గ్లోబల్ శక్తిగా ముందుకు వెడుతున్న భారత్
ఉత్తమ నిర్ణయాలు తీసుకోవడంలో ఎవ్వరూ కూడా ప్రధాని మోదీకి సాటిరారు. తన రెండవ పాలనా ప్రయాణం సరికొత్త పంథాలో సాగుతుందని మోదీ అన్నారు. నూతన శక్తితో కూడిన సరికొత్త భారతాన్ని ప్రజలు వెలువరించిన కొత్త తీర్పులో ఆవిష్కరించనున్నట్టు మోదీ వెల్లడించారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో 2022 సంవత్సరానికి ప్రతి భారతీయుడి కలలు సాకారం చేసే విధంగా భారత నిర్మాణానికి పూనుకోనున్నట్టు అన్న మాటలు వెనుక ఇదే అర్థం వెల్లడవుతోంది. ఆయన ఈ కల నాణ్యమైన ఆరోగ్య సేవలకు మాత్రమే పరిమితం కాలేదు. ప్రతి భారతీయునికీ విద్య, హౌసింగ్, ఇతర మౌలిక సదుపాయాలను రానున్న మూడు సంవత్సరాల కాలంలో చేకూర్చాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటితో పాటు అంతర్జాతీయంగా భారత్‌ను ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని కూడా మోదీ కల లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రధాని మోదీ సరికొత్త నినాదాన్ని ప్రకటించారు. అదే ‘నారా’ (నేషనల్ యాంబిషన్+ రీజినల్ యాస్పిరేషన్స్). దీనిని విశాలదృక్పథంలోంచి చూస్తే, రానున్న భవిష్యత్తులో అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించాలని ఈ నినాదం లక్ష్యంగా ఉంది. భారత్ రూపొందించిన రోడ్ మ్యాప్‌కు తగ్గట్టు కొత్త ఆవిష్కరణలకు, శాస్త్రీయ విజ్ఘానానికి మనదేశం నిలయంగా ఉంటుంది. భారత దేశ వ్యూహానికి తగ్గట్టు ప్రపంచంలోనే శక్తివంతమైన గళంగా మారేందుకు కూడా భారత్ కృషిచేస్తోంది.
ఇది వాస్తవరూపం ధరించే ముందు భారత్ ప్రజలకు ఎంతో అనుకూలమైన ఉజ్వల, ఆయుష్మాన్ భారత్, ఇతర పథకాలు మరింత విస్తృతంగా విస్తరించేలా చూడాలి. ఈ సంక్షేమ కార్యక్రమాలతో పాటు భారత్ తన ఆర్థిక చక్రాల వేగాన్ని కూడా పెంచాలి. ఇలా జరిగితే భారత్ ఐదు ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఆర్థిక సభ్యదేశాల బృందంలోకి రానున్న ఐదు సంవత్సరాల కాలంలో చేరుతుంది. అంతేకాదు 2030 సంవత్సరం నాటికి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా నిలబడుతుంది. అంటే భారత జిడిపి పది ట్రిలియన్ డాలర్లకు చేరుతుందనమాట. ఇది వినియోగం, పెట్టుబడుల పెరుగుదల ద్వారా సాధ్యమవుతుంది. అంతర్జాతీయ టాప్ దేశాల సరసన భారత్‌ను నిలబెట్టాలన్న ఉద్దేశంతో అభివృద్ధి మంత్రం బలీయంగా మారింది.
ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త భారతం కలలో ఆర్థిక, పెట్టుబడుల పరిధిని విస్తరించడం ఒకటైతే, దౌత్యపరంగా, రాజకీయపరంగా, వ్యూహాత్మకంగా దేశం బలపడ్డం అనేది భారత కోరికలో మరొకటి. భారత దేశ చరిత్రలో 1942-1947 సంవత్సరాల కాలం ఎంత ముఖ్యమో రానున్న ఐదు సంవత్సరాలు కూడా అంతే కీలకమైనవని ప్రధాని నరేంద్ర మోదీ పలుమార్లు వ్యాఖ్యానించడం మర్చిపోలేం. ఎందుకంటే 1942-47 సంవత్సరాల మధ్యలోనే వివిధ ప్రాంతాలు, జీవనశైలులకు, జిల్లాలకు చెందిన ప్రజలు ఏకతాటిపై నిలబడి బ్రిటిష్ పాలనకు చరమగీతం పాడారు. అలాగే తన సమస్యలను పరిష్కరించుకునేందుకు ఇలాంటి చైతన్యమే ప్రపంచ క్రమంలో నేడు అవసరం ఉంది. ప్రజలనుద్దేశించి చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని సరైన లక్ష్యంతో, అడుగులతో తగినంత ప్రాముఖ్యం ఇస్తూ వాస్తవరూపం ధరించేలా చూడాలి.
ఐక్యరాజ్యసమితి భద్రతామండలి (యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, యుఎన్ఎస్‌సి) లో భారత సభ్యత్వాన్ని సాధించేందుకు రాజకీయ, దౌత్యపరమైన వేదికల ద్వారా కదలికను తీసుకురావాలి. ఈ సందర్భంలో ఐక్యరాజ్యసమితి సమగ్ర సంస్కరణలకు సంబంధించి బిష్‌కెక్‌లో జరిగిన షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సివొ) సభ్యులు, విదేశాంగ మంత్రుల సమావేశంలో భద్రతామండలిలో సభ్యత్వం పెంచడం ద్వారా దాన్ని మరింత శక్తివంతంగా, ప్రాధాన్యం సంతరించుకునేలా చేయాలని న్యూఢిల్లీ పిలుపునిచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని విస్తరించాలనే నినాదం చేయడంలో భారత్ ముందు నిలిచింది. కానీ ఒకటి రెండు దేశాలు ప్రస్తుతం కొనసాగుతున్న ఐక్యరాజ్యసమితి భద్రతామండలి వీటో నిర్మాణంలో మార్పులను వ్యతిరేకిస్తున్నాయి. దీంతో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి విస్తరణ లక్ష్యం ఊపందుకోలేదు. భారత ఆర్థిక రంగం వృద్ధి చిత్రం, ప్రధాని నరేంద్రమోదీ వ్యక్తిత్వ ప్రత్యేకతలు పలు గ్లోబల్ నాయకులపై ప్రభావం చూపాయి. దీంతో గత కొద్ది కాలంగా ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సంస్కరణల అంశం ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రపంచంలో బాధ్యతాయుత దేశంగా ఎన్నో అంశాల పరంగా భారత దేశం కీలకపాత్ర వహిస్తూ ముందుంది. పర్యావరణ అంశాలతో పాటు పలు అంశాల పోరాటంలో భారత్ ముందుంది. వాతావరణ న్యాయం జరిగేందుకు ఇంటర్నేషనల్ సోలార్ అలయెన్స్ (ఐఎస్ఎ)కి నాయకత్వం వహించడానికి న్యూఢిల్లీ అంగీకరించింది. శిలాజలాల ఇంధనం వినియోగం మీద ఆధారపడడం తగ్గించడం ద్వారా సౌరశక్తి వినియోగాన్ని భారీగా ఉపయోగించుకునే లక్ష్యంతో పనిచేయాలని ఐఎస్ఎ భావించింది. నూతన భారతం స్థాపనలో ఈ ఎజెండా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. పలు అంతర్జాతీయ అంశాలలో భారత్ ప్రముఖ పాత్ర పోషించాలని కూడా ప్రపంచంలోని పలు దేశాలు కోరుకుంటున్నాయి. అందుకోసం భారత్‌ను అవి ఆహ్వానిస్తున్నాయి. అయితే గ్లోబల్ అంశాలలో దౌత్యపరంగా భారత్ ఎంతో పరిణతితో ముందుకు సాగుతోంది. భారత దేశ విజన్ అయిన ‘వసుధైవకుటుంబకం’ (ప్రపంచమంతా ఒక కుటుంబం) మనదేశ విదేశాంగ విధాన లక్ష్యాలను స్పష్టంగా వివరిస్తోంది...ఆవిష్కరిస్తోంది...కూడా.
Comments
Post a Comment