పర్షియన్ గల్ఫ్ ఘర్షణ దిశగా పయనిస్తోందా?

ఇటీవల అమెరికా, దాని మిత్రదేశాల మధ్య తీవ్ర వాగ్విదాలు చోటుచేసుకున్నాయి. మరోవైపు ఇరాన్ పర్షియన్ గల్ఫ్‌ లో ఉద్రిక్తలను తీవ్రతరం అవుతున్నాయి. వాషింగ్టన్, టెహ్రాన్‌ల మధ్య నలుగుతున్న సమస్య చాలా పెద్దది, ఎంతో సంక్లిష్టమైంది కూడా. అమెరికా జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ (జెసిపివొఎ) నుంచి లేదా ఇరాన్ అణు ఒప్పందం నుంచి గత ఏడాది మేలో అమెరికా విరమించుకున్న తర్వాత పరిస్థితులు మరింత తీవ్రతను సంతరించుకున్నాయి. ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ తన చర్యలతో ఆ ప్రాంతాన్ని అస్థిరతకు గురిచేస్తోందంటూ నిందించారు. అంతేకాదు అణ్వాయుధ ఒప్పందం చేసుకున్నప్పటికీ అణ్వాయుధాల తయారీ, బాలిస్టిక్ క్షిపణుల తయారీకి ఇరాన్ పాల్పడుతోందంటూ ఆరోపించారు. అప్పటి నుంచి తిరిగి అమెరికా ఇరాన్‌పై ఏకపక్షంగా ఆర్థిక ఆంక్షలను విధించింది. ఇలా ఆర్థిక ఆంక్షలను విధించడం ద్వారా టెహ్రాన్‌పై తీవ్ర ఒత్తిడి తీసుకురావాలని, అణ్వాయుధ ఒప్పందంపై చర్చలకు ఇరాన్ మళ్లా దిగేలా చేయాలని అమెరికా భావించింది. కానీ ఇరాన్ మాత్రం అమెరికా ప్రయత్నాలను ఎదుర్కొంది. అమెరికా కోరుకున్నట్టు చేయడానికి ఇరాన్ పూర్తిగా వ్యతిరేకించింది. ఒప్పందం నుంచి అమెరికా తొలగి మే8, 2019కి సంవత్సరం పూర్తయిన సందర్భంలో తమ ఆర్థిక రంగంపై అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షల ఒత్తిడిని యూరోపియన్ దేశాలు, రష్యా, చైనాలు సరళం చేసేలా సహాయం చేయాలని ఇరాన్ కోరింది. కానీ అది విఫలం కావడంతో అణు ఒప్పందం నుంచి వెనకడుగు వేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.

ప్రస్తుతం అంతర్జాతీయ సమాజం చూపు ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణంపైనే ఉంది. పర్షియన్ గల్ఫ్‌ లో యుద్ధ నౌకలను దింపడానికి ‘యుఎస్ఎస్ అరిలింగ్టన్’, ‘పేట్రియాట్’ లను సెంట్రల్ కమాండ్ (సిఇఎన్‌టిసివొఎం )కి అమెరికా పంపింది. దీనిపై ప్రతిస్పందిస్తూ తన అధికార ప్రకటనలో ఒకవేళ యుద్ధం సంభవిస్తే పర్షియన్ గల్ఫ్‌ లోని అమెరికా యుద్ధనౌకలను టార్గెట్ చేస్తామని ప్రకటించింది. అదే సమయంలో యుఎఇ లోని ఫుజైరా తీరంలో సౌదీ చమురు ట్యాంకులపై తలపెట్టిన విద్రోహచర్యతో అరేబియన్ గల్ఫ్‌ దేశాలు తీవ్రంగా ఆందోళన చెందాయి. అరేబియన్ గల్ఫ్ దేశాల ప్రయోజనాలను దుష్టశక్తుల చర్యలు దెబ్బతీస్తాయనే ఆలోచనలు ఆ దేశాలను వెంటాడుతున్నాయి. సౌదీ అరేబియాలోని రెండు చమురు ఉత్పత్తి కేంద్రాలపై డ్రోన్ ద్వారా దాడులకు పాల్పడిన సంఘటనతో గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తలు మరింత తీవ్రమయ్యాయి.

ఈ నేపథ్యంలో, సౌదీ అరేబియా, యుఎఇల దృష్టి ఇరాన్‌పై పడింది. ఇరాన్‌పై తగిన చర్యలతో స్పందించాల్సిన అవసరం ఉందని భావించాయి. తద్వారా ఆ ప్రాంతంలో సౌదీ, ఎమిరేట్ల ప్రయోజనాలు దెబ్బతినకుండా ఇరాన్ దాడులకు పాల్పడకుండా నివారించాలని భావించాయి. సౌదీ విదేశాంగ వ్యవహారాల మంత్రి అదెల్ అల్-జుబైర్ మాట్లాడుతూ సౌదీ అరేబియా యుద్ధానికి అనుకూలంగా లేకపోయినా, ఇరాన్ రెచ్చగొట్టే చర్యలకు తప్పకుండా సమాధానం చెపుతుందన్నారు. ఇరాన్ తమను టార్గెట్ చేస్తుందన్నది సౌదీ ఆందోళన. అందుకే సౌదీ రాజు హఠాత్తుగా మక్కాలో మే 30 వ తేదీన అరబ్, గల్ప్ దేశాలతో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. త్వరలోనే ఇస్లామిక్ శిఖరాగ్ర సదస్సు కూడా జరుగుతుండడంతో ఈ సమావేశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. పర్షియన్ గల్ఫ్‌ లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తపరిస్థితులతో పాటుగా సమిష్టిగా వాటిపై ఎలా స్పందించాలన్న అంశాలను కూడా ఇందులో చర్చించనున్నారు.

రియాద్, టెహ్రాన్‌ల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకీ పెరుగుతోంది. పరిమిత స్థాయిలో యుద్ధం లేదా పూర్తి స్థాయిలో యుద్ధావకాశాలను పూర్తిగా కొట్టివేయలేము. ఈ పరిస్థితి ఆ ప్రాంత వినాశనానికి కారణమవుతుంది. అంతేకాదు ఈ దుష్ప్రభావం ప్రపంచమంతటిపై కూడా పడుతుంది. మరీ ముఖ్యంగా ఏసియన్ ఆర్థికరంగంపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే ఏసియన్ దేశాలు తమ ఎనర్జీ భద్రత పరంగా ఈ ప్రాంతం నుంచి వచ్చే చమురు దిగుమతులపై భాగా ఆధారపడి ఉన్నాయి.

సౌదీ అరేబియాలో ఉన్న చమురు కేంద్రాలపై డ్రోన్ దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడడంపై కృతనిశ్చయంతో ఉన్నట్టు పునరుద్ఘాటించింది. అంతేకాదు అన్ని రకాల హింసాత్మక చర్యలపై, పరిణామాలపై కూడా పోరాడతామని భారత్ పేర్కొంది. పర్షియన్ గల్ఫ్‌ లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై భారత శైలి విస్పష్టం. పర్షియన్ గల్ఫ్‌ లోని శత్రుపక్షాలు అన్నీ ఏకతాటిపై నడుస్తూ స్నేహంగా తమ మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకోవాలని భారత్ కోరుతూవస్తోంది. యుద్ధానికి దిగవద్దని హితవు పలుకుతోంది. ఈ ప్రాంతంలో భారత్‌కు ఎన్నో బలమైన ప్రయోజనాలు ఉన్నాయి. అంతేకాదు గల్ఫ్ దేశాలన్నింటితోనూ భారత్‌కు మంచి ద్వైపాక్షిక స్నేహ సంబంధాలు ఉన్నాయి. భారత ఎనర్జీ సెక్యూరిటీ విషయంగా కూడా ఈ ప్రాంతం ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. గల్ఫ్ కో-ఆపరేషన్ కంట్రీస్ (జిసిసి) లో మొత్తం 8.5 మిలియన్లమంది భారత ప్రజలు నివసిస్తున్నారు. ఏదైనా ఉద్రిక్త పరిస్థితులు అక్కడ పెచ్చరిల్లితే ఆ దేశాలలో ఉంటున్న భారత ప్రజలపై దాని ప్రభావం ఎంతో తీవ్రంగా ఉంటుంది. అంతేకాదు అక్కడి భారత ప్రజల ప్రయోజనాలు కూడా తీవ్రంగా దెబ్బతింటాయి.

ఈ పరిస్థితుల్లో, అంతర్జాతీయ సమాజం దౌత్యపరమైన చర్యలను చేపట్టడం ద్వారా పర్షియన్ గల్ఫ్ లో నెలకొన్న యుద్ధ పరిస్థితులను అడ్డుకోవాలి. ఎందుకంటే పర్షియన్ గల్ఫ్ లో యుద్ధం ఎంత శక్తివంతమైనదంటే ఇది ప్రాంతీయ లేదా గ్లోబల్ స్థాయిలో తీవ్ర సంఘర్షణగా పరిణమించే అవకాశం ఉంది.

రచన: డా.మొహమ్మద్. ముద్దాస్సిర్ ఖామర్, పశ్చిమ ఆసియా వ్యూహాత్మక విశ్లేషకులు

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన