2019 ఐసిసి ప్రపంచ కప్ ప్రారంభం

‘జంటిల్మన్ ’ క్రీడగా పేరొందిన క్రికెట్ 12వ వరల్డ్ కప్ పోటీలకు ఇంగ్లండ్, వేల్స్ కలిసి ఆతిథ్యం ఇస్తున్నాయి. ఇవి మే 30 వ తేదీ నుంచి జూలై 14 వ తేదీ వరకూ జరుగుతాయి. ఐసిసి ( గతంలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ) ఒకటిన్నర నెల పాటు సుదీర్ఘంగా జరిగే టోర్నమెంట్. క్రికెట్ వరల్డ్ కప్ క్రీడలు ఇంగ్లండ్, వేల్స్‌ లలో ఐదవ పర్యాయం జరుగుతున్నాయి. గతంలో 1975, 1979, 1983, 1999 సంవత్సరాలలో ప్రపంచ క్రికెట్ కప్ పోటీలు ఇక్కడే జరిగాయి.

క్రికెట్ ఆడే దేశాలు కొన్నే అయినప్పటికీ వాటిల్లో చాలా బ్రిటిష్ సామ్రాజ్యంలో వలసలుగా ఉన్నవే. అందుకే ఆ ప్రాంతాలలో క్రికెట్‌ని ఇష్టపడేవారు బాగా ఉన్నారు. ఫుట్‌బాల్, లాన్ టెన్నిస్ తర్వాత క్రికెట్‌ ప్రేమికులు, వీక్షకుల సంఖ్యే ఎక్కువ. భారత ఉపఖండంలో క్రికెట్ అంటే మతమంత ప్రేమ, ఇష్టం కనిపిస్తాయి. ఇక క్రికెటర్లు ప్రజలకు దేవుడి తర్వాత దేవుళ్లు. ఉపఖండంలోని క్రికెట్ టీముల మధ్య పోటీ కూడా ఎక్కువే. కొన్నిసార్లు అది మితిమీరిన వెర్రిగా పరిణమించే పరిస్థితులను కూడా చూస్తాం. ఇక ఇప్పటి వరకూ ప్రపంచ కప్ క్రికెట్ విజేతల్లో ఇండియా, శ్రీలంక, పాకిస్తాన్ల మధ్యనే నాలుగు పర్యాయాలు ప్రపంచకప్ కైవసమైంది. క్రికెట్‌కి ప్రపంచమంతా ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఒక మాజీ క్రికెటర్ ఉపఖండంలోని ఒక దేశానికి ప్రధాని. దక్షిణ ఆసియా ప్రాంతంలో ప్రముఖ క్రికెట్ దేశాలుగా పేరొందిన చోట్ల కూడా ఎందరో క్రికెటర్లు మంత్రులుగా, శాసనసభ్యులుగా ఉన్నారు. క్రికెట్ పుట్టింది ఇంగ్లండ్‌లో కానీ ఇప్పటివరకూ ఆ దేశం ఒక్కసారి కూడా ప్రపంచకప్పును గెలుచుకునే అదృష్టాన్ని కైవసం చేసుకోకపోవడం విచారకరం.

ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ క్రికెట్ కప్ పోటీల్లో తొలి మ్యాచ్ లండన్‌లోని ఓవల్‌లో జరుగుతోంది. ఈ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ దక్షిణాఫ్రికాతో కలిసి ఆడుతుంది. వరల్డ్ కప్ ఫైనల్స్ క్రికెట్ మక్కాగా పేరొందిన లార్డ్స్ ప్రాంగణంలో జరుగుతాయి.

టోర్నమెంట్ ఫార్మేట్‌లో పది టీములు సింగిల్ గ్రూపుగా ఉంటుంది. వీటిల్లో ప్రతి టీమ్ మిగతా తొమ్మిది టీములతో ఒకసారి ఆడుతుంది. గ్రూప్ చివరి దశలో టాప్‌లో ఉన్న నాలుగు టీములు సెమీఫైనల్స్‌ పోటీలకు వెడతాయి. అసోసియేట్ టీమ్స్ టోర్నమెంటులో లేకపోవడంపై పది టీములతో కూడిన టోర్నమెంట్ విమర్శలకు గురవుతోంది. 2017 జూన్‌లో ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్ దేశాలకు కూడా గ్రూపులో స్థానం కల్పించారు. దీంతో ఈ దేశాల సంఖ్య పది నుంచి 12కి పెరిగింది. దీంతో టెస్ట్ ప్లేయింగ్ దేశాలు లేకుండా పోటీపడిన తొలి ప్రపంచ కప్ ఇదే అవుతుంది. క్వాలిఫైయింగ్ టోర్నమెంటులో అసోసియేట్ టీమ్స్ అర్హత పొందలేదు.

ఈ పోటీలను నిర్వహిస్తున్న ఇంగ్లండ్ క్రీడాకారులే ఆ దేశ ప్రజల ఫేవరేట్ అని వేరే చెప్పక్కర్లేదు. కానీ భారత దేశ క్రికెట్ టీమ్ పట్ల ఎందరో అభిమానుల చూపు ఉంది. భారతదేశం క్రికెట్ ప్రపంచకప్పును రెండు పర్యాయాలు కైవసం చేసుకుంది. తొలిసారి 1983లో కప్పు సాధిస్తే, మళ్లా 2011 సంవత్సరంలో ప్రపంచ క్రికెట్ కప్పును మనవాళ్లు సాధించారు. 2003 సంవత్సరంలో భారత్ రన్నరప్‌గా నిలిచింది. 2015 సంవత్సరంలో ఆస్ట్రేలియాలో జరిగిన ప్రపంచ క్రికెట్ కప్పు పోటీల్లో భారత్ సెమీ-ఫైనల్స్ దశ వరకూ వచ్చింది. భారత్ కాకుండా ఇతర దేశాల క్రికెట్ టీములు అంటే ఆస్ట్రేలియా, దక్షిణ ఆఫ్రికా, న్యూజిలాండ్, వెస్ట్ ఇండియన్స్‌ కు కూడా అభిమానులు బాగా ఉన్నారు. అయినా, ప్రపంచ క్రికెట్ కప్పు పోటీల్లో ఏ టీమును కూడా తక్కువగా అంచనావేయలేం.

భారత క్రికెట్ టీమ్‌కి విరాట్ కోహ్లీ సారథ్యం వహిస్తున్నారు. కోహ్లీ ఎందరికో స్ఫూర్తినిస్తున్న క్రికెట్ క్రీడాకారుడు మాత్రమే కాదు ఆటలో అన్ని పరిస్థితుల్లోనూ మంచి పోరాటపటిమ చూపడంలో దిట్ట. ఇకపోతే క్రికెట్ ఆటలోని బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డిండ్ వంటి అన్ని విభాగాల్లోనూ భారత టీమ్ బలమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. స్టంప్స్ వెనుక కాపుకాసే మహేంద్ర సింగ్ ధోని టీమ్‌లో సీనియర్ ఆటగాడు. అంతేకాదు 2011, 2015 సంవత్సరాలలో భారత టీమ్‌కి కేప్టన్‌గా వ్యవహరించాడు. భారత క్రికెట్ బృందంలో ధోనీ ఎంతో కీలక పాత్ర పోషించారు. ఏ క్రికెట్ అభిమాని కూడా ధోని 2011లో ముంబయిలోని వాన్ఖేడ్ స్టేడియంలో శ్రీలంకపై కొట్టిన ‘విన్నింగ్ సిక్సర్’ షాట్‌ను మరవలేరు. ఇది సచిన్‌కు వరల్డ్ కప్ బహుమతిని అందిచ్చిందని చెప్పాలి. క్రికెట్ చరిత్రలో సచిన్ ఓ అద్భుత చరిత్ర.

ఈ వరల్డ్ కప్ పోటీలో భారత్ జూన్ 5వ తేదీన దక్షిణాఫ్రికాపై సౌథాంప్టన్‌లోని రోజ్ బౌల్ స్టేడియంలో ఆడనుంది. ఆతర్వాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లతో జూన్ 9, 13 వ తేదీల్లో ఆడనుంది. ఆ తర్వాత భారత్ తన చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్‌పై జూన్ 16వ తేదీన మాంచెస్టర్‌లోని ట్రాఫోర్డ్ మైదానంలో ఆడనుంది. ఈ టోర్నమెంటు టికెట్లు అన్నీ ఇప్పటికే అమ్ముడయిపోయాయి. వరల్డ్ కప్‌ టోర్నమెంటులో భారత్ ఎన్నడూ పాక్ చేతుల్లో ఓడలేదు. ఈ రికార్డును ఇంతవరకూ భారత క్రికెట్ బృందం కొనసాగిస్తూనే వచ్చింది. దీని తర్వాత బారత్ కొత్తగా ప్రపంచ క్రికెట్ పోటీల్లోకి అడుగుపెట్టిన ఆఫ్ఘనిస్తాన్‌ టీమ్‌తో బరిలోకి దిగుతుంది. అలాగే వెస్ట్ ఇండీస్, ఈ పోటీల ఆతిథ్య దేశమైన ఇంగ్లండ్‌, బంగ్లాదేశ్, శ్రీలంకలతో కూడా భారత్ ఆడుతుంది.

తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జూలై 9న మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో తొలి, నాల్గవ క్వాలిఫైయర్స్ మధ్య పోటీ జరుగుతుంది. రెండు, మూడు క్వాలిఫైయర్ల మధ్య రెండవ సెమీ ఫైనల్స్ జూలై 11న బ్రిమింగ్‌హామ్ లోని ఎడ్గ్‌బాస్టన్‌లో పోటీ ఉంటుంది. క్రికెట్ ప్రపంచ కప్ పోటీల్లో విజేత అయిన దేశానికి ట్రోఫీతో పాటు నాలుగు మిలియన్ అమెరికన్ డాలర్ల క్యాష్ ప్రైజు ఇస్తారు. క్రికెట్ అభిమానులందరూ ఇంగ్లీష్ ద్వీపాల మీద దిగుతున్నారు. ఇది ఇంగ్లీష్ సమ్మర్ వేడిని బద్దులుచేస్తుందనడంలో సందేహం లేదు.

రచన: కౌశిక్ రాయ్, ఎఐఆర్: వార్తా విశ్లేషకులు

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన