ఇమ్రాన్ ఖాన్ దావోస్ పర్యటన వైఫల్యం

పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్, ఇటీవల దావోస్’లో జరిగిన ప్రపంచ ఆర్థిక మండలి 2020 సదస్సులో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన స్విస్ స్కి – రిసార్ట్’లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్’తో సమావేశమయ్యారు. ఆయన అక్కడకు వెళ్ళింది తమ దేశంలోకి విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు,అయితే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన అసలు విషయాన్ని పక్కన పెట్టి, అలవాటులో గ్రహపాటుగా, కశ్మీర్’దండకం ఎత్తుకున్నారు. అదే వేదిక నుంచి ఇమ్రాన్ ఖాన్, “భారత దేశంతో మా సంబంధాలు చక్కగా ఉన్నప్పుడు, వ్యూహాత్మకంగా మా బలమ ఏమిటో ప్రపంచానికి తెలుస్తుంది. ప్రపంచం చూస్తుంది” అంటూ చెప్పుకొచ్చారు. ‘పాకిస్థాన్’లో ఉగ్రవాదమా, అస్సలు లేదు’ అంటూ మరో ముక్కను చేర్చారు.

నిజమే కావచ్చును. పాకిస్థాన్’లో ఉగ్రవాదం అసలే లేదన్న ఇమ్రాన్ ఖాన్ మాటలు నిజమే కావచ్చును. ఎందుకంటే, వాస్తవంలో అక్కడ ఉగ్రవాదం ప్రభుత్వ పోషణలో విరాజమానంగా విరాజిల్లుతోంది.ఉగ్రవాద సంస్థలు ప్రభుత్వ సహాయ సహకారలాను సంపూర్ణంగా అనుభవిస్తున్నాయి.కాబట్టి,సహజంగానే పాక్ పాలకులకు ఉగ్రవాదం అనేది కనిపించక పోవడంలో అబ్బురపడవలసింది,ఆశ్చర్యపోవల్సిదీ ఉండదు. మరోవంక, పారిస్ స్థావరంగాగల ప్రపంచ ఉగ్రవాద వ్యతిరేక ఆర్థిక సహకార పర్యవేక్షణ సంస్థ, ఫైనాన్సియల్ టాస్క్ ఫోర్సు (FATA), తదుపరి సమావేశంలో పాకిస్థాన్’ లో ఉగ్రవాద సంస్థలకు అందుతున్న ఆర్థిక సహకారంపై ఒక నిర్ణయాన్ని తీసుకోనుంది. ఈనేపధ్యంలో పాక్ ప్రభుత్వం తమ భూభాగంలోని ఉగ్రవాద సంస్థలను కాస్త వెనక్కి తగ్గమని వేడుకుంది.ఆ కారణంగానూ,పాక్ ప్రభుత్వానికి, ఇమ్రాన్ ఖాన్’కు తమ దేశంలో ప్రణవిల్లుతున్న ఉగ్రవాదం కనిపించకపోవచ్చును.

అదలా ఉంటే, దావోస్’లో పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ భారత దేశం, భారత-పాకిస్థాన్ సంబంధాల గురింఛి చేసిన వ్యాఖ్యలలో, ‘ఆశ్చర్య పోవలససింది ఏమీ లేదు’ అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలలో వ్యాఖ్యల్లో నిజం లేదు సరికదా, ఒకదానికొకటి విరుద్ధంగానూ ఉన్నాయి. అలాగే, ఆయనలో, పాకిస్థాన్, ప్రభుత్వంలో పెల్లుబుకుతున్న అసహనాన్ని ఆయన వ్యాఖ్యలు ప్రతిధ్వనిస్తున్నాయి. దొంగతనంగా పాలు తాగే పిల్లి తనను ఎవరూ చూడడం లేదు అనుకుంటున్నట్లుగా, పాకిస్థాన్ ఉగ్రవాదం విషయంలో తమ దొంగాటను,ద్వంద ప్రమాణాలను ప్రపంచం చూడడం లేదనుకుంటోంది. కానీ, ప్రపంచం అన్నీ గమనిస్తూనే ఉంది. ఓవంక ఉగ్రవాదంపై పోరు విషయంలో బాధిత పాత్రను పైకి తెస్తున్న పాక్, మరో వంక భారత దేశం,ఇతర ఇరుగు పొరుగు దేశాల్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది.భారత దేశం దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాద సంస్థలకు సహకారం అందిస్తోంది.

ఇమ్రాన్ ఖాన్ చెపుతున్నట్లుగా పాకిస్థాన్ భారత దేశంతో శాంతిని,సాధారణ సంబంధాలను కోరుకుంటున్నదే నిజం అయితే, అందుకు తగిన వాతావరణాన్ని సృస్టించవలసిన బాధ్యత కూడా ఆదేశం పైనే ఉంటుంది. అతర్జాతీయ సమాజం దృష్టిని మరల్చేందుకు, పక్కదారి పట్టించే తప్పుడు ప్రకటనలకు స్వస్తి చెప్పి, పాక్ భూభాగం నుంచి ఆకృత్యాలకు పాల్పడుతున్న ఉగ్రవాద సంస్థలపై తిరుగులేని విధంగా కఠిన చర్యలు తీసుకున్నప్పుడే ప్రపంచం ఇమ్రాన ఖాన్ పలుకులను ఎంతోకొంత విశ్వసిస్తుంది.

దావోస్ సమావేశంలో, ఇమ్రాన్ ఖాన్, ఒక ప్రశ్నకు సమాధానంగా, “పాకిస్థాన్’లో ఉగ్రవాదం అనేది ఏ కొంచెం అయినా ఉంటే, అది ఆఫ్ఘానిస్తాన్’నుంచి దిగుమతి అయ్యిందే కాని, పాకిస్థాన్’ లోపల ఉగ్రవాదం అనేది లేనే లేదు” అని చెప్పారు.

ఇమ్రాన్ ఖాన్ పలుకులు ఇలా ఉంటే పాకిస్థాన్ విశ్లేషకులు, ఆఫ్ఘనిస్థాన్ యుద్ధం హతమార్చిన ముష్కరులకంటే ఎక్కువ సంఖ్యలో,ఉగ్రవాద భూతాలను సృష్టించింది’అని పేర్కొంటున్నారు. అయితే, ఆఫ్ఘనిస్థాన్’ నుంచి అమెరికా సేనలు వైదొలిగిన తర్వాత అక్కడి పరిస్థతి ఏమిటీ? అన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వడంలో ఇమ్రాన్ ఖాన్ విఫలమయ్యారు.

పాకిస్థాన్ ప్రధానమంత్రి దావోస్ వెళ్ళింది, ప్రపంచ ఆర్థిక మండలి సమావేశంలో పాల్గొనేందుకు,అయితే,ఆక్కడ తమ దేశ ఆర్థిక పరిస్థితులను వివరించడంలో ఆయన పూర్తిగా తడబడ్డారు.పాకిస్థాన్ పెట్టుబడులకు అనుకూలంగా ఉందని ప్రపంచ దేశాలను ఒప్పించడంలో విఫలమయ్యారు.అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ 2019లో కలిపించిన బేలవుట్ ప్యాకేజి నిబంధనలను సక్రమమగా అమలు చేశామని అభివృద్ధి చెందిన దేశాలను నమ్మించడంలోనూ ఇమ్రాన్ ఖాన్ విఫలమయ్యారు. సరైనా ఆర్థిక దృక్పధాన్ని ప్రదర్శించలేక, ఇమ్రాన్ ఖాన్ దావోస్ సదస్సులో పాల్గొన్న ప్రపంచ కుబేరులను ఆకర్షించ లేకపోయారు. ఆకట్టుకోలేక పోయారు.ఇలా ఇమ్రాన్ దావోస్ పర్యటన విఫలమైందని పాక్ విశ్లేషకులు సైతం పేర్కొంటున్నారు.

అంతే కాదు,ఈ పర్యటనలో ఇమ్రాన్ ఖాన్ చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు, పాకిస్థాన్ డొల్లతనాన్ని బయట పెట్టేలా ఉన్నాయేగాని, పెట్టుబడులను ఆకర్షించేందుకు దోహదం చేసే విధంగా లేవు.గత సంవత్సర కాలంలో విదేశీ పెట్టుబడులు రెట్టింపు అయ్యాయని ఆయన ఒకటికి పదిసార్లు పేర్కొన్నారు. అయితే,నిజానికి ఇవేవీ, పెట్టుబడులు కాదు, రెండంకెల వడ్డీకి తెచ్చుకున్న రుణాలు లేదా స్వల్పకాల ట్రెజరీ బిల్లులు. ఈ బిల్లులు పాక్ స్థూల ఆర్థిక వ్యవస్థ అస్తిరత్వానికి సంకేతాలు,సూచికలు. అలాగే, సామర్ధ్య నిర్మాణానికి అవసరమైన వనరుల సమీకరణలో పాక్ ప్రభుత్వ అసమర్ధతకు ప్రతిబింబాలు.

ఇమ్రాన్ ఖాన్ దావోస్ పర్యటనలో మరో ఆసక్తిక అంశం, తమ దావోస్ పర్యటనకు ఇద్దరు వ్యాపార వేత్తలు, ఇక్రం సెహగల్, ఇమ్రాన చౌదరి ఆర్థిక సహాయం చేశారని తనకు తానే పదే పదే చెప్పుకున్నారు.క్రోనీ క్యాపిటలిజంకు పెట్టింది పేరైన పాకిస్థాన్’లో ఇది సహజంగానే రాజకీయ వేడిని పెంచుతుంది.నిజానికి,ఈకారణంగానే ఒకప్పిటి ఇమ్రాన్ మిత్రుడు, ప్రోత్సాహకుడు ప్రస్తుత శత్రువు ,పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్’ను ప్రస్తుత ప్రభుత్వం జైలుకు పంపింది.

ఈ పర్యటనలో పాక్ ప్రధాని ఆర్థిక అంశాలపై దృష్టిని కేంద్రీకరించి ఉంటే, ఎంతోకొంత ప్రయోజనం ఉండేదాని, అయితే,ఇమ్రాన్ ఖాన్,పొరుగు దేశంఫై ముట్టడే తమదేశం ఎదుర్కుంటున్న సమస్యలకు ఉపసమనం అనే భావనలో ఉన్నారని పాక్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

రచన: కౌషిక్ రాయ్,

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన