బిష్కెక్‌లో ఎస్‌సీవో సదస్సు
ఇటీవలి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒక ముఖ్యమైన విదేశాంగ విధాన రూపకల్పన సదస్సులో పాలుపంచుకున్నారు. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీవో) వార్షిక సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సదస్సులో ఆయన ప్రసంగిస్తూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న, సహకరిస్తున్న, ఆర్థిక తోడ్పాటును అందజేస్తున్న దేశాలను గుర్తించాలని పిలుపునిచ్చారు. ఏకపక్ష ధోరణులు, స్వీయ రక్షణ ఎవరికి కూడా మేలు చేయలేదని ఆయన అన్నారు. ఎస్సీవో సమావేశం ఆరోగ్యరంగంలో సహకారం, ఇంధన రంగంలో సహకారం, ప్రత్యామ్నాయ ఇంధన రంగం, సాహిత్యం, సంస్కృతి, ఉగ్రవాద రహిత సమాజం, మానవీయ సహకారం తదితర అంశాలపై కేంద్రీకరించి పని చేయాలని అన్నారు. మోదీ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఒక దేశానికీ మరో దేశానికి మధ్య అనుసంధానత అవసరమని చెబుతూ అందుకోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. అప్ఘనిస్తాన్లో శాంతి, సుస్థిరతల గురించి ఆయన మాట్లాడుతూ ఆ ప్రక్రియ పూర్తిగా ఆప్ఘన్ నేతృత్వంలో, అప్ఘనీయుల చొరవతో, అప్ఘన్ ఆధీనంలో సాగాలని ఆకాంక్షించారు.
కాగా, ఎస్సీవో సదస్సుకు తనదైన ప్రాంతీయ ప్రత్యేక వ్యూహాత్మక ప్రాధాన్యత ఉన్నప్పటికీ అందులో ప్రపంచ ప్రయోజనాలు కూడా ఇమిడి ఉన్నాయి. అయితే ఈ సదస్సు సందర్భంగా వివిధ దేశాల అధినేతల మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చలు మీడియా పతాక శీర్షికలను ఆకర్శించాయి. ఈ క్రమంలో ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో బిష్కెక్లో జరిపిన చర్చలు వ్యూహాత్మక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. చైనా అధ్యక్షుడు షీ, రష్యా అధ్యక్షుడు పుతిన్లు ప్రధాని మోదీ ఇటీవల ఎన్నికల్లో సాధించిన విజయాన్ని అభినందించారు.
గత కొన్నేళ్లుగా ప్రధాని మోదీ ఈ ఇరు దేశాల నేతలతో వ్యక్తిగత స్థాయిలో మంచి సంబంధాలు నెరపుతున్నారు. మోదీ భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం చైనా అధ్యక్షుడు షీతో కనీసం డజను సార్లయినా భేటీ అయి ఉంటారు. సరిహద్దు ఉగ్రవాదానికి బాధితురాలైన భారత దేశం పాకిస్థాన్తో శాంతియుత సంబంధాలు నెరపేందుకు చేస్తున్న ప్రయత్నాలను ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు షీకి ఈ సందర్భంగా వివరించారు. అయితే ఈ ప్రయత్నాలు పట్టాలు తప్పాయని కూడా ఆయన తెలిపారు. పాకిస్థాన్ ‘‘ఉగ్రవాద రహిత’’ వాతావరణం సృష్టించేందుకు ప్రయత్నించాలని ఆయన అన్నారు.
ఎస్సీవో పట్ల భారత దేశం పూర్తిస్థాయి సానుకూలతతో ఉంది. దీనికి ఆయా దేశాల నడుమ ఉన్న సాంస్కృతిక బంధమే కారణం. దక్షిణాసియాలోని సభ్య దేశాలతో భారత దేశానికి అనేక విషయాల్లో సారూప్యత ఉన్నందున ఆయా దేశాలతో కలిసి పని చేసేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. భారత దేశానికి సంబంధించిన చలన చిత్రాలను ఎస్సీవో సభ్య దేశాల్లోని చిత్రోత్సవాల్లో ప్రదర్శిస్తారు. వీటిని అక్కడి జనం ఎంతో ఆసక్తితో తిలకిస్తారు. ఉజ్బెకిస్థాన్, తజకిస్థాన్, కిర్గిజిస్థాన్ లాంటి దేశాల్లో వీటికి ఎంతో ఆదరణ ఉంది. మొత్తంగా చూస్తే ఎస్సీవో విషయంలో భారత్ ఎంతో సానుకూలత ప్రదర్శిస్తోంది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్తో న్యూఢిల్లీ కలిసి పని చేసేందుకు అన్ని రకాల భారత దేశం సహకారం అందించేందుకు సిద్ధంగా ఉంది.
ఎస్సీవో సదస్సు సందర్భంగా పలు కీలకమైన డాక్యుమెంట్లు రూపొందాయి. అందులో యాంటీ నార్కోటిక్ స్ట్రాటజీ అత్యంత కీలకమైనది. దీనికి సంబంధించి ఒక కార్యాచరణ కూడా తయారైంది. ఆరోగ్య సంరక్షణ, పర్యావరణం, క్రీడారంగంలో సహకారంపై మరో మూడు డాక్యుమెంట్లు రూపొందాయి.
సదస్సులో భాగంగా మొత్తం 14 కీలకమైన నిర్ణయాలపై ఆయా దేశాధినేతలు సంతకాలు చేశారు. సమాంతర సమావేశాల్లో భారత దేశం ఎస్సీవో, ఐక్యరాజ్య సమితి ప్రత్యేక ఏజెన్సీలతో పలు సహకార ఒప్పందాలపై సంతకం చేసింది.
ఉగ్రవాదంపై ఒక సంయుక్త డిక్లరేషన్పై అన్ని దేశాలు సంతకాలు చేశారు. ఈ విషయంలో ఎస్సీవో చేసిన చర్చలు, సంప్రదింపులు తగు ఫలితాలు ఇచ్చాయి. దాంతో ఉగ్రవాదంపై ఒక ఘాటైన ప్రకటన, కఠినమైన భాషతో వెలువడింది. దీనిపై ఎస్సీవోలోని సభ్య దేశాలన్నీ సంతకాలు చేశాయి. దీంతో ఎస్సీవో ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరించాలని మరోమారు దృఢంగా నిర్ణయించినట్లు స్పష్టమైంది.
రానున్న సదస్సు సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలకు రోడ్ మ్యాప్ను కూడా రూపొందించారు. రష్యా తదుపరి సదస్సును నిర్వహించనుంది. సమ్మిట్ సందర్భంగా ఆయా దేశాధినేతలతో 90 రకాల కార్యక్రమాలు రూపొందించారు. బిష్కెక్ సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతూ రానున్న సదస్సులో సైబర్ టెర్రరిజంపై కీలక చర్చ జరుగుతుందని చెప్పారు. ఐటీ, డిజిటలైజేషన్ రంగంలో సహకారం అవసరమని చెప్పారు. వచ్చే సదస్సు నాటికి రెండో ప్రపంచ యుద్ధం ముగిసి 75 సంవత్సరాలు పూర్తవుతుంది. ఎస్సీవోకు మూల స్థంభాలైన శాంతి, అభివృద్ధి, ఉగ్రవాద రహిత లక్ష్యాలకు అనుగుణంగా భారత దేశం పని చేసేందుకు సిద్ధంగా ఉంది.

Comments
Post a Comment