న్యూఢిల్లీ డబ్ల్యుటివొ మంత్రివర్గ సమావేశం

స్పెషల్ అండ్ డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ (ఎస్ అండ్ డిటియంత్రాంగాన్ని తిరిగి కఠినంగా అమలు  చేసేందుకు రంగం సిద్ధమైందిదీనికోసం డబ్ల్యుటివొ (వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్)కు చెందిన పేద దేశాలుఅభివృద్ధిచెందుతున్న దేశాలు న్యూఢిల్లీలో మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించాయివివిధ అంతర్జాతీయ వాణిజ్య  ఒప్పందాలు అందిస్తున్న రాయితీలుసౌకర్యాలను ఉపయోగించుకోవాల్సిందిగా అభివృద్ధిచెందుతున్న దేశాలకు  సమావేశం  పిలుపునిచ్చిందిడబ్ల్యుటివొ పరిధిలో బహుపక్ష వాణిజ్య విధానాన్ని అభివృద్ధి చేయాలని కోరింది.  డబ్ల్యుటివొ వాణిజ్య చర్చలలో ఏర్పడ్డ ప్రతిష్ఠంభనను తొలగించేందుకుఅదే సమయంలో బహుపక్ష స్వభావాన్ని కాపాడేందుకు 22 దేశాలకు చెందిన సీనియర్ అధికారులతో  సమావేశం జరిగిందిఇందులో ఇటీవల డబ్ల్యుటివొలో చోటుచేసుకున్న పరిణామాలను బహిరంగంగా చర్చించడమే కాకుండాఅందరు సభ్యులతో కలిసి కట్టుగా పనిచేయడానికి మార్గాలను శోధిస్తోందితద్వరా గ్లోబల్ వాణిజ్య వ్యవస్థను బలోపేతం చేయాలని భావిస్తోందిడబ్ల్యుటివొ వివాదాల పరిష్కారానికి (డబ్ల్యుటివొ డిస్ప్యూట్ సెటిల్మెంట్సంబంధించిన అప్పాల్లేట్ బాడీ (ఎబి)కి సభ్యుల నియామకం విషయంలో ట్రంప్ ప్రభుత్వ యంత్రాంగం వ్యతిరేకతను వ్యక్తంచేసిందిపలు దేశాలతో వాణిజ్య వివాదాలకి సంబంధించి అమెరికాకు అననుకూలమైన తీర్పు ఏమీ రాలేదుపలు దేశాలతో అమెరికా కొనసాగిస్తున్న వాణిజ్యపరమైన యుద్ధ వాతావరణంపై సభ్య దేశాల ప్రతినిధులు  సమావేశంలో విమర్శలు చేశారు.  ఆలస్యంచేయకుండా ఎబి ఖాళీలను నింపడానికి  డబ్ల్యుటివొ సభ్యులు నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని భావించాయిఅదే సమయంలో ఇతర అంశాలపై అంటే వివాదాల పరిష్కార యంత్రాంగం పనిచేయడం వంటి వాటిపై కూడా చర్చలు చేశాయి.
భారత వాణిజ్య శాఖామంత్రి   సమావేశంలో మాట్లాడుతూ వాణిజ్య ఉద్రిక్తతలు కొద్దిగా కూడా తగ్గని నేపథ్యంలో  సమావేశం నిర్వహణ ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుందని అన్నారుపలు ట్రేడింగ్ మేజర్లు రక్షణ విధాన ధోరణులు చూపుతున్నాయిఇది స్వేచ్ఛారక్షణ పూరిత వాతావరణ ప్రయోజనాలకు ప్రమాదం కలిగించడం ద్వారా ప్రపంచంలో దశాబ్దాలుగా పోస్ట్-వార్ ప్రాస్పరిటీ ధోరణులను మరింత పెంచుతోందిన్యూఢిల్లీ మంత్రివర్గ  ప్రారంభ సమావేశంలో భారత మంత్రి మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న దేశాలలో నివసిస్తున్న 7.3 బిలియన్ల మంది ప్రజలు అభివృద్ధి ప్రయోజనాలను కోల్పోకూడదన్నారు.  అభివృద్ధి సంబంధిత అంశాలతోపాటుసహాయం ద్వారా కాకుండా వాణిజ్యం ద్వారా దేశాలు వృద్ధి చెందాలని డబ్ల్యుటివొ చెబుతుంది.
ఇలాంటి ఆందోళనలనే డబ్ల్యుటివొ డైరక్టర్ జనరల్ రోబెర్టో అజెవెడో పునరుద్ఘాటించారుడబ్ల్యుటివొ సంస్కరణల గురించి జరుగుతున్న చర్చలను ప్రస్తావిస్తూ, ‘ ఇది మీ సంస్థ... చర్చల్లో మీ గళాలను వినిపించండి’ అని అన్నారుడబ్ల్యుటివొ పనికి సంబంధించిన మూడు మూల స్తంభాలైన అంశాలను పేర్కొన్నారు  పర్యవేక్షణవివాదాల పరిష్కారం,   సభ్యుల సమావేశ చర్చా విశేషాలను  అజెవెడో వివరించారు.
ఎస్ అండ్ డిటి ననుసరించి అభివృద్ధి చెందుతున్న దేశాలుపేద దేశాలు బహుపక్ష వాణిజ్య నిబంధనలను అమలుచేయడానికి ఎక్కువ సమయం పడుతుందిడబ్ల్యుటివొ చీఫ్ అజెవెడో మాట్లాడుతూ ఎస్ అండ్ డిటి యంత్రాంగం  సంక్షోభ పరిస్థితులను ఛేదించేందుకు కొత్త ఆవిష్కరణలతో ముందుకురావాలని అభిప్రాయపడ్డారు.
 పరిస్థితుల్లో ముందుకు పోవాలంటే ట్రేడ్-ఫెసిలిటేషన్ అగ్రిమెంట్ టైప్ మోడల్ మంచి మార్గం అని డబ్ల్యుటివొ చీఫ్ అన్నారుదీంట్లో దేశాలు తమదైన ప్రమాణాలను ఏర్పాటుచేసుకోవచ్చుకానీ ఇండియాచైనాలతో పాటు మొత్తం 17 సభ్యదేశాలు ప్రతిస్పందిస్తూ ఎస్ అండ్ డిటి ప్రొవిజన్లు అభివృద్ధి చెందుతున్న దేశాల హక్కులువీటిని డబ్ల్యుటివొ ప్రస్తుతమే కాకుండాభవిష్యత్ ఒప్పందాలలో సైతం పరిరక్షించడం ద్వారా  బలోపేతం చేయాలని అభిప్రాయపడ్డాయిఅదే సమయంలో నిరుపేద దేశాల (లీస్ట్ డెవలెప్డ్ కంట్రీస్ఎల్డిసిఅంశాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కూడా అభిప్రాయపడ్డాయికజకస్తాన్టర్కీఅర్జెంటీనాబ్రెజిల్గైతమాలా దేశాలు సంయుక్త ప్రకటనపై సంతకాలు చేయలేదుడబ్ల్యుటివొ శాశ్వత ప్రతినిధి అయిన భారత దేశానికి చెందిన దీపక్ మాట్లాడుతూ ఎస్ అండ్ డిటి అంశంపై భారత స్థానం విస్పష్టండబ్ల్యుటివొ యంత్రాంగంలో ఇది అత్యావశ్యకందేశాలను ఇంకా వర్గీకరించడాన్ని మాత్రం భారత్ విశ్వసించదు’ అని వ్యాఖ్యానించారుఅలా  సమావేశంలో పాల్గొన్న 22 దేశాల ప్రతినిధుల్లో 17 మంది సభ్యులు డబ్ల్యుటివొ లోని ‘స్పెషల్ అండ్ డిఫరెన్షియల్ ప్రొవిషన్స్ని బలోపేతం చేయాలని పునరుద్ఘాటించాయిఅలా న్యూఢిల్లీ మంత్రివర్గ సదస్సు టాక్టికల్గా లబ్దిపొందింది.
 సమావేశ సంయుక్త ప్రకటనలో వివిధ దేశాలతో ఎలక్ట్రానిక్-కామర్స్ ఒప్పందాల గురించి ప్రస్తావించలేదుఅయితే బహుపక్ష అవసరాన్ని మాత్రం ఇది ప్రస్తావించిందిఏకాభిప్రాయ భూమికగా బహుపక్ష మార్గాలు అనుసరిస్తే అందరినీ కలుపుకుపోయే అభివృద్ధి  సాధ్యం అవుతుందితద్వారా బహుపక్ష వాణిజ్య వ్యవస్థను బలోపేతం  చేయొచ్చుఅవి డబ్ల్యుటివొ నిబంధనలకు తగ్గట్టుగా కొనసాగుతాయి కూడా.  న్యూఢిల్లీ మంత్రివర్గ సదస్సు కొత్త డైనమిజాన్ని ఇంకించిందనడంలో సందేహంలేదుఅంతేకాదు అంతర్జాతీయ సంస్థ గ్లోబల్ వాణిజ్యం పరంగా ముందుకు వెళ్లేందుకు తన వంతు సేవలందించేందుకు సహాయపడుతుంది.

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన