ఇండియా-ఇరాన్ల మధ్య సహకారానికి నూతన వ్యూహాల శోధన

భారత, ఇరాన్ దేశాల మధ్య పదవ పర్యాయం విదేశాంగ శాఖల సమాలోచనలు ఈ వారం టెహ్రాన్‌లో జరిగాయి. అక్కడ ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో వ్యూహాత్మకంగా గందరగోళ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. భారత విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే భారత ప్రతినిధి బృందానికి సారథ్యం వహించారు. ఇరాన్ వైపు నుంచి ఆ దేశ డిప్యూటీ విదేశాంగ మంత్రి డా. సయ్యద్ అబ్బాస్ అరాంఘఛీ ఇరాన్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించారు. ఇరాన్ విదేశాంగ వ్యవహారాల మంత్రి డా. జవాద్ జారిఫ్, ఇరాన్ సుప్రీమ్ లీడర్ అయితుల్లా ఖొమైని సీనియర్ సలహాదారు డా. ఆలి అక్బర్ వెలయతితో భారత విదేశాంగ కార్యదర్శి గోఖలే చర్చలు జరిపారు. 


రెండు దేశాలూ తమ మధ్య ఉన్న ద్వైపాక్షిక సహకారానికి సంబంధించి సమగ్ర స్థాయిలో పునర్ అంచావేశారు. వాటిల్లో అనుసంధాన కార్యక్రమం, మౌలికసదుపాయాల కల్పన ప్రాజక్టులైన డెవలెప్‌మెంట్ ఆఫ్ షాహిద్ బెహెస్తి పోర్ట్, ఛబాహార్, భారత్, ఇరాన్, అఫ్ఘనిస్తాన్లతో కూడిన ట్రైలేటరల్ ట్రాన్సిట్ ఒప్పందం సహకారం విషయంలో రెండు దేశాలవారూ పునరంచనా వేశారు. వీటితో పాటు ప్రాంతీయ అంశాలను కూడా రెండు దేశాలూ చర్చించాయి. ఇరుదేశాలకు పరస్పర ప్రయోజనకరమైన ద్వైపాక్షిక సంబంధాలను మరింత వేగవంతం చేసే దిశగా కట్టుబడి ఉంటామనే అభిప్రాయాన్ని రెండు దేశాలూ వ్యక్తంచేశాయి. రెండు దేశాల మధ్య పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి. తర్వాతి జాయింట్ కమిషన్ సమావేశం విదేశాంగ మంత్రుల స్థాయిలో జరుగుతుంది. ఈ సమావేశం తొందరలోనే ఇరాన్‌లో నిర్వహించనున్నారు. 

ఈ ఏడాది మేలో వాషింగ్టన్ ఆరు నెలల సమయాన్ని భారత్‌కు పెంచడానికి నిరాకరించిన నేపథ్యంలో విదేశాంగ మంత్రి కార్యాలయం చేసిన చర్చలను అంచనా వేయాల్సిన అవసరం ఉంది. ఇండియాకు చెందిన ఇరాన్ రాయబారి ఆలి ఛెగెని మాట్లాడుతూ టర్కీ, రష్యా, చైనా దేశాలు ఇరాన్‌తో తమ ఎనర్జీ సంబంధాలను కొనసాగిస్తున్నాయన్నారు. కానీ ఇండియా దీనికి భిన్నంగా తన సంబంధాలను నిలిపివేసింది. ఇరాన్ నుంచి తాత్కాలికంగా భారత్ చమురు దిగుమతిని ఆపేయడం ఎంతో ముఖ్యమైన అంశం. అయితే టెహ్రాన్ ఇతర రంగాలలో తన సంబంధాలను భారత్ కొనసాగిస్తోంది. నిజం చెప్పాలంటే ఇరాన్‌తో భారత వ్యూహాత్మక సంబంధాలు చమురు వాణిజ్యానికి మించి అతీతమైనవని గుర్తించాలి. 

అఫ్ఘనిస్తాన్‌కు సంబంధించి రెండు దేశాలు తమ కార్యకలాపాలతో పాటు చర్చలను కూడా కొనసాగిస్తున్నాయి. ఇరాన్‌తో ఆర్థిక, వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోవడానికి భారత్ కొత్త మార్గాలను శోధిస్తోంది. ఇటీవల జరిగిన ఇండియా-రష్యా శిఖరాగ్ర మహాసభలో న్యూఢిల్లీ, మాస్కోలు రెండూ తమ వాణిజ్యం, ఆర్థిక సహకారాలను ఇరాన్‌తో కొనసాగిద్దామని నిర్ణయించుకున్నాయి. ఇవి పరస్పర ప్రయోజనకరమైనవిగా, న్యాయమైనవిగా రెండు దేశాలూ అభివర్ణించాయి. భారత్ కూడా ఈ సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లానే ఈ ఏడాది మార్చిలో ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్సిట్ కారిడార్ (ఐఎన్ఎస్‌టిసి) కో-ఆర్డినేషన్ కౌన్సిల్ ఏడవ మీటింగ్ ఒప్పందపడ్డాయి కూడా. 

ఇరాన్, అమెరికాల మధ్య వాతావరణం ఏ ఏడాది మే నుంచి మరింత ఉద్రిక్తతలతో నిండింది. ఈ పరిస్థితి భారత్, ఇరాన్‌లు సరికొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితుల్లో ఉన్న విషయాన్ని స్పష్టేంచేస్తోంది. ఇరాన్‌తో ఎనర్జీ పరమైన సంబంధాలను ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్లాల్నది భారత ప్రధాన లక్ష్యం. వాటిని ఇతర మార్గాల ద్వారా తిరిగి పునరుద్ధరించాలని భారత్ భావిస్తోంది. 2006 వరకూ ఇరాన్ మనదేశ రెండవ అతి పెద్ద ముడి చమురు పంపిణీదారుగా ఉంది. కానీ అ స్థానం కాస్తా 2013-14 నాటికి ఏడు సంఖ్యకు పడిపోయింది. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ ఇరాన్ రెండవ అతిపెద్ద కొనుగోలుదారుగా భారత్ నేటికీ నిలిచే ఉంది. చైనా తర్వాత భారత్‌దే స్థానం. అది కూడా ఈ ఏడాది మే నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకోవడం ఇరాన్ నుంచి ఆపేసినంత వరకూ రెండవ స్థానం భారత్‌దే. గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే సుస్థిర చమురు పంపిణీదారుగా ఇరాన్ ప్రాధాన్యతను నిర్లక్షం చేయలేం.

ముఖ్యంగా ఇరాన్ ప్రాంతీయంగా భారత్‌కు ఎంతో ముఖ్యమైంది. యురేసియాకు ఇది గేట్‌వే.పశ్చిమా ఆసియాలో దాని ప్రముఖ పాత అలాగే న్యూఢిల్లీ ఇరాన్‌తో తన కార్యకలాపాలను పెంపొందించుకోవాల్సిన అత్యవసర స్థితిని అఫ్ఘనిస్తాన్ గుర్తించింది. తన అనుసంధాన ప్రాజెక్టులు ఐఎన్ఎస్‌టిసి, ఛబాహార్ ల కోసం భారత్‌కు ఇరాన్‌తో ఎంతో అవసరం ఉంది. అఫ్ఘనిస్తాన్ పరంగా పలు కార్యకలాపలు, మద్దతు, అంతేకాదు చైనా, రష్యా, మధ్య ఆసియా రిపబ్లిక్కులు, ఇతర ప్రాంతీయ శక్తులతో సమతుల్యమైన సంబంధాలు పాటించాడం అవసరం. భౌగోళిక-రాజకీయ సమతుల్యత కోసం ప్రాంతీయ కీలక శక్తులైన ఇరాన్-చైనా-రష్యా, ఇరాన్-అఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్-చైనా, రష్యాలు భారత్‌ను ఇరాన్తో సంబంధాలు కొనసాగించాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. 

ప్రధాని నరేంద్ర మోదీ 2016 మేలో ఇరాన్‌ని పర్యటించిన సమయంలో సరికొత్త సహకారానికి ఆయన శ్రీకారం చుట్టారు. రెండు దేశాలు సమగ్ర వ్యూహాత్మక ఆర్థిక సహకారానికి సంసిద్ధంగా ఉన్నాయి. ప్రధానంగా మౌలిసదుపాయలు, వాణిజ్యం, ఆర్థికం, ఎనర్జీ సహకారం, రాజకీయ-వ్యూహాత్మక కోణంతో ఇండో-ఇరాన్ సంబంధాలు తదితర అంశాలపై ఇరాన్ దృష్టిపెట్టింది. ఇరాన్ ప్రెసిడెంట్ రొహానీ మూడు రోజుల పర్యటనకుగాను భారత్‌కు గత ఏడాది ఫిబ్రవరిలో వచ్చారు. అంతేకాదు ఇరాన్ విదేశాంగ మంత్రి మొహమ్మద్ జవాద్ జరీఫ్ ఈ ఏడాది జనవరిలో భారత్‌లో పర్యటించారు. 

విదేశాంగ కార్యదర్శి చేపట్టిన సంభాషణల్లో ప్రస్తుత దౌత్య యాక్టివిజం ప్రస్ఫుటంగా వెల్లడవుతోంది. దీని అనంతరం ఇండియా విదేశాంగ వ్యవహారాల మంత్రి టెహ్రాన్ వెళ్లారు. ఇది ఇరాన్‌తో మోదీ ప్రభుత్వ కొనసాగించాలనుకుంటున్న సరికొత్త వ్యూహాత్మక సహకార మార్గాలను వెల్లడిస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వ యంత్రాంగం నుంచి ఎంత తీవ్ర ఒత్తిడి వచ్చినా కూడా, ఇరాన్‌ని ఒంటరిని చేయాలని అమెరికా లక్ష్యంగా పెట్టుకున్నా, ఇరాన్‌తో తన సంబంధాల విషయంలో భారత ప్రభుత్వం స్పష్టంగా ఉంది. శత్రుత్వాన్ని తగ్గించుకుని, ప్రాంతీయ సంభాషణలను చేపడితే దాని వల్ల అమెరికాకే కాదు ఇరాన్ కూడా మంచి ఫలితాలను పొందగలదు. అంతేకాదు అంతర్జాతీయంగా విస్తృతస్థాయిలో, ప్రాంతీయ కమ్యూనిటీ స్థాయిలో కూడా ఇది మంచిది. 

రచన: డా. మీనా సింగ్ రాయ్, రష్యా వ్యవహారాల వ్యూహాత్మక విశ్లేషకులు, సిఐఎస్, పశ్చిమాశియా

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన