అభివృద్ధిని వేగవంతం చేయడంపై దృష్టి పెడుతున్న ప్రభుత్వం


వరుసగా రెండవ పర్యాయం భారీ మెజారిటీతో పదవీ పగ్గాలు చేపట్టిన జాతీయ ప్రజాస్వామ్య కూటమి (నేషనల్ డెమోక్రాటిక్ అలయెన్స్, ఎన్డీఎ) ప్రభుత్వం మరింత బలం పుంజుకుని ముందుకు సాగుతోంది. భారత ఆర్థిక ప్రగతిని అత్యున్నత అభివృద్ధి పంథంలో కొనసాగించేందుకు సంసిద్ధమవుతోంది. తద్వారా ప్రజలకు ఉపాధి అవకాశాలతోపాటు సాధారణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ప్రధాన లక్ష్యాలతో ముందుకు సాగుతోంది.

విస్తృతస్థాయిలో ఆర్థిక కార్యకలాపాలు జరిగే విధంగా సంస్కరణలను చేపట్టాలని ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకుందని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టంచేశారు. తద్వారా ఆర్థిక రంగ కార్యకలాపాలు వేగవంతం చేయాలని నిశ్చయించారు. నీతిఆయోగ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో కొంతమంది ఆర్థిక శాస్త్రవేత్తలు, నిపుణులతో ప్రధాని మోదీ సంభాషించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను భారీగా ఆకర్షించేందుకు భారత ఆర్థిక వ్యవస్థను గట్టిపోటీకి నిలబడేలా తయారుచేయాలనుకుంటున్నట్టు నొక్కిచెప్పారు.

నిపుణులతో కార్మిక, ఉపాధి, వ్యవసాయం, ఆరోగ్యం, విద్య వంటి రంగాలపై ప్రధాని చర్చలు జరిపారు. ఈ అంశాలు పూర్తిస్థాయిలో బిజెపి సారథ్యంలోని ఎన్డీఎ ప్రభుత్వం ప్రవేశపెట్టే తొలిబడ్జెట్‌కు ఎంతగానో ఉపయోగపడతాయి. కేంద్ర బడ్జెట్ సమావేశాలు జూలై5వ తేదీ నుంచి మొదలవుతాయి.

ఈ సమావేశంలో పాల్గొన్న సభ్యులు ఐదు బృందాలుగా విడిపోయి వివిధ రంగాలకు సంబంధించి రకరకాల వినూత్న ఆలోచనలను పంచుకున్నారు. ఉపాధి, వ్యవసాయం, నీటి వనరులు, ఎగుమతులు, విద్య, ఆరోగ్యం తదితర రంగాలలో కొత్త ఆలోచనలను ఈ బృందాలు సూచిస్తాయి. ఈ మొత్తం కార్యక్రమం వెనుక ఉన్న ఉద్దేశం ఒక్కటే. భారత దేశం అత్యున్నత అభివృద్ధి వేగాన్ని సాధించాలి. అలాగే దేశంలో ఉపాధి అవకాశాలను పెంపొందించాలి.


ప్రధాని మోదీ ప్రభుత్వం మొదటి పర్యాయం అధికారంలో ఉన్నప్పుడు ఆర్థిక ప్రగతిని బాగా వృద్ధి చేయాలనే అతి పెద్ద కార్యభారాన్ని ఎదుర్కొంది. దాని కోసం మోదీ ప్రభుత్వం ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఆర్థిక ప్రగతిని పెంచేందుకు రకరకాల వరుస చర్యలను ఆయన ప్రభుత్వం ప్రవేశపెట్టింది. తద్వారా ప్రంపంచంలోనే అత్యంత వేగంగా ఆర్థికాభివృద్ధి గల దేశంగా నిలిచింది.

మళ్లా రెండవ పర్యాయం కూడా ఎన్డీఎ ప్రభుత్వ అధికార పగ్గాలను చేపట్టింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్థిక వ్యవస్థ ఎన్డీఎ ప్రధాన లక్ష్యంగా నిలిచింది. ఆర్థిక రంగాన్ని సుస్థిరమైన ప్రగతి పథంలోకి నడిపించాలనే అతి పెద్ద సవాలును భారత్ ఎదుర్కొంటోంది. నిరుద్యోగానికి ప్రధాన కారణంగా అదే నిలుస్తోంది. అంతేకాదు డిమాండ్‌ను పునరుద్ధరించాలన్నలక్ష్యసాధనకు సైతం కారణమైంది.

అభివృద్ధిని బాగా పెంపొందించాలన్న ఆలోచనలు ప్రభుత్వానికి ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా ప్రవేశపెడుతున్న బడ్జెట్‌లో పెరుగుదలను పెంచే మౌలికసదుపాయాల రంగం వంటి వాటిల్లో వినియోగం, పెట్టుబడులను పెంచే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ముందు పెట్టనుంది.

అలాగే బ్యాంకుల ఆరోగ్యకరమైన స్థితిగతులపై కూడా ప్రభుత్వం దృష్టిపెట్టింది. గత ప్రభుత్వంలో ఎన్డీఎ ఇందులో ఎన్నో రకాల చర్యలను చేపట్టింది. వాటిల్లో ఇన్‌సాల్వెన్సీ అండ్ బాంక్‌రప్ట్‌సీ కోడ్ (ఐబిసి) వంటివి ఉన్నాయి. వీటి ద్వారా బ్యాంకుల స్థితిగతులను మెరుగుపరచాలని ప్రభుత్వం ప్రయత్నించింది. దాని నుంచి వచ్చిన ఫలితాలు కూడా ఎంతో ప్రోత్సాహకరంగా ఉండడం గమనించవచ్చు. వీటి పునాదిగా కొత్త ఆర్థిక మంత్రి దేశ ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టంగా, బలోపేతంగా, విజయవంతంగా నిర్వహిస్తారనే అభిప్రాయం వినవస్తోంది.

మనదేశ ఆర్థిక పెరుగుదలను ఏడు శాతంగా చెప్తూ వచ్చారు. అలాగే ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ తన స్థానాన్ని కొనసాగిస్తోంది. వృద్ధి క్షీణిస్తున్న పెద్ద రంగాలను పునరుద్ధరించే దిశగా చర్యలను చేపట్టే ఆలోచనల్లో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.

ప్రభుత్వం రెండవ తరం ఆర్థిక సంస్కరణలపై చాలా తీవ్రస్థాయిలో స్పందిస్తూ ఇందులో ప్రభుత్వం ఎంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పిఎస్‌యు డిస్‌ఇన్వెస్ట్‌మెంట్, జిఎస్టీని మరింత సంక్షిప్తీకరించడం, పరిశ్రమలకు సులభతరంగా పెట్టుబడుల ప్రక్రియ, దిగుముతుల టారిఫ్ ను తగ్గించడం, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం నేపథ్యంలో పరపతి ఎగుమతి అవకాశాలు వంటి వాటిని కూడా ప్రభుత్వం కొనసాగించాల్సి ఉంటుంది.

ప్రభుత్వం ఇప్పుడు చేపట్టి కొనసాగిస్తున్న ఆర్థిక రంగ అంశాలను నిబద్ధతతో కొనసాగిస్తే తనదైన ముద్రను దేశ ఆర్థిక రంగంలో వేయడమే కాదు భారత ఆర్థిక రంగాన్ని అంతర్జాతీయ ఆర్థిక రంగంలో టాప్ ఐదు స్థానాల్లో ఒకటిగా నిలబెట్టగలదనడంలో సందేహం లేదు. కొత్త ఆవిష్కరణలతో కూడిన సంస్కరణలను ప్రభుత్వం ఆవిష్కరించాలి. 1991లో భారత ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు చేపట్టింది. తమ ఉత్పత్తులు మార్కెట్ పోటీని తట్టుకునేలా నిలబడేందుకుగాను ప్రైవేటు రంగానికి నాటి ప్రభుత్వం తలుపులు తెరిచింది.

ప్రభుత్వం చేపట్టే తర్వాత స్థాయి సంస్కరణలు మార్కెట్లో కీలక పాత్ర నిర్వహించేలా ఉండాలి. ఉత్పత్తి, భూమి, శ్రామికులు, పెట్టుబడి వంటి అంశాలలో సంస్కరణలు చేపట్టాలి. ఈ రంగాలలో సంస్కరణలు చేపడితే తప్ప భారత తయారీ రంగం, సేవలు అంతర్జాతీయ పోటీని తట్టుకుని నిలబడలేవనే సత్యాన్ని ప్రభుత్వం ప్రస్తుతం బాగా గుర్తించింది.

భూ మార్కెట్ పరంగా దృష్టిసారిస్తే తప్ప భారత తయారీదారులు గ్లోబల్ స్థాయిల్లో ఎదగడం అసాధ్యం అని నిపుణులు అంటున్నారు. లేబర్ మార్కెట్‌లో ఫ్లెక్సిబిలిటీని ప్రవేశపెట్టేలా అవి కాంప్లిమెంట్‌గా ఉండాలి. తద్వారా అత్యధిక శ్రామికులతో కూడిన తయారీరంగం, ఉద్యోగావకాశాలకు మార్గం సుగమం అవుతుంది. అలాగే మార్కెట్ ఆధారిత విధానం అవసరమున్న మరొక ముఖ్య రంగం వ్యవసాయరంగం.

సంస్కరణలను భారీ స్థాయిలో తీవ్రవేగంతో ఆర్థిక రంగంలో విస్తృతస్థాయిలో ప్రవేశపెట్టడం వల్ల వృద్ధి వేగం బాగా పుంజుకోవడమే కాకుండా, ఉద్యోగాల కల్పనకు అసంఖ్యాక అవకాశాలకుతలుపులతెరుచుకుంటాయి.

రచన: ఆదిత్య రాజ్ దాస్, సీనియర్ ఎకనామిక్ జర్నలిస్ట్

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన