ప్రపంచ దేశాలతో ఆర్థిక సంబంధాలు – ప్రగతి బాటలో భారత ఆర్థిక వ్యవస్థ
భారతదేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా చేసుకొని ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఓ వంక దేశీయంగా వాణిజ్యం, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని నిర్మిస్తూ, మరోవంక విదేశాలతో బలమైన సంబంధాలను ఏర్పరచుకునేందుకు కృషి చేస్తోంది. ఇందుకు గాను భారతదేశం అనేక సంస్కరణలను తీసుకువచ్చింది. దివాళాచట్టం (ఐబిసి), వస్తు సేవల పన్ను చట్టం – జి.ఎస్.టి - ఇందులో ప్రధానమైనవి. 5 ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరుకునేందుకు భారతదేశం మార్కెట్ ప్రయోజనాలను ముందుకు తీసుకుపోతూ, వ్యాపార భాగస్వాములతో సత్సంబంధాలను నెలకొల్పుకునేందుకు అడుగులు వేస్తోంది. అంతర్జాతీయ విలువల పరిరక్షణలో భాగంగా ఇలాంటి చర్యలను తీసుకుంటోంది. అదేవిధంగా ప్రపంచ దేశాలతో పరిస్పర ప్రయోజనకరమైన, నిర్మాణాత్మక సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు గాను, భారత దేశం ప్రాంతీయ వాణిజ్య ద్వైపాక్షిక ఆర్థిక చర్చల పంధాను ఎంచుకొని ముందుకు సాగుతోంది. భారత ఆర్థిక వ్యవస్థ అంతర్ముఖ ఆర్థిక వ్యవస్థ అన్న అభిప్రాయాన్ని తొలగించేందుకు ప్రపంచ దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సాధించే దిశగా సాగుతోంది.
కొద్ది సంవత్సరాల క్రితం యురేపియన్ యూనియన్, ఆస్ట్రేలియా, ఇజ్రాయిల్, ఇరాన్ వంటి అనేక ప్రాంతీయ మండళ్లతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం గురించి భారతదేశం క్రియాశీలకంగా చర్చలు జరిపింది. యూరోపియన్ యూనియన్ తో 2007లో చర్చలు జరిపేందుకు భారతదేశం ఆసక్తి కనబర్చినప్పటికీ, ఏడు సంవత్సరాల పాటు అడుగు ముందుకు పడలేదు. యూరోపియన్ యూనియన్ తో విస్తృత స్థాయి వాణిజ్య, పెట్టుబడుల ఒప్పందం – బిటిఐఏ – వల్ల భారతదేశానికి అనేక విధాల ప్రయోజనం చేకూరుతుంది. ముఖ్యంగా ఆభరణాలు, రత్నాలు, వస్త్ర రంగాల అభివృద్ధికి ఈ ఒప్పందం ఎంతగానో దోహదం చేస్తుంది. యూరోపియన్ యూనియన్ ఎగుమతి రంగంలో ఆసక్తి చూపుతున్న ఉత్పత్తులకు సంబంధించి సుంకాల కోతను కోరుతోంది. మరోవంక భారతదేశం బ్రెక్సి ట్ అనంతర పరిణామాల నేపథ్యంలో యుకెతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు, తద్వారా స్వతంత్రంగా వ్యాపార సంబంధాలను మెరుగుపర్చుకునేందుకు సిద్ధంగా వుంది. యుకెలో చాలా పెద్ద సంఖ్యలో భారతీయులు స్థిరనివాసం ఏర్పరచుకుని ఉన్నారు. పరస్పర ప్రయోజనాలకు అనుకూలంగా ప్రవాస భారతీయులు, భారతీయ సంతతి వారితో గల చారిత్రక సంబంధాలను బలోపేతం చేసుకోవడం ద్వారా ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చునని, పెట్టుబడిదారులకు రక్షణ కల్పించాలన్న యుకె అభ్యర్ధనను ప్రత్యేకంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చునని భారతదేశం భావిస్తోంది.
భారత్ – అమెరికా దేశాల మధ్య ఇంతవరకు స్వేచ్చా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి ఎలాంటి చర్చలు జరగలేదు. ప్రస్తుతం ఆ దిశగా ఆలోచనలు సాగుతున్నాయి. అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ 2020 ఫిబ్రవరిలో భారతదేశంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన సందర్భంగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం వుందని భావిస్తున్నారు. ఈ ఒప్పందంలో అమెరికా జిఎస్పి ప్రయోజనాలను ఉపసంహరించుకోవడం ఎంపిక చేసిన అమెరికా ఉత్పత్తులపై భారతదేశం టారిఫ్ ను తగ్గించుకోవడం వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం వుంది. అలాగే వాణిజ్య అసమతుల్యత, ఇంధన భద్రతను పెంచుకునేందుకు అవసరమైన చర్యలు గురించి కూడా ఈ సందర్భంగా చర్చించే అవకాశం వుంది.
భారతీయ పరిశ్రమలకు అంతగా ప్రయోజనం చేకూర్చని ఆర్.సి.ఈ.పి నుంచి భారతదేశం వైదొలిగింది. ఆర్.సి.ఈ.పి నిర్దిష్ట నిబంధన లేకుండా సున్నిత రంగాలను స్వేచ్చా వాణిజ్య పరిధిలో చేర్చాలన్న డిమాండ్ ను భారతదేశం తిరస్కరించింది. అయితే ఆ వెంటనే భారతదేశం, ఏషియాన్, జపాన్, దక్షిణ కొరియా వంటి తూర్పు ఆసియా పొరుగుదేశాలతో కొన్ని ఒప్పందాలను కుదుర్చుకుంది. అలాగే చర్చల దశలోనే నిలిచిపోయిన ఆర్.సి.ఈపిలో సభ్య దేశాలైన ఆస్ట్రేలియా వంటి దేశాలతో ప్రత్యేకంగా చర్చలు ప్రారంభించింది. దక్షిణ కొరియా, జపాన్, ఏషియాన్ దేశాలతో మన స్వేచ్ఛా వాణిజ్య వినియోగ రేట్లు తక్కువగా వున్నాయి. ఈ నేపథ్యంలో పున:సమీక్ష నిబంధనల ప్రకారం టారిఫ్ సవరణకు ప్రయత్నించాలని భారతదేశం భావిస్తోంది. ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఇజ్రాయిల్ వంటి దేశాలతో ఆర్థిక అవగాహన, సంబంధాలు సానుకూల ఫలితాలను ఇస్తున్నాయని పరిశీలనలో తేలింది. అలాగే ఈఏఈయు వంటి ఆర్థిక కూటములతో చర్చలు కూడా ప్రయోజనకరంగా వుంటాయని భావిస్తున్నారు. త్వరలోనే ఈ రకమైన చర్చలు ప్రారంభంకానున్నాయి. అయితే ఈ చర్చలకు వస్తు సేవలు, పెట్టుబడులు ప్రధాన పునాదిగా వుండాలని భావిస్తున్నారు. భారతదేశం స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు, ఆర్థిక సంబంధాలకు సంబంధించి జరిపే చర్చలు సున్నితరంగాలకు ప్రమాదం లేకుండా జాగ్రత్తలు తీసుకోవల్సిన అవసరం వుంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి భాగస్వాములకు టారిఫ్ సవరణకు అవసరమైన తగినంత సమయాన్ని ఇస్తోంది. ఆ విధంగా సమీప భవిష్యత్తులో భారతదేశం ప్రపంచ దేశాలు ఆర్థిక కూటములతో ఆర్థిక సంబంధాలను మెరుగుపర్చుకునే దిశగా అడుగులు వేస్తోంది.
రచన : సత్యజిత్ మహంతి, ఐ.ఆర్.ఎస్ సీనియర్ ఎమిక్ జర్నలిస్ట్

Comments
Post a Comment