పటిష్టమైన ప్రభుత్వానికి భారత్ ఓటు

భారతీయ జనతాపార్టీ సారథ్యం వహించిన నేషనల్ డెమోక్రాటిక్ అలయెన్స్ (ఎన్డీఎ) ఎన్నికల్లో విజయదుందుభి మోగించింది. 900 మిలియన్ల మంది పైగా ఉన్న భారతీయ ఓటర్లు సుస్థిర, పటిష్టమైన ప్రభుత్వానికి తమ ఓటు వేశారు. 35 సంవత్సరాలలో మొదటిసారి ఒకే పార్టీ 303 సీట్ల అఖండ విజయంతో లోక్ సభలో ప్రవేశించింది. అలా ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా రెండవసారి దేశ ప్రధానిగా అధికార పగ్గాలు చేపట్టారు. జాతీయ భద్రత, అభివృద్ధి అనే రెండు అంశాలతో దేశం సర్వత్రా అనూహ్యమైన విజయ పతాకాన్ని ఎగరవేశారు.

పదిహేడవ లోక్ సభ ఎన్నికలు ఏడు దశల్లో జరిగాయి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ దేశ ఓటర్ల మద్దతును పూర్తిగా కైవశం చేసుకుంది. అంతేకాదు పశ్చిమబెంగాల్, తెలంగాణా వంటి కొన్ని రాష్ట్రాలలో సైతం బిజెపి ప్రభంజనం సృష్టించింది. ఎందుకంటే ఈ రాష్ట్రాలలో బిజెపి ఉనికి చాలా తక్కువ. అలాంటి చోట సైతం బిజెపి తన విజయాలను నమోదుచేసింది. భారత ప్రతిపక్షాలకు సారథ్యం వహించిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎన్‌సి) అనుకున్న విజయాన్ని, స్థానాలను సంపాదించలేక కుదేలైంది. పైగా గత ఐదేళ్ల కాలంలో ప్రధాని నరేంద్రమోదీ చేసిన పనులు ఎందరో ఓటర్ల హృదయాలను గెలుచుకున్నాయి. అది ఓట్ల రూపంలో బిజెపికి విజయాన్ని తెచ్చిపెట్టాయి.

గత ఐదేళ్లల్లో 133 అభివృద్ధి ప్రాజక్టులను ప్రారంభించడంలో ఎన్డీఎ నిర్ణాయకశక్తిగా పనిచేసింది. అది చేపట్టిన పారిశుద్ధ్యం, వంటగ్యాసు, సబ్సిడీలను సరిగా అందించడం, బ్యాంకు అకౌంట్ లేని ఎందరికో బ్యాంకు ఖాతాలను తెరవడం వంటి కొన్ని పనులు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

జాతీయ భద్రతా విషయంలో ఎన్డీఎ ప్రభుత్వం ఎంతో పటిష్టంగా వ్యవహరించింది. ఉగ్రవాదం భరించే ప్రసక్తే లేదనే విషయాన్ని చాలా స్పష్టంగా ప్రపంచానికి తెలియజేసింది. ఉగ్రవాదంపై పోరులో భారత రక్షణ దళాలు ఎన్నో విజయాలను నమోదుచేసుకున్నాయి. మరీ ముఖ్యంగా సరిహద్దు తీవ్రవాదాన్ని నిరోధించడంలో ఎంతో కృషి చేశాయి. భారత్‌లో అంతర్భాగమైన జమ్ము-కశ్మీర్ సరిహధ్దుల్లో చెలరేగుతున్న ఉగ్రవాదాన్ని బలంగా నిరోధించాయి. అంతేకాదు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ భూభాగంలో ఉన్న బాలాకోట్, చకోటి, ముజాఫర్‌బాద్లలోని జైష్-ఇ-మొహమ్మద్ (జెఇఎం) శిబిరాలపై ఉగ్రవాద ప్రతి దాడులకు భారత భద్రతా దళాలు జరిపాయి. పుల్వామా ఉగ్రదాడి ఇక్కడ పేర్కొనాలి. అంతేకాదు పాకిస్తాన్ నిర్భంధంలో ఉన్న ఎయిర్ ఫోర్సు వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ని స్వదేశానికి వచ్చేట్టు చేయడంలో మోదీ ప్రభుత్వం విజయం సాధించింది. వింగ్ కమాండర్ వర్థమాన్ పాక్ దాడులను ఎదుర్కొనే క్రమంలో పాకిస్తాన్ భూభాగంలో ఆయన నడిపిన యుద్ధవిమానం కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే.

భారత విదేశాంగ విధానానికి నూతన జవసత్వాలు ఇవ్వడంలో, సరికొత్త మార్గ నిర్దేశనంతో పాటుగా పలువురి విశ్వాసం పెంపొందేట్టు చేయడంలో ప్రధాని నరేంద్ర మోదీ విజయవంత మయ్యారు. ఆయన చేపట్టిన ‘యాక్ట్ ఈస్ట్’ విధానం భారత తూర్పున ఉన్న పొరుగుదేశాలతో సమానమైన అభివృద్ధి విషయంలో ఎంతో కీలకంగా పనిచేసింది. దోక్లాం ప్రతిష్ఠంభనను మోదీ ప్రభుత్వం విజయవంతంగా పరిష్కరించింది. అలాగే అమెరికా, రష్యా, చైనా, సౌదీ అరేబియా, ఇరాన్, ఇజ్రాయిల్ వంటి దేశాలతో లోతైన సంబంధాలను భారత్ వృద్ధిచేసిన తీరు సైతం దేశ ప్రజలను ఆకట్టుకుంది.

2019 ఎన్నికల్లో ఓటర్లు ప్రకటించిన నిర్ణయం ఎంతో స్ఫూర్తిదాయకం. మతం, కులం, భాష, లింగ తేడాల వంటి వాటితో సంబంధం లేకుండా ఓటర్లు అందరూ మోదీకి ఓటు వేశారు. కుల సమీకరణాలను వ్యతిరేకించారు. మంచి జీవనశైలిని ఓటర్లు కోరుకున్నారు. అది అందించగల ఏకైక నాయకుడు మోదీ అని వారు గట్టిగా నమ్మారు.

ప్రస్తుతం ప్రధాని మోదీ ముందు ఎంతో క్లిష్టమైన కార్యం ఉంది. కనీస మౌలిక అవసరాలైన తిండి, ఆర్థిక మద్దతు, ఇల్లు, మరుగుదొడ్లు ఉన్న పేద ప్రజలు ఇపుడు మరిన్ని సదుపాయాలను మోదీ నుంచి కోరుకుంటున్నారు. భారత్ మిడిల్ ఇంకమ్ కేటగిరీ దేశాల సరసన చేరుతోంది. జాతీయాదాయం రెండు వేల అమెరికన్ డాలర్లు ఉంటోంది. కొత్తగా పుట్టుకొస్తున్నవర్గాలు కొత్త ఆశలతో ఉన్నారు. భూస్వామ్య ధోరణులను వాళ్లు కోరుకోవడం లేదు. పట్టణ ప్రాంతాలలోని యువత వృద్ధి చెందిన రీతిలోనే గ్రామీణ ప్రాంతాలలో కనీస స్థాయిలో జీవిస్తున్న యువత వృద్ధిని ఆశిస్తున్న పరిస్థితి కనపడుతోంది.

భారత ఆర్థికరంగం ఇంకా బాగా బలోపేతం కావాల్సి ఉంది. గత ఐదు సంవత్సరాల కాలంలో పరిస్థితి ఫరవాలేదు. అప్పుడు ఆహారవస్తువుల ధరలు కొద్దిగా పెరిగాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఆర్థిక క్షీణత ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అంతర్జాతీయ వాణిజ్య యుద్ధాలు లేదా పూర్తిస్థాయి యుద్ధాలు కూడా సంభవించే అవకాశాలు ఉండడంతో ధరల పరంగా కనిపించని ఒత్తిడి సైతం తలెత్తే సూచనలను తొలిసారి చూస్తున్నాం.

కొత్త ప్రభుత్వం ముఖ్యంగా దృష్టి నిలపాల్సిన మరో అంశం ఉంది. అదే యువతకు ఉపాధి కల్పన. మిలియన్ల సంఖ్యలో నిరుద్యోగులు పెరుగుతున్నారు. వారందరికీ ఉద్యోగ కల్పన సులభమైన విషయం కాదు. ‘స్కిల్ ఇండియా’, ‘ముద్ర’ రుణ పథకం వంటి స్కీములను మరింత బలోపేతం చేసి ఎక్కకువమందికి వాటి ప్రయోజనాలను అందించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రస్తుతం విద్య, తయారీ రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

అలాగే పన్నుల విధానంలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉంది. దేశం మొత్తం చేపట్టిన ఒకే జిఎస్టీ పన్ను విధానం లాంటివి ఇంకా సులభతరం చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం చాలా కష్టం. దీనికి ప్రభుత్వ రెవెన్యూ కూడా పెరగాల్సి ఉంటుంది.

2014లో కన్నా ఇప్పుడు ప్రజలు ఆశిస్తున్నవి ఎన్నో ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ వీటిని సాధించగలరని, సమస్యలను పరిష్కరించగలరని, భారతదేశాన్ని సమర్థవంతమై ఆర్థిక రంగంగా ముందుకు నడిపించగలరని దేశ ప్రజలు నమ్ముతున్నారు. రానున్న ఐదు సంవత్సరాలలో భారత్ నూతన స్థాయిని చేరుకుంటుందని, మరింత పరాకాష్టకు చేరుతుందని భారత ఓటర్లు ఆశిస్తున్నారు.


పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో పాటు ఎన్నో ప్రపంచదేశాల నాయకులు ప్రధాని మోదీకి తమ అభినందనలను తెలియజేశారు. మరింత నాణ్యమైన ప్రపంచ క్రమం సాధనా దిశగా పయనించడానికి మోదీతో కలిసి పనిచేయాలని తాము కోరుకుంటున్నట్టు వారు ఈ సందర్భంగా వ్యక్తంచేశారు.


రచన: ప్రొఫెసర్ శివాజీ సర్కార్, రాజకీయ వ్యాఖ్యాత

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన