భూక్షీణతను తగ్గిస్తామంటూ దేశాల ప్రతిన

భూమి చాలా క్లిష్టమైన వనరు. మానవజీవితాలకు కావలసిన ప్రాథమిక జీవనోపాధులను ఇది అందిస్తుంది. మనుషులు బాగా బతికేట్టు చేస్తుంది. అందులో ఆహారం, స్వచ్ఛమైన నీరు, ప్రకృతి సమతుల్యతతో కూడిన వ్యవస్థ ఇలాంటి వన్నీ అందిస్తుంది. అంతేకాదు జీవ వైవిధ్యాన్ని కూడా కాపాడుతుంది. వాతావరణ వ్యవస్థలో సైతం భూమి కీలక పాత్ర పోషిస్తుంది.




దశాబ్దాలుగా భూమిని బాగా వాడాం. జనాభా పెరుగుదల కారణంగా జలవనరుల వాడకం పెరిగి భూ క్షీణదల మొదలైంది. వ్యవసాయం, పశుత్పత్తి, పట్టణీకరణ, అడవులు నరకడం, విపరీతమైన వాతావరణ పరిస్థితులు, మరీ ముఖ్యంగా కరువు వంటివి భూక్షీణతను మరింత పెంచాయి. మానవులు 70 శాతం మంచురహిత భూమిని దెబ్బతీశారు. పలు దేశాల్లో భూక్షీణత, ఎడారీకరణలు ప్రధాన ఆర్థిక, సామాజిక, పర్యావరణ సమస్యలుగా నిలిచాయి. దీంతో ఫలవంతమైన భూమి కూడా ఎడారీగా మారుతోంది.




ఈ మార్పలను చర్చించాలి. ఈ సవాళ్లను అధిగమించే మార్గాలను పట్టుకోవాలి. సెప్టెంబరు రెండవ తేదీన ఢిల్లీ పొలిమేరల్లో పధ్నాల్గవ కాన్ఫెరెన్స్ ఆఫ్ పార్టీస్ (సివొపి 14)లో అదే జరిగింది. ఈ సదస్సులో 197 దేశాల నుంచి తొమ్మిదివేల మంది ప్రతినిధులు హాజరయ్యారు. పధ్నాల్గవ కాన్ఫెరెన్స్ ఆఫ్ పార్టీస్‌లో ఈ మార్పులను చర్చించడంత పాటు వాటి సవాళ్లను ఎదుర్కొనే చర్చలు జరిగాయి. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డెసర్టిఫికేషన్ (యుఎన్‌సిసిడి) పధ్నాల్గవ సదస్సును భారతే నిర్వహించింది.



ఇందులో పాల్గొన్న ప్రతినిధులు భూ నిర్వహణపై, క్షీణించిన భూమిని తిరిగి పునరుద్ధరించడంపై, కరువు, వాతావరణ మార్పులు, పునరుత్పాదక ఎనర్జీ, మహిళా సాధికారత, జండర్ సమానత్వం, నీటి ఎద్దడి ఇలా పలు అంశాలపై ప్రసంగించారు. ఈ సదస్సుకు హాజరైన ప్రతినిధుల్లో మంత్రులు, ఐక్యరాజ్యసమితి ఉన్నతాధికారులు, వివిధ ప్రభుత్వాల శాఖలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కూడా హాజరయ్యారు.




పన్నెండు రోజుల పాటు ప్రసంగాలు కొనసాగాయి. ఈ సదస్సు ‘న్యూఢిల్లీ ప్రకటన’ను చేపట్టింది. అందులో మరింత భూమిని కోల్పోకుండా భూగ్రహాన్ని కాపాడుకునేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ పథకాన్ని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రపంచానికి భూమి ఆధారిత పరిష్కారాల ఆవశ్యకత ఎంతో ఉందని ప్రతినిధులు భావించారు. ఉదాహరణకు వాతావరణ పరంగా, జీవవైవిధ్య పరంగా అలాగే 2015 డిశెంబరులో చోటుచేసుకున్న పారిస్ ఒప్పందానికి సంబంధించిన దీర్ఘకాలిక లక్ష్యాలు ప్రపంచానికి అవసరమని ఢిల్లీ ప్రకటన అభిప్రాయపడింది.




ఈ ప్రకటనలో మొత్తం 35 అంశాలపై దేశాలు సంతకాలు చేశాయి. వాటిల్లో భూక్షీణతపై పోరాడడంతోపాటు ఎడారీకరణకు తావులేకుండా కృషిచేయాలి. అలాగే కరువును నిర్మూలించాలి. ఢిల్లీ ప్రకటన ఏకగ్రీవ ఆమోదంతో చేపట్టింది. ఈ ప్రకటనలో తీసుకున్న 35 నిర్ణయాలపై సంతకాలు చేసిన 197 దేశాలూ చట్టబద్ధంగా కట్టుబడి వాటిని అమలు చేయాల్సి ఉంటుంది.






ఈ ప్రకటనలో సంతకాలు చేసిన దేశాలు తీసుకోవాల్సిన చర్యలను దశల వారీగా వివరించారు. తద్వారా క్షీణతకు గురవుతున్న భూమిని తిరిగి ఈ దేశాలు పునరుద్ధరించాల్సి ఉంటుంది. ఇది భవిష్యత్తులో చేపట్టాల్సిన ఎజెండాను నిర్ణయిస్తుంది. కరువుతో వచ్చే సమస్యలను తగ్గించడానికి ఇందులో పాల్గొన్న దేశాలన్నీ కలిసి గ్లోబల్‌గా కృషి చేయాలని భావించాయి.




సుస్థిర అభివృద్ధి లక్ష్యాన్ని సాధించాలని దేశాలు అంగీకరించాయి. అందులో భాగంగానే ‘ల్యాండ్ డీగ్రడేషన్ న్యూట్రాలిటీ’( ఎల్‌డిఎన్ )ని 2030 నాటికి సాధించాలని టార్గెట్‌గా పెట్టుకున్నాయి. ఇది ప్రతి దేశం పెట్టుకున్న యాక్షన్ టార్గెట్ అనమాట. ఎల్‌డిఎన్‌లో భూ వనరుల పరిమాణం, నాణ్యత సుస్థిరంగా లేదా నిర్దిష్ట రీతిలో పెరగడం ఉంటుంది. ఎకో-సిస్టమ్స్ దెబ్బతినవు. ఈ సబ్జక్టు మీద సదస్సులో విస్తృతంగా చర్చ జరిగింది. భూక్షీణత వల్ల ప్రపంచమంతా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలు, రైతులు, ప్రజలు దారిద్రరేఖకు దిగువన జీవిస్తున్నారు. ల్యాండ్ డీగ్రడేషన్ న్యూట్రాలిటీ (ఎల్‌డిఎన్) వల్ల భూనిర్వహణా విధానాలు, పద్ధుతుల్లోనే మార్పులు వచ్చాయి.




ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ గ్లోబల్ లాండ్ ఎజెండాకు భారత్ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. 2030 సంవత్సరం నాటికి భారత్ 26 మిలియన్ హెక్టార్ల భూమిని క్షీణించకుండా పునరుద్ధరిస్తానని ప్రమాణం చేసింది. గతంలో పెట్టుకున్న 21 హెక్టర్ల భూమి టార్గెట్ కన్నా ఇది ఐదు మిలియన్ హెక్టార్లు ఎక్కువ. సివొపి 14కి ప్రస్తుతం భారత్ ప్రెసిడెంట్గా రెండు సంవత్సరాల పాటు వ్యవహరిస్తుంది.




భూమి కాలపరిమితి విషయంలో కూడా దేశాలు తమ ఆందోళనలను,అభద్రతలను తమ ప్రసంగాలలో పేర్కొంటారని భావించారు. వాటిల్లో జండర్ సమానత్వంతో పాటు భూ సంబంధిత కార్బన్ విడుదలను తగ్గించేలా భూపునరుద్ధరణను పెంపొందించాలి వంటివి కూడా ఉన్నాయి. అంతేకాదు పబ్లిక్, ప్రైవేటు మార్గాల ద్వారా వినూత్నమైన ఆర్థిక వనరులను సేకరించడం ద్వారా సదస్సులో తీసుకున్న నిర్ణయాలను జాతీయ స్థాయిలో అమలు చేయాలనేది కూడా ఉంది.




కరువుకాటకాలు అన్ని ప్రాంతాలలో ఆరోగ్యం , అభివృద్ధి, సంపదలపై ప్రభావం చూపుతాయి. వినూత్న కార్యక్రమాలకు తమ మద్దతు ఉంటుందని మంత్రులు వాగ్దానం చేశారు. మానవ ఆరోగ్యం, సుఖసంతోషాల కోసం, ఆరోగ్యవంతమైన పర్యావరణ వ్యవస్థ కోసం, శాంతి సుస్థిరతల దిశగా ప్రయాణించేందుకు తమ అండదండలు ఉంటాయని పలు దేశాల మంత్రులు ఈ సదస్సులో స్పష్టంచేశారు.




స్థానిక ప్రభుత్వాలు సమైక్యంగా భూ వినియోగ నిర్వహణను చేపట్టాలని ఢిల్లీ ప్రకటనలో పేర్కొంది. సహజవనరుల సంరక్షణ ద్వారా భూనిర్వహణ పెంపొందించడం వల్ల నగరాలు సుస్థిరంగా ఉంటాయి. భూ వినియోగ రేట్లను తగ్గించాలని కూడా ఈ ప్రకటన సూచించింది. మట్టి సీలింగ్‌తో పాటు జీవవైవిధ్యం, ఎకోసిస్టమ్ నష్టాలను తగ్గించడం కూడా వీటిల్లో ఉన్నాయి. ఏడారీకరణ వల్ల తలెత్తే రిస్కులను తగ్గించేందుకు ప్రోయాక్టివ్ విధానాన్ని సదస్సు చేపట్టింది. అంతేకాదు ఏడారీకరణ వల్ల తలెత్తే దుష్ప్రభావాలు, భూక్షీణత, కరువు వంటివాటిని కూడా ఈ విధానం ద్వారా తగ్గించాలనే నిర్ణయాలను కూడా సదస్సు చేపట్టింది.




యుఎన్‌సిసిడి ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ ఇబ్రహీ థియా మాట్లాడుతూ అంతర్జాతీయంగా తలెత్తిన వాతావరణ విపరీత పరిణామాలకు భూపునరుద్ధరణ తక్కువ ఖర్చుతో కూడిన చక్కటి పరిష్కారమన్నారు. అంతేకాదు జీవవైవిధ్య నష్టాన్ని కూడా భూపునరుద్ధరణ తగ్గిస్తుంది. ఇంకా ఇబ్రహీం మాట్లాడుతూ భూ పునరుద్ధరణకు, వాతావరణానికి, జీవవైవిధ్యానికి స్పష్టమైన సంబంధం ఉందన్నారు.


రచన: కె వి వెంకటసుబ్రమణియన్, సీనియర్ జర్నలిస్ట్

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన