మోదీ 2.0 లో భారత విదేశాంగ విధాన కార్యక్రమాలు
ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ విజయదుందుభి మోగించారు. 900 మిలియన్ల పైగా ఓటర్లు ఆయనకు ఓటు వేసి మోదీ చేతికి తిరిగి అధికార పగ్గాలు ఇచ్చారు. 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేశంలోని అన్ని రంగాలలో గొప్ప మార్పును తీసుకొచ్చేలా ప్రధాని పలు చర్యలను దేశ విదేశాంగ విధానంలో చొప్పించారు. అంతేకాదు రానున్న ఐదు సంవత్సరాల కాలంలో భారత విదేశాంగ విధాన కార్యకలాపాలకు పలు అవకాశాలను మోదీ కల్పించారు.
ప్రధాని మోదీ ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ కింద అందరినీ పాలనలో కలుపుకుపోతామంటూ ఈ సందర్భంగా ప్రకటించారు. ఇది ఆయన ప్రభుత్వ విధానాల తీరును అద్దంపడుతుంది. భారత విదేశాంగ విధానం ప్రధానంగా భారత అంతర్జాతీయ కార్యకలాపాలను విస్తృతం చేయడం ద్వారా అందరినీ కలుపుకుపోయే పాలనను లక్ష్యంగా పెట్టుకున్నారు. తద్వారా భారత స్వరూప స్వభావాలను మార్చాలన్న దానిపై మోదీ దృష్టి పెట్టారు.
అలాగే పెరుగుతున్న అంతర్జాతీయ విచ్ఛిన్నకర వాతావరణంలో పెద్ద అంతర్జాతీయ శక్తులైన చైనా, అమెరికా, రష్యాలాంటి దేశాలతో భారత సంబంధాల సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలన్నది భారత విదేశాంగ విధాన ప్రధాన లక్ష్యం. పైన పేర్కొన్న ప్రతి దేశంతో సంబంధాలు పెట్టుబడులు, సామగ్రి, సాంకేతికపరిజ్ఘానం వంటి అంశాల పరంగా ఎంతో కీలకమైనవి. ఇవి భారత భద్రత, సాధికారతలకు, భారతదేశ రూపురేఖలు మార్చడానికి అవసరం. ప్రపంచలోని పెద్ద ఆర్థిక వ్యవస్థలున్న అమెరికా, చైనా, యురోపియన్ కూటమి, జపాన్, ఏసియన్, రష్యా వంటి దేశాలతో పర్సస్పర సంభాషణలకు ఇవి ముఖ్యం.
పొరుగుదేశాల భద్రత భారత్‌కు ఎంతో అవసరం. దీనివల్ల భారత్ ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగ గలదు. శాంతి, భద్రతలు లేకపోతే సుస్థిర అభివృద్ధి అసాధ్యమనే విషయాన్ని భారత అభివృద్ధి స్పష్టం చేస్తోంది. భారత్‌కు భూ, సముద్ర సరిహద్దులతో పాటు సర్వత్రా అనుకూల వాతావరణం ఏర్పడేలా భారత విదేశాంగ విధానంలో ప్రాధాన్యం ఇవ్వడం కూడా కీలక అంశం. ఇందుకోసం పొరుగుదేశాలతో భారత్ సమిష్టి విధానం అనుసరించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడ్డం, వేగవంతమైన సుస్థిర సామాజిక-ఆర్థిక అభివృద్ధికి ఇది చాలా అవసరం.
ఆసియాలో, రానున్న ఐదు సంవత్సరాల కాలంలో భారత మూల ప్రయోజనాలకు ఉపయోగపడేలా ఇండో-ఫసిఫిక్ వ్యూహాత్మక నిర్మాణాన్ని ఆఫ్రికా తీరం నుంచి అమెరికా వరకూ అనుకూలంగా ఉండేందుకు అవకాశాలు లేకపోలేదు. మార్చి, 2015లో ప్రధాని నరేంద్రమోదీ ‘సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ది రీజియన్’ (ఎస్ఎజిఎఆర్, సాగర్) ప్రకటనలో, అలాగే జూన్, 2018 సంవత్సరంలో సింగపూర్‌లో జరిగిన షాంగ్రి-లా-డయలాగ్‌లో చేసిన ప్రకటనలు ఇదే విషయాన్ని స్పష్టంచేస్తున్నాయి. మోదీ ప్రభుత్వం భారత విదేశాంగ విధానానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇది హిందూ మహాసముద్రంలో సుస్థిర, భద్రతాకరమైన ‘బ్లూ ఎకానమీ’కి రోడ్ మ్యాప్‌ని తయారుచేసే పనిలో ఉన్నారు. ఇది భారత్ మార్పు చెందడంలో ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది.
పశ్చిమ ఇండో-ఫసిఫిక్‌లో గత ఐదు సంవత్సరాల కాలంలో చేపట్టిన చారిత్రాత్మక కార్యక్రమాల ఆధారంగా భారత విదేశాంగ విధానం రూపొందించే అవకాశాలు ఉన్నాయి. వీటిల్లో గల్ఫ్, పశ్చిమ ఆసియాలు కూడా ఉన్నాయి. ఈ దేశాలలో మొత్తం ఎనిమిది మిలియన్ల భారతీయులు నివసించడమే కాదు అక్కడ తమ సేవలను అందిస్తున్నారు కూడా. భారత ఎనర్జీ, ఆర్థికరంగాలకు పటిష్టమై దౌత్య నిర్వహణ ఆవశ్యకత ఎంతో ఉంది. గల్ఫ్ ఆఫ్ ఎడెన్, స్ట్రైట్స్ ఫ్ హార్మోజ్లౌలను తెరిచి ఉంచడం చాలా అవసరం. వాటి ద్వారా సముద్ర మార్గాల కమ్యూనికేషన్‌కై భారత వాణిజ్యం, డిజిటల్ అనుసంధానతల సాధనలకు పటిష్టమైన దౌత్యం చాలా అవసరం.
న్యూఢిల్లీ వ్యూహాత్మక అవసరాలకు అనుగుణంగా అనుసంధాన ప్రాజక్టులైన ఛబాహర్ లాంటి ప్రాజక్టులను పూర్తిచేయాల్సిన అవసరం ఉంది. దీనివల్ల భూమార్గం లేని ఆసియన్ దేశాలైన ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా దేశాలకు అంతర్జాతీయ పెట్టుబడులు, మార్కెట్లకు అవకాశాలు ఏర్పడతాయి. ఈ కార్యక్రమాలు పశ్చిమ ఇండో-ఫసిఫిక్ ప్రాంతంలో సంపూర్ణ భద్రత విషయంలో భారత పాత్రను బాగా పెంచుతాయి కూడా.
గత ఐదు సంవత్సరాలలో జరిగిన ఇండియా-ఆఫ్రికన్ ఫోరమ్ శిఖరాగ్ర సమావేశం, ఫోరమ్ ఫర్ ఇండియా-ఫసిఫిక్ ఐలెండ్స్ కో-ఆపరేషన్, ఇండియా-కమ్యూనిటీ ఆఫ్ లాటిన్ అమెరికన్ అండ్ కరేబియన్ స్టేట్స్ సమావేశాల్లో చేసిన ప్రతిపాదనల అమలు పరంగా భారత విదేశాంగ విధానం దృష్టిసారించాల్సి ఉంది. దీని వల్ల అంతర్జాతీయంగా భారత పేరుప్రఖ్యాతలు బాగా పెరుగుతాయి. అంతేకాదు ఆయా దేశాల్లో భారత దేశానికి చెందిన వివిధ జాతుల ప్రజల జీవితాలు కూడా వృద్ధిచెందుతాయి.
సరికొత్త సాంకేతిక పరిజ్ఘానం వేగంగా అభివృద్ధి చెందుతూ ముందుకు సాగుతోంది. ఇది నాల్గవ పారిశ్రామిక విప్లవం దిశగా పయనిస్తోంది. ఇది కూడా 21వ శతాబ్ద ప్రపంచ రూపురేఖలను మార్చడంలో భారత విదేశాంగ విధానానికి ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. తన అంతర్జాతీయ కార్యక్రమాలలో భారత్ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ కొత్త సాంకేతికపరిజ్ఘానం వినియోగంతో పాటు గ్లోబల్ ఎలక్ట్రానిక్ కామర్స్ పరంగా కొత్త నిబంధనలను స్థిరపరచాలి. ఇలా చేయడం డిజిటల్ ఇండియా మీద నేరుగా ప్రభావం చూపుతుంది. అంతేకాదు విస్తృత జనాభా గల భారత సాధికారతపై కూడా ప్రత్యక్షంగా ప్రభావం చూపుతుంది.
2020, జూన్‌లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో రెండు సంవత్సరాల పాటు అంటే 2022 వరకూ భారత్ నాన్-పర్మినెంట్ సభ్యదేశంగా ఎన్నిక అవుతుంది. 2021 సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సంఘానికి మూడు సంవత్సరాల కాలపరిమితికి భారత్ తిరిగి ఎన్నిక కావలసి ఉంది. ఈ పదవీ కాలం 2024 సంవత్సరానికి ముగుస్తుంది. 2022 సంవత్సరంలో భారత్ జి-20 కి ఛైయిర్‌గా వ్యవహరించనుంది. ఇలా పలు బహుపక్ష నాయకత్వ పాత్రలను పోషిస్తూ అంతర్జాతీయ సంబంధాలలో ‘థాట్ లీడర్’ గా భారత్ ప్రాధాన్యం సంతరించుకుంది. తద్వారా అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించే స్థితిలో ఉంది. భారత్ సరికొత్తగా రూపాంతరం చెందడానికి చేస్తున్న కృషిలో అంతర్జాతీయ సహకారం ఎంతో కీలకమైంది.
Comments
Post a Comment