేశాలను  శక్తివంతంగా అభివృద్ధి చేయడానికి అక్కడ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారన్నది కూడా విస్పష్టం.

ఈ ఏడాది జులైలో రూపొందించిన తాజా నివేదికలో ఎఫ్ఎటిఎఫ్ స్పందిస్తూ,  ఇస్లామాబాద్ ఎఫ్ఎటిఎఫ్‌తో కలిసి గత ఏడాది యాక్షన్ ప్లాన్ అభివృద్ధి చేస్తున్నప్పటికీ,  ఎఎంఎల్/సిఎఫ్‌టి వ్యూహాత్మకమైన లోపాలను పాకిస్తాన్ పరిధిలో తాము గుర్తించినట్టు  ఎఫ్ఎటిఎఫ్ స్పష్టంగా పేర్కొంది. ఎఫ్ఎటిఎఫ్ నేరుగా ఒకపక్క నుంచి పాకిస్తాన్ నిందిస్తూనే ఎఎంఎల్/సిఎఫ్‌టి పరంగా మెరుగు పరచడానికి   కొన్ని చర్యలు చేపట్టినా ట్రాన్సిషనల్ టిఎఫ్ రిస్కుకు పరంగా పాక్ సరైన అవగాహనను ప్రదర్శించలేదని కూడా పేర్కొంది.

ఎఫ్ఎటిఎఫ్‌తో కలిసి తయారుచేసిన  పది అంశాల ప్రణాళికను పూర్తిచేయడంలో పాకిస్తాన్ వైఫల్యచెందడంపై కూడా ఎఫ్ఎటిఎఫ్ ఆందోళన వ్యక్తంచేసింది. అలాగే జనవరి, ఆ తర్వాత మే డెడ్‌లైన్ల విషయంలో కూడా పాక్ వైఫల్యం చెందిందని  ఈ బృందం పేర్కొంది. అక్టోబర్ గడువు విషయంలో కూడా ఇలాగే వ్యవహరించినట్టయితే ఈ విషయంలో హేతుబద్ధ చర్యలకు సిద్ధపడతామంటూ ఎఫ్ఎటిఎఫ్ పాకిస్తాన్‌ని హెచ్చరించింది. ఎఫ్ఎటిఎఫ్ తన నివేదికను ‘తగినంత  ప్రగతి లేని పక్షంలో ఆ సమయంలో ఎఫ్ఎటిఎఫ్ ఏ చర్య చేపట్టాలో నిర్ణయిస్తుంది’ అంటూ ముగించింది.

ఇది ఇలా ఉంటే, పాకిస్తాన్ ప్రభుత్వం విడుదల చేసిన పత్రికా ప్రకటన తమ దేశ ప్రజలను, యావత్ ప్రపంచాన్ని కూడా తప్పుదారి పట్టించేలా ఉంది. యాక్షన్ ప్లాన్ అమలు పరంగా ఎఫ్ఎటిఎఫ్ తమను వెన్నుతట్టి ప్రోత్సహించిందని పాక్ తన పత్రికా ప్రకటనలో పేర్కొంది. అంతేకాదు ఎఎంల్/సిఎఫ్‌టి పరంగా మెరుగుదలను సైతం ప్రోత్సహిందని   పాక్ పేర్కొంది. అంతేకాదు ఆ దిశగా మరిన్ని చర్యలు తీసుకోవాల్సిందంటూ ఎఫ్ఎటిఎఫ్ తమని ప్రోత్సహించిందని పత్రికా ప్రకటనలో పాక్ పేర్కొంది.

పాకిస్తాన్ ఎఫ్ఎటిఎఫ్‌కి ఇచ్చిన మాటప్రకారం ఉగ్రవాదం, ఉగ్రవాదసంస్థలకు నిధుల సహాయం వంటి అంతర్జాతీయ అంశాల విషయంలో నమ్మకమైన, మాటతప్పని, మార్చని, స్థిరమైన చర్యలను పాకిస్తాన్ చేపడుతుందని ఆశిస్తున్నామంటూ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తన ఆశాభావాన్ని వ్యక్తంచేసింది.

ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఈ దశలో పాకిస్తాన్‌కు మద్దతునిచ్చే, ఎఫ్ఎటిఎఫ్‌లోని సభ్యదేశాలు సైతం కూడా అయిన సంప్రదాయ మిత్రదేశాల నుంచి  దయ, జాలి పొందడానికి పాకిస్తాన్ ప్రయత్నించవచ్చు. అలా మూడు నెలల పాటు పాక్ కొంత ఊపిరి తీసుకునే అవకాశానికి ప్రయత్నించవచ్చు. కానీ, ఇస్లామాబాద్‌లోని నిర్ణయాధికార శక్తులకు మాత్రం ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం చేయడానికి సంబంధించి, అలాగే హవాలా లావేదీవీలకు సంబంధించి వ్యతిరేకంగా సుస్థిరమైన కఠిన చర్యలు తీసుకోకతప్పదు. ఇప్పటికి కూడా పాకిస్తాన్ లోని అలాంటి కొన్ని ఉగ్రవాద సంస్థలకు పాక్ తోడ్పడుతోంది. దక్షిణ ఆసియా ప్రాంతాన్ని అస్థిరతకు గురిచేస్తోంది.
రచన: డా. అశోక్ బెహూరియా, కో-ఆర్డినేటర్, దక్షిణ ఆసియా కేంద్రం, ఐడిఎస్ఎ

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన