పొరుగు దేశానికి ప్రధమ ప్రాధాన్యత విధానం: ప్రాంతీయ అవగాహనలు 

డిల్లీలోని భారత ప్రధాన మేథోమథన కేంద్రం,ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ ఎనాలిసిస్ (IDSA), ఇటీవల,“భారత పొరుగు దేశానికి ప్రధమ ప్రాధాన్యత: ప్రాంతీయ అవగాహనలు” అనే అంశంపై 12వ దక్షిణ ఆసియా సదస్సును నిర్వహించింది.దక్షిణ ఆసియా దేశాలు, మయన్మార్’నుంచి విధాన నిర్ణేతలు,విద్యావేత్తలు, నిపుణులు, ఇంకా ఇతర సంబంధిత రంగాల ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొన్నారు. భారత దేశం ఆచరిస్తున్న ‘పొరుగు దేశాలకు ప్రధమ ప్రాధాన్యత విధానం” అంటే ఏమిటీ? తమ తమ దేశాలకు ఈ విధానం ఏ విధంగా వర్తిస్తుంది అనే కోణంలో చర్చించారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో సుమారు 25 మందికి పైగా పొరుగు దేశాలకు ప్రధమ ప్రాధాన్యత విధానం” పై తమ తమ అభిప్రాయాలను, విశ్లేషణలను తెలియచేసే పత్రాలను సమర్పించారు. విదేశీ ప్రతినిధులతో పాటుగా తొమ్మిది మంది భారతీయ ప్రతినిధులు కూడా ‘పొరుగు దేశాలకు ప్రధమ ప్రాధాన్యత విధానం” పై తమ అభిప్రాయాలను పత్రాల రూపంలో పంచుకున్నారు. కాగా, సదస్సులో ప్రారంభ ఉపన్యాసం చేసిన భారత రక్షణ శాఖ మంత్రి, IDSA అధ్యక్షుడు రాజనాథ్ సింగ్,దక్షిణ ఆసియా దేశాలు వ్యక్తిగత దేశీయ గుర్తింపు పరిధినిదాటి, దక్షిణ ఆసియా ప్రాతీయ గుర్తింపును కోరుకోవలసిన సమయం ఆసన్నమైందని నొక్కి చెప్పారు.దక్షిణ ఆసియా దేశాల అభివృద్ధికి ఇది అవసరమని ఆయన అన్నారు. భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి, V.మురళీధరన్, భారత దేశం అనుసరిస్తున పొరుగు దేశాలకు ప్రధమ ప్రాధాన్యత విధానానికి సంబందించిన వివిద అంశాలను వివరించారు.

2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, 2014లో తొలిసారి ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన సమయంలోనే పొరుగు దేశాలతో స్నేహ సంబధాలను బలోపేతం చేసుకోవడంపై దృష్టిని కేంద్రేకరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తమ ప్రమాణ స్వీకారోత్సవానికి సార్క్’ దేశాధినేతలు అందరినీ ఆహ్వానించారు. అలాగే, ప్రధానమంత్రి హోదాలో విదేశీ పర్యటనలకు పొరుగు దేశం భూటాన్’నుంచి ప్రారంభించి, ఇతర పొరుగుదేశాలలో పర్యటించారు. గత ప్రభుత్వాలు అనుసరించిన విధానాలకు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం అనిసరించిన విధానాలకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనలు పొరుగు దేశాలకు భారత దేశం ఇస్తున్న ప్రాధాన్యతను, విలువలను చెప్పకనే చెప్పాయి. NDA ప్రభుత్వం 2014లో “సబ్ కా సాత్ , సబ్ కా వికాస్’ కు ప్రధాన్యత ఇచ్చింది.రెండవమారు అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ‘సబ్ కా సాత్ , సబ్ కా వికాస్’ కు ‘సబ్ కా విశ్వాస్ , సర్వ జన విశ్వాసం అనే పదాన్ని చేర్చారు.

భారత ద్వైపాక్షిక సంబంధాలు ఇచ్చి పుచ్చుకునే బంధాలు మాత్రమే కాదు, పరస్పర విశ్వాసాన్ని పెంచుకునే, సంపదను పంచుకునే విశ్వాస బంధాలు. భారత దేశం, ఇరుగు పొరుగు దేశాల మధ్య అధికార వ్యత్యాసం కారణంగా, కొన్ని కొన్ని సందర్భాలలో ఇరుగు పొరుగు దేశాలు ఇతర దేశాలను ఆశ్రయిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఇరుగు పొరుగు దేశాలతో చక్కని స్నేహ సంబంధాలను ఏర్పరచుకోవడం ఇరు పక్షాలకు అవసరం. ఇరు పక్షాల బాధ్యత. రహదారుల అనుసంధానం, జలవనరుల సంరక్షణ, విద్యుత్ గ్రిడ్ అంతర్గత కలయిక ద్వారా ప్రాంతీయ ఆర్థిక అనుసంధానపై దృష్టిని కేంద్రీకరించడం జరిగింది. వివిధ వాణిజ్య ఆంక్షలు ప్రాతీయ, ఆర్థిక నిబంధనలు, బలహీన అనుసంధానం కారణంగా అంతర్గత వాణిజ్యం చాలా తక్కువగా 6 శాతం దగ్గరే ఆగిపోయింది. అయితే , ఇటీవల కాలంలో భారత దేశం అందిస్తున ఆర్థిక, రుణ సహాయసహకారాలతో వేర్వేరు ప్రాజెక్టుల పరిదిలో రవాణా అనుసంధానం మెరుగవుతోంది. ఇటీవల సంవత్సరాలలో విద్యుత్ వాణిజ్యం వాస్తవ రూపం దాల్చింది.

భారత్ దేశం పొరుగున ఉన్న బంగ్లాదేశ్’కు 12వందల మెగావాల్టుల విద్యుత్ ఎగుమతి చేస్తోంది. గ్రిడ్ అనుసంధానంతో ఇది ఇంకా పెరుగుతుంది. అదే విధంగా బంగ్లాదేశ్ భూటాన్’లో ఒక బిలయన్ అమెరికన్ డాలర్ల మొత్తాన్ని హైడల్ విద్యుత్ ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టాలని ప్రతిపాదించింది. భారత ప్రభుత్వం నేపాల్ ‘ లో పెట్టుబడులు పెట్టే విషయంలో ఆసక్తి చూపుతోంది. భవిష్యత్’ లో గ్రిడ్ అనుసంధానం వాస్తవ రూపం దాల్చడం,2019 మార్చిలో భారత దేశం ప్రతిపాదించిన సరహద్దు వెలుపలి విద్యుత్ వాణిజ్య నిబంధన కారణంగా ఉభయ దేశాల మధ్య విద్యుత్ వాణిజ్యం సులభతరం అవుతుందని భావిస్తునారు. యుద్ద, ప్రకృతి ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, పునః నిర్మాణ కార్యక్రమాలలో పెట్టుబడులు పెట్టడంతో పాటుగా భారత దేశం ఇరుగు పొరుగు దేశాలలో ప్రభుత్వ ఉద్యోగులు, సైన్యం సామర్ధ్య నిర్మాణంలోనూ పాలుపంచుకుంటోంది.ఈ ప్రాంతంలో భారత దేశం సైనిక బలగాల బహుళమ దైపాక్షిక విన్యాసాలలో భాగస్వామ్య మవుతోంది.

అదే విధంగా ఇరుగు పొరుగు దేశాలు వివిధ క్షేత్రాలలో భారత దేశం భాగస్వామ్య పాత్రను కోరుకుంటున్నాయి. నేపాల్, భూటాన్ దేశాలు తమ వాణిజ్య విస్తరణ కోసం బంగ్లాదేశ్’ సీపోర్ట్ ‘ను వినియోగించుకోవాలని ఆసక్తి చూపుతున్నాయి.అదే విధంగా ఇంధన మార్కెట్’ను విస్తరించుకునేందుకు ఉత్సాహం చూపుతున్నాయి. మాల్దీవులు, భూటాన్ ‘భారత్ ప్రధమ ప్రాధాన్యత’ విధానాన్ని పునరుద్ఘాటించాయి. ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర సహకారం ప్రాతిపదిక బంగ్లాదేశ్ పరస్పర విశ్వాసం, సమ్మిళిత అభివృద్ధి పై దృష్టి నిలిపింది.

ఈ ప్రాంతంలో భారత దేశం సయోధ్య పాత్రను పోషిస్తుంది. ఈ ప్రాంతంలోని దేశాలు ఉగ్రవాదాన్ని ప్రధాన సవాలుగా భావిస్తున్నాయి. ఈ ప్రాంతంలోని ప్రతి దేశానికీ ఇరుగు పొరుగు దేశాలతో ద్వైపాక్షిక సంబధాలు అత్యంత కీలకం అయినప్పటికీ, వివిధ ప్రాంతీయ మండళ్ళ పాత్ర కూడా అంతే ప్రధానమైనది. SAARC*, BIMSTEC*, భారత్, భూటాన్, ఇండియా, నేపాల్ (BBIN), బంగ్లాదేశ్, చైనా, ఇండియా, మయ్మ్మార్ (BCIM) ఎకనమిక్ కారిడార్, మొదలైనవి అన్నీ కూడా దక్షిణ ఆసియా ప్రాంతీయ ఆర్ధిక అనుసంధానికి అవసరం. ఈ నేపధ్యంలో విబేధాలను విస్మరించి శాంతి, సౌభాగ్యాల సాధనకు ప్రతి దేశం ఒకటిగా కలిసి కదలవలసిన సమయం ఆసన్నమైంది.

రచన: డాక్టర్. స్మృతి పట్నాయక్, దక్షిణ ఆసియా వ్యూహాత్మక విశ్లేషకులు

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన