ప్రయోగించనున్న భారత చంద్రయాన్-2 మిషన్

భారత చంద్రయాన్-2 మిషన్‌ని ఈ ఏడాది జూలైలో ప్రయోగించాలనుకున్నారు. ఇందులో 13 పేలోడ్స్ ఉన్నాయి. వీటిని దేశంలోని వివిధ అధ్యయన సంస్థలు రూపొందించాయి. వీటి ద్వారా విస్తృతస్థాయిలో శాస్త్ర ప్రయోగాలను చేపట్టాలనుకుంటోంది ఇస్రో. అంతేకాదు డేటా సేకరణ కూడా చేపట్టాలని భావిస్తున్నట్టు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘ఇస్రో’ తెలిపింది. ఈ స్పేస్‌క్రాఫ్ట్ 3.8 టన్నుల బరువు ఉంది. ఇందులో మూడు మాడ్యూల్స్ ఉన్నాయి. ఒకటి ఆర్బిటర్, రెండు లాండర్ (విక్రమ్), మూడు రోవర్ (ప్రజ్ఘాన్). నాసా ప్రయోగించిన మాడ్యూల్ భూమి, దాని సహజ ఉపగ్రహం మధ్య ఉన్న దూరం కొలవడం లక్ష్యంగా  ప్రయోగించారు. చంద్రయాన్-2 మిషన్ ప్రయోగానికి అన్ని మాడ్యూల్స్ సర్వ సన్నద్ధంగా ఉన్నాయి. దీన్ని జూలై 9-6 మధ్య లక్ష్యంగా పెట్టుకున్నారు. సెప్టెంబరు ఆరవతేదీ నాటికి అది చంద్రడిపై దిగేలా ప్రణాళిక వేశారు. ఈ విషయాలను అంతరిక్ష ఏజెన్సీ వెల్లడించింది. ఆర్బిటర్ చంద్రుడి ఉపరితలం నుంచి వంద కిలోమీటర్ల కక్ష్యలో తిరుగుతుంది. లాండర్ (విక్రమ్) చంద్రుడి దక్షిణ ధృవ సమీపంలో జాగ్రత్తగా దిగుతుంది. ఇక రోవర్ అంటే ప్రజ్ఘాన్ అక్కడి పరిస్థితులపై ప్రయోగాలను నిర్వహిస్తుంది.


చంద్రయాన్-1 భారీ విజయం సాధించింది. అంతేకాదు చంద్రుడిపై నీరు ఉందన్న విషయాన్ని కనుగొనడం ద్వారా పెద్ద విజయాన్ని సాధించింది. ఇందులో మొత్తం ఐదు విదేశీ పేలోడ్స్ ఉన్నాయి. వీటిల్లో మూడు యూరప్‌కు చెందినవి కాగా, రెండు అమెరికాకు చెందినవి. చంద్రయాన్-2 ఉన్నత సాంకేతిక పరిజ్ఘానం కలది. చంద్రుడిపై చేసిన మిషన్స్‌ లో  అత్యంత అధునాతనమైనది.

‘ఇస్రో’ ఛైర్మన్ డా. కె శివన్ మాట్లాడుతూ  ఐదురకాల వాహనాలతో కూడిన లాండర్ ‘విక్రమ్’ సెప్టెంబరు ఆరు, లేదా దానికి అటు ఇటుగా  చంద్రుడిపై దిగితే, రొబోటిక్ రోవర్, ప్రజ్ఘాన్‌లు చంద్ర గ్రహం చుట్టూ ఉన్న ప్రదేశం మొత్తాన్ని శోధిస్తాయని తెలిపారు. ప్రజ్ఘాన్ చంద్రుడి ఉపరితలంపై 300-400 మీటర్లలో విడుదలవుతుంది. ప్రజ్ఘాన్ చంద్రుడిపై  భూగ్రహ లెక్కల్లో మొత్తం పధ్నాలుగు రోజులు ఉంటుందని భావిస్తున్నారు. ఈ సమయంలో వివిధ రకాల ప్రయోగాలను అది నిర్వహిస్తుందని డా శివన్ తెలిపారు. చంద్రుడి ఉపరితలంపై పరిశోధించిన వివిధ అంశాలను రోవర్ అంచనా వేస్తుంది. తర్వాత డేటాను, సంబంధిత చిత్రాలను ఆర్బిటర్ ద్వారా కేవలం పదిహేను నిమిషాల్లో భూమికి పంపుతుంది. ఈ స్పేస్‌క్రాఫ్ట్ ఆర్బిటర్‌తో  కలిపి 3,800 కిలోల బరువు ఉంటుంది. ఈ ఆర్బిటర్ నూరు కిలోమీటర్ల దూరం నుంచి చంద్రుడిని చుడుతుంది.

ఇస్రో ఛైర్మన్ డా. కె. శివన్ మాట్లాడుతూ అనుకున్న సమయానికి చంద్రుడి దక్షిణ ధృవం పై  దిగిలా ఇస్రో చేపట్టిన చంద్రయాన్-2 మిషన్ ఎంతో సంక్లిష్టమైనదన్నారు. పోలిక తెస్తే, చంద్రయాన్-1లోని మూన్ ఇంపాక్ట్ ప్రాబ్ (ఎంఐపి) సాఫ్ట్‌ గా చంద్రడిపై దిగడానికి వీలుగా డిజైన్ చేయలేదు.  ఇస్రో దీనిపై వివరిస్తూ ‘ఇప్పటి వరకూ ఎవ్వరూ వెళ్లని చంద్రుడి దక్షిణ ధృవంపై మనం దిగడానికి వెళ్లనున్నామని జనవరిలో వ్యాఖ్యానించింది. దీనిపై ఇప్పటివరకూ ఎవ్వరూ పరిశోధనలు, అధ్యయనాలు చేపట్టలేదు.  చంద్రయాన్ మిషన్-1కి అత్యాధునిక వెర్షనే చంద్రయాన్-2 మిషన్. చంద్రయాన్-1లో మొత్తం 11 పేలోడ్స్ ఉన్నాయి. వాటిల్లో ఇండియా నుంచి ఐదు, యూరప్ నుంచి మూడు, అమెరికా నుంచి రెండు, బల్గేరియా నుంచి ఒకటి ఉన్నాయి. ఈ మిషన్ ద్వారానే చంద్ర గ్రహంపై నీటి ఉనికిని  కనుగొని పెద్ద విజయాన్ని సాధించాం.

చంద్రయాన్-2ని చంద్రుని ఉపరితలంపై భారత్ విజయవంతంగా ప్రయోగించిన పక్షంలో, అలాంటి విజయం సాధించిన ప్రపంచ దేశాల్లో భారత్ నాల్గవ దేశం అవుతుంది. ఇప్పటివరకూ చంద్రడిపై స్పేస్‌క్రాఫ్ట్‌ని విజయవంతంగా ప్రయోగించిన   రష్యా, అమెరికా, చైనాల తర్వాత ప్రపంచంలో నాల్గవ దేశంగా భారత్ నిలవాలని కోరుకుంటోంది. ఈ విషయంలో ఇజ్రాయిల్ చాలావరకూ విజయవంతం అయినా కూడా చివరి నిమిషంలో చంద్రుడిపై ‘బెరీషీట్’ ఏప్రిల్ 12న దిగాలన్న ప్రయత్నం విఫలమైంది. కానీ ఇది అనుకున్నంత సులభం కాదు. బరీషీట్ ప్లెయిన్‌గా ఉన్న ఉపరితలంపై దిగాలని ప్రయత్నించింది. ఈ ఉపరితలం ‘సీ ఆఫ్ సెరినిటీ’ అనే లావా గట్టిపడడంతో ఏర్పడింది. సూర్యుని ప్రభావం లేని చదునైన ఉపరితలం ఇది. అయితే చంద్రయాన్-2 చంద్రుడి దక్షిణ ధృవంపై దిగనుంది. దీనిపై దిగే ప్రయత్నం ఇప్పటి వరకూ ఒక్క చైనా తప్ప మరే దేశం చేయలేదు.

ఈ జనవరిలో చైనా చాంగే స్పేస్‌క్రాఫ్ట్‌ని డార్క్ సైడ్ అనే పిలిచేప్రాంతంలో దించిందనే విషయం తెలిసిందే. డార్క్ సైడ్ అని ఈ ప్రాంతాన్ని పిలవడానికి కారణం భూమికి దూరంగా ఉండడమే కారణం. అంతేకాదు దీని గురించి చాలామందికి తెలియదు.  

చంద్రయాన్-2 మిషన్ ఇస్రో ప్రయోగాలలో మరో ముఖ్యమైన అంతరిక్ష కార్యక్రమంగా చెప్పాలి. ఇప్పటికే  అంతరిక్ష ప్రయోగాలలో అంతర్జాతీయంగా పేరున్న ప్రముఖ దేశాలలో ఒకటిగా భారత్ పేరుపొందింది. చంద్రయాన్-2 మిషన్ కూడా ఇస్రో విజయపరంపరలో ఒకటి అవుతుందనడంలో సందేహంలేదు.

రచన: యోగేష్ సూద్, జర్నలిస్ట్

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన