ఒసాకాలో బ్రిక్స్ నాయకుల అనధికార సమావేశం


బ్రెజిల్ ప్రభుత్వం, రష్యా సమాఖ్య, భారత్, చైనా, దక్షిణ ఆఫ్రికా (బ్రిక్స్) జపాన్‌లోని ఒసాకాలో జి20 శిఖరాగ్ర సదస్సులో కలిసారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రెజిల్ ప్రెసిడెంట్ జైయిర్ బోల్సోనారో, రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమర్ పుతిన్, చైనా ప్రెసిడెంట్ గ్జి జింపింగ్, దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్ సిరిల్ రామఫోసాలు జి20 అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న జపాన్‌కు అభినందనలు తెలిపారు. అలాగే జపాన్ చేపట్టిన ప్రాధాన్యాలపై కూడా ప్రశంసలు గుప్పించారు. వాటిల్లో వాణిజ్యం, సైన్స్, టెక్నాలజీ, నూతన ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాలు, వాతావరణంలో మార్పులు, విశ్వజనీన ఆరోగ్య కవరేజి, సీనియర్ సిటిజన్స్, సుస్థిర అభివృద్ధి అంశాలు కూడా జపాన్ ప్రాధాన్య అంశాలలో ఉన్నాయి.

ప్రపంచ ఆర్థిక అభివృద్ధి సుస్థిరమవుతోందని ఈ సందర్భంగా ‘బ్రిక్స్’ నాయకులు అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాదికి మరికొంతమేర పెరుగుతుందని, 2020 నాటికి పుంజుకుంటుందని అంచనావేశారు. అయితే, దృఢమైన అభివృద్ధి అనిశ్చితంగానే కొనసాగుతోంది. పెరుగుతున్న వాణిజ్యం, భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు దీనికి ఒక కారణం. అంతేకాదు సరుకుల ధరల్లో అస్థిరత, అసమానత్వం, కలుపుకుపోయే అభివృద్ధి లోటు, ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉండడం వంటివి ఈ పరిస్థితులను మరింత తీవ్రతరం చేస్తున్నాయి. అనుకూల గ్లోబల్ ఆర్థిక పర్యావరణం ప్రాధాన్యతను ఈ సమావేశం నొక్కి చెప్పింది. తద్వారా అంతర్జాతీయ వాణిజ్య సుస్థిర వృద్ధి సాధ్యమవుతుందని ఈ సందర్భంగా బ్రిక్స్ నాయకులు అభిప్రాయపడ్డారు.

గత దశాబ్దకాలంగా బ్రిక్స్ దేశాలు గ్లోబల్ అభివృద్ధిలో కీలకంగా నిలిచాయి. ప్రస్తుతం గ్లోబల్ అవుట్‌పుట్‌లో మూడవ స్థానానికి దగ్గరలో ఉన్నాయి. 2030 నాటికి బ్రిక్స్ గ్లోబల్ ఆర్థిక ప్రగతిలో సగానికి పైగా వాటా సాధిస్తూ ముందుకు కొనసాగే అవకాశం ఉంది. నిర్మాణాత్మక సంస్కరణల అమలును కొనసాగించడం వల్ల బ్రిక్స్ శక్తిమంతంగా వృద్ధి చెందుతుంది. బ్రిక్స్ సభ్యదేశాల మధ్య సమతులమైన వ్యాపార విస్తరణ వల్ల అంతర్జాతీయ వాణిజ్యం వేగం బలోపేతం అయి కొనసాగుతుంది.

బహిరంగ మార్కెట్ల ప్రాధాన్యతను ఈ సందర్భంగా బ్రిక్స్ నాయకత్వం ఉద్ఘాటించింది. ఇది బలమైన ఆర్థిక స్థితిగుతలను సృష్టించడంతో పాటు ఆర్థిక స్థిరత్వాన్ని పటిష్టం చేస్తుంది. అంతేకాదు పకడ్బందీగా రూపొందించిన సూక్ష్మ ఆర్థిక విధానాల మధ్య సహకారం, పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యాలు (పిపిపి) ఎంతో ముఖ్యమైనవి. వీటి ద్వారా కూడా ఆర్థిక స్థితి, వాణిజ్య వృద్ధి పటిష్టమవుతాయి. ఇంకో ముఖ్యాంశం ఏమిటంటే పారదర్శకంగా, వివక్షారహితంగా, బహిరంగంగా, స్వేచ్ఛగా, కలుపుకుపోయే స్వభావంతో ఉండే అంతర్జాతీయ వాణిజ్యానికి బ్రిక్స్ కట్టుబడి ఉంది. రక్షణవాదం, ఏకపక్షవాదాలు డబ్ల్యుటివొ నిబంధనలకు, స్ఫూర్తికి ప్రతిగా ప్రవేశించాయి. బహుపక్షవాదానికి కట్టుబడి ఉన్నామంటూ బ్రిక్స్ సభ్యదేశాల నాయకులు పునరుద్ఘాటించారు. అంతేకాదు అంతర్జాతీయ న్యాయం, నిబంధనలతో కూడిన బహుపక్ష వాణిజ్యంలను డబ్ల్యుటివొలతో కలిసి చేస్తామన్నారు. చర్చల ఎజెండా సమతులంగా ఉండాలి. అంతేకాదు వాటిని బహిరంగంగా చర్చించాలి. పారదర్శకత పాటించాలి. కలుపుకుపోయే విధానం అనుసరించాలి.

మౌలికసదుపాయాల ఫైనాన్సింగ్, సుస్థిర అభివృద్ధి, ఒత్తిడి, దృఢమైన, సమానమైన, నాణ్యమైన పోర్టిఫోలియో ప్రాజక్టుల విషయంలో న్యూ డెవలెప్‌మెంట్ బ్యాంక్ (ఎన్‌డిబి) పాత్రను బ్రిక్స్ ప్రశంసించింది. సభ్యదేశాల్లో క్లిష్టస్థితిలో ఉన్న మౌలికసదుపాయాల పెట్టుబడుల్లోని బకాయిలపై కృషికి సంబంధించి బ్రిక్స్ దృష్టిపెట్టింది. ప్రాంతీయ కార్యాలయాల ఏర్పాటు ద్వారా ఎన్‌డిబి బలోపేతం అవుతుంది. సభ్యదేశాలన్నింటిలో దేశీయ కరెన్సీ వనరులను సమకూర్చడం పట్ల ఎన్‌డిబి నిబద్ధతను బ్రిక్స్ ఆహ్వానించింది. చైనాతో మొదలయి దక్షిణాఫ్రికా, రష్యా కార్యక్రమాలు కూడా ఇందులో ఉన్నాయి.

బ్రిక్స్ నాయకులు ఉగ్రవాదుల దాడులను ఖండించారు. బ్రిక్స్ దేశాలపై ఉగ్రదాడులకు పాల్పడడాన్ని కూడా వ్యతిరేకించింది. ఎవరిపై, ఎక్కడ దాడులు చేసినా ఈ దేశాలు ఖండించాయి. అంతర్జాతీయ న్యాయం భూమికగా ఐక్యరాజ్యసమితి కింద ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి సమిష్ట, సమగ్ర కృషిని బ్రిక్స్ దేశాలు కోరాయి. అంతేకాదు ఉగ్రవాద నెట్‌వర్కులకు ఆర్థిక సహాయం చేయడాన్ని, తమ భూభాగంలో ఉగ్రవాద చర్యలను అరికట్టే చర్యలను చేపడుతూ అన్ని దేశాలు ఉగ్రవాదపోకడలను నిరోధించాల్సిన బాధ్యతను బ్రిక్స్ దేశాలు పునరుద్ఘాటించాయి.

స్వచ్ఛమైన, సరళమైన, శక్తిమంతమైన ఎనర్జీ వ్యవస్థల దిశగా బదలాయింపు జరగడంలో కీలకమైన సహకార అవసరాన్ని బ్రిక్స్ నాయకత్వం గుర్తించింది. దీంతోపాటు గ్రీన్‌హౌస్ గ్యాస్ విడుదల తగ్గించడంతో కూడిన ఎనర్జీ సిస్టమ్స్ కావాలని బ్రిక్స్ భావించింది. ఎనర్జీ భద్రత, ఎనర్జీ అందుబాటు, సుస్థిరత, సరసమైన ధరలు వంటి వాటిని అందివ్వాలి. పారిస్ ఒప్పందం పూర్తి స్థాయి అమలుకు బ్రిక్స్ సభ్యదేశాలన్నీ కట్టుబడి ఉన్నాయి. దీనిని యుఎన్ఎఫ్సిసిసి నిబంధనల కింద చేపట్టారు. ఇందులో సాధారణ నిబంధనలు కూడా ఉన్నాయి. అంతేకాదు వివిధ దేశాల్లోని పరిస్థితులకు అనుగుణంగా విభిన్న స్వభావం ఉన్న రకరకాల బాధ్యతలు, తత్ సంబంధిత సామర్థ్యాలను పరిగణలోకి తీసుకుని దీన్ని అమలు చేయడానికి మ బ్రిక్స్ సభ్యదేశాలు తమ నిబద్ధతను వ్యక్తంచేశాయి. అంతేకాదు ఈ ఏడాది సెప్టెంబరులో జరగనున్న యుఎన్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్ పట్ల కూడా ఇది ఆశాభావాన్ని వ్యక్తంచేస్తోంది. దీనివల్ల అనుకూల పరిణామాలు సంభవించగలవని భావిస్తోంది.

బ్రసిలియాలో ఈ ఏడాది వార్షిక బ్రిక్స్ శిఖరాగ్రసభను బ్రెజిల్ దేశం నిర్వహిస్తోంది. ఈ శిఖరాగ్ర సమావేశం ‘ఎకనామిక్ గ్రోత్ ఫర్ యాన్ ఇన్నోవేటివ్ ఫ్యూచర్’ అన్న అంశంపై జరుగుతుంది. అభివృద్ధి సాధనకు నూతన ఆవిష్కరణలు కీలకమైనవిగా బ్రిక్స్ దేశాల బృందం గుర్తించింది. డిజిటలైజేషన్ లాభాలను మరింత పెంపొందించే దిశగా, అలాగే నూతన సాంకేతికపరిజ్ఘానాన్ని అభివృద్ధిపరిచే విషయంలో ఎంతో నిబద్ధతతో కృషి చేస్తామని బ్రిక్స్ నాయకులు పునరుద్ఘాటించారు. అంతర్జాలం సహాయంతో పేదరిక నిర్మూలన, పారిశ్రామికరంగాన్ని పూర్తిగా డిజిటలైజేషన్ చేయడం అంశాలను ప్రోత్సహిస్తామని బ్రిక్స్ దేశాల బృందం స్పష్టంచేసింది. అలాగే శాస్త్ర, సాంకేతిక నూతన ఆవిష్కరణలు, బ్రిక్స్ సభ్యదేశాల మధ్య ఔత్సాహికపారిశ్రామికరంగ సహకారం వంటి అంశాలను నొక్కిచెప్పారు. బ్రిక్స్ పార్టనర్‌షిప్ ఆన్ న్యూ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ (పార్ట్ ఎన్ఐఆర్), ఐబ్రిక్స్ నెట్‌వర్కు, బ్రిక్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యూచర్ నెట్‌వర్క్సు, యంగ్ సైంటిస్ట్స్ ఫోరమ్‌ల ద్వారా కూడా తమ కృషి కొనసాగిస్తామని బ్రిక్స్ దేశాలు స్పష్టంచేశాయి.

రచన: పదం సింగ్, ఎఐఆర్, వార్తా విశ్లేషకులు

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన