పాకిస్తాన్‌లో మైనారిటీలపై కొనసాగుతున్న హింస
పాకిస్తాన్ తమ దేశంలోని మైనారిటీల పట్ల కనబరుస్తున్న వివక్షా పూరిత విధానం వల్ల ఎందరో మైనారిటీలు అన్యాయానికి గురవుతున్నారు. దేశంలోని మెజారిటీ ప్రజల చేతుల్లో వీరు పెద్ద ఎత్తున పక్షపాతం, వేధింపులకు బలవుతున్నారు. మరీ ముఖ్యంగా రైట్‌వింగ్ తీవ్రవాదుల చేతుల్లో అన్యాయానికి గురవుతున్నారు. వారి దురాగతాల పాల బడుతున్నారు. పాకిస్తాన్ జనాభాలో హిందువులు, క్రిస్టియన్లు, సిక్కులు అందరూ కలిపి మూడు మిలియన్ల వరకూ ఉంటారు. వాళ్లు తమ తమ మత విశ్వాసాలు, నమ్మకాలు అనుసరించడం వల్ల ప్రమాదాల్లో చిక్కుకుంటున్న పరిస్థితులు పాకిస్తాన్‌లో నేడు వ్యాపించి ఉన్నాయి. అక్కడ ఎంతగానో వివాదాస్పదమైన దైవ దూషణ చట్టాన్ని మైనారిటీల పట్ల వివక్ష పూరితంగా ప్రయోగిస్తున్నారు. అక్కడ మైనారిటీ మతస్తులపై పాక్ ప్రయోగించే తొలి ఆయుధం అదే. ఇస్లాం బోధనలను అవమానించారని మైనారిటీలపై ఆరోపణలు చేస్తూ ఆ చట్టం కింద వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారు.
సింధ్ ప్రాంతంలో మైనారిటీకి చెందిన ఒక డాక్టరుపై ఇటీవల దైవదూషణకు పాల్పడిన కేసును పెట్టింది. మత గ్రంథ పవిత్రతను దెబ్బతీశాడంటూ ఆయనపై ఆరోపణలు చేసింది. ఈ సంఘటనకు కొన్ని వారాల ముందు పంజాబ్ ప్రాంతంలో ఉంటున్న మైనారిటీ వర్గానికి చెందిన ఒక జంట వేరే వ్యక్తికి తప్పుడు సందేశం పంపించారంటూ దైవదూషణ చట్టం కింద వారిపై కేసు నమోదుచేసింది. పాకిస్తాన్‌లోని మైనారిటీలు మరింత భీతవహులు అయిన మరొక సంఘటన కూడా అక్కడ చోటుచేసుకుంది. లాహోర్ ప్రాంతంలోని నరోవలిన్‌లో ఉన్న సిక్కుల పుణ్యక్షేత్రం అయిన ‘గురు నానక్ ప్యాలస్’ను నేలమట్టం చేశారు.
పాక్‌లో అప్పుడప్పుడు, అక్కడక్కడ ఇలాంటి సంఘటనలు జరిగి ఉంటాయనుకుంటే పొరబాటే. అక్కడి మైనారిటీల హక్కులు నిత్యం అతిక్రమణకు గురవుతూనే వస్తున్నాయి. భారీ సంఖ్యలో మైనారిటీలపై పలు కేసులు నమోదుచేయడం లేదా దైవదూషణ చట్టం కింద వారిని హింసలపాలు చేయడం పాకిస్తాన్‌లో నిత్యం చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసుల్లో ఆసియాబీబీ కేసు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఆమెపై పెట్టిన కేసు పాకిస్తాన్‌లో మైనారిటీల హక్కులు అతిక్రమణకు గురవుతున్న వైనంపై పెద్ద చర్చకే దారి తీసింది. మైనారిటీల అంశానికి సంబంధించి పాక్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినప్పటికీ, దైవదూషణ చట్టం కింద మైనారిటీ ప్రజలను హింసించడం, వారి పట్ల వివక్షను ప్రదర్శించడం మాత్రం పాకిస్తాన్ ఆపకుండా కొనసాగిస్తూనే వస్తోంది.
స్థానిక మసీదుకు చెందిన ఒక మతపెద్ద డాక్టరుపై ఫిర్యాదు నమోదు చేయడంతో ఆ వైద్యుని ప్రభుత్వం కస్టడీలోకి తీసుకుంది. ఇస్లాం గ్రంథాన్ని అపవిత్రం చేశాడంటూ అతనిపై ఆరోపణలు ఉన్నాయి కాబట్టి పాకిస్తాన్ దైవ దూషణ చట్టకింద కఠినమైన శిక్ష వేయాలన్నది ఆ కేసు సారాంశం. పాక్ మత చట్టాలలో ఎక్కడా చెప్పని నిబంధనలు ఉన్నాయి. అవి పాకిస్తాన్ పౌరుల మెదళ్లల్లో నాటుకుపోయాయి. దీంతో వైద్యుని అరెస్టు చేసిన తర్వాత వారు పెద్ద మూకలుగా ఏర్పడి దాడులకు పూనుకున్నారు. ఒక తెగకు చెందిన మైనారిటీ వర్గం షాపులను ప్రత్యేకంగా తగలబెట్టారు. ప్రజల ఆలోచనాతీరును సింధులో జరిగిన సంఘటన ప్రతిఫలిస్తుంది. పాకిస్తాన్ దైవదూషణ చట్టాలు పటిష్టంగా లేవు. కానీ ‘బలమైనవి’. వీటిల్లో స్పష్టమైన నిబంధనలు శూన్యం. ఇవి హద్దు ఆపులేకుండా ఇష్టంవచ్చినట్టు పాకిస్తాన్‌లోని మైనారిటీ మతస్థులను టార్గెట్ చేస్తున్నాయి. వ్యక్తిగత కక్షలతో ఎంతోమంది అమాయకులైన మైనారిటీ ప్రజలపై తప్పుడు కేసులు బనాయిస్తున్న పరిస్థితిని పాకిస్తాన్‌లో నేడు చూస్తున్నాం.
పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే మైనారిటీ మతస్థుల పుణ్యక్షేత్రాలను పరిరక్షిస్తామన్న గ్యారెంటీని కూడా పాక్ ప్రభుత్వం ఇవ్వకుండా వివక్షాపూరితంగా వ్యవహరిస్తోంది. చారిత్రాత్మకంగా, సాంస్కృతికంగా ఎంతో ప్రాధాన్యం గల పలు మైనారిటీ కట్టడాలను పాకిస్తాన్ రైట్‌వింగ్ తీవ్రవాదులు ఎన్నో ఏళ్లుగా టార్గెట్ చేసుకుని నాశనం చేస్తున్నాయి. ఆ జాబితాలోకి ఇటీవల నాశనం చేసిన నారోవాల్‌లోని సిక్కుల పుణ్యక్షేత్రం ‘గురునానక్ ప్యాలెస్ కూడా వస్తుంది. అయితే ఈసారి మైనారిటీల కట్టడాల కూల్చివేత బాగా పేరున్న స్థానిక వ్యక్తుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. వీళ్లు రైట్‌వింగ్ తీవ్రవాదులతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్నారు. ఈ పరిస్థితులు పాకిస్తాన్‌లోని మైనారిటీల దుస్థితిని అద్దంపడుతోంది. అన్యాయంగా, చట్టవిరుద్ధంగా ఇలాంటి సంఘటనలకు స్థానిక ప్రముఖులు సైతం పాల్పడుతున్నా ఎవ్వరూ నోరెత్తి ప్రశ్నించడం లేదు. అంతకాదు 15 వ శతాబ్దానికి చెందిన గురుద్వారా తలుపులు, కిటికీలు, మరెన్నో విలువైన వస్తువులు దొంగిలించబడి మార్కెట్‌లో ఎంతో కొంత ధరకు అమ్మివేసిన సంఘటనలు సైతం పాకిస్తాన్‌లో చోటుచేసుకుంటున్నాయి.
వీటిపై అధికారులను ప్రశ్నిస్తే నోరు మెదపడం లేదు. ఇది అక్కడి మొత్తం సిక్కు ప్రజల సెంటిమెంట్స్ ను బాగా దెబ్బకొట్టింది. ఫలితంగా భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య చేపట్టిన కర్తార్‌పూర్ కారిడార్ కార్యక్రమానికి అడ్డుకట్టపడింది. చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఈ సిక్కు క్షేత్రాన్ని కూలగొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు డిమాండ్ చేశారు. కానీ గతంలో ఇలాంటి నేరాలు ఎన్నో జరిగాయి. వాటిపై ప్రభుత్వం ఇప్పటి వరకూ ఏమైనా చర్య తీసుకుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది.
ముస్లిం కాని వారందరినీ ‘కాఫిర్’ (నమ్మకంలేనివాడు)గా పాకిస్తాన్‌లో ముద్రవేస్తున్నారు. అసలు సమస్య ఏమిటంటే పాకిస్తాన్ రాజ్యంగం, ఇతర రాష్ట్రాల చట్టనిర్మాణాలు ఈ సిద్దాంతానికి మద్దతునివ్వడం. అంతేకాదు పాకిస్తాన్ పార్లమెంటులో మైనారిటీల కోసం ఐదు శాతం సీట్ల రిజర్వేషన్ ఉన్నప్పటికీ జాతీయస్థాయిలో మైనారిటీల ప్రాతినిథ్యం సరిగా లేదు. పాకిస్తాన్‌లో జీవిస్తున్న మైనారిటీలకు భద్రత కరువైంది. వారితో పాటు వారి మతాలకు సంబంధించిన పుణ్యక్షేత్రాలు, దేవాలయాలు, గురుద్వారాలు, చర్చలు వేటికీ అక్కడ రక్షణ లేకుండా పోయింది. దైవదూషణ చట్టాల కింద మైనారిటీలను హింసలు పాలు చేస్తున్న నేరస్తులను రికార్డులకు ఎక్కించే ప్రొవిజనే పాకిస్తాన్‌లో లేదు. మైనారిటీల చారిత్రాత్మక, సాంస్కృతిక ప్రాధాన్యం ఉన్న పుణ్యక్షేత్రాలను విధ్వంసం చేసినా కూడా ఈ పరిస్థితిలో మార్పు లేదు. షియా హజరాస్, అహ్మదీస్‌లతో పాటు ఇవన్నీ కూడా పాకస్తాన్‌లోని మైనారిటీలకు సంబంధించిన మానవహక్కులు తీవ్రస్థాయిలో అతిక్రమణకు గురయ్యేలా చేశాయి.
Comments
Post a Comment